సంగం(నెల్లూరు జిల్లా): భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మహోన్నత వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. గురువారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో మస్తాన్‌బాబు ఉత్తరక్రియల్లో పాల్గొన్న ఆయన.. సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పర్వతాలను సులువుగా అధిరోహించిన మస్తాన్‌బాబు దురదృష్టవశాత్తు ఆండీస్ పర్వతారోహణలో ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని మృతిచెందారన్నారు.
మస్తాన్‌బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషిచేశాయన్నారు. మస్తాన్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు గాంధీజనసంఘంలోని సామాజిక భవనానికి మల్లి మస్తాన్‌బాబు నామకరణం చేయనున్నామని వెల్లడించారు. అలాగే సంగంలోని గురుకుల కళాశాలకు సైతం మస్తాన్‌బాబు పేరు పెట్టనున్నామన్నారు.
మల్లి మస్తాన్‌బాబు మహోన్నత వ్యక్తి
Published Thu, May 7 2015 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement