Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం | Padamati Anvitha Reddy: My Dream Came True when I Climbed Mount Everest | Sakshi
Sakshi News home page

Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం

Published Thu, May 26 2022 3:45 PM | Last Updated on Thu, May 26 2022 3:45 PM

Padamati Anvitha Reddy: My Dream Came True when I Climbed Mount Everest - Sakshi

పడమటి అన్వితారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16న ఎవరెస్టును అధిరోహించి హైదరాబాద్‌కు చేరుకున్న పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె స్పాన్సర్, అన్వితా గ్రూప్‌ అధినేత అచ్యుతరావు, కోచ్‌ శేఖర్‌ బాబులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా అన్వితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో తాను చూసిన కోటనే తనకు ప్రేరణ అయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కని నేపాల్‌లోని ఎవరెస్టు పర్వతం దక్షిణం వైపు నుండి శిఖరాన్ని అధిరోహించినట్లు తెలిపారు. మే 16న ఉదయం 9:30కి ఎవరెస్టు శిఖరం (8848.86 మీటర్లు) చేరుకోవడం ద్వారా తన కలను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన అన్వితారెడ్డి.. స్థానికంగా ఉన్న రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. (క్లిక్‌: ఎవరెస్ట్‌పై నుంచి చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement