చెన్నైలో మోదీ ఏరియల్ సర్వే.. జయతో భేటీ
చెన్నై: భారీ వరదలతో అతలాకుతలమైన చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రత్యేక విమానంలో వేలూర్, రాజాలి ఎయిర్‌బేస్‌కు చేరుకున్న మోదీ, వరద నష్టంపై ఎయిర్‌పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లో ఫొటోలను ఆయన పరిశీలించారు. వరదలో వాటిల్లిన నష్టంపై ఆరా తీశారు. ఏరియల్ సర్వే అనంతరం నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా చెన్నై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 269మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫొటోల కోసం క్లిక్ చేయండి