సాక్షి, దేవిపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు (లాంచీ) ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఒకొక్క బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment