
సాక్షి, ఆదిలాబాద్: మిడతల కదలికలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మిడతల ప్రభావం లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మిడతల దండు దిశను మార్చుకున్నాయని... తెలంగాణకు ముప్పులేదని స్పష్టం చేశారు. మిడతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో మిడతల దండు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ వెల్లడించింది.