నిజాం కళాశాలలో జూనియర్, సీనియర్ల మధ్య చలరేగిన వివాదంతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్‌కుమార్ కు అవమానం జరిగింది. నిజాం కాలేజీలో బీఏ చదువుతున్న ఆనంద్ కుమార్‌ను మంగళవారం లైబ్రరీ వద్ద ఫైనల్ ఇయర్ విద్యార్థులు భరత్, మోహన్ బయోడేటా చెప్పాలని అవమానించారు. దీంతో అతను వారిపై తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొంది.
దీంతో మనస్థాపానికి లోనైన ఆనంద్‌కుమార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీఎల్‌ఎన్ స్వామికి ఫిర్యాదు చేశారు. దీం తో బుధవారం ఆయన భరత్, మోహన్‌లను పిలిపించి మందలించారు. దీనిపై సమాచారం అందడంతో అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించడమేగాక, ఆనంద్‌కుమార్‌తో పాటు మోహన్, భరత్‌లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.