mountaineer
-
ఎనిమిదేళ్లకే పర్వతాలు అధిరోహిస్తున్న చిచ్చర పిడుగు..!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హనుమతండాకి చెందిన జాటోత్ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్ రామ్ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్‌లో విహాన్ శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ మనాలీలో 15రోజుల పాటు బేసిక్ మౌంట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోగల మౌంట్ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు సాధించాడు విహాన్. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్ రామ్. విజయోస్తు...విహాన్!– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
22 ఏళ్ల క్రితం అదృశ్యం.. చెక్కుచెదరని స్థితిలో మృతదేహం!
22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ పర్వతారోహకుడి మృతదేహాం పెరూ దేశంలో తాజాగా బయటపడింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్ఫ్ల్గా గుర్తించారు. జూన్ 2002లో ఆయన ఆదృశ్యమవ్వగా అప్పుడు అతని వయసు 59 ఏళ్లు. పెరూలోని హుస్కరన్ అనే పర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ పర్వతం ఎత్తు 6,700 మీటర్లు(22,000 అడుగులు). ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావరణ మార్పుల వల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం బయటపడినట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.అయితే ఇన్నేళ్ల అతని మృతదేహం దొరికినప్పటికీ.. అది చెక్కుచెదరని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉందని, ఒంటిపై ఉన్న బట్టలు, బూట్లు మంచులో అలాగే భద్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అతని జేబులో లభించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ, విదేశీ పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. కాగా గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. -
13 రోజుల్లో.. మూడుసార్లు ఆమె ఎవరెస్ట్‌ను జయించింది!
పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది. నేపాల్‌లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.‘ప్రపంచంలో ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.మూస పద్ధతికి స్వస్తి...ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్ కంపెనీ నుండి కొంత లోన్ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్ గైడ్‌గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అలసట కలిగినా..ఈ వసంత కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలల సాధనకు కృషిస్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే ఫొటోగ్రఫీ అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
నేపాల్‌కు చెందిన 10 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో విజయం సాధించారు. ఈ సీజన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి యాత్ర బృందం ఇదే. డెండి షెర్పా నేతృత్వంలోని పర్వాతారోహకుల బృందం శుక్రవారం రాత్రి 8.15 గంటలకు 8,848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. ఈ విషయాన్ని ఈ పర్వతారోహణ యాత్ర నిర్వహణ సంస్థ ‘సెవెన్ సమ్మిట్ ట్రాక్’ ప్రతినిధి థాని గుర్గైన్ మీడియాకు తెలిపారు.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనతను పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా చేసి చూపారు. ఆమె 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. షెర్పా తన 28వ ఎవరెస్ట్ అధిరోహణ రికార్డును తానే బద్దలు కొట్టారు. కమీ రీటా షెర్పాకు 54 ఏళ్లు. ఆమె 1994 నుండి పర్వతాలను అధిరోహిస్తున్నారు.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ముందు కమీ రీటా షెర్పా మీడియాతో మాట్లాడుతూ తనకు మరో వ్యాపకం లేదని, పర్వతారోహణే తన లక్ష్యమని అన్నారు. 29వ సారి కూడా ఎవరెస్ట్ అధిరోహిస్తానని తెలిపారు. కాగా కమీ రీటా షెర్పాతో పాటు టెన్జింగ్ గ్యాల్జెన్ షెర్పా, పెంబా తాషి షెర్పా, లక్పా షెర్పా, దావా రింజి షెర్పా, పామ్ సోర్జీ షెర్పా, సుక్ బహదూర్ తమాంగ్, నామ్‌గ్యాల్ డోర్జే తమాంగ్, లక్పా రింజీ షెర్పా తదిరులు పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం 414 మంది అధిరోహకులు ఈ సీజన్లో ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు అనుమతి పొందారు. Nepali Sherpa climber Kami Rita Sherpa climbs Everest for record 29th time breaking his own previous record of 28 ascends. He is the sole person to climb the World’s tallest peak for a record 29 times: Government officials(file pic) pic.twitter.com/6gp6QaKWdz— ANI (@ANI) May 12, 2024 -
కమి రిటా షెర్పా రికార్డు
కఠ్మాండు: నేపాలీ పర్వతారోహకుడు కమి రిటా షెర్పా(53) సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8 వేల మీటర్లకంటే మించి ఎత్తయిన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమి రిటా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనస్లును మంగళవారం ఉదయం కమి రిటా షెర్పా అధిరోహించారని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని కమి రిటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు ఎక్కారు. -
పర్వతారోహకుడు సురేష్ బాబుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: నవరత్నాలు పథకాలను ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శిఖరాలను అధిరోహించిన కర్నూలు పర్వతారోహకుడు జి.సురేష్ బాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌పై మీ అంకితభావం, ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం.. మీ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా..’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్ భేటీ My warm wishes to G Suresh Babu, the mountaineer from Kurnool who scaled peaks worldwide promoting our Navaratnalu schemes! Your dedication and love for Andhra Pradesh are truly inspiring and we're grateful for your support Suresh. pic.twitter.com/PNyUX6viKX — YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2023 -
ఏపీ మంత్రి రోజాను కలిసిన ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవీయ
సాక్షి, అమరావతి: మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్‌పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవీయను రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్ అడ్వాన్సుమెంట్ & సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా అభినందించారు. ఆశా మాలవీయలక్ష్యం నెరవేరాలని మంత్రి ఆకాంక్షించారు. బుధవారం సచివాలయంలోని చాంబర్లో ఆశా మాలవీయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాను చేస్తున్న సైకిల్ యాత్ర లక్ష్యాన్ని మాలవ్య మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా భద్రత, సాధికారత సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మాలవీయకు వివరించారు. కిశోర బాలికలు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యను కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన న్యాప్కిన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. నాడు-నేడు పథకం క్రింద పాఠశాలల్లో టాయిలెట్ల అభివృద్ది, నిర్వహణ.. మహిళల రక్షణ, భద్రతకై దిశా యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు.. అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు తదితర కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత, సాధికారత అంశాలు ఆమోఘం: ఆశా మాలవీయ ఈ సందర్బంగా ఆశా మాలవ్య మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణిని అని, సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని, నవంబర్ 1న భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించి ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర పూర్తి చేయడం జరిగిందని మంత్రికి వివరించారు. తన సైకిల్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ లో మంచి ఆదరణ లభించిందని, అటు వంటి ఆదరణ తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కూడా లభించలేదని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్ రెడ్డిని కలిసినప్పుడు వారు ఎంతగానో తనను ఆదరించారని, రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, సాధికారత సాధనకు అమోఘమైన చర్యలు చేపడుతుందని కొనియాడారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్ పనితీరు అమోఘంగా ఉందని, ఆ యాప్‌ను తాను కూడా డౌన్ లోడ్ చేసుకుని పరిశీలించడం జరిగిందని, పోలీసుల ప్రతిస్పందన చాలా బాగుందని అన్నారు. ఋతుస్రావ సమస్య వల్ల కిశోర బాలికల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం మహిళల భద్రత, సాధికారత సాధనకై అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు దేశానికే అదర్శమని అభివర్ణించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా బొబ్బిలి వీణను ఆశా మాలవ్యకు బహుకరిస్తూ.. ఎలాంటి అవసరం సహకరించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కొద్దిరోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఆశా లక్ష్యం నెరవేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలో మీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పిన ఆశా.. ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి వివరించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర చేస్తున్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమన్నారు. ‘‘ప్రస్తుతం నేను 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ 1న భోపాల్‌లో నా సైకిల్ యాత్ర ప్రారంభించి నేడు విజయవాడ చేరుకున్నాను. మొత్తం 28రాష్ట్రాల్లో నా యాత్ర నిర్వహించాలనేది టార్గెట్ ఇప్పటికే 7రాష్ట్రాల్లో నా సైకిల్ యాత్ర పూర్తయింది’’ అని ఆమె పేర్కొన్నారు. భారత దేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిశాను. సీఎంని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి’’ అని ఆశా మాలవ్య అన్నారు. చదవండి: విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్‌తో కొలువు ‘‘మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్ ప్రవేశపెట్టారు. నేను దిశా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిని చెక్ చేశాను. దిశా యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలు మాత్రమే కాదు అందరూ సురక్షితంగా ఉన్నారు. నా ఆశయం కోసం ముఖ్యమంత్రి నాకు 10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించాను. అక్కడి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు’’ అని ఆశా మాలవ్య చెప్పారు. -
Anvitha Reddy: ‘మనాస్లు’ పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి మరో రికార్డ్ సృష్టించారు. నేపాల్‌లోని ఎత్తయిన మనాస్లు పర్వతాన్ని అధిరోహించారు. పర్వతారోహణ కోసం ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ నుంచి నేపాల్ బయలుదేరి వెళ్లిన అన్వితారెడ్డి... సెప్టెంబర్ 11న మనాస్లూ బేస్ క్యాంప్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత పైభాగానికి 28వ తేదీ రాత్రి చేరుకొని భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా అన్వితారెడ్డి చరిత్ర సృస్టించారు. మనాస్లు... ప్రపంచంలోనే ఎనిమిదో ఎత్తయిన పర్వతం కావడం విశేషం. ఇప్పటికే పలు పర్వతాలను అధిరోహించిన అన్వితారెడ్డి.. మేలో ఎవరెస్టును, 2021 జనవరిలో ఆఫ్రికాలోని కిలిమంజారోను, ఫిబ్రవరిలో ఖడే, డిసెంబర్లో యూరప్‌లోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల ఆధ్వర్యంలో అన్వితారెడ్డి పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. పట్టణంలోని పడమటి మధుసూదన్‌రెడ్డి, చంద్రకళ దంపతుల కుమార్తె అయిన అన్విత... ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నారు. -
ఎలబ్రస్ పర్వతంపై ఏపీ యువకుడు
పాలకొల్లు అర్బన్: రష్యాలోని మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అధిరోహించాడు. సముద్ర మట్టానికి 18,500 ఫీట్ల ఎత్తులో ఉన్న ఎలబ్రస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఏడుగురు సభ్యుల బృందం రష్యా లోని బేస్ క్యాంప్ నుంచి ఈ నెల 12న బయలుదేరింది. మౌంట్ ఎలబ్రస్ పర్వతంపై సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రంగనాథరాజుల ఫొటోలను దాసు ప్రదర్శించారు. క్లిక్: ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు -
Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న ఎవరెస్టును అధిరోహించి హైదరాబాద్‌కు చేరుకున్న పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె స్పాన్సర్, అన్వితా గ్రూప్ అధినేత అచ్యుతరావు, కోచ్ శేఖర్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో తాను చూసిన కోటనే తనకు ప్రేరణ అయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కని నేపాల్‌లోని ఎవరెస్టు పర్వతం దక్షిణం వైపు నుండి శిఖరాన్ని అధిరోహించినట్లు తెలిపారు. మే 16న ఉదయం 9:30కి ఎవరెస్టు శిఖరం (8848.86 మీటర్లు) చేరుకోవడం ద్వారా తన కలను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన అన్వితారెడ్డి.. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. (క్లిక్: ఎవరెస్ట్‌పై నుంచి చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించింది) -
ఎవరెస్ట్ మిన్నగా.. ప్రపంచం చిన్నగా.. నా కల నెరవేరింది: అన్వితా రెడ్డి
సాక్షి, యాదాద్రి: ‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరిన తర్వాత చూస్తే.. ప్రపంచం చాలా చిన్నగా కనిపించింది. ఎప్పటినుంచో ఉన్న ఆశ ఈ సంవత్సరం తీరింది. నా కల నెరవేరింది. వివిధ పర్వతాలు అధిరోహించిన అనుభవంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎవరెస్ట్ ఎక్కగలిగాను. మరో శిఖరాన్ని ఎక్కడానికి ఉత్సా హంగా ఉన్నాను’అంటూ సంతో షం వ్యక్తం చేశారు ఎవరెస్ట్ పర్వతం అధిరోహించిన పడమటి అన్వితారెడ్డి. ఈ నెల 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆమె బుధవారం ఉదయం 10.30కి నేపాల్‌లోని బేస్‌క్యాంపునకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఫోన్లో ‘సాక్షి’తో చెప్పిన అంశాలు ఆమె మాటల్లోనే.. అధైర్యపడలేదు... ‘‘మొదట ఎంత ఆత్మస్థైర్యం, నమ్మకంతో ప్రారంభమయ్యానో... చివరి వరకు అలాగే ఉన్నా. ఎక్కడా అధైర్యపడలేదు. అంతా సవ్యంగా జరిగింది. బేస్ క్యాంపు నుంచి సమ్మిట్ వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేరుకోగలిగా. డిసెంబర్లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతం ఎక్కినప్పుడు చిన్న ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నింటినీ అధిగమించి ఆ పర్వతం అధిరోహించాను. అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఎవరెస్ట్ అధిరోహించడంలో తోడ్పడ్డాయి. వాతావరణం అనుకూలించనప్పుడు కొంత ఇబ్బంది పడ్డాను. కానీ, వాతావరణం అనుకూలించగానే ఎక్కడా ఆగకుండా సాగర్మాత (ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర్మాత అంటారు) వరకు చేరుకున్నాను. సంతోషంతో కేరింతలు.. మే 16న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్టును అధిరోహించాను. అక్కడినుంచి చూస్తే ప్రపంచమంతా చిన్నగా కనిపించింది. చుట్టు పక్కల దేశాలు చిన్నగా అనిపించాయి. నా లక్ష్యం నెరవేరిందన్న సంతోషంతో ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కేరింతలు కొట్టాను. నా వద్ద ఉన్న కెమెరాతో వీడియో తీశాను. ఫొటోలు తీసుకున్నాను. 15 నుంచి 20 నిమిషాలపాటు శిఖరాగ్రంపై ఉన్నాను. ఆ సమయంలో నా వెంట తెచ్చిన పూజా జెండాలు కట్టడంతోనే సరిపోయింది. భూమి మీదికి వచ్చిన తర్వాత అన్ని పెద్దగా కనిపిస్తున్నాయి. మరెన్నో లక్ష్యాలు... నాకింకా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న పర్వతాలన్నింటినీ అధిరోహించాలి. ఒక్కొక్కటిగా నెరవేర్చకుంటా. నన్ను ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులు, కోచ్‌లు, స్పాన్సర్లకు కృతజ్ఞతలు’’ అంటూ అన్విత ఉద్వేగాన్ని పంచుకున్నారు. -
ఎవరెస్ట్‌పై అన్వితారెడ్డి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరో హించారు. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న 25 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి నేపాల్‌లోని లుక్లా నుంచి మే 9న ఎవరెస్ట్ అధిరోహణ మొదలు పెట్టారు. మే 12న బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించి, మే 16న ఉదయం 9.30కు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అన్వితా రెడ్డి విజయం పట్ల కోచ్ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మద్దతు ఇచ్చిన ఆమె తల్లిదండ్రులు, స్పాన్సర్లు, సహోద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, అన్వితారెడ్డి ఇప్పటికే ఫిబ్రవరి 2021లో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు–సో–మోరిరి, లదాఖ్), జనవరి 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబర్ 2021లో యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. అన్వితారెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. -
ఎవరెస్ట్ శిఖరాన.. ఎమ్మెల్యే కుమారుడు
భువనేశ్వర్: రాష్ట్రానికి చెందిన యువకుడు సిద్ధార్థ్ రౌత్రాయ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అతను ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ రౌత్రాయ్ కుమారుడు సిద్ధార్థ్ రౌత్రాయ్ కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4.15 గంటలకు ఎవరెస్ట్ లక్ష్యాన్ని చేరి, కీర్తి ఆర్జించాడని ఎమ్మెల్యే పుత్రోత్సాహం ప్రదర్శించారు. ఇప్పటి వరకు 45మంది భారతీయ పర్వతారోహకులు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వీరి సరసన తన కుమారుడు చోటు చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అరుదైన ఎవరెస్ట్ శిఖరాగ్ర పర్వతారోహకుని జాబితాలో స్థానం చేజిక్కించుకుని, భారత పతాకం ఎగురు వేశారన్నారు. అలాగే శ్రీమందిరం పతితపావన పతాకం రెపరెపలాడించి, జగన్నాథుని ప్రతిమ స్థాపించామరని వివరించారు. ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు.. సిద్ధార్థ్ రౌత్రాయ్ 3 ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను గతంలోనే అవలీలగా అధిరోహించారు. మౌంట్ డెనాలీ(ఉత్తర అమెరికా), మౌంట్ అకాంకోగువా(దక్షిణ అమెరికా), మౌంట్ కిలిమంజారో(ఆఫ్రికా) పర్వత శిఖరాలను చేరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 7 ఖండాల్లోని పర్వతాలను చేరడం అభిలాషగా తెలిపారు. సిద్ధార్ కాలిఫోర్నియా ఫాల్సమ్ ప్రాంతంలో భార్యా, బిడ్డలతో కలిసి ఉంటున్నారు. 2016లో ఫ్లోరిడాలో నిర్వహించిన ట్రయథ్లాన్(4 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42 కిలోమీటర్ల పరుగు పందెం)లో విజయం సాధించి, ఒడియా ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు సాధించారు. చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున తలుపులు తెరవగానే.. -
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్‌లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్‌కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్‌పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
Sabita Mahato and Shruti Rawat: కూతురి కోసం సందేశం..
సైకిల్ తొక్కుతూ దేశమంతా తిరుగుతూ ‘కూతుళ్లను రక్షించండి, వారిని చదివించండి’ అనే సందేశం ఇవ్వడానికి మూడేళ్ల క్రితమే ఈ సోలో సైకిలిస్ట్ దేశమంతా పర్యటించింది. 173 రోజుల్లో 12,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి 29 రాష్ట్రాలను చుట్టి వచ్చింది. రాబోయే సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తన సందేశాన్ని శిఖరాగ్రాన ఉంచాలనుకుంది 24 ఏళ్ల సబితా మహతో. బీహార్ వాసి అయిన సబిత మూడేళ్ల క్రితం తన మొదటి యాత్రను జమ్మూ కాశ్మీర్ నుండి ప్రారంభించి, దక్షిణాన కేరళ, తమిళనాడులను చేరుకుని, అటు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లింది. చివరకు సిక్కిం మీదుగా పాట్నా చేరుకుంది. దారిలో అన్ని ప్రదేశాలలోనూ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటూ సైకిల్‌పై 12 వేల 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. గత ఫిబ్రవరిలో మరో సైకిలిస్ట్ శ్రుతి రావత్‌తో కలిసి 85 రోజుల్లో 5,800 కిలోమీటర్లు నేపాల్ మీదుగా హిమాలయన్ సైక్లింగ్ టూర్‌ను ప్రారంభించిన సబిత ఈ పర్యటననూ దిగ్విజయంగా పూర్తిచేసింది. లింగ సమానత్వం, పర్యావరణం గురించి పాఠశాల విద్యార్థులతో చర్చించాలనే ఆశయంతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. అడగడుగునా ఆహ్వానాలు.. సబిత తన ప్రయాణ అనుభవాల గురించి వివరిస్తూ ‘అడవి గుండా వెళుతున్నప్పుడు కూడా నా నినాదాన్ని వదిలిపెట్టలేదు. ‘కూతురుని రక్షించండి. చదివించండి.’ అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నాను. వెళ్లిన ప్రతి చోటా ఆ ప్రాంతవాసుల ఆదరాభిమానాలు పొందాను. సైకిల్ ప్రయాణంలో నేను బీహార్ వాసినని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. శ్రుతి రావత్‌తో కలిసి చేసిన పర్యటనలో ఇవే అనుభవాలను చవిచూశాను. ఎక్కడకెళ్లినా, అక్కడి ప్రజలు నన్ను ఆదరించిన తీరు మాత్రం మర్చిపోలేను.’ అని తన పర్యటన విశేషాలు సంతోషంగా తెలియజేస్తుంది. పేదరికంలో పెరిగినా.. సబిత మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. పేదరికంలోనూ పెద్ద కలలు కనేది. తనకు చిన్నతనంలోనే పెళ్లి చేయబోతే నిరోధించింది, షార్ట్స్ వేసుకొని సైకిల్ తొక్కుతూ తిరిగేది. దీంతో తండ్రి ఆమెను ఎప్పుడూ ‘జనం ఏమనుకుంటారు’ అని అంటూ వెనకడుగు వేసేలా చేసేశాడు. కానీ, అవేమీ పట్టించుకోలేదు సబిత. స్కూల్లో ఉన్న ఇతర అమ్మాయిల బాల్యవివాహాలనూ అడ్డుకుంది. ‘కూతుళ్లను చదివించండి..’ అనే నినాదంతో సబిత మొదలుపెట్టిన సైకిల్ ప్రయాణానికి పాఠశాల యాజమాన్యం కూడా సాయం చేసింది. భూమికి ఏడున్నరవేల మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని సంతోపత్ పర్వతంపై సబిత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ‘నిరంతరం నా ప్రయాణం అమ్మాయిల్లో అవగాహన పెంచడం కోసమే’ అంటుంది సబిత. శ్రుతి రావత్‌తో కలిసి.. డార్జిలింగ్‌లో ఉండే శ్రుతి రావత్ ఈ యేడాదే డిగ్రీ పూర్తి చేసింది. సైకిల్ రైడింగ్ అంటే తనకు చాలా ఇష్టం. సైకిల్ రైడర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సబిత పరిచయమై, ఆమె తన యాత్ర గురించి చెప్పినప్పుడు ఈ పర్యటనలో పాల్గొనాలన్న ఆలోచన తనకూ కలిగింది. ‘‘మొదట్లో నేను ఎక్కువ దూరం సోలోగా ప్రయాణించలేదు. క్రీడాకారిణిని కూడా కాదు. రోజూ ఏడు గంటలు సైకిల్‌పై ప్రయాణం చేయడం అప్పట్లో కష్టంగా అనిపించేది. కానీ, సబిత ఇచ్చిన శిక్షణ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించే సైకిల్ యాత్ర చీకటి పడటంతో ముగుస్తుంది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల మీదుగా ఉత్తరాఖండ్ అటు నుంచి ట్రాన్స్ హిమాలయాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. మా ప్రయాణంలో ముందే భోజన, వసతి సదుపాయాల ప్లానింగ్ కూడా ఉండేది. దాంతో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చుంటే బయటి ప్రపంచం అంతా అమ్మాయిలకు రక్షణ లేనిదిగానే ఉంటుంది. కానీ, బయటకు వచ్చి చూస్తే ఎంతో అద్భుత ప్రపంచం కనిపిస్తుంది’’ అని తమ యాత్రానుభవాలను పంచుకుంది శ్రుతి. -
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం
సాక్షి, అమరావతి: తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. తుకారాం స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండా. తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించి సత్తా చాటాడు. చదవండి: రేపటి నుంచి తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం చదవండి: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల -
నా పాఠాన్ని నేనే చదివాను: మలావత్ పూర్ణ
ఆమె సంకల్పబలం శిఖరసమానం. ఆత్మవిశ్వాసంలో ఆమె ఎవరెస్ట్.. లక్ష్యసాధనలో ఆమెకు లేదు రెస్ట్. అందుకే ఆమె ది బెస్ట్.. సరిగ్గా ఐదడుగులు కూడా లేని ఆమె ముందు ప్రపంచంలోనే ఎత్తైన 29,028 అడుగుల పర్వతం తలవంచింది. ఆమె ఘనతను చూసి మహిళాలోకం సగర్వంగా తలెత్తుకొంది. ఆమే మలావత్ పూర్ణ. ఆమె పేరు మారుమూల పాకాల నుంచి ప్రపంచం నలుమూలలకూ పాకింది. ఆమె ప్రతిష్ట హిమాలయమంత ఎత్తు కు ఎదిగింది. యువతకు ఆమె ఇప్పుడు సం‘పూర్ణ’ప్రేరణ. సంకల్పబలముంటే సాధారణ మనిషైనా ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని సాధికారికంగా నిరూపించిన ‘పూర్ణ’అంతరంగాన్ని ‘సాక్షి’మరోసారి ఆవిష్కరించింది. ఇక చదవండి. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత నా గురించి ఒకటి, రెండు పేరాలు పదో తరగతి, ఇంటర్, డిగ్రీల్లో పాఠ్యాంశాలుగా చేర్చారు.. నా గురించి ఉన్న ఈ పాఠ్యాంశాలను నేనే చదువుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి అనుభూతి చాలా అరుదుగా ఎదురవుతుంది.. నా అచీవ్మెంట్పై తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో పుస్తకాలు వచ్చాయి.. తాజాగా మలయాళంలోనూ ఓ పుస్తకం వెలువడింది. నా గురించి ఏకంగా ఓ సినిమానే వచ్చింది.. ఈ సినిమా చూసి ఏ ఒక్క ఆడపిల్ల అయినా నన్ను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తే నాకు అదే సంతోషం’’అంటున్నారు ప్రపంచంలోనే అత్యం త ఎత్తైన శిఖరం ‘ఎవరెస్ట్’ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా వరల్డ్ రికార్డు సాధించిన మలావత్ పూర్ణ. అమెరికాలో విద్యాభ్యాసం తర్వాత తన స్వగ్రామం పాకాల చేరుకున్న సందర్భంగా పూర్ణను ‘సాక్షి’ పలకరించింది. కుటుంబంతో మలావత్ పూర్ణ సాక్షి: ఎవరెస్ట్ అధిరోహించక ముందు ఎలా ఉండేవారు? మీ లక్ష్యాన్ని సాధించాక ఎలా ఉన్నారు? పూర్ణ: ‘‘రైట్ గైడెన్స్ ఫ్రం రైట్ పర్సన్’’ తొమ్మిదో తరగతిలో నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన.. అంతకు ముందు ఇదే గ్రామం(పాకాల)లో బడికి పోతుండే.. పొలం పనుల్లో నాన్నకు సహాయం చేస్తుండే.. నాట్లు వేసేటప్పుడు వరినారు అందిస్తుండే.. అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వు ఏరుతుంటిని.. మొర్రిపండ్లు సేకరిస్తుంటిమి.. అందరు పిల్లల్లాగే చదువుకోవడం, ఆడుకోవడం.. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు నా వయస్సు 13 సంవత్సరాల పదినెలలు. అతిపిన్న వయస్సులో ఈ శిఖరం ఎక్కిన రికార్డు నాకు దక్కింది. అంతకు ముందు 16 సంవత్సరాల వ్యక్తి పేరిట ఈ రికార్డు ఉంది. ఇది సాధించాక చాలా మార్పులు వచ్చాయి.. ప్రపం చం నావైపు చూసినట్లపించింది. అమెరికాలో చదువుకునే అవకాశం లభించింది. ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సార్ మార్గదర్శకత్వంలో ముందడుగు వేశాను. రైట్ గైడెన్స్ ఫ్రం రైట్ పర్సన్.. ఉంటే ప్రతి ఆడపిల్లా ఉన్నతశిఖరాలను అందుకోవచ్చనేది నిరూపితమైనట్లు భావిస్తున్నా. సాక్షి: అమెరికాలో ఏం చదువుకున్నారు? పూర్ణ: ‘‘2017లో అమెరికా వెళ్లాను. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు యూఎస్ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. యూఎస్ కాన్సలేట్ జనరల్ క్యాథరిన్ హెడ్డాను కలిసినప్పుడు అమెరికా రావాలని సూచించారు. అక్కడ ‘‘వరల్డ్ లెర్నింగ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం, ఎక్స్పీరియెన్షనల్ ఎడ్యుకేషన్’’ అనే కోర్సులు రెండు సెమిస్టర్లు చదివేందుకు వెళ్లాను. సంవత్సరంపాటు అమెరికాలో ఉన్నా.. లాక్డౌన్ సమయంలోనే అక్కడి నుంచి వచ్చాను. ప్రస్తుతం డిగ్రీ(బీఏ)లో రాయకుండా మిగిలిపోయిన పరీక్షలు రాస్తున్నాను. సాక్షి: మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ? పూర్ణ: ఇకపై పర్వతారోహణను నా జీవితంలో ఒక భాగం చేసుకుంటాను.. ప్రస్తుతం నా డిగ్రీ పూర్తవుతోంది. పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఐపీఎస్ సాధించి వేలాదిమందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా.. పీజీ అమెరికాలో చేయాలనే భావిస్తున్నా.. రెండెకరాలున్న వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. బీపీఎల్ కుటుంబం.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్థికసహాయం అందింది. ఇందల్వాయిలో ఐదెకరాల భూమి కేటాయించారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రిపుల్ బెడ్రూం ఇంటి స్థలం కేటాయించారు.. ఇన్ఫోసిస్ అధినేత్రి సుధామూర్తి ఆర్థికంగా చేయూతనిచ్చారు. సాక్షి: పర్వతారోహణ విశేషాలు చెబుతారా? పూర్ణ: ‘‘లక్ష్యాన్ని చేరుకున్నాక.. నా ఆనందానికి అవధుల్లేవు.. కానీ, నా కాళ్లలో సత్తువ లేదు’’ఐదో తరగతి వరకు ఇదే గ్రామం (పాకాల)లో చదువుకున్నా.. తర్వాత తాడ్వాయి(కామారెడ్డి జిల్లా) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునేటప్పుడు పర్వతారోహణకు అవకాశం వచ్చింది. రాక్ కైయిమింగ్ శిక్షణ కోసం మొదట భువనగిరికి తీసుకెళ్లారు. ఆ కొండను చూస్తే భయమేసింది. మనిషన్నవారు ఈ కొండను ఎక్కగలరా అని తొలి అడుగు వేసేటప్పుడు అనిపించింది.. అక్కడ ఐదురోజులు శిక్షణ తీసుకున్న తర్వాత డార్జిలింగ్‌కు పంపారు. బేసిక్స్ అండ్ అడ్వాన్స్ మౌంటెనింగ్‌లో 25 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. చుట్టూ కనుచూపు మేరల్లో అంతా మంచు. డార్జిలింగ్‌కు వెళ్లాక ఇదే కొత్త లోకం అని అనిపించింది.. ఆ పరిస్థితులు చూస్తే ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను. కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఎవరెస్ట్ ఎక్కేందుకు ఇంత కఠోర శిక్షణ అవసరమా అని ప్రవీణ్ సార్‌ను అడిగాను.. కానీ, ఎవరెస్ట్ సమీపంలోకి వెళ్లేటప్పుడు అనిపించింది. అంత కంటే ఇంకా కఠోర శిక్షణ అవసరమని.. మరికొద్ది సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుంటున్న తరుణంలో పర్వతాల్లో శవాలు కనిపించాయి.. వాటిని చూసి భయపడి వెనక్కి వెళితే.. ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృథా అవుతుందనిపించింది.. ఎలాగైనా లక్ష్యమే నా కళ్ల ముందు మెదిలింది.. శక్తినంతా కూడగట్టుకుని లక్ష్యాన్ని చేరుకున్నా.. ఇక నా ఆనందానికి అవధుల్లేవు.. ఎగిరి గంతేయాలనిపించింది.. కానీ నా కాళ్లలో సత్తువ లేదు.. కూలబడిపోయాను.. కొన్ని నీళ్లు తాగాక.. వెళ్లి ఫొటోలు దిగాను’’ పాకాల.. చుట్టూ అడవి.. గుట్టల మధ్య కుగ్రామం.. ఇదో అత్యంత మారుమూల ప్రాంతం.. సిరికొండ మండలంలో ఉన్న ఈ గ్రామం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సు కూడా రోజుకు ఒకటీ రెండు ట్రిప్పులకు మించి వెళ్లదు.. గ్రామంలో గిరిజనులే అధికం. గుట్టలకు ఆనుకుని నివాసాలు నిర్మించుకున్నారు.. అది చుట్టూ పచ్చని పొలాల మధ్య ఉంటుంది. విద్యార్థులకు చెబుతుంటాను ‘‘పాకాల బడిలో విద్యా వలంటీర్‌గా పనిచేస్తున్నా.. పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలకు తరచూ చెబుతుంటాను.. ‘మీరు మాలావత్ పూర్ణలాగా ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతోపాటు, ఆ లక్ష్యసాధన కోసం కష్టపడాలని’ పూర్ణ చిన్నప్పుడు అందరు పిల్లల్లాగే ఆడుకునేది. ఆటల్లో కాస్త ఎక్కువ ఆసక్తి కనబరిచేది. కళ్ల ముందు తిరిగిన అమ్మాయి ఉన్నతస్థానానికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ – కళావతి, ఉపాధ్యాయురాలు సరదాగా ఆడుకునేవాళ్లం ఐదో తరగతి వరకు కలసి ఇదే గ్రామం(పాకాల)లో చదువుకున్నాం.. అప్పుడు ఎంతో సరదాగా ఆడుకునేవాళ్లం.. పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లం.. మా స్నేహితురాలు ఎవరెస్ట్ ఎక్కిందని టీవీల్లో చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పడు కూడా పూర్ణ మాతో ఎంతో స్నేహంగా ఉంటుంది. – స్రవంతి, పూర్ణక్లాస్ మేట్ కుటుంబంతో మలావత్ పూర్ణ -
‘విన్సన్’ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
సాక్షి, హైదరాబాద్: అంటార్కిటికా ఖండంలో ఎత్తయిన విన్సన్ మసిఫ్ పర్వతాన్ని తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ ఈ నెల 26న అధిరోహించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన పూర్ణ.. ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రస్, అకోన్కాగ్వా, కార్ట్స్నెజ్ పర్వతాలను ఎక్కింది. తాజాగా విన్సన్ మసిఫ్ పర్వతాన్ని అధిరోహించింది. ఇప్పటివరకు మొత్తం ఆరు ఎత్తయిన పర్వతాలను ఎక్కింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుపేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొంది. తనకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
‘నాకు కొన్ని వేడి నీళ్లు ఇస్తారా’
సింగపూర్ : హిమాలయా పర్వత శ్రేణిలో ఎత్తైనదే కాక ప్రమాదకర శిఖరాల్లో అన్నపూర్ణ పర్వతం ఒకటి. తాజాగా ఈ పర్వతాన్ని అధిరోహించి.. ప్రమాదం పాలైన మలేషియా డాక్టర్ సింగపూర్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వివరాలు.. మలేషియాకు చెందిన చిన్ వుయ్ కిన్ (48) సిటీ స్టేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది పర్వతారోహకులతో కలిసి గత నెల 23న హిమాలయాల్లో ఎత్తైన శిఖరం అయిన అన్నపూర్ణ (ఎత్తు 8100 మీటర్ల) పర్వతాన్ని అధిరోహించాడు. కానీ అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న క్యాంప్‌కు చేరుకోలేకపోయాడు చిన్ వుయ్. ఇది గమనించిన తోటి పర్వతారోహకులు, గైడ్ అతన్ని వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఆచూకీ లభించలేదు. దాంతో వారంతా క్యాంప్‌కు చేరుకుని ఈ విషయం గురించి అధికారులకు తెలియజేశారు. చిన్ వుయ్ మంచు వాలులో చిక్కుకుపోయి ఉంటాడని భావించిన క్యాంప్ నిర్వహకులు తొలుత హెలికాప్టర్ని రంగంలోకి దించారు. కానీ అతని జాడ తెలియలేదు. దాంతో నలుగురు అనుభవజ్ఞులైన షేర్పాలను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సారి వారి ప్రయత్నం ఫలించింది. నాలుగు గంటలపాటు వెతగ్గా దాదాపు 6500 మీటర్ల ఎత్తులో.. అపస్మారక స్థితిలో ఉన్న చిన్ వుయ్ వారికి కనిపించాడు. వెంటనే అతన్ని ఖట్మాండులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయం గురించి ఓ డాక్టర్ మాట్లడుతూ.. ‘స్పృహలోకొచ్చిన తర్వాత చిన్ వుయ్ మాట్లాడిన మొదటి మాట నాకు కొన్ని వేడి నీళ్లు ఇవ్వగలరా అని అడిగాడు. ఆ తర్వాత వెంటనే స్పృహ కోల్పోయాడ’ని తెలిపారు. అంతేకాక ఇన్ని రోజుల పాటు అంత శీతల వాతావరణంలో అతడు బతికి ఉండటమే గొప్ప అని పేర్కొన్నారు. ఆ తరువాత చిన్ వుయ్ని సింగపూర్‌కి తరలించి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న చిన్ వుయ్ నిన్న (గురువారం) మరణించినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన ఎవరెస్ట్ కన్నా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించడమే కష్టం అంటున్నారు పర్వతారోహకులు. అన్నపూర్ణ పర్వతం మీదే అధిక మరణాల సంఖ్య నమోదవుతుందని తెలిపారు. -
భారత పర్వతారోహకుడి అరుదైన ఘనత
కోల్‌కతా: భారత పర్వతారోహకుడు సత్యరూప్ సిద్ధాంత అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయస్సులోనే ఏడు ఖండాల్లోని ఎతైన పర్వతాలు, అగ్ని పర్వతాలు అధిరోహించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.28 గంటలకు 4,285 మీటర్ల ఎతైన అంటార్కిటికాలోని సిడ్లే అగ్ని పర్వతాన్ని అధిరోహించడం ద్వారా సత్యరూప్ ఈ ఘనత సాధించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ బుల్ 36 ఏళ్ల 157 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించారు. కాగా, సత్యరూప్ 35 ఏళ్ల 274 రోజుల వయస్సులోనే ఈ రికార్డును బద్దలు కొట్టారు. 2012 నుంచి 2019 మధ్య కాలంలో సత్యరూప్ ఎతైన పర్వతాలు, అగ్ని పర్వతాలు అధిరోహించారు. సిడ్లే శిఖరానికి చేరుకున్న తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించినట్టు సత్యరూప్ తెలిపారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు కూడా సిద్ధాంత్ కావడం విశేషం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సత్యరూప్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ఎనిమిది సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు కానీ...
డార్జిలింగ్ : ఆయన ఎనిమిది సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.. కానీ ప్రమాదవశాత్తు ఓ హిమనీనదిలో పడి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన పెంబా శెర్పా (47) పర్వతారోహకులలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతాన్ని 8 సార్లు అధిరోహించాడు. మకాలు, కాంచనగంగ వంటి పర్వతాలను కూడా ఎక్కాడు. కొన్ని రోజుల క్రితం పర్వత శిఖరం మీద నుంచి కిందకు దిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ససెర్ కంగ్రి అనే హిమనీనదిలో పడిపోయాడు. అప్పటినుంచి అతని జాడలేకుండా పోయింది. ఐటీబీపీ జవాన్లు, సెర్పాస్ ప్రజలు పెంబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెంబా భార్య మాట్లాడుతూ.. ‘‘ఆయన జూన్ 19న మనాలికి వెళ్తునట్లు తెల్సింది. పెంబా లోయలో పడిపోయినట్లు అతని చిన్న తమ్ముడికి శనివారం ఫోన్ వచ్చింద’’ని ఆమె తెలిపింది. -
ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం
కోల్‌కతా: ప్రముఖ పర్వతారోహకుడు ప్రదీప్ సాహూ(50) హఠాన్మరణం చెందారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుతో జింబాబ్వే రాజధాని హరారేలో కన్నుమూశారు. కోల్‌కతాలోని టాలిగుంగే ప్రాంతానికి చెందిన ఆయన పర్వతారోహకుల్లో ప్రముఖులు. ఈ ఏడాది కూడా ఆయన తన భార్య చేతనతో కలిసి ఎవరెస్టును మూడోసారి అధిరోహించారు. ఓ మైనింగ్ కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న ఆయన చాలా ఏళ్లుగా వివిధ పర్వాతాలను తన భార్యతోకలిసి అధిరోహిస్తుంటారు. ఐదేళ్ల కిందటే ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇటీవలె వ్యక్తిగత పనుల నిమిత్తం హరారే వెళ్లారు. ఆయనకు ఇటీవలె బెంగాల్ ప్రభుత్వం రాధానాథ్ షిక్దార్ అవార్డును కూడా ప్రకటించింది. దానిని ఈ నెల తర్వాత అందించనున్నారు. సాహూ మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందానని, ఆయన లేరనే విషయం నమ్మలేకపోతున్నానని, ఆయనతోపాటు చివరిసారిగా పర్వతారోహణను పంచుకున్న దేబాశిష్ విశ్వాస్ అనే మరో ఎవరెస్టు అధిరోహకుడు చెప్పారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న మౌంటెనీర్ జాహ్నవి
-
చెప్పిందొకటి, చేస్తోంది మరొకటి
పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి అన్యాయం అప్పట్లో ఐదెకరాలు ఇస్తామని, ఇప్పుడు రెండెకరాలు ఇచ్చిన ప్రభుత్వం అధికారులను నిలదీసిన మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ సంగం: ఖండాంతరాల్లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన ప్రముఖ పర్వతారోహకుడు, దివంగత మల్లిమస్తాన్‌బాబు కుంటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మస్తాన్‌బాబు మృతి చెందినపుడు ఆయన తల్లి సుబ్బమ్మకు ఐదు ఎకరాల సాగుభూమి ఇస్తామని అప్పట్లో రాష్ట్ర మంత్రులు, అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా ఇప్పుడు రెండెకరాలు ఇస్తున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో సోమవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులు ప్రకటించారు. దీనిపై మస్తాన్‌బాబు తల్లి ఆవేదన చెందారు. తన కుమారుడు మస్తాన్‌బాబు మృతి చెందినపుడు రాష్ట్ర మంత్రులు, అధికారులు తనకు ఐదెకరాలు సాగుభూమి, రూ. 10 వేల పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు రెండెకరాలు ఇవ్వడం ఏమిటని జన్మభూమిలో అధికారులను ఆమె నిలదీశారు. అప్పుడు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తుందేమిటి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా రెండెకరాల భూమిని సుబ్బమ్మకు ఇస్తున్నట్లు సభలో పట్టాను చూపిన తహశీల్దార్.. ఆమెకు మాత్రం పట్టా అందజేయలేదు. ఆర్డీవో ఎంవీ రమణ ద్వారా పట్టా ఇప్పిస్తామని తొలుత అధికారులు తెలిపారు. ఆర్డీవో సభకు రాకపోవడంతో పట్టాను ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లి సుబ్బమ్మకు పట్టా ఇచ్చే విషయంలో కూడా అధికారులు ప్రచారం కోరుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. -
ఆనంద్‌కుమార్‌కు అవమానం
నిజాం కళాశాలలో జూనియర్, సీనియర్ల మధ్య చలరేగిన వివాదంతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్‌కుమార్ కు అవమానం జరిగింది. నిజాం కాలేజీలో బీఏ చదువుతున్న ఆనంద్ కుమార్‌ను మంగళవారం లైబ్రరీ వద్ద ఫైనల్ ఇయర్ విద్యార్థులు భరత్, మోహన్ బయోడేటా చెప్పాలని అవమానించారు. దీంతో అతను వారిపై తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మనస్థాపానికి లోనైన ఆనంద్‌కుమార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామికి ఫిర్యాదు చేశారు. దీం తో బుధవారం ఆయన భరత్, మోహన్‌లను పిలిపించి మందలించారు. దీనిపై సమాచారం అందడంతో అబిడ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించడమేగాక, ఆనంద్‌కుమార్‌తో పాటు మోహన్, భరత్‌లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. -
మల్లి మస్తాన్‌బాబు మహోన్నత వ్యక్తి
సంగం(నెల్లూరు జిల్లా): భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మహోన్నత వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. గురువారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో మస్తాన్‌బాబు ఉత్తరక్రియల్లో పాల్గొన్న ఆయన.. సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పర్వతాలను సులువుగా అధిరోహించిన మస్తాన్‌బాబు దురదృష్టవశాత్తు ఆండీస్ పర్వతారోహణలో ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని మృతిచెందారన్నారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషిచేశాయన్నారు. మస్తాన్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు గాంధీజనసంఘంలోని సామాజిక భవనానికి మల్లి మస్తాన్‌బాబు నామకరణం చేయనున్నామని వెల్లడించారు. అలాగే సంగంలోని గురుకుల కళాశాలకు సైతం మస్తాన్‌బాబు పేరు పెట్టనున్నామన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో మస్తాన్ బాబు అంత్యక్రియలు
అశ్రునయనాలు... మస్తాన్ బాబు అమర్ రహే నినాదాల నడుమ.... నింగికెగసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం నెల్లూరు జిల్లా గాంధీజనసంగంలోని అతని పొలంలోనే.... సాహసవీరుడు శాశ్వాత నిద్ర తీసుకున్నాడు. అధికారిక లాంఛనాలతో మస్తాన్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. గౌరవ సూచికంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మూడుసార్లు గాల్లో కాల్పులు జరిపారు. పర్వతారోహణలో దేశ కీర్తిని ప్రపంచ నలుదిక్కులా చాటిన మస్తాన్‌బాబును....కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక సెలవు వీరుడా అంటూ... కన్నీటితో సాగనంపారు. తుదివీడ్కోల సమయంలో మస్తాన్ తల్లి పరిస్థితి వర్ణనాతీతం. చెట్టంతా కొడుకు విగతజీవిగా మట్టిలో కలిసిపోతుంటే... చూడలేక కుమిలికుమిలి ఏడ్చింది. మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొని తుదివీడ్కోలు పలికారు. -
'మల్లి' మళ్లీ వస్తాడు...
నెల్లూరు : సాహసమే ఊపిరిగా జీవించిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ..మళ్లీ తిరిగి పుడతాడని భావిస్తున్నానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఉదయం మస్తాన్ బాబు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ...మల్లి మస్తాన్ బాబు స్మృతులను గుర్తు చేసుకున్నారు. మస్తాన్ బాబు అదృశ్యమైన దగ్గర నుంచి ఆతని ఆచూకీ కోసం తీవ్రప్రయాత్నాలు చేశామని, అయినప్పటికీ ప్రాణాలతో కనుగొనలేకపోవటం దురదృష్టకరమన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి... ఉద్యోగాన్ని సైతం వదులుకుని తనకు ఇష్టమైన పర్వతారోహణను చేపట్టి ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ రికార్డును అధిగమించాడన్నారు. తాను తొలిసారి 2006లో మల్లి మస్తాన్ బాబును చూసానని అన్నారు. మల్లి మస్తాన్ బాబును యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మస్తాన్ జీవితం యువతకు ఆదర్శమన్నారు. మరోవైపు మల్లి మస్తాన్ బాబు స్వగ్రామం గాంధీజనసంగంలో అంత్యక్రియులు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రులు నారాయణ, పల్లె రఘునాధరెడ్డి, రావెల కిషోర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు మస్తాన్ బాబు భౌతికకాయానికి అంజలి ఘటించారు. మరోవైపు మస్తాన్ బాబును కడసారి చూసేందుకు బంధువులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. -
మస్తాన్ మృతదేహాన్ని దించారు
న్యూఢిల్లీ: పన్నెండు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అర్జెండీనా ఆండీస్ పర్వతాల్లో అసువులు బాసిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని ట్రెక్కింగ్ నిపుణులు కిందకు దించారు. ఉత్తర అర్జెంటీనాలోని టుకుమాన్ అనే నగరానికి తరలించారు. వీలైనంత త్వరగా మృతదేహానికి పంచనామా, పరీక్షలు నిర్వహించి భారత్‌కు పంపిస్తారు. ఈ వారం చివరిలోగా మల్లి మస్తాన్ బాబు మృతదేహం నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉందని అతడి స్నేహితుడు సత్యం బీం సారెట్టి తెలిపాడు. ఇప్పటికే మస్తాన్ బాబు సోదరి డాక్టర్ మల్లి దొరసానమ్మ అర్జెంటీనాకు తరలి వెళ్లారు. గత కొన్ని రోజుల క్రితం పర్వతారోహణ చేస్తూ మల్లి మస్తాన్ బాబు ఏప్రిల్ 3న అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని మృతిచెందిన అతడి మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ ప్రారంభమయ్యింది. ప్రారంభంలో కాస్తంత ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం అయినా ఆ తర్వాత వాతావరణం మెరుగుపడటంతో ట్రెక్కింగ్ బృందం రంగంలోకి దిగింది. ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం బేస్ క్యాంపునకు చేరుకుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొంది. దీని కోసం భారత రాయబార కార్యాలయం అన్ని రకాల అనుమతులను తీసుకుంది. -
స్వాప్నికుడూ... సాహసీ!
జయప్రభ నాకన్పిస్తుంది. సృష్టిలోని ప్రతి పర్వతమూ ఒక సాలగ్రామమే అని. ప్రతి మహోన్నత శిఖరమూ ఒక ఆలయ గోపురమే అని. శిఖరారోహణ చేసే ప్రతిసారీ తనతో పాటుగా రుద్రాక్షమాలని చేతపట్టుకుని వెళ్లే మస్తాన్‌బాబు కూడా బహుశా నాలాగే భావించి ఉంటాడు. పర్వత శిఖరాలు అతడిని అమితంగా ఆకర్షిస్తాయి. ఆ ఆకర్షణని అతడు నిలువరించుకోలేడు. పర్వతాల ఎత్తులకి ఎగబాకే క్రమంలో ఒంటరి పర్వతారోహకుడు ఒక సాధకుడౌతాడు. నిట్టనిలువు కొండలని కొలిచే వేళ గండ శిలలపై మృదువుగా తన చెక్కిలి నానించి సున్నితమైన వాటి సుబోధలని గ్రహించగలడు. తానొక్కడే రాత్రివేళ గుడారపు మధ్యలో ముడుచుకుని తన చుట్టూ ఆవరించి ఉన్న గాఢతర నిశ్శబ్దంలోంచి చరాచరపు ఊసులకి ఊ కొట్టగలడు. మబ్బు తెరల మధ్యనించి కురిసే మంచు నించి తరచూ తనతో కరచాలనం చేసే హిమ స్పర్శని చల్లగా అందుకోగలడు. రాత్రి ఏకాంతంలో చుక్కల వెలుగు మధ్య అనంతమైన ఆకాశపుటందాలని చూడగలడు. తాను సిద్ధంగా ఉండని, తాను ముందుగా ఊహించని సంక్లిష్టతలని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు శాంత చిత్తంతో ఆ స్థితి ముందు అతడు నిలబడగలడు. జీవితం ఎంత అస్థిరమో, ఎంత బుద్బుదమో అనుక్షణం గ్రహింపుకి వచ్చే క్రమంలో అతడు ఇతరులకెందరికో అంత సులువుగా అర్థం కాని, వారికెవ్వరికీ అనుభవంలోకి రాని అరుదైన జ్ఞానాన్ని ఆర్జిస్తాడు. సరిగ్గా ఇలాంటి జ్ఞానవంతుడినే ఆరోజు నేను మల్లి మస్తాన్బాబులో చూశాను. మస్తాన్బాబుని గురించి ఒకరోజు ఇలా రాయవలసి వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. నిరంతర సంచారి అయిన మల్లి మస్తాన్బాబుని గురించి. సాహసి అయిన మస్తాన్ గురించి... ఇది 2007లో జరిగిన విషయం అని గుర్తు. ఏదో వార్తాకథనం లోంచి నేను మల్లి మస్తాన్బాబుని గురించి తెలుసుకున్నాను. మిత్రులనడిగి అతడి ఫోన్ నంబరు తీసుకుని, అతడితో మాట్లాడి, అతడిని అభినందించి, మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. నా సంరంభానికీ, అతడు నాలో కల్గించిన గర్వానికీ అప్పుడు ఒక కారణం ఉంది. తెలుగువాడిగా, భారతీయుడిగా మల్లి మస్తాన్‌బాబు గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు. అతడు సాధించిన విషయం మామూలుది కాదు. ప్రపంచంలోని ఏడు ఖండాలలో ఉన్న ఎత్తయిన ఏడు శిఖరాలనీ అప్పటిదాకా ఎక్కినవారి వేగాన్ని తాను అధిగమించటం. ఆరోజు చెప్పిన సమయానికల్లా అతడు మా ఇంటికి వచ్చాడు. ముప్ఫై మూడేళ్ల యువకుడు. చాలా వినయం. ఎంతో ఆత్మవిశ్వాసం. తాను చెప్పే విషయాల మీద అతడికున్న సాధికారత నాకెంతో నచ్చింది. ఆ అబ్బాయి మీద వాత్సల్యం ఏర్పడింది. ఆ తరువాత చాలా సునాయాసంగా గంటలకొద్దీ కబుర్లు చెప్పుకున్నాం. కొండలెక్కడంలో పసితనంలోనే అతడిలో ఏర్పడిన ప్రేమ - పెద్దయ్యాకా ఎక్కడా ఏ శిక్షణా తీసుకోకుండానే ఇన్ని అద్భుతాలు చేసేలా చేసింది. అత్యున్నత విద్యాసంస్థల్లో ఎంతో చదువుకుని కూడా అతడు ఉద్యోగాల వైపు ఆలోచించకపోవడంలో అతడి దృఢ దీక్ష వ్యక్తమయ్యింది. నీ గురించి తెలుగువారికి తెలుసా? అని అడిగాను. తన స్నేహితులకీ, బయట రాష్ట్రాల వారికీ, బయటి దేశాల వారికీ తన గురించి ఎక్కువ తెలుసని చెప్పాడు. తెలుగువారికి ఏమంత శ్రద్ధ ఉన్నట్టు లేదని ఆ రోజు అతడి మాటల వలన నాకు అర్థమైంది. చాలామందికి అర్థం కాదు మేడమ్! కొండలెక్కుతాడంట అని అంటుంటారని చిరునవ్వుతో అనడం ఆ రోజు నా మనసుని ఇబ్బంది పెట్టిన విషయం.మనుచరిత్రలోని ప్రవరాఖ్యుడి కుతూహలం నాది. అతడు చేసిన ఆ సాహసంలో అతడెదుర్కొన్న సంఘటనల గురించీ అతడి అనుభవాల గురించీ అడిగి తెలుసుకున్నాను. ఎంతో సంతోషంతో మస్తాన్ వాటినన్నింటినీ నాతో పంచుకున్నాడు. అంతేకాదు త్వరలోనే తాను సిమ్లా ఎక్స్‌పెడిషన్ క్యాంపు చేయబోతున్నట్టు చెప్పి, అందులో నన్ను కూడా పాల్గొనమని అడిగాడు. నిజానికది నాకు ఇష్టమే. అన్నమయ్య పదాల మీద మొదటి సంపుటం రాసి అచ్చువేసిన అలసటతో ఉన్నాను. కానీ మనసుకున్న ఉత్సాహం శరీరానికి లేక, అతడి కోరిక ప్రకారం అలాగే వస్తానని అనలేకపోయాను. అతడికి నా కవిత్వాన్ని వినిపించాను. ఎంతో శ్రద్ధతో విన్నాడు. నా పుస్తకాలన్నీ కొని వాటిమీద నా సంతకాన్ని తీసుకున్నాడు. మర్నాడు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లాడు. మళ్లా సరిగ్గా చెప్పిన సమయానికల్లా వచ్చాడు. వస్తూ ఒక పార్కర్ పెన్ సెట్‌ని నాకు బహుమతిగా ఇచ్చాడు. మళ్లీ కొన్ని గంటలు గడిపి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత నా రచనలు తనకి చాలా నచ్చాయని చెబుతూ, ఫోన్లు చేసి మాట్లాడేవాడు. అలా ఒక ఏడాది పాటు మామధ్య సంభాషణ నడిచింది. ఆ తరువాత నేను అన్నమయ్య పదాల మీద మరో పెద్ద పుస్తకం రాయడానికి తలపెట్టడంతో ఆ పనులలో పడి అన్నింటినీ మరిచిపోయాను. తిరిగి ఈ విషాద వార్తతో మస్తాన్ బాబుని గురించిన జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.ఎక్కడో పెన్న వొడ్డున పల్లెలో పుట్టి... ప్రపంచవ్యాప్తంగా పర్యటించినవాడు. అతి సామాన్య కుటుంబంలోంచి వచ్చి అసాధ్యాలెన్నో సాధించినవాడూ... మస్తాన్‌బాబు! పర్వతారోహకులని వారి వారి దేశాలు సమున్నత రీతిలో సత్కరించాయి. వారి పేర మౌంటనీరింగ్ సంస్థలని నెలకొల్పాయి. సర్ బిరుదాన్ని, నైట్ హుడ్ లాంటి హోదానీ బహూకరించుకున్నాయి. వారి పేర్లని ముఖ్యమైన రోడ్లకి పెట్టాయి. మరి మస్తాన్‌బాబుకి ఈ దేశం ఏమి చేయబోతోంది? (వ్యాసకర్త ప్రముఖ కవయిత్రి) -
మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం
-
మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం
చిలీ: అర్జెంటీనా ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని మృతి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ ప్రారంభమయ్యింది. ఇంతకాలం ప్రతికూల వాతావరణం కారణంగా మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఎటువంటి యత్నాలు జరుగలేదు. అయితే గత మూడు రోజులుగా వాతావరణం మెరుగుపడటంతో మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ బృందం రంగంలోకి దిగింది. ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సన్నద్ధమయ్యింది. దీనిలో భాగంగానే సహాయ బృందం బేస్ క్యాంపుకు చేరుకుంది. మరో ఐదుగురు సభ్యుల బృందం ట్రెక్కింగ్ ప్రారంభించింది. దీని కోసం భారత అంబాసీ అన్ని రకాల అనుమతులను తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం పర్వతారోహణ చేస్తూ మల్లి మస్తాన్ బాబు అసువులు బాసిన సంగతి తెలిసిందే. -
అతడు చిరంజీవి!
కడుపులో నీళ్లు కదలకుండా, హాయిగా సాప్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ, సవాలక్షమందిలో ఒకడిగా ఉంటే మల్లి మస్తాన్ బాబు బతికి ఉండేవాడేవాడోమో. కానీ అతడిని సాహసం అనే పురుగు తొలుస్తుంటే కుదురుగా బతకలేకపోయాడు. అడ్వెంచర్నే ఆక్సిజన్‌గా మార్చుకున్నాడు. అయితే విచిత్రంగా అతడు ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. పర్వతారోహణ సంస్థల వద్దకు వెళ్లి శాస్త్రీయంగా కొండలెక్కడం నేర్చుకోలేదు. అతడిలో ఉన్న సాహస ప్రవృత్తే మస్తాన్ బాబుకు ఆ విద్యను నేర్పింది, ఏదైనా సాధించాలన్న తపనే అతడిని ఏడు ఖండాల్లోని ఏడు కొండలను ఎక్కించింది. అతడు శిఖరాల్ని ఎంతగా ప్రేమించాడంటే - తన ప్రేమలో ఎన్పటికైనా ప్రమాదముంటుందన్న భావనతో అతడు పెళ్ళి కూడా చేసుకోలేదు. నెల్లూరు జిల్లాలోని ఓ పల్లెటూళ్లో, అందులోనూ అట్టడుగు వర్గంలో పుట్టిన మస్తాన్ బాబు పర్వతారోహకుడిగా అంతర్జాతీయ కీర్తిని ఆర్జించాడు. అయితే మన నేల మీద మాత్రం అతడు చనిపోయిన తర్వాతే ఎక్కువమందికి తెలిసి ఉంటాడు. ఇందులో మనవారి తప్పేమీ లేదు. మనకి సినిమా హీరోలు, రాజకీయ నాయకులు పట్టినంతగా సాహసికుల్లో, శాస్త్రవేత్తలో పట్టరు. నిజమైన హీరోలను బతికున్నప్పుడు పట్టించుకోకపోవటం అసలైన విషాదం. సాహసమే ఊపిరిగా బతికి మస్తాన్, ఒంటిరిగా వెళ్లి కొంత దుస్సాహసం చేశాడనే చెప్పాలి. మంచు విపరీతంగా కురిసే ప్రాంతాల్లో - శరీరాన్ని నిరంతరం వేడిగా ఉంచుకోవాలి. ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ, బయట ఉన్న ద్రవ పదార్థాలు మంచులా గడ్డకట్టేనట్టే శరీరం లోపలి ప్లూయిడ్స్ కూడా క్రిస్టల్స్ గా మారే ప్రమాదముంటుంది. దాంతో పల్మనరీ ఓడిమా, సెరిబ్రల్ ఓడిమా అనే రుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదముంది. దీంతో కొన్ని గంటల్లో స్పృహ కోల్పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పక్కన తోడు లేకపోతే అది అంతిమంగా మృత్యువుకి దారి తీయొచ్చు. పర్వతారోహణలో ఏళ్ల తరబడి అనుభవంతో పండిపోయిన మస్తాన్ కి ఈ మాత్రం విషయాలు తెలీయవనుకోలేం. సాధించాలి, జయించాలి అన్న తొందరే అతడిని ఒంటరిగా వెళ్లే దుస్సాహసానికి పురికొల్పిందని భావించొచ్చు. ఎవరెస్ట్ ఎక్కిన తొలి తెలుగువాడిగా, ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన భారతీయుడుగా మస్తాన్ సృష్టించిన రికార్డులు, అతడి స్పూర్తి ఎప్పటికీ మిగిలే ఉంటాయి. చనిపోయినా అతడు చిరంజీవి! -
పది రోజుల్లో స్వదేశానికి మస్తాన్‌బాబు మృతదేహం
సంగం (నెల్లూరు): పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహాన్ని పది రోజుల్లో భారత్‌కు పంపేలా చర్యలు తీసుకుంటామని చిలీలోని భారతీయ ఎంబసీ అధికారులు సమాచారం అందించినట్టు మృతుడి సోదరి దొరసానమ్మ ఆదివారం మీడియాకు తెలిపారు. చిలీలో ప్రతికూల వాతావరణం ఉండడంతో జాప్యం జరుగుతోందన్నారు. అయితే మృతదేహాన్ని వారంలోగా పంపేలా చూడాలని తాను భారత ఎంబసీని కోరినట్లు ఆమె చెప్పారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. గత ఏడాది డిసెంబర్ 16న ఇంటి నుంచి బయలుదేరిన అతడు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతారోహణకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోయాడు. -
ఆ సాహసికుడు.. ఇక రాడు
పర్వతారోహకుడు మస్తాన్‌బాబు మృతి ఆండీస్ పర్వతాల్లో మృతదేహం గుర్తింపు సంగం/న్యూఢిల్లీ/హైదరాబాద్: పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు మృతిచెందారు. గతనెల 24 నుంచి ఆచూకీ తెలియని మస్తాన్‌బాబు మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున గుర్తించారు. 172 రోజుల్లో ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న మస్తాన్ ఆ పర్వతాల్లోనే ఒదిగిపోయారు. పర్వతాలు తమకు ఇష్టమైన బిడ్డను తమలోనే కలిపేసుకున్నాయంటూ ఫేస్బుక్లో ఆయన స్నేహితులు శనివారం నివాళులర్పించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగం గ్రామానికి చెందిన మల్లి మస్తానయ్య, సుబ్బమ్మ దంపతుల ఐదో సంతానం మస్తాన్‌బాబు. గత ఏడాది డిసెంబర్ 16న ఇంటి నుంచి బయలుదేరిన అతడు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతారోహణకు సిద్ధపడ్డారు. బేస్‌క్యాంపు వరకు వెళ్లిన మస్తాన్ టీం ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆగింది.ఎన్నో ఎత్తై శిఖరాలను అవలీలగా అధిరోహించిన అతను ప్రతికూల వాతావరణాన్ని పట్టించుకోకుండా మార్చి 24వ తేదీన పర్వతారోహణ ప్రారంభించారు. అదేరోజున ఆయన జీపీఎస్ నెట్వర్క్ పనిచేయటం మానేసింది. కంగారుపడిన అతని స్నేహితులు ఈ విషయాన్ని అతడి సోదరి దొరసానమ్మకు తెలిపారు. ఆమె ఈ విషయమై కేంద్రప్రభుత్వ సహాయాన్ని కోరారు. దీంతో కేంద్రం అర్జెంటీనా, చిలీ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీలతో మాట్లాడింది. దీంతో అర్జెంటీనా, చిలీ ప్రభుత్వాలు కూడా ఏరియల్ సర్వేకి హెలికాప్టర్లు పంపాయి. రెండు హెలికాప్టర్లు శోధించినా మస్తాన్‌బాబు జాడ తెలియలేదు. అతడి స్నేహితులైన పర్వతారోహకులు అతడిని వెదికేందుకు బృందాలుగా వెళ్లారు. వారు శనివారం తెల్లవారుజామున మస్తాన్‌బాబు మృతిచెందినట్లు గుర్తించారు. పర్వతారోహణ చేసి దిగుతూ, బేస్ క్యాంపునకు 500 మీటర్ల ఎత్తులో పడిపోయినట్లు సమాచారం. మస్తాన్‌బాబు మృతదేహాన్ని బేస్‌క్యాంపునకు తీసుకొచ్చి అతడి సోదరికి సమాచారం తెలిపారు. పల్లె ఒడి నుంచి.. గాంధీజనసంగం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మల్లి మస్తానయ్య, సుబ్బమ్మ దంపతులకు 1974లో మస్తాన్‌బాబు జన్మించారు. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోను, 4, 5 తరగతులు సంగంలోని ఓ ప్రైవేటు పాఠశాలలోను చదువుకున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కోరుకొండ సైనిక పాఠశాలలో చదువుకున్నారు. అప్పటినుంచే అతడికి పర్వతారోహణ మీద ఆసక్తి కలిగింది. 1992 నుంచి 1996 వరకు జంషెడ్‌పూర్‌లోని నిట్‌లో బీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, 1996 నుంచి 1998 వరకు ఖరగ్‌పూర్‌లో ఐఐటీలో ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు. 1998 నుంచి 2001 వరకు సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఎం కోర్సు చేశారు. పాఠశాల స్థాయి నుంచే అవార్డులు మస్తాన్‌బాబు కోరుకొండలో చదివే సమయంలో నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్స్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. 1992లో బెస్ట్ స్విమ్మర్ అవార్డు పొందారు. జంషెడ్పూర్ నిట్‌లో అథ్లెటిక్ కెప్టెన్‌గా వాలీబాల్, స్విమ్మింగ్ పోటీల్లో అవార్డులు పొందారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో వాటర్పోలోతో పాటు వాలీబాల్ పోటీల్లోనూ విజేతగా నిలిచారు. కలకత్తా ఐఐఎంలో డాక్టర్ బీసీరాయల్ అవార్డును అందుకున్నారు. చెన్నైకి భౌతికకాయం: వెంకయ్య మస్తాన్‌బాబు మృతికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మృతదేహాన్ని కేంద్రం చెన్నై విమానాశ్రయానికి పంపుతుందన్నారు. అక్కడి నుంచి అతడి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు. మస్తాన్‌బాబు మృతి వార్త తెలిసిన వెంటనే వెంకయ్య విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడి భౌతికకాయాన్ని తీసుకురావాలని కోరారు. సీఎం చంద్రబాబు, జగన్ సంతాపం మస్తాన్‌బాబు మృతికి సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు. అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే మంత్రి నారాయణ కూడా తన సంతాపాన్ని తెలిపారు. అమెరికా తీసుకెళ్తానన్న నాబిడ్డ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ అంటూ మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నన్ను అమెరికా తీసుకెళతానన్న నా కుమారుడు ఎక్కడున్నాడయ్యా.. అంటూ గుండెలవిసేలా రోదిస్తోంది. నా కుమారుడికి నీ పేరు పెట్టుకున్నందుకు నాకు కడుపుకోత మిగులుస్తావా మస్తాన్‌బాబా అంటూ కసుమూరు మస్తాన్‌స్వామిని తలచుకుంటూ ఆమె విలపించింది. మస్తాన్‌బాబు తల్లిని ఓదార్చిన ఎంపీ, జెడ్పీ చైర్మన్ మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఓదార్చారు. అతడి సోదరి దొరసానమ్మతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మల్లి మస్తాన్ బాబు దుర్మరణం
నెల్లూరు : పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కథ విషాదంగా ముగిసింది. మార్చి 24న పర్వతారోహణ చేస్తూ అతను చిలీలోని సెర్రో ట్రస్క్ క్రూసెస్ బేస్ క్యాంప్ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. అతని ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే నిర్వహించారు. మస్తాన్ బాబు మృతదేహాన్ని ఏరియల్ సర్వేలో గుర్తించారు. మృతుడు మస్తాన్ బాబుది నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజన సంగం. కాగా కుమారుడి జాడ తెలియకపోవటంతో మస్తాన్ బాబు తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. కొడుకు ఎప్పటికైనా సజీవంగా తిరిగి వస్తాడనుకున్న ఆమె...మస్తాన్ బాబు మరణవార్తతో కుప్పకూలిపోయింది. ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఏరియల్ సర్వేలోనూ దొరకని మస్తాన్ జాడ
సంగం: పర్వతారోహకుడు మస్తాన్‌బాబు జాడ ఇంకా తెలియరాలేదు. రెండు రోజులుగా ఏరియల్ సర్వే చేసినా ఫలితం దక్కలేదు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగంకు చెందిన బాబు ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే చేసిందని, అయినా జాడ తెలియరాలేదని భారతీయ రాయబార కార్యాలయ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీటర్లో తెలిపారు. కొందరు బాబు స్నేహితులు పర్వతాలెక్కి అతని జాడ కోసం వెతుకుతున్నారు. బాబు అదృశ్యమై శుక్రవారానికి పదిరోజులైంది. కుమారుడి జాడ తెలియకపోవడంతో తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. -
పర్వతారోహకుడు మస్తాన్‌బాబు జాడేదీ?
మూడు గంటల హెలికాప్టర్ గాలింపులో కనపడని వైనం కేంద్రం నుంచి సాయం శూన్యం వెతుకలాటలో స్నేహితులు సంగం : మండలంలోని గాంధీజనసంగంకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు జాడపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిలీ సమీపంలోని ఆండీస్ పర్వాతాల్లో హెలికాప్టర్ గాలింపులో మస్తాన్‌బాబు జాడ కనపడలేదు. భారతదేశ సాయం శూన్యంగా మారిందని, తామే వెతుకులాడుతున్నామని స్నేహితులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మస్తాన్‌బాబు వెతుకులాటకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి ఆరుగంటల వరకు హెలికాప్టర్ ఏరియల్ సర్వే సాగింది. ఈ సర్వేలో మస్తాన్‌బాబు జాడ కనపడలేదని సర్వే సిబ్బంది వెల్లడించారు. ఈ సర్వే సమయంలో ఇంగ్లాండ్ మౌంటనీర్ ఒకరు తారసపడగా ఆయన్ను తీసుకొచ్చినట్లు సిబ్బంది చె బుతున్నారని మస్తాన్‌బాబు అన్న పెద్ద మస్తాన్‌బాబు తెలిపారు. ఏరియల్ సర్వే కేవలం 5వేల మీటర్ల ఎత్తువరకు సాగిందని, అంతకన్నా పైకి వెళ్లే సామర్థ్యం ఏరియల్ సర్వే చేస్తున్న హెలికాప్టర్‌కు లేదని మస్తాన్‌బాబు స్నేహితులు తెలిపారన్నారు. మూడు గంటల వరకు గాలింపు జరిపి ప్రస్తుతం ఆపి ఉన్నారన్నారు. భారతదేశ సాయం శూన్యం మస్తాన్‌బాబు వెతుకులాటకు అవసరమైన సాయం చేస్తామన్న కేంద్రమంత్రులు మాటలకే పరిమితమయ్యారు. ఇంతవర కు దానికి సంబంధించిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మస్తాన్‌బాబు స్నేహితులు తమతో అన్నట్లు పెదమస్తాన్బాబు పేర్కొన్నారు. స్నేహితులైన మౌంటనీర్లు తామే స్వయంగా వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. వాళ్లు వెతికి తీసుకుని వస్తే తప్ప మరో గత్యంతరం లేదని అన్నారు. -
పర్వతారోహకుడు మల్లి మస్తాన్ అదృశ్యం?
జోరుగా మీడియాలో ప్రచారం ఇది మామూలేనంటున్న కుటుంబసభ్యులు నెల్లూరు: పర్వతారోహకుడు, గిన్నిస్‌బుక్ రికార్డు గ్రహీత మల్లి మస్తాన్‌బాబు దక్షిణ అమెరికాలోని చిలీలో పర్వతారోహణకు వెళ్లారు. 48 గంటల నుంచి ఆయన ఆచూకీ లభ్యం కావడం లేదన్న వార్తలు శనివారం రాత్రి ప్రసార మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ గిరిజన సంఘంలోని అతని తల్లి సుబ్బమ్మ, కుటుంబ సభ్యులు మాత్రం ఇది మామూలేనంటున్నారు. మల్లి మస్తాన్‌బాబు 1974 అక్టోబర్ 9న సంగం మండలం గాంధీ గిరిజన కాలనీలో మల్లి మస్తానయ్య, మస్తానమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య సంగంలో కొనసాగించారు. కోరుకొండలోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. జంషెడ్‌పూర్‌లోని ఎన్ఐటీలో బీఈ, ఖరగ్పూరులోని ఐఐటీలో ఎంటెక్, కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఏ పూర్తిచేశారు. 2006 జనవరి 19వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మొత్తంగా 172 రోజుల్లో ఏడు పర్వత శిఖరాలను అధిరోహించారు. గిన్నిస్ రికార్డులకెక్కారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. నాలుగు నెలలుగా ఆయన చిలీలో ఉంటున్నారు. అక్కడ పర్వతారోహణకు వెళ్లిన మస్తాన్‌బాబు 48 గంటలుగా కనిపించడం లేదని, ఆచూకీ కోసం బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం మాధ్యమాల్లో శనివారం రాత్రి జోరుగా సాగింది. ఈ విషయమై మస్తాన్ కుటుంబ సభ్యులను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అర్జెంటైనాలో వర్షాల కారణంగా సిగ్నల్ దొరికి ఉండకపోవచ్చనీ, పర్వతారోహణకు వెళ్లిన సమయాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. తాము ఎవ్వరికి ఫిర్యాదు చేయలేదని వారు పేర్కొన్నారు. -
షెర్పాలపై ఎవరెస్టంత నిర్లక్ష్యం!
ఎవరెస్టు పర్వతారోహణ ఇప్పుడు వ్యాపారమయమై పోయింది. పర్వతారోహణ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి. అందుకు కారణమైన షెర్పాల సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. నేపాల్ ప్రభుత్వమైతే సరేసరి. షెర్పాలే లేకపోతే హిమాలయ పర్వతారోహణ లేనేలేదు. వీరు లేకపోతే ఒక ఎడ్మండ్ హిల్లరీ... ఒక బచేంద్రీపాల్... ఎందరో... ఇంకెందరో పర్వతారోహకులు అనామకులుగా మిగిలిపోయేవారు. వీరికి ఇతర ఆదాయ వనరుల్లేవు. వీరు అల్ప సంతోషులు. కొండలెక్కడం వారి సహజ లక్షణం. పుట్టేది అక్కడే... కన్నుమూసేది అక్కడే. ఎవరెస్టు అధిరోహించేందుకు ప్రపంచవ్యాప్తంగా వచ్చేవారు పర్వతారోహణ శిక్షణ సంస్థలకు పదులు, వందల్లో డాలర్లు చెల్లిస్తారు. ఈ మొత్తంలో కొంత దళారులకు, మరికొంత నేపాల్ ప్రభుత్వానికి పోతుంది. చివరకు నేపాలీ షెర్పా గైడ్లకు దక్కేది వెయ్యి డాలర్లే. ఇది రెండు నెలల సీజన్లో వచ్చే సంపాదన. మిగిలిన పది నెలలూ చిన్నాచితకా పనులు చేసుకుంటేనే పూట గడుస్తుంది. ఎవరెస్టు పర్వతారోహణ ఇప్పుడు వ్యాపారమయమై పోయింది. పర్వతారోహణ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి. అందుకు కారణమైన షెర్పాల సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. ప్రభుత్వమైతే సరేసరి. పర్వతారోహకుల బృందాల నుంచి పదివేల డాలర్ల చొప్పున వసూలు చేసే నేపాల్ ప్రభుత్వం ఇటీవల ఎవరెస్టు దుర్ఘటనలో మృతి చెందిన షెర్పాల కుటుంబాలకు అంత్యక్రియల కోసమంటూ 400 డాలర్లు మాత్రమే విదల్చడం షెర్పాల ఆగ్రహానికి కారణమైంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లోంచి ఎవరెస్టును అధిరోహించేం దుకు ప్రయత్నించి 250 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ 1990లో 5.6 శాతం ఉన్న మరణాల సంఖ్య 2000 కల్లా 1.5 శాతానికి తగ్గిపోయింది. ఈ ఘనతంతా షెర్పాలకే దక్కుతుంది. అపార ధైర్యసాహసాలు, కొండాకోనల్లోకి సునాయాసంగా ఎగబాకే శరీర దారుఢ్యం, ప్రాణాలకు తెగించి సాహసికుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. అందుబాటులో ఉన్న షెర్పా గైడ్లు, అందించే సేవలను బట్టి కొన్ని పర్వతారోహణ సంస్థలు ఒక్కొక్క సాహసికుడి నుంచి 40 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు విదేశీ గైడ్లను ఏర్పాటు చేస్తున్నాయి. విదేశీ నిపుణులు, మం చి ఆహారం, ఫైవ్‌స్టార్ వంటమనిషిని సమకూరుస్తున్నారు.కొన్ని సంస్థలు అనుభవమున్న వారినే పర్వతారోహణకు అనుమతిస్తాయి. నిబంధనల మేరకు ఒకేసారి కనీసం 8 వేల మీటర్ల చొప్పున 41 సార్లు పర్వతారోహణను పూర్తి చేసుకున్న వారినే ఎవరెస్టు శిఖరారోహణకు అనుమతిం చాలి. జీవితంలో ఎప్పుడూ పర్వతారోహణ చేయని వాళ్లు కూడా ఎవరెస్టును అధిరోహించేందుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్నిసార్లు సాహసికులు తప్పుడు అర్హతలు చూపిస్తున్నారు. వీరిని ప్రోత్సహిస్తున్న కొన్ని పర్వతారోహణ సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని అమెరికాలో జన్మించి నేపాల్ రాజధాని కఠ్మాండులో స్థిరపడిన ఎలిజబెత్ హాల్వే (90) అంటున్నారు. శారీరక సామర్థ్యం, అనుభవం లేని సాహసికుల్ని అనుమతించడంతో వారి రక్షణ షెర్పాల ప్రాణాల మీదకొస్తోంది. పర్వతారోహణను పూర్తి చేసుకుని బేస్‌క్యాంప్ నుంచి పర్వతారోహకుడు తిరిగి బయల్దేరేవరకూ అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అనుక్షణం షెర్పాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వారు మార్గాలను ఏర్పాటు చేయడంలో, తాళ్లు, టెంట్లు, ఆక్సిజన్ సీసాలను మోసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎవరెస్టు పర్వతారోహణ కార్యక్రమాలను నిర్వహించే వాంగ్చూ షెర్పా ఒక్కొక్క సాహసికుడి వెంట ఇద్దరు షెర్పా గైడ్లను పంపినందుకు 37 వేల డాలర్లు వసూలు చేస్తాడు. ఇందులో అతనికి రెండు వేల నుంచి మూడు వేల డాలర్ల వరకూ లాభం ఉంటుంది. డబ్బు వెదజల్లితే చాలు... ఎవరెస్టు ఎక్కేయొచ్చు అనే భావనలో కూడా చాలామంది సాహసికులుంటారు. పర్వతారోహణ సంస్థలకు కూడా కావలసింది ఇలాంటి వారే. అందుకోసమే నిబంధనలకు తిలోదకాలిస్తున్నాయి. పర్వతారోహణకు ఆసక్తి చూపేవారికి అర్హత లున్నాయో లేదో తెలుసుకోకుండా... డబ్బు చెల్లిస్తే చాలు తీసుకెళ్తున్నాయి. అయితే, అన్ని సంస్థలూ ఇలాగే చేస్తున్నాయని అనలేం. నేపాల్ పర్యాటక రంగంలో పర్వతారోహణ కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం పర్వతారోహణ ద్వారా వస్తున్న ఆదాయమే దేశ స్థూల జాతీయోత్పత్తిలో నాలుగు శాతం ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా దేశంలో పేదరికం పెరుగుతూనే ఉంది. పర్వతారోహణ సంస్థలకు ఎవరెస్టు కాసులు కురిపించే కామధేనువైనా... షెర్పాల సంక్షేమం మాత్రం అంతంతమాత్రమే. -ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి(బాలు) -
5గురు పర్వతారోహకుల్ని మింగేసిన ఎవరెస్ట్
హిమాలయాల్లో మంచు తుఫాను వల్ల అయిదుగురు పర్వతారోహకులు హిమసమాధి అయ్యారు. ఎవరెస్టు పర్వత శిఖరం నుంచి మంచు చరియలు విరిగిపడటంతో వారు బస చేసిన క్యాంప్ పూర్తిగా కప్పబడిపోయింది. ఈ క్యాంప్ దాదాపు 21000 అడుగుల ఎత్తుమీద ఉంది. దీన్ని పర్వతారోహకులు పాప్ కార్న్ ఫీల్డ్ అని పిలుస్తారు. హిమసమాధి అయిన వారిని కాపాడేందుకు సిబ్బందిని హుటాహుటిన అక్కడికి తరలిస్తున్నారు. ఒక హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది. ప్రతి సంవత్సరం ఈ సమయంలో 29035 అడుగుల ఎత్తైన ఎవరెస్టును ఎక్కేందుకు వందలాది మంది పర్వతారోహకులు ఈ బేస్ క్యాంప్ కి చేరుకుంటారు. 1953 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 4000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కారు. మొట్టమొదట ఎవరెస్టును 1953 లో న్యూజీలాండ్ కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గేలు అధిరోహించారు. అప్పట్నుంచీ ఎవరెస్టును అధిరోహించడం పర్వతారోహకులందరికీ ఒక పెను ఛాలెంజ్ గా ఉంటూ వస్తోంది.