తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు(ఆదివారం) ఏరియల్ స్వరే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.
ఇదిలా ఉండగా.. రేపు(ఆదివారం) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలులో గవర్నర్ తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు.
ఇది కూడా చదవండి: ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం
Comments
Please login to add a commentAdd a comment