ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి ఆయన ఈ సర్వే చేస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాల పరిధిలో ఏరియల్ సర్వే జరుపుతారు. కాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి విశాఖలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.