మస్తాన్ బాబు మృతదేహం కోసం ట్రెక్కింగ్ ప్రారంభం
చిలీ: అర్జెంటీనా ఆండీస్ పర్వతాల్లో చిక్కుకుని మృతి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ ప్రారంభమయ్యింది. ఇంతకాలం ప్రతికూల వాతావరణం కారణంగా మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ఎటువంటి యత్నాలు జరుగలేదు. అయితే గత మూడు రోజులుగా వాతావరణం మెరుగుపడటంతో మస్తాన్ బాబు మృతదేహాన్ని తెచ్చేందుకు ట్రెక్కింగ్ బృందం రంగంలోకి దిగింది.
ట్రెక్కింగ్ నిపుణుడు హెర్నర్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సన్నద్ధమయ్యింది. దీనిలో భాగంగానే సహాయ బృందం బేస్ క్యాంపుకు చేరుకుంది. మరో ఐదుగురు సభ్యుల బృందం ట్రెక్కింగ్ ప్రారంభించింది. దీని కోసం భారత అంబాసీ అన్ని రకాల అనుమతులను తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం పర్వతారోహణ చేస్తూ మల్లి మస్తాన్ బాబు అసువులు బాసిన సంగతి తెలిసిందే.