rain affected areas
-
అపోహలొద్దు.. ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తుపాన్‌తో పంటలు నష్టపోయిన అన్నదాతలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు వెంటనే అందిస్తామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం, బుద్దాం గ్రామాల్లో దెబ్బతిన్న మిరప, వరి పంటలను పరిశీలించిన అనంతరం బాధిత రైతులను సీఎం జగన్ ఊరడించారు. ఎన్నడూ లేనంతగా నాలుగు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం జగన్ అన్నారు. ఇంత బాధాకరమైన పరిస్థితులు వచ్చినా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న నమ్మకం ఇక్కడి రైతన్నల్లో కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ ప్రభుత్వంలో అందరికి మంచే జరుగుతుందని కచ్చితంగా చెబుతున్నానన్నారు. నాలుగు రోజుల్లో.. 'ఏ రాష్ట్రాలలోనూ లేనిది, మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థలుగా అవి నిలిచాయి. వివక్షకు తావులేకుండా, ఆఖరికి మనకు ఓటు వేయని వారికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం అందరికి తోడుగా నిలుస్తోంది. జరిగిన నష్టాన్ని పారదర్శకంగా గుర్తించి, జాబితాను సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిచేసుకుని మరీ సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం మనదే. గతంలో కరువులు, వరదలు వచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఏ రోజు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో, అసలు ఎంతమందికి వస్తుందో కూడా తెలియని దుస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మారింది. వరదతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ రేషన్‌తో పాటు ప్రతి ఇంటికి రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. దాదాపు 12 వేల మందికి వారికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళ దుంపలతోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ వలంటీర్ వచ్చి అందచేస్తారు. 4 రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీని పూర్తి చేస్తాం.' అని సీఎం జగన్ తెలిపారు. ఇన్సూరెన్స్‌పై ‘ఈనాడు’ దిక్కుమాలిన రాతలు మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! అదేపనిగా అబద్ధాలనే చూపించే, ప్రచురించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడులో ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు. ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వంలోనే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. జూన్ నాటికి రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తాం. గతంలో ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా వారు కట్టాల్సిన ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ అన్నదాతలకు ఇన్సూరెన్స్ ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలో మాత్రమే. గతంలో చంద్రబాబు పాలనలో వరుసగా కరువు కాటకాలే తాండవించినా ఐదేళ్లలో 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎక్కడా కరువు కాటకాలు లేకపోయినా నాలుగేళ్లలో 55 లక్షల మందికి రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు అందచేశాం. ఈ ఖరీఫ్‌లో రైతన్న ఇబ్బంది పడితే వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూ్యరెన్స్ కచ్చితంగా వస్తోంది. దేశంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్నది మన ప్రభుత్వమే. పారదర్శకంగా పంట నష్టం వివరాలు తుపాను విపత్తు వేళ కలెక్టర్లు అందరూ వెంటనే స్పందించి ఎన్యుమరేషన్ మొదలు పెడుతున్నారు. ఎన్యూమరేషన్ పూర్తైన తర్వాత 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో జాబితాను పారదర్శకంగా ప్రదర్శిస్తారు. ఈ జాబితాలో ఎవరైనా రైతు మిస్ అయితే, వారి పేరు మళ్లీ చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే సంక్రాంతిలోపు అర్హులు అందరికీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా గత నాలుగేళ్లుగా ఏటా ఇలానే అమలు చేస్తున్నాం. డబ్బులిచ్చి.. తగినంత సమయం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా.. సీఎం హోదాలో నేను వచ్చి జరుగుతున్న పనులను చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకుని, ఫొటోలకు పోజులిస్తూ టీవీల్లో, పేపర్లలో రావాలని తాపత్రయపడే వ్యక్తిని కాదు. గతానికి, ఇప్పటికి తేడా అదే. ఏదైనా సంఘటన జరిగితే మీ బిడ్డ కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాడు. ముందుగా కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేస్తున్నాడు. వారికి సరిపడా వారం రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత బాగా జరిగిందా లేదా? అనేది నిర్ధారించుకునేందుకు స్వయంగా వచ్చి ప్రజలనే నేరుగా అడుగుతున్నాడు. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడనే మాట ప్రజల నుంచి రావాలని అధికారులకు చెప్పా. గతంలో చంద్రబాబు కలెక్టర్లకు నిధులు ఇచ్చేవారు కాదు. అసలు ‘టీఆర్ 27’ అనే పదానికి అర్థమే ఆయనకు తెలియదు. కలెక్టర్లు, తహసీల్దార్లు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ విపత్తు సమయంలో పరుగులు తీస్తూ ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోంది. ఇప్పుడు జరిగిన నష్టం అపారం. చేయాల్సిన సాయం అంతా పారదర్శకంగా, వేగంగా జరుగుతోంది. గత ప్రభుత్వాల కంటే కచ్చితంగా ఎక్కువే జరుగుతుందని గుర్తుంచుకోవాలి. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్థనరెడ్డి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, కరణం బలరాం, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం -
రైతుల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా
-
హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం అల్లకల్లోలం సృష్టించింది. వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బేగంపేట, కోఠి, సికింద్రాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాలైన లింగంపల్లి, పటాన్చెరు, ఆర్సీపురంలో భారీ వర్షం కురుస్తోంది. -
ముంచెత్తిన వాన...
-
రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు(ఆదివారం) ఏరియల్ స్వరే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. రేపు(ఆదివారం) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలులో గవర్నర్ తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు. ఇది కూడా చదవండి: ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం -
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి వేణుగోపాల్
-
ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
-
Tamil Nadu: దీవిని తలపిస్తున్న కడలూరు.. ఎటు చూసినా నీరే
రాష్ట్రాన్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కుంటల నుంచి జలాశయాల వరకు అన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. రోడ్లు, పంట పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరు చేరి అల్లాడుతున్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక సీఎం స్టాలిన్ సహా.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విపక్ష నాయకులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సాక్షి, చెన్నై: ఏటా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న ప్రాంతం కడలూరు. ఈ ఏడాదీ ఇక్కడి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి ప్రస్తుతం కడలూరు దీవిని తలపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే చాలు అది రాష్ట్రం వైపుగా చొచ్చుకు వస్తుందంటే, అది కడలూరు సమీపంలో తీరం దాటాల్సిందే. ఇది ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న పరిణామం. ప్రస్తుతం కూడా ఇక్కడి ప్రజల్ని వాయుగుండం వెంటాడుతోంది. ఇక్కడున్న ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 300 చెరువులు 75 శాతానికి పైగా నిండి ఉన్నాయి. చదవండి: భారీ వర్షాలు: 15 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నీటి పరవళ్లతో పంట పొలాలు, రోడ్లు కనిపించని పరిస్థితి. ఎటు చూసినా నీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక్కడి ఎన్ఎల్సీ లిగ్నైట్ కార్పొరేషన్‌లోని బొగ్గు గనుల నుంచి వెలువడే నీటికి వరదలు తోడయ్యాయి. దీంతో పరిసర గ్రామాల మధ్య సంబంధాలు కరువైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. విల్లుపురం, కళ్లకురిచ్చి, నాగపట్నం జిల్లాల నుంచి సైతం వరదలు ఇటు వైపుగా పోటెత్తుతుండంతో సాయం కోసం కడలూరు వాసు లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక డెల్లా జిల్లాల్లో సంబా పంటపై వరుణుడు ప్రతాపం చూపుతున్నా డు. పుదుకోట్టై, తిరువారూర్, తంజావూరు జిల్లాల్లో వరి పంటను ముంచేస్తూ వరదలు పోటెత్తుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్ Tamil nadu government kindly do the drainage system properly #TamilNaduRains #Velachery pic.twitter.com/RnNeef6KS8 — Abhimanyu Kumar (@themanukumar) November 11, 2021 #WATCH Areas in Chennai's Ashok Nagar remain inundated as rainfall continues to lash the city. As per the Met Department, Chennai is expected to receive heavy rainfall today. #TamilNadu pic.twitter.com/0iyNoVfnrY — ANI (@ANI) November 11, 2021 River #Sweta at V.Kalathur Site in #Cuddalore district in #TamilNadu pic.twitter.com/W84EiSBETp — Central Water Commission Official Flood Forecast (@CWCOfficial_FF) November 3, 2021 -
Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
-
Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సీఎం అన్నారు. చదవండి: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు సీఎం జగన్ నివాళి ‘‘అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోండి. వారికి మంచి ఆహారం అందించండి. బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించండి. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోండి. ఏం కావాలన్నా.. వెంటనే అడగండి. బాధితులకోసం ఒక ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచండి. వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోండి. లైన్ డిపార్ట్మెంట్లను సిద్ధంచేయండి. ఎస్ఓపీల ప్రకారం అన్నిరకాల చర్యలను తీసుకోండి. ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోండి. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని’’ సీఎం సూచించారు. ‘‘పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోండి. వర్షాల అనంతరం కూడా పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోండి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను కూడా చర్యలు తీసుకోండి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికిన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి. తాగునీటిప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయండి. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, నీటి పారుదల సదుపాయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. గండ్లు పడకుండా చర్యలు తీసుకోండి. ఎప్పటికప్పుడు నీటి ప్రవావాహాలను, వర్షాలను అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయండి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని.. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఫోన్‌కాల్‌కు తాము అందుబాటులో ఉంటామని.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయాలని’’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి పరిస్థిలు తెలుసుకున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం జరిగింది. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారీన పడకుండా పారిశుద్ద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర వస్తువలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. -
అకాల వర్షం.. రబీ పంటలకు నష్టం
బజార్హత్నూర్(బోథ్) : జిల్లాలో మూడు రోజు లుగా రాత్రి సమయాల్లో కురుస్తున్న రాళ్ల వర్షానికి రబీ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 40 శాతం శనగ పంటను కోసం మెదలుగా చేనులో ఆరబెట్టారు. ఉరుములు, మెరుపులతో గాలి బీ భత్సం, రాళ్ల వర్షంతో మెదల్లు కొట్టుకుపోవడం, తడిసిపోవడం జరిగింది. గింజలు నల్లబారి మెలకెత్తుతున్నాయి. మిగతా 60 శాతం పంట కోత దశలో ఉండడంతో రాళ్ల వర్షానికి నేలరాలాయి. గింజ నాణ్యత కోల్పోతే గిట్టుబా టు ధరలు రాక మళ్లీ నష్టపోయే పరిస్థితి వ స్తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోథ్, బజార్హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొం డ మండలాల్లో 86 వేల ఎకరాల్లో రబీలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధమ పంటలు సాగు చేశారు. శనగ పంట దెబ్బతింది.. నాకున్న ఆరెకరాల్లో నాలుగెకరాలు శనగ, రెండెకరాల్లో కంది పంట వేసాను. శనగ పంట కోత దశలో ఉండడంతో రూ.4వేలు ఖర్చు చేసి కూలీలతో మెదల్లు వేసి ఆరబెట్టాను. మూడు రోజులుగా అకాల వర్షానికి మెదల్లు తడవడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నాలుగెకరాల శనగ పంట దెబ్బతింది. గింజరంగు మారేపరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రైతు డుబ్బుల ముత్తన్నయాదవ్, బజార్హత్నూర్ ప్రభుత్వం ఆదుకోవాలి మండలంలో శనగ, కంది, మొక్కజొన్న, జొన్న, ధనియాలు, పెసరి, మినుము, గోధుమ పంటలు సాగు చేశారు. మూడు రోజులుగా రాళ్ల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గింజలు మొలకెత్తి, రంగుమారి నాణ్యత కోల్పోతున్నాయి. పంట దిగుబడిలో దెబ్బతినే పరిస్థితి ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. రబీ పంటలకు గింజ నాణ్యతతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరలు కల్పించాలి. – రైతు కొడిమెల కాశీరాం, దేగామ -
పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు
-
పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు: వైఎస్ జగన్
భారీవర్షాల తాకిడికి అతలాకుతలమైన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం పర్యటించారు. గుంజనా నది వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. 27 రోజులుగా వర్షబీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందడం లేదని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, నగదు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను పనిచేయమని చెబితే వారు చేస్తారని ఆయన చెప్పారు. ''బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు, బియ్యం, వనరులు ఇచ్చి.. ఆ తర్వాత అధికారులను ఏమైనా అంటే బాగుంటుంది. కానీ ప్రజలు ముఖ్యమంత్రిని తిట్టకముందే ఆయనే అధికారులను తిడుతున్నారు. ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోండి. పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3, 4 వేల రూపాయల డబ్బులు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇస్తేనే బతకగలరు. అవేవీ ఇవ్వకుండా అధికారులను తిట్టడం మానవత్వం ఉన్న పని కాదు. ప్రతి గ్రామంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, తమకేమీ జరగట్లేదని.. బతకడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.