ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం | Everester Pradeep Sahoo dead | Sakshi
Sakshi News home page

ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం

Published Mon, Nov 21 2016 4:34 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం - Sakshi

ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం

కోల్కతా: ప్రముఖ పర్వతారోహకుడు ప్రదీప్‌ సాహూ(50) హఠాన్మరణం చెందారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుతో జింబాబ్వే రాజధాని హరారేలో కన్నుమూశారు. కోల్కతాలోని టాలిగుంగే ప్రాంతానికి చెందిన ఆయన పర్వతారోహకుల్లో ప్రముఖులు. ఈ ఏడాది కూడా ఆయన తన భార్య చేతనతో కలిసి ఎవరెస్టును మూడోసారి అధిరోహించారు. ఓ మైనింగ్ కంపెనీకి డైరెక‍్టర్ గా ఉన్న ఆయన చాలా ఏళ్లుగా వివిధ పర్వాతాలను తన భార్యతోకలిసి అధిరోహిస్తుంటారు.

ఐదేళ్ల కిందటే ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇటీవలె వ్యక్తిగత పనుల నిమిత్తం హరారే వెళ్లారు. ఆయనకు ఇటీవలె బెంగాల్ ప్రభుత్వం రాధానాథ్ షిక్దార్ అవార్డును కూడా ప్రకటించింది. దానిని ఈ నెల తర్వాత అందించనున్నారు. సాహూ మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందానని, ఆయన లేరనే విషయం నమ్మలేకపోతున్నానని, ఆయనతోపాటు చివరిసారిగా పర్వతారోహణను పంచుకున్న దేబాశిష్ విశ్వాస్ అనే మరో ఎవరెస్టు అధిరోహకుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement