Locust
-
మిడతల దండు కలకలం
-
ఆందోళన రేకెత్తిస్తున్న మిడతల దండు
-
గురుగ్రామ్‌పై మిడతల దండు దాడి
గురుగ్రామ్/న్యూఢిల్లీ: దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన రాకాసిమిడతల గుంపులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దు దాకా చేరాయి. ఢిల్లీలోకి ఇంకా ప్రవేశించలేదని అధికారులు చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనమైన మిడతల దండు శనివారం ఉదయం 11.30 గంటలకు గురుగ్రామ్‌లోకి ప్రవేశించిందని హరియాణా వ్యవసాయ శాఖలో మిడతల హెచ్చరిక విభాగం అధికారి కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని పాల్వాల్ వైపు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పంటలను భోంచేసే ఈ మిడతలు ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా ఎడారుల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టాయి. తొలుత రాజస్తాన్‌లో, తర్వాత పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి. ఢిల్లీలో హై అలర్ట్ మిడతల దండు ఢిల్లీ సరిహద్దు దాకా రావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో శనివారం హైఅలర్ట్ ప్రకటించింది. మిడతలు దండెత్తకుండా చెట్లపై రసాయనాలు, పురుగు మందులు చల్లాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వేప ఆకులను మండిస్తే పొగకు మిడతలు పారిపోతాయని వెల్లడించింది. -
వాలగానే వేసేద్దాం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి ఏ సమయంలోనైనా మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడతల నిరోధక చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్న మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చేందుకు అవకాశాలు అలాగే ఉన్నందున, తగిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మిడతల దండును ఎదుర్కోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. (మిడతల దండు మళ్లీ వచ్చేసింది) సాధారణంగా మిడతల దండు ఉదయం వేళ ప్రయాణం చేస్తుంటుంది. ఈ సమయంలో వీటిని చంపడం అంత సులువు కాదు. చెట్లపై, చేనుపై వాలినపుడే వాటిని చంపేందుకు సులువవుతోంది. దీంతో రాత్రివేళ, వేకువజామున మిడతలను చంపేందుకు సిద్ధపడాలని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ముందుగా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే సరిహద్దు జిల్లాలను గుర్తించాలి. అన్ని గ్రామాలలోనూ మిడతలు ప్రవేశించే మార్గాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాకు 500 లీటర్ల రసాయనాలను సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగు కలిపిన నీటితో గ్రామాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. వీటన్నింటిపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విడుదల చేయనుంది. (ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!) రూ. 53.55 లక్షలు కేటాయింపు... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రసాయనాల కొనుగోలుకు, పీపీఈ కిట్లకు జిల్లాకు రూ. 5.95 లక్షల చొప్పున రూ. 53.55 లక్షలు కేటాయించింది. ఈ నిధులను విపత్తు నిర్వహణ నిధుల నుంచి వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. (కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు...) జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు లేదా ఎస్పీ, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఫైర్ అధికారి, డీపీవోతో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి కీటక శాస్త్రవేత్తతో కలిపి ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మిడతల దాడి జరిగే అన్ని మండలాలు, సరిహద్దు గ్రామాలలో గ్రామ కమిటీలను గుర్తించాలి. ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, సమూహాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. మిడతలు ప్రవేశించే స్థలాలను గుర్తించి, వాటిని చంపేందుకు స్ప్రే చేయడానికి తగిన స్థలాన్ని గుర్తించాలి. భారీ వాహనాలు, ఫైరింజన్లు వెంటనే వచ్చేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. రాత్రివేళ పిచికారీ చేయాల్సి ఉన్నందున లైటింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నందున పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. పంటలకు, పశుపక్షాదులకు ఎటువంటి ఆరోగ్య, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. మొక్కల నర్సరీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేప పూత ముందుగా చల్లుకోవడం మంచిది. అటవీ ప్రాంతం అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున కమ్యూనికేషన్ సెట్ వినియోగించాల్సి ఉంటుంది. -
మిడతల దండు మళ్లీ వచ్చేసింది
ఢిల్లీ : దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మిడతల దాడి ఆందోళనకు గురిచేస్తుంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మిడతల దండు దాడి మళ్లీ మొదలైంది. తాజాగా శనివారం గురుగ్రామ్‌లో మిడతల దండు వీరవిహారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండు నెలల నుంచి రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో మొదలైన మిడతల దండు దాడి మెళ్లిగా ఢిల్లీలోకి వ్యాపించే ప్రమాదం ఉండడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.(భారత్ గట్టిగా పోరాడుతోంది : మోదీ) పంటలను నాశనం చేసే మిడతల దండు గురుగ్రామ్ సిటీతో పాటు సైబర్ హబ్ ప్రాంతమైన డిఎల్ఎఫ్ ఫేజ్ I-IV, చక్కర్‌పూర్, సికందర్పూర్, సుఖ్రాలి ఏరియాలో పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు శుక్రవారం సాయంత్రమే అప్రమత్తం చేశారు. మిడతలు వచ్చినప్పుడు భారీ శబ్దాలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇంట్లోని వస్తువులను గట్టిగా వాయించడం, పటాకులు కాల్చడం, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. కాగా మిడతలు దండు వ్యాపిస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియోలు తీసి ట్విటర్లో షేర్ చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మిడతల దండు దాడిని తన ట్విటర్లో షేర్ చేశాడు. -
200 కి.మీ. దూరంలో మిడతల దండు
సాక్షి, హైదరాబాద్: తూర్పు ఆఫ్రికా నుంచి బయల్దేరి భారత్‌కు చేరిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వద్ద ఆగింది. తెలంగాణకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఈ దండు నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లోని బత్తాయితోటలపై దాడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోకి మిడతల దండు వస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం తన నివేదికను సీఎస్‌కు బుధవారం అందజేయనుంది. వీరితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం బీఆర్కేభవన్లో సీఎస్ సమావేశమవుతారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఫైర్ సర్వీసెస్ డీజీ, వ్యవసాయ–సహకార శాఖ కార్యదర్శి కూడా హాజరవుతారు. మరో మిడతల దండు యెమెన్ దేశం నుంచి బయల్దేరిందని, అవి ముంబైని చేరతాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి రాదు..! మిడతల దండు ద్వారా రాష్ట్రానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం ఇప్పటికే అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చింది. ఈ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లోని పంటపొలాలు, బత్తాయి ఇతర పండ్ల తోటలపై తిష్టవేసిన ఈ దండు ఇప్పట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన దరిమిలా.. గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తోంది. సాధారణంగా మిడతలు కూడా గాలివాటానికి అనుగుణం గానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. అలాగే ప్రస్తుతం ఇవి ఉత్తర భారత్‌లోని మధ్యప్రదేశ్‌వైపు వెళ్లే అవకాశాలున్నాయి. తూర్పు ఆసియాలో మొదలైన ఈ దండు ప్రయాణం.. యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా భారత్‌లోని రాజస్తాన్ నుంచి ఇతర రాష్ట్రాల్లోకి చొచ్చుకొచ్చాయి. ఈ దండు ఇంతకుముందు రాజస్తాన్ వరకు ఒకసారి, మధ్యప్రదేశ్ వరకు ఒకసారి వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మాత్రమే మహారాష్ట్ర వరకు వచ్చాయి. ఏటేటా.. ఇవి దేశంలోకి మరింత లోపలికి చొచ్చుకువస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా నాగ్‌పూర్ వెళ్లిన తెలంగాణ అధికారుల బృందం వీటిపై పూర్తిగా అధ్యయనం చేసింది. కొన్ని కీటకాలను బంధించి వాటి భౌతిక అంశాలు, జాతి, హానికారక లక్షణాలను అధ్యయనం చేసింది. అవి ఏ స్థాయిలో ప్రమాదకారులు, వాటి ప్రత్యుత్పత్తి కాలం, దాడి చేసే సామర్థ్యం, ఏ మందుకు లొంగుతాయి? అన్న విషయంపై నివేదికను రూపొందించినట్లు సమాచారం. కమిటీ సభ్యుడు రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలతో ప్రత్యేక పోలీసుల బృందం ఈనెల 2వ తేదీ, 12వ తేదీల్లో నాగ్‌పూర్, గొండియాలో పర్యటించింది. అక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, వివరాలను మన వ్యవసాయ శాస్త్రవేత్తలకు అందజేశారు. ఇక ఒక్కో మిడతల దండు 15 కి.మీ. పొడవు, 3 కి.మీ. వెడల్పుతో ఉండి పంటలపై దాడి చేశాయి. మహారాష్ట్ర అధికారులు పురుగుల మందులు చల్లడంతో ఇవి 3 కి.మీ. పొడవైన చిన్న దండులుగా విడిపోయాయి. ఇటీవల అరేబియాలో సంభవించిన నిసర్గ్ తుఫాన్ వల్ల చాలా మిడతల దండులు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, చింద్వారా పంజాబ్ రాష్ట్రాల వైపునకు వెళ్లాయని సమాచారం. ప్రస్తుతం కొన్ని మాత్రమే మహారాష్ట్రలో మిగిలిపోయాయి. అధికారులు రెడీ.. ఒకవేళ గాలి దిశ మారి.. తెలంగాణపై మిడతల దండు దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు సిద్ధంగానే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలోని పలు ప్రాంతాలతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మిడతలు దాడి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏరియల్ సర్వే చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఆదిలాబాద్, కొమరంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో అధికారులు పురుగుల మందులతో సిద్ధంగా ఉన్నారు. 15 వేల లీటర్ల మెలాథియన్, క్లోరోఫైరోపోస్, లాంబ్డా సహాలాత్రిన్ను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను పంచుకునే చోట పిచికారీ చేసేందుకు ఫైరింజన్లు, జెట్టింగ్ యంత్రాలతో సిబ్బంది మోహరించారు. -
ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!
సాధారణంగా తూర్పు ఆఫ్రికా నుంచి ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మన దేశం (రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతం)లోకి గాలి వాటున ఎడారి మిడతల దండ్లు వస్తూ ఉంటాయి. అయితే, ఈ ఏడాది అసాధారణంగా ఎన్నో రెట్లు ఎక్కువగా మిడతలు పుట్టుకొచ్చినందున ఇప్పుడు సముద్రం వైపు నుంచి కూడా మిడతల దాడి ప్రారంభం అయ్యింది. అరేబియా మహాసముద్రం మీదుగా మిడతల దండు నేరుగా మన దేశంలో పశ్చిమ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) ఈ విషయమై కొద్ది నెలలు ముందే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తొలి దండు ఒమెన్ దేశం నుంచి జూన్ 12న అరేబియా మహాసముద్రం మీదుగా ఆకాశ మార్గాన భారత్ వైపు బయలుదేరిందని ఎఫ్.ఎ.ఓ. తాజా బులిటెన్‌లో తెలిపింది. ఈ దండు ప్రయాణం సజావుగా కొనసాగితే జూన్ 17 నాటికి మహారాష్ట్ర సముద్ర తీరప్రాంతానికి చేరుకోవచ్చని ఎఫ్.ఎ.ఓ. పేర్కొంది. వాతావరణం అనుకూలించకపోతే మిడతలు సముద్రంలో పడి మరణించ వచ్చు కూడా అని తెలిపింది. ♦ ఒమెన్–ముంబై మధ్య 1,566 కిలోమీటర్ల దూరం ఉంది. మిడతల దండు ఇంత దూరం ఏకబిగిన తిండీ తిప్పలు లేకుండా, అలసట లేకుండా ఎగరగలుగుతుందా? అసాధ్యం కాదని చరిత్ర చెబుతోంది. ♦ మిడతలు గంటకు 16–19 కి.మీ. ప్రయాణించగలవు. మిడతల దండ్లు 5 నుంచి 130 కి. మీ. లేదా అంతకన్నా ఎక్కువ దూరం ఎగరగలవు. మిడతల ప్రయాణ వేగం గాలుల వేగంపై ఆధారపడి ఉంటుంది. ♦ మిడతల దండు అనేక రోజుల పాటు ఆకాశంలోనే ఉండి గాలి వాటున ప్రయాణించ గలదు. ఆ సమయంలో అతి తక్కువ శక్తిని మాత్రమే ఖర్చు చేయగల ఒడుపు మిడతలకు తెలుసునట. 300 కి.మీ. వెడల్పు ఉండే ఎర్ర సముద్రాన్ని తరచూ అలవోకగా దాటేస్తుంటాయి. ♦ 1954లో వాయువ్య ఆఫ్రికా నుంచి బయలుదేరి బ్రిటన్ చేరుకున్నాయి. 1988లో పశ్చిమ ఆఫ్రికా నుంచి కరిబియన్ చేరాయి. 5 వేల కి.మీ. దూరాన్ని కేవలం పది రోజుల్లో మిడతల దండులు చేరుకున్నాయి. ♦ తూర్పు ఆఫ్రికా, ఒమెన్, ఎమెన్ తదితర దేశాల్లో కుప్పలు తెప్పలుగా గత 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ సంఖ్యలో మిడతలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి, అక్కడి నుంచి నేరుగా అరేబియా మహాసముద్రం మీదుగా మన దేశంలోని పశ్చిమ తీర ప్రాంతానికి మిడతల దండులు తాకే ముప్పు ఉంది. అక్కడి నుంచి గాలులు అనుకూలిస్తే దక్షిణాది రాష్ట్రాలపై కూడా వచ్చే కొద్ది వారాల్లో మిడతలు దండుయాత్ర చెయ్యొచ్చు. ♦ అటు రాజస్థాన్ నుంచి కూడా ఇంతకు ముందుకన్నా ఎక్కువ సంఖ్యలో మిడతల గుంపులు దక్షిణాది వైపు రావచ్చు. ఎఫ్.ఎ.ఓ. ఎప్పటికప్పుడు మిడతల స్థితిగతులపై బాధిత దేశాలకు సమాచారం ఇస్తూ ఉంటుంది. జూన్ 22 నుంచి జూలై 19 వరకు రాజస్థాన్ మీదుగా మిడతల దండయాత్ర మరింత ఉధృతం కాబోతున్నదని, సర్వసన్నద్ధంగా ఉండాలని ఎఫ్.ఎ.ఓ. భారత ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా 16 రాష్ట్రాలను హెచ్చరించినట్లు సమాచారం. మిడతల నియంత్రణకు ట్రాక్టర్లు, ఫైరింజన్లతోపాటు డ్రోన్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేపనూనె పిచికారీ చేయాలి: స్వామినాథన్ ♦ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎమ్మెస్ స్వామినాథన్ సహా పలువురు శాస్త్రవేత్తలు రైతులు రసాయనాలు పచికారీ చేయవద్దని సూచిస్తున్నారు. మిడతల రాకకు ముందు రోజుల్లో పంటలపై వేప నూనె కలిపిన నీటిని పిచికారీ చేయాలని డా. స్వామినాథన్ ఇటీవల ట్వీట్ చేశారు. వేప నూనె వాసన, రుచికి పంటలను మిడతలు తినకుండా వెళ్లి పోతాయి. అంతేకాదు, వేప నూనె పోషకంగా కూడా పంటలకు పనిచేస్తుందన్నారు. ♦ మిడతల దండును మట్టుబెట్టేందుకు పురుగుమందులు చల్లిన ప్రాంతాల్లో విషతుల్యమైన మిడతలు చచ్చి పడి ఉంటాయి. కాబట్టి, కనీసం వారం రోజుల వరకు పశువులు, కోళ్లు అటువైపు వెళ్లి విషతుల్యమైన మిడతలను తినకుండా రైతులు జాగ్రత్తపడాలి. ♦ ఎడారి మిడతలు దండు కట్టక ముందు బాల్య దశలో సాధారణ స్థితిలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఎగురుతాయి. పెరిగి పెద్దయి దండులో చేరిన తర్వాత పగటి పూట ఎగురుతాయి. చెట్లు, పంటలపై వాలి రాత్రి పూట కూడా ఆకులు, కంకులు తింటూనే ఉంటాయి. రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వాల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ గండం గట్టెక్కాల్సిన సీజన్ ఇది. -
మిడతలతో ముప్పే
సాక్షి, హైదరాబాద్: మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది. రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని గ్రామం వద్ద ప్రస్తుతం ఈ దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వీటి నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీఐపీఎంసీ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పేనని, ఈనెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ ఇవి వచ్చే అవకాశం ఉందని నిపుణులు సీఎంకు వివరించారు. అప్పటికి తెలంగాణలో వానాకాలం పంట సీజన్ ప్రారంభమై, పంటలు మొలకెత్తే దశలో ఉంటాయని, అప్పుడు మిడతలు దాడిచేస్తే చాలా నష్టం జరుగుతుందని, లేత పంటను పీల్చేస్తాయని, అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు. తొమ్మిది జిల్లాల్లో అప్రమత్తత మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న 9 జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, బాన్స్వాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదిలాబాద్‌కు సీఎస్ బృందం మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేశారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎంసీ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్.సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం రెండ్రోజుల్లో ఆదిలాబాద్‌లో పర్యటించనుంది. ఈ బృందం ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశమవుతూ, మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
భారత్‌పై మరోసారి మిడతల దాడి
న్యూఢిల్లీ: కరోనాతో కకావికలమైన ఇండియా త్వరలోనే మిడతల రూపంలో మరోసారి ప్రమాదాన్ని ఎదుర్కొబోతున్నట్లు ఐక్యరాజ్య సమితి అనుభంద సంస్థ వ్యవసాయ ఆహార సంస్థ(ఎఫ్ఏఓ) హెచ్చరించింది. పంటను నాశనం చేసే ఎడారి మిడతలు జూలైలో మరోసారి భారత్‌పై దాడి చేయనున్నట్లు తెలిపింది. మిడతల వల్ల బాగా నష్టపోయిన రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా మరో 16 రాష్ట్రాలపై మిడతలు మరోసారి దాడి చేయనున్నట్లు కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వర్షాకాలం ముందు మే నెలలో నైరుతి పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌కు వసంత-జాతి మిడుత సమూహాలు వలసలు వస్తాయని ఈ సంస్థ తెలిపింది. 1962 తరువాత ప్రస్తుతం మొదటిసారి వీటిలో కొన్ని సమూహాలు ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించాయని ఎఫ్ఏఓ వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వ్యవసాయ భూముల్లో వృక్షసంపద ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ సమూహాలు ఏప్రిల్‌లో పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించాయన్నారు. ఇవి కూడా ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ నుంచి వచ్చాయని తెలిపారు. తూర్పు ఆఫ్రికాలోని వాయవ్య కెన్యాలో ప్రస్తుతం రెండో దశ బ్రీడింగ్ జరుగుతుందని.. ఫలితంగా జూన్ రెండవ వారం నుంచి జూలై మధ్య వరకు అపరిపక్వ సమూహాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. సోమాలియా, ఇథియోపియాలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. కొత్త సమూహాలు చాలా వరకు కెన్యా నుంచి ఇథియోపియాకు, జూన్ మధ్యకాలం తరువాత దక్షిణ సూడాన్ నుంచి సుడాన్ వరకు ప్రయాణిస్తాయి. మరికొన్ని సమూహాలు ఉత్తర ఇథియోపియాకు వెళతాయి. ఈశాన్య సోమాలియాకు చేరుకున్న సమూహాలు ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా ఇండో-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి వలస వెళ్ళే అవకాశం ఉంది అని ఎఫ్ఏఓ తెలిపింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) మిడతలు రోజులో 150 కిలోమీటర్ల వరకు ఎగురుతాయి. ఒక చదరపు కిలోమీటర్ మేర ఉన్న సమూహం.. 35,000 మంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని తింటాయి. రాజస్థాన్‌లోని బార్మెర్, జోధ్‌పూర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు మిడతల దాడులను చూస్తూనే ఉన్నాయని భారత ప్రభుత్వ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ (ఎల్‌డబ్ల్యూఓ) కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం 65,000 హెక్టార్ల ప్రాంతంలో మిడతలు నియంత్రించబడ్డాయని.. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కొత్త మిడతల సమూహాలు లేవని ఆయన అన్నారు. (మిడతలను పట్టే ‘మెథడ్స్’) మిడతల దాడులను నియంత్రించడానికి మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో హెలికాప్టర్ల వాడకాన్ని చూసే అవకాశం ఉందని ఎల్‌డబ్ల్యూఓ తెలిపింది. రాత్రిపూట చెట్లపైకి చేరిన తర్వాత మిడతలు మీద రసాయనాలను పిచికారీ చేయడానికి డ్రోన్లు, ఫైర్ టెండర్లు, ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో కదులుతున్న మిడతల దండును నియంత్రించడానికి హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తాము అని గుర్జార్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని వింధ్య, బుందేల్‌ఖండ్, గ్వాలియర్-చంబల్ ప్రాంతాల్లో శుక్రవారం మిడతలు కనిపించాయన్నారు. రాజస్థాన్‌లో, బార్మెర్, పాలి, జోధ్‌పూర్, జలూర్, నాగౌర్, బికనేర్ వంటి ప్రదేశాల్లో మిడుత సమూహాలు కనిపించాయన్నారు. -
బీజీ కొత్తూరులో కనిపించిన మిడతలు
భద్రాద్రి కొత్తగూడెం, అశ్వాపురం: మండల పరిధిలోని బీజీకొత్తూరు గ్రామంలో బుధవారం జిల్లేడు చెట్లపై మిడతలు కనిపించాయి. మిడతలు పెద్ద సంఖ్యలో జిల్లేడు చెట్లపై చేరి వాటి ఆకులు తిని చెట్లకు ఆకులు లేకుండా మోడుగా మార్చాయి. ఇటీవలి కాలంలో మిడతల వల్ల కలిగే నష్టాలపై అధికారులు అప్రమత్తం చేయడం, పక్క రాష్ట్రాల నుంచి ఏ క్షణంలోనైనా మిడతలు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న తరుణంలోనే మిడతలు కనిపించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మిడతలు చెట్ల ఆకులు తిని మోడుగా మార్చడం గమనించిన వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. మండల వ్యవసాయ అధికారి డి.సాయిశంతన్‌కుమార్ బీజీకొత్తూరు గ్రామాన్ని సందర్శించి జిల్లేడు చెట్లపై ఉన్న మిడతలను పరిశీలించారు. ఈ మిడతలు పంటలు నాశనం చేసేవి కావని, జిల్లేడు చెట్ల మీద మాత్రమే పెరుగుతాయని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి తెలిపారు. -
మిడతల నివారణకు ప్రభుత్వం చర్యలు
భువనేశ్వర్ : రాష్ర్టంలో మిడతల దండును నియంత్రించే దిశగా ఒడిశా ప్రభుత్వం మంగళవారం అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించింది. జూన్ 15న రాష్ర్టంలో మిడతల సమూహం దాడిచేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే 8 లక్షలు రైతులకు కేంద్రం పలు సూచనలు జారీ చేసింది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇక జూన్ 30 వరకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో భారీ సడలింపులకు అనుమతులు ఇచ్చింది. కర్ప్యూ సమయాన్ని కూడా తగ్గించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం రాత్రి వేళల్లో ఎలాంటి మార్పులకు అంగీకరించలేదు. (వలస కార్మికులకు ఓపిక లేకనే....అమిత్ షా) ఇదివరకు ఉన్న నిబంధనలు మాధిరిగానే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ప్యూ ఉంటుందని పేర్కొంది. మాస్కులు ధరించడం, బహిరంగంగా ఉమ్మివేయడం లాంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని తెలిపింది. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘిస్తే 500 రూపాయలు, రెండవసారి ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసిన తాజా నిబంధనల ప్రకారం.. గంజాం, పూరి, నాయగర్, ఖుర్దా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపారా, జాజ్‌పూర్, భద్రాక్, బాలసోర్, బోలంగి సహా 11 జిల్లాల్లో శని, ఆదివారాల్లో మొత్తం షట్‌డౌన్ ఉండనుంది. అయితే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, స్విమ్మింగ్ పూల్స్ సహా ప్రార్థనా మందిరాల్లోకి కూడా లాక్డౌన్ నిబంధనలు ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్రం ఇప్పటికే ప్రార్థనా స్థలాలకు అనుమతించినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం నిబంధనలు సడలించలేదు. అంతేకాకుండా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి బహిరంగ కార్యక్రమాల్లో అనుమతి లేదని తెలిపింది. (కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం ) -
మిడతల దాణా మంచిదేనా?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్‌లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్‌లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది. మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్‌లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్‌కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు. వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్‌లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు') మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్‌థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్‌డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’) -
ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు'
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం నుండి వచ్చిన ఎడారి మిడతల వల్ల గత రెండు వారాలుగా ఉత్తర భారత దేశంలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపొయారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ మిడతలు వస్తాయోమో అన్న ఆందోళన నెలకొన్న సందర్భంగా మిడతలకు సంబంధించిన విషయాలను పరిశీలిద్దాం. మనకు సాధారణంగా కనబడే మిడతలకు, ఎడారి మిడతలకు తేడా ఏమిటి? వీటిని గుర్తించటం ఎలాగో తెలుసుకుందాం.. ♦ విశాఖపట్టణం జిల్లా నుంచి వచ్ఛిన ఫొటోల ఆధారంగా, కేరళలో కొన్నిప్రాంతాలలో కనిపించిన మిడతలు ‘కాఫీ తోటలను ఆశించే మిడతలు’గా, అలానే పిఠాపురం ప్రాంతం నుంచి వచ్చిన ఫొటోల ఆధారంగా వాటిని ‘జిల్లేడు మొక్కలను ఆశించే ప్రత్యేక మిడతలు’గా గుర్తించాలి. మన దేశంలో కనపడే ముఖ్యమైన మిడతల గురించి తెలుసుకుందాం. ఎడారి మిడత ఎడారిమిడతలు (schistocerca gregaria) మన ప్రాంతంలో వుండవు. కానీ ఇప్పుడు వేరే దేశాల నుంచి రాజస్తాన్ మీదుగా ఇతర రాష్ట్రాల్లోకి దండుగా తరలి వస్తున్న మిడతలు ఇవే. ఇది ఒక ఖండం నుంచి మరో ఖండానికి (వలస) వెళ్లగల అత్యంత వినాశకారి మిడత ఇది. ♦ మిడతల జీవిత చక్రంలో గుడ్డు, రెక్కలు లేని అపరిపక్వ దశ, రెక్కలున్న ప్రౌఢదశలుగా మూడు దశలు వుంటాయి. ఆడపురుగులు ఖాళీగా వుండే ఎడారిప్రాంతాల్లో తగినంత తేమ ఉన్నప్పుడు గుడ్లు పెడతాయి. రెండు వారాల్లో గుడ్డు నుంచి (రెక్కలు లేని) పిల్ల పురుగులు పుడతాయి. ఈ పిల్ల పురుగులు ఐదారు వారాల్లో అన్ని రకాల పంటలను, చెట్ల ఆకులను, గడ్దిని తింటూ అయిదారు సార్లు కుబుసం విడుస్తూ (పాత చర్మాన్ని విడుస్తూ) పరిమాణాన్ని విపరీతంగా పెంచుకుంటాయి. చివరి కుబుసం విడిచే దశ తర్వాత రెక్కలున్న పెద్ద మిడతలుగా మారతాయి. ♦ పెద్దమిడతలు వేరేప్రాంతానికి ఎగురుకుంటూ పోయి ఆయా ప్రాంతాల్లో గుడ్లు పెడతాయి. పెద్ద మిడతలు నాలుగువారాలు బతుకుతాయి. అయితే ఒంటరిగా వుండే రెక్కలులేని మిడతలు, రెక్కలుగల ప్రౌఢ దశలో ఉన్న మిడతలు ఎక్కువగా వుండి ఆ ప్రదేశం మిడతలతో కలిసి గుంపుగా మారితే ఈ మిడతల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఈ గుంపులనే ‘దండు’ అంటారు. ♦ సాధారణంగా రెక్కలు లేని మిడతలు ఒంటరి దశలో ఆకుపచ్చ రంగులో వుంటాయి, కానీ అవి గుంపులుగా వుండే దండు దశకు మారగానే నల్లటి మచ్చలతో పసుపురంగులోకి మారతాయి. చదరపు కిలోమీటరులో పరచుకొని ఉండే ఒక్కో దండులో అయిదారు కోట్ల మిడతలు ఉంటాయి. ప్రౌఢ దశలో ఉన్న మిడతలు ఎంతదూరమైనా ఎగురుకుంటూ పోగలవు. ♦ గాలి వాటంగా రోజుకు 100 కిలోమీటర్లు వెళ్లగలవు. రెక్కలున్న ప్రౌఢ మిడతలైతే గాలి వాటంగా సముద్రమట్టంపై రెండు కిలోమీటర్ల ఎత్తులో వేరే ప్రాంతానికి ఎగురుతూ వెళ్లగలవు. ఈ ఎడారి మిడతలు సహారా ఎడారుల్లో, పాకిస్తాన్, మనదేశంలో రాజస్తాన్ ఎడారి ప్రాంతంలో వుంటాయి. కానీ, వాటికి, సంతతికి అనుకూలంగా వుంటే వేరే ఖండాలకు, దేశాలకు, ప్రాంతాలకు దండులుగా తిండికోసం, గుడ్లుపెట్టటానికి వెళ్తాయి. ఈ క్రమంలో దొరికిన పంటలను, చెట్లను సర్వనాశనం చేస్తాయి. ♦ మన దేశంలో ఈ మిడతలు సంతానోత్పత్తి జులై నుండి అక్టోబర్ దాకా చేస్తాయి. అయితే పాకిస్తాన్లో జనవరి నుండి అక్టోబర్‌దాకా సంతానోత్పత్తి చేస్తాయి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిడతల కదలికలను గమనిస్తూ అన్ని దేశాలకి సలహాలని ఇస్తుంటారు. ♦ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘మిడతల హెచ్చరిక సంస్థ’ ఎప్పటికప్పుడు పక్కదేశాల్లో మిడతల ఉధృతిని అంచనావేస్తూ ఉంటుంది. మన దేశంలో నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్లో ఉన్న ఎడారి ప్రాంతాలో పడిన వానల మూలంగా ఎడారి మిడతల సంతానోత్పత్తి పెరిగింది. అందువల్ల ఈ ఎడారి మిడతలు దండు దశగా మారి ఎప్రిల్ నెలలో పాకిస్తాన్ నుండి రాజస్తాన్ వైపు వచ్ఛాయి. అవి గాలివాటంగా (బలమైన దక్షిణ గాలుల వల్ల) ఇతర ప్రాంతాల వైపు వస్తున్నాయి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంచనాల ప్రకారం ఇప్పుడున్న గాలివాటం ప్రకారం బీహార్, ఒరిస్సా రాస్ట్రాల వరకు జులై నెలదాకా వచ్చే అవకాశం వుంది. అయితే నైరుతీ రుతు పవనాలు మొదలవగానే ఈ మిడతలు గాలివాటంగా మళ్లీ రాజస్తాన్ వైపు మరలుతాయని అంచనా. ♦ జిల్లేడు మిడత జిల్లేడు మిడత (Poekilocerus pictus) మన భారత ఖండంలోనే వుంటుంది. ఇది జిల్లేడు మొక్కలపై జీవిస్తుంది. బాగా ఆకుపచ్చ రంగులో వుండి పసుపు పచ్చ గీతలు వుంటాయి. ఇవి జిల్లేడు మొక్కల మీద మాత్రమే వుంటాయి. వేరే రకాల మొక్కలపై లేదా పంటలపైకి అసలు రావు. వీటిని మొహం మీద లేదా పొట్ట దగ్గర తాకితే ఒకరకమైన ద్రావణాన్ని చిమ్ముతాయి. వీటిని గుర్తించటం చాలా తేలిక. ఎడారి మిడతలకు వీటికి తేడా సులభంగా అర్థమవుతుంది. ♦ బొంబాయ్ మిడత బొంబాయ్ మిడత (Patanga succincta) మన దేశంలో సాధారణంగా అన్ని మొక్కలపై కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధరణంగా అన్ని చోట్లా అన్ని మొక్కలపైనా కనిపిస్తూ వుంటుంది. ఈ మిడతల దండు 1927 తర్వాత మళ్లీ కనిపించలేదు. ఏ పంటలనూ వదలవు 1993లో రాజస్థాన్‌లో ఎడారి మిడతలు విజృంభించాయి. అప్పట్లో మిడతల నియంత్రణ కార్యక్రమాన్ని 40 రోజులు అమలు చేసి.. మిడతలను సమర్థవంతంగా నిర్మూలించిన అధికార బృందంలో తెలుగు వారైన డాక్టర్ కె.ఎస్.ఆర్.కె. మూర్తి కూడా ఉన్నారు. కీటక శాస్త్ర నిపుణులైన డా. మూర్తి 1999లో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రిటైరై సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కీటక శాస్త్ర నిపుణుల జాతీయ సంఘానికి అధ్యక్షునిగా కూడా సేవలందించారు. ఎడారి మిడతలు ఏ పంటలనూ వదలకుండా రాత్రీ, పగలు తేడా లేకుండా ఆబగా తినేస్తాయని, వీటి పట్ల ప్రభుత్వం, రైతులతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డా.మూర్తి చెప్పారు. రైతులు రోజూ ఉదయం, సాయంత్రం పొలాల్లో కలియదిరిగేటప్పుడు ఎడారి మిడతలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుంటూ ఉండాలి. సాధారణంగా వేడి వాతావరణంలోనే ఎడారి మిడతలు వస్తాయి. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇక రావు అనుకోవడానికి లేదన్నారు. ఇతర దేశాల్లో మిడతల తీవ్రత, వాతావరణంలో మార్పులను బట్టి రావచ్చని. రావని కచ్చితంగా చెప్పటానికి లేదని డా.మూర్తి(94415 84255) హెచ్చరిస్తున్నారు. కాఫీ మిడత కాఫీ తోటల్లో ఉంటుంది కాబట్టి దీన్ని కాఫీ మిడత (Aularches miliaris) అంటారు. దీన్ని దెయ్యం మిడత, నురుగు మిడత అని కూడా పిలుస్తారు. ఈ మిడత ఇటీవల కేరళలో వయనాడ్ ప్రాతంలో కాఫీతోటల్లో కనపడిందని వార్తలు వచ్చాయి. ఎడారి మిడత వచ్చిందని స్థానికులు భయపడ్డారు. దీన్ని గుర్తించటం చాలా తేలిక. విశాఖపట్టణం జిల్లాలో కాఫీమిడతలకు చెందిన రెక్కలులేని పిల్లపురుగులు. ఎక్కువ సంఖ్యలో వుండటంతో వీటిని చూసి స్థానికులు ఎడారి మిడతలని అనుకుంటున్నారు. వీటికి ఎడారి మిడతలకు చాలా తేడా ఉంది. ♦ కాఫీ మిడత కొబ్బరి, పోక, పనస, రబ్బరు, టేకు, అరటితోపాటు మిగతా పంటల్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇతర మిడతలు మనకు సాధారణంగా గడ్డిలో కనబడే అనేక ఇతర రకాల మిడతలు పెద్దగా నష్టం కలగచేయవు. వరి పంటలోనూ ‘వరి మిడత’ను గమనించవచ్ఛు. కొన్నిసార్లు ఈ మిడతల ఉధృతి పెరగవచ్చు. – డా. శ్రీనివాస రావు చెరుకూరి కీటక శాస్త్ర ఆచార్యులు (94410 26576) ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, బాపట్ల cherukurisrao@yahoo.com -
మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’
చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ‘గొప్ప ముందడుగు’ పేరిట 1958 నుంచి 1962 వరకు రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. అందులో ‘ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు’ సమూలంగా నిర్మూలించడం ఓ లక్ష్యం. ఆ లక్ష్యంలో చాలా వరకు విజయం సాధించినప్పటికీ చైనా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పిచ్చుకలు లేకుండా పోవడంతో చైనాలో మిడతల దాడులు పెరిగాయి. అంతకుముందు మిడతలు కనిపిస్తే పిచ్చుకలు వాటి వెంటబడి తినేవి. (మిడతలను పట్టే ‘మెథడ్స్’) మిడతలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ మార్గలేమిటని చైనా ప్రభుత్వం అన్వేషించగా, అందుకు బాతులు బాగా పనికొస్తాయని తేలింది. దాంతో పెద్ద ఎత్తున బాతుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. లక్షలకు చేరుకున్న బాతులకు ‘డక్ ఆర్మీ’ అని పేరు పెట్టి మిడతల పైకి దాడికి పంపించేది. ఆ బాతులు మిడతల లార్వాలను, ఎగురలేని పిల్ల మిడతలను శుభ్రంగా తినేసేవి. నోటికందిన పెద్ద మిడతలను కూడా వదిలేవి కావు. (మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! ) మిడతల దండు దేశంలోని పంటలపైకి దాడికి వచ్చినప్పుడల్లా, ఇప్పటికీ ‘డక్ ఆర్మీ’ని చైనా ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం వినతిపై లక్ష బాతుల ఆర్మీని ఆ దేశానికి పంపించేందుకు గత ఫిబ్రవరి నెలలో చైనా ప్రభుత్వం అంగీకరించింది. అయితే పంపించిందీ, లేనిదీ కరోనా వార్తల పరంపరలో తెలియలేదు. (ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కుమ్మేశారు) -
మిడతలను పట్టే ‘మెథడ్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘హెవెన్–సెంట్ విసిటేషన్ (స్వర్గం పంపించిన పర్యవేక్షకులు)’ అని పంటలపైకి దాడికి వచ్చిన మిడతల దండును భారతీయులు ఒకప్పుడు భావించేవారట. అందుకని మిడతలను పట్టుకుంటే డబ్బులిస్తామంటూ బ్రిటీష్ పాలకులు ఎంత పిలిచినా వెళ్లేవారు కాదట. మిడతల వల్ల పంటలు దెబ్బతిని దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని, వ్యవసాయ రైతులు పన్నులు చెల్లించే పరిస్థితుల్లో ఉండరనే ఉద్దేశంతో బ్రిటిష్ పాలకలు మిడతలను కూలీ ఇచ్చి పట్టించే వారు. (చదవండి: మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!) అప్పట్లో మిడతలను పారద్రోలేందుకు, పట్టుకునేందుకు పలు పద్ధతులు అమల్లో ఉండేవి. మిడతలను పారద్రోలేందుకు అవి ఆశించిన పంట పొలాల్లోకి వెళ్లి తపాలాను కర్రలతో మోగించేవారు. ఆ శబ్దాలకు అవి పారిపోయేవి. శబ్దాలు వినిపించని చోటుకు వెళ్లేవి. అక్కడ కూడా అలాంటి శబ్దాలనే వినిపించినట్లయితే అక్కడి నుంచి మరోచోటుకు వెళ్లేవి. కానీ నశించేవి కావు. నూనెలో తడిపిన తెరలను పొలాల వద్ద గాలివాటున కట్టే వారు. గాలి వాటున వచ్చే మిడతలు నూనెలో తడిపిన తెరకు అంటుకొనేవి. వాటిలో కొన్ని చనిపోయేవి. సైప్రస్ దేశంలో ఆ తెరల విధానాన్ని ఎక్కువగా ఉపయేగించేవారట. అందుకనే ఆ నూనెలో తడిపిన తెరలను ‘సైప్రస్ స్క్రీన్’ అని పిలిచేవారు. ఆ తెరల విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో మిడతలను పట్టేందుకు బుట్టలాంటి సంచులను గిరిగిరా తిప్పుతూ పొలాల్లో తిరిగేవారు. మిడతలు వాలిన మొక్కలపైకి బ్లాంకెట్లు వలల్లా విసిరి, వాటి కింద చిక్కిన మిడతలను పట్టుకునేవారు. ఈ పద్ధతులను ఉపయోగించి మిడతలను పట్టేందుకు బ్రిటీష్ పాలకులు కూలీలను నియమించేవారు. మిడతలను స్వర్గ పర్యవేక్షకులని భావించిన భారతీయులు మాత్రం కూలీకి వెళ్లేవారు కాదట. (చదవండి: మిడతలపై ఎదురుదాడికి ‘ఎల్‌డబ్లూఓ’) -
మిడతల దండుపై ఆందోళన వద్దు
ఎదులాపురం (ఆదిలాబాద్): మిడతల దండు విషయంలో రాష్ట్ర రైతులు ఆందోళన చెందవద్దని, వివి ధ మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని కీటక శాస్త్రజ్ఞుడు ఎస్జే రహమాన్ అన్నారు. మిడతలు రాష్ట్రంలో ప్రవేశించేలోపు తీసుకోవాల్సిన ముం దస్తు చర్యల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన కమిటీ సభ్యులు ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా ఆదిలాబా ద్ జిల్లాకు చేరుకున్న కమిటీ సభ్యులు రాష్ట్ర సరిహ ద్దు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంతోపాటు నిర్మల్ జిల్లాలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మం దిరంలో కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యుడు, కీటక శాస్త్రవేత్త రహమాన్ మాట్లాడుతూ మిడతలు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ప్రవేశించేందుకు ఆస్కారం ఉందో అంచనా వేసేందుకు ఈ ఏరియల్ సర్వే చేపట్టామన్నారు. ఆయన వెంట కమిటీ సభ్యురా లు, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఆర్.సునీత ఉన్నారు. -
మిడతల కదలికలపై ఏరియల్ సర్వే
సాక్షి, ఆదిలాబాద్: మిడతల కదలికలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మిడతల ప్రభావం లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మిడతల దండు దిశను మార్చుకున్నాయని... తెలంగాణకు ముప్పులేదని స్పష్టం చేశారు. మిడతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో మిడతల దండు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ వెల్లడించింది. -
'పటాసులు కాల్చండి.. డ్రమ్స్ వాయించండి'
నాగ్‌పూర్ : మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ప్రజలు పటాసులు కాల్చాల్సిందిగా, డ్రమ్ములను వాయించాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం కతోల్‌లో మిడతల దాడి పరిస్థితిపై మంత్రి సమీక్ష చేపట్టారు. రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఎప్పుడైతే మిడతలు దాడి చేస్తాయో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటాకులు కాల్చడం, టైర్లను కాల్చడం, డ్రమ్ములను వాయించడం వంటి చర్యలతో మిడతలను పారద్రోలాలన్నారు.(మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!) అంతకముందు మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదా భూషే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం మిడతలను వ్యవసాయ విభాగం నిర్మూలించిందన్నారు. రసాయనాలు స్ప్రే చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించినట్లు తెలిపారు. మిడతల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఉచితంగా రసాయనాలు, పురుగుమందులను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.పాకిస్తాన్ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతలు గాలి ద్వారా తమ దిశను మార్చుకుంటున్నాయి. రాజస్తాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున పంటపొలాల మీద పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఒక్కో గుంపులో వేల నుంచి లక్ష సంఖ్యలో ఉండే మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలను మిడతల దండు స్వాహా చేస్తాయి. (మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు!) -
మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!
సాక్షి, హైదరాబాద్: కరోనాకుతోడు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్న ప్రమాదం పంటలపై మిడతల దాడి. ఈ దండు దాడి చేసిందంటే సెకన్లు, నిమిషాలు, గంటల్లోనే పంటలన్నీ ఖాళీ అయిపోతాయి. దీంతో ఏ క్షణాన మిడతలు పంటలపై దాడి చేస్తాయోనన్న భయం రాష్ట్రాలను వెంటాడుతోంది. ఇదే పరిస్థితి మనకన్నా ముందు పాకిస్తాన్‌కూ ఎదురైంది. అక్కడి ప్రభుత్వం ఈ దండయాత్రను అడ్డుకొనేందుకు రసాయనాలపై ఆధారపడగా ఓ పరిశోధన బృందం మాత్రం సమస్య పరిష్కారానికి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నిశీధిలో ఓ వెలుగు.. పాకిస్తాన్‌లోని సింధ్, బలూచిస్తాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ మిడతలను చంపేందుకు వాడిన రసాయనాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ జాతీయ ఆహార భద్రత పరిశోధన మంత్రిత్వశాఖలో సివిల్ సర్వెంట్‌గా పనిచేసే మహ్మద్ ఖుర్షీద్, తన స్నేహితుడు, పాక్ వ్యవసాయ పరిశోధన మండలిలో బయోటెక్నాలజిస్టుగా పనిచేసే జోహార్ అలీతో కలసి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మిడతలపై రసాయనాలు చల్లి చంపే బదులు వాటిని సజీవంగా పట్టుకొని బ్రాయిలర్ కోళ్లకు ఆహారంగా మారిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకారా జిల్లాలోని అటవీప్రాంత సమీపంలో ఉన్న దీపల్‌పూర్‌లో (రసాయనాలు పిచికారీ చేయని ప్రాంతం కావడంతో దీన్ని ఎంచుకున్నారు) మూడు రోజులపాటు పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. సోయాబీన్ కంటే చౌక పాకిస్తాన్లో పౌల్ట్రీ పరిశ్రమ కోళ్లకు అహారంగా సోయాబీన్‌ను ఉపయోగిస్తోంది. దాదాపు 3 లక్షల టన్నుల సోయాబీన్‌ను దిగుమతి చేసుకుని నూనె తీసిన అనంతరం వచ్చే పీచును అక్కడి కోళ్ల పరిశ్రమలో వినియోగిస్తున్నారు. ‘సోయాబీన్లో 45 శాతం ప్రోటీన్లు ఉంటే క్రిమిసంహారక మందుల ప్రభావంలేని మిడతల్లో అది 70 శాతం ఉంటుంది. కోళ్లకు పెట్టే సోయాబీన్ ఆహారం కిలో 90 రూపాయలుంటే మిడతలు ఉచితంగా వస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు ఖర్చు పెడితే చాలు. సోయాబీన్ కంటే బలవర్ధకమైన ఆహారం మా కోళ్లకు పెట్టొచ్చు’అని పాకిస్తాన్లో అతిపెద్ద పౌల్ట్రీ కంపెనీ అయిన హైటెక్ గ్రూప్ జీఎం మహ్మద్ అథర్ వెల్లడించారు. కోళ్లకే కాదు చేపలు, డెయిరీ పరిశ్రమకు కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మిడతల్ని బస్తాలలో మూటలు గట్టిన దృశ్యం కిలో మిడతలకు 20 పాక్ రూపాయలు.. ‘మిడతలను పట్టుకోండి.. డబ్బు సంపాదించండి.. పంటలు కాపాడుకోండి’అనే నినాదంతో ఖుర్షీద్ బృందం స్థానికులను ఆకర్షించింది. కిలో మిడతలను పట్టిస్తే 20 పాక్ రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది.. రాత్రివేళ చెట్లపై సేదతీరే మిడతలను వలలతో పట్టుకొనేందుకు జనం పోటీపడ్డారు. ఒక్క రాత్రిలో ప్రజలంతా కలిపి సగటున ఏడు టన్నుల మిడతలను పట్టేసుకొని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఒక్కో వ్యక్తి 20 వేల పాకిస్తానీ రూపాయలు సంపాదించారు. అంటే ఒక్కో వ్యక్తి వెయ్యి కిలోల మిడతలు పట్టుకున్నాడన్న మాట. స్థానికులు పట్టి తెచ్చిన మిడతలను ఖుర్షీద్ బృందం స్థానికంగా ఉండే కోళ్ల ఫీడ్ తయారు చేసే ప్లాంట్లకు విక్రయించింది. -
మిడతలపై ఎదురుదాడికి ‘ఎల్‌డబ్లూఓ’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ఓ పక్క భారత్ సర్వశక్తులా పోరాడుతుండగానే అనూహ్యంగా దేశంపై మరో ఉపద్రవం మిడతల దండు రూపంలో వచ్చి పడింది. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించిన మిడతల దాడిని అడ్డుకోక పోయినట్లయితే పచ్చని పంటలను కోల్పోవాల్సిన ప్రమాదం ఉంది. అయినా మిడతల దాడిని ఎదుర్కోవడం మనకు కొత్త కాదు. ఇందులో రెండు శతాబ్దాల అనుభవం భారత్‌కు ఉంది. 81 సంవత్సరాల క్రితం, అంటే దేశానికి స్వాతంత్య్రం రాకముందు, బ్రిటీష్ పాలనలో మగ్గుతున్నప్పుడే ‘లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్’ ఆవిర్భవించింది. ప్రస్తుత మిడతల దాడిని ఎదుర్కోవడానికి పాత అనుభవాలు ఎక్కువగా పనికొచ్చే అవకాశం ఉంది. భారత్‌పై మిడతల దాడిని బ్రిటీష్ పాలకులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకు కారణం వారు వ్యవసాయ పన్నుపై ఎక్కువ ఆధారపడడం, మిడతల దాడిని సకాలంలో అడ్డుకోకపోతే పంటలు దక్కక కరవు కాటకాలు ఏర్పడేవి. పన్నులు చెల్లించే స్థోమత రైతులకు ఉండేది కాదు. 19వ శతాబ్దంలో 1812, 1821, 1843–44, 1863, 1869, 1878, 1889–92, 1896–97 సంవత్సరాల్లో భారత్ భూభాగంపై మిడతల దాడులు ఎక్కువగా జరిగాయి. మిడతల్లో సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన దాని సైకిల్ ఏమిటి? ఎప్పుడు అవి పంటలపైకి దాడికి వస్తాయి? వాటి సామాజిక జీవనం ఎట్టిదో తెలుసుకునేందుకు అధ్యయం చేయాల్సిందిగా ఎంటమాలజిస్ట్ (క్రిమికీటకాల అధ్యయన శాస్త్రవేత్తలు)లను బ్రిటీష్ పాలకులు ప్రోత్సహించారు. మిడతల దండును ఎదుర్కొనేందుకు స్థానికంగా అనుసరిస్తున్న పద్ధతులతోపాటు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను కూడా పరిగణలోకి తీసుకొని నాటి బ్రిటీష్ పాలకులు తగిన చర్యలు తీసుకున్నారు. 1927–29 సంవత్సరంలో భారత్‌లోని కేంద్ర ప్రాంతాలతోపాటు, పశ్చిమ ప్రాంతాలను కూడా మిడతలు ఏకకాలంలో ముట్టడించడంతో వాటిని ఎదుర్కొనేందుకు ఓ కేంద్రీకృత సంస్థ ఉండాలని నాటి పాలకులు భావించారు. 1929లో స్టాండింగ్ లోకస్ట్ కమిటీని, 1930లో లోకస్ట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఈ రెండింటిని మిలితం చేసి 1939లో ‘లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థనే ఇప్పటికీ కొనసాగుతోంది. (భారత్‌పై మిడతల దాడి: పాక్ నిర్లక్ష్యపు కుట్ర) 1943లో మిడతలపై తొలి అంతర్జాతీయ సదస్సు రోజు రోజుకు తీవ్రమవుతున్న మిడతల దాడిని ఎదుర్కోవడం ఎలా ? అన్న అంశంపై ఫ్రాన్స్ మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును 1943లో మొరాకన్ నగరం రాబత్‌లో ఏర్పాటు చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలు సహారా ప్రాంత దేశాలు హాజరయ్యాయి. అప్పటికే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ వలస ప్రభుత్వానికి ఆ సదస్సు ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో సహారా దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా ఉండేవి. ఆఫ్రికా, ఆరేబియా, ఇరాన్, భారత్ సహా ఆసియా దేశాలన్నింటితోపాటు మధ్యప్రాచ్య దేశాలకూ మిడతల దాడులు విస్తరించిన నేపథ్యంలో దీనిపై నేడు అంతర్జాతీయ సదస్సును నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగితేనే సార్థకతతోపాటు సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. -
ఆ తర్వాత ఏలియన్స్ దాడులా?: వర్మ
హైదరాబాద్: సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై ఇప్పటివరకు కవితలు, పాటలు రాసిన వర్మ తాజాగా ఏకంగా ఓ సినిమాను తెరకెక్కిస్తూ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెటిజన్ల తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటికే వివిధ సమస్యలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే మిడతల రూపంలో కొత్త సమస్య వచ్చిచేరింది. మిడతల దండు పంటపొలాలను నాశనం చేస్తుండటం ప్రభుత్వాలకు తలపోటుగా మారింది. ఈ క్రమంలో మిడతల దండుపై తన దైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశాడు వర్మ. (ఈశ్వర్, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ) వైరస్లు ప్రపంచంపై దాడి చేసిన అనంతరం ప్రస్తుతం మిడతలు అటాక్ చేస్తున్నాయని, తదుపరి ఏలియన్స్ దాడులు చేస్తాయా? అని ప్రశ్నిస్తూ వర్మ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి’ అంటూ మరో సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా తీయడానికి వర్మకు మరో సబ్జెక్ట్ దొరికిందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ‘మిడతల దండు’ అనే సినిమా తీయండి అంటూ మరికొందరు వర్మకు సూచనలిస్తున్నారు. (ఆర్జీవీకి అభినందనలు: బిగ్‌బీ) While the entire WORLD is in a LOCKDOWN the LOCUSTS are on a WORLD TOUR 🙄🙄🙄 pic.twitter.com/K2IuOxP4K3 — Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2020 The entire WORLD is in a LOCKDOWN and the LOCUSTS are on a WORLD TOUR 🙄🙄🙄 pic.twitter.com/sTb7nZqPoY — Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2020 -
భూమిని కప్పేసినట్టు కోట్లాది మిడతలు
-
ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కుమ్మేశారు
సాక్షి, నూఢిల్లీ : మహారాష్ట్రలోని అమరావతి, వార్దా, నాగపూర్ ప్రాంతాలపై మే 26వ తేదీన ఆకాశాన్ని కమ్మేసినట్టు, భూమిని కప్పేసినట్టు కోట్లాది మిడతలు దాడి చేయడం తెల్సిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలోనే ఈ మిడతల దాడులు కొనసాగాయి. జైపూర్‌ను ముట్టడించిన మిడతల దాడిని ఎంతోమంది స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కుమ్మేశారు. గత 26 ఏళ్లలో ఎన్నడు లేనంత తీవ్రంగా ఈసారి మిడతలు భారత్‌పైకి దండయాత్రకు వచ్చాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. (మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు! ) భారత్‌లోని 739 జిల్లాలకుగాను 41 జిల్లాలపై ఈసారి మిడతలు దాడి చేశాయని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్’ డిప్యూటీ డైరెక్టర్ కేఎల్ గుర్జార్ తెలిపారు. అసలు ఎందుకు మిడతలు దాడులు చేస్తాయి ? ఏ సీజన్లో దాడులు చేస్తాయి ? వాతావరణ పరిస్థితులకు, వాటి దాడులకు సంబంధం ఏమన్నా ఉందా ? వాటి వల్ల పంటలకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుంది ? వాటి దాడులను ఎలా ఎదుర్కోవాలి ? అందుకోసం భారత్‌లోని ఏ విభాగం పోరాడాలి? ఎలా పోరాడాలి? అందుకు ఎవరి సహకారం అవసరం ? అన్న పలు ఆసక్తికరమైన ప్రశ్నలన్నింటికి సమాధానాలు అందుబాటులోనే ఉన్నాయి. (వణికిస్తున్న రాకాసి మిడతలు) మిడతలది 90 రోజుల సైకిల్ ఆడ, మగ మిడతలు కలసుకోవడం, ఆడ మిడతలు గుడ్లు పెట్టడం, ఆ గుడ్లు పిల్లలవడం, పిల్లలు ఎదిగి ఎగిరి పోవడం ఒక సర్కిల్. ఈ సర్కిల్ ఏడాదికి 90 రోజులపాటు కొనసాగుతుంది. 90 రోజులపాటు అవి దేశ దేశాలపై దాడులు చేస్తూ పచ్చని పంట పొలాలను ఆశిస్తాయి. ఓ మిడత మంద ఓ ప్రాంతం పంటలపై ‘మేటింగ్, బ్రీడింగ్’ల కోసం ఆగిపోతే, చోటు సరిపోదని భావించిన ఇతర మందలు పచ్చదనం వెతుక్కుంటూ మరో ప్రాంతం వైపు దూసుకు పోతాయి. ఆడ, మగ మిడతలు కలుసుకున్న రెండు రోజులకే ఆడ మిడతలు 60 నుంచి 80 గుడ్లు పెడతాయి. అవి ఐదు నుంచి పది సెంటీ మీటర్ల పొడవు ఉంటాయి. గుడ్లు పెట్టడానికి మిడతలకు బలమైన నేల కూడా కావాలి. పది నుంచి 15 రోజుల్లోగా ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి ఎగిరేందుకు సిద్ధం కూడా అవుతాయి. ఈ 90 రోజుల సర్కిల్లో మిడతలు తెగతింటాయి. అందువల్ల పంట పొలాలన్నీ సర్వనాశనం అవుతాయి. పచ్చని పొలాలు అందుబాటులో లేనప్పుడు మిడతలు పెద్ద చెట్లపై వాలి వాటి ఆకులను కూడా తింటాయి. అవి మనుషులు, జంతువుల జోలికి మాత్రం రావు. (పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..) జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సీజన్ మనకు మిడతల సైకిల్ కొనసాగే ప్రాంతాలు ఇరాన్, పాకిస్థాన్, భారత్, అఫ్ఘానిస్థాన్ దేశాలు. భారత భూభాగంలో మిడతల సీజన్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు. ఇరాన్, పాకిస్థాన్ మీదుగా భారత్‌కు వచ్చి, అఫ్ఘాన్వైపు తరలిపోయే మిడతలు ఈసారి భారత్‌లోకి ఏప్రిల్, మే నెలల్లోనే వచ్చాయి. అందుకు వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళా ఖాతంలో చెలరేగిన తుపానులు, పశ్చిమ గాలుల ప్రభావంతో ఈ సారి మిడతలు ముందుగానే భారత్‌లోకి దండయాత్రకు వచ్చాయి. వాటిని నాశనం చేసేందుకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తారు. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..) ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లోని 303 ప్రాంతాల్లో (47 వేల హెక్టార్లలో) ‘లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్’ మందులను స్ప్రే చేసింది. ఇంకా చాలా ప్రాంతాల్లో చేయాల్సి ఉంది. అందుకోసం 60 కొత్త స్ప్రేయింగ్ యంత్రాల కోసం బ్రిటన్‌కు ఆర్డర్ ఇచ్చామని, మరో 15 రోజుల్లో అవి వస్తాయని గుర్జార్ తెలిపారు. ఈసారి సమస్య తీవ్రంగా ఉన్నందున హెలికాప్టర్ల ద్వారా కూడా మందులను స్ప్రే చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. భారత్, పాక్, ఇరాన్, అఫ్ఘాన్ మధ్య సహకారం అవసరం మిడతలను పటిష్టంగా ఎదుర్కోవాలంటే ఈ నాలుగు దేశాల మధ్య సమన్వయం, సహకారం చాలా అవసరం. అందుకోసం ఐక్యరాజ్య సమితిలో ఈ దేశాల సభ్యులతో కూడిన కమిటీ ఒకటి ఉంది. ఇరాన్, పాక్ భూభాగాల మీదుగా వచ్చే మిడతలను ఆ రెండు దేశాల్లో అరికట్టినట్లయితే భారత్, అఫ్ఘాన్లపై అంత భారం పడదు. భారత్ పటిష్టంగా పనిచేస్తే అఫ్ఘాన్‌పై అంత భారం ఉండదు. ఈసారి పాకిస్థాన్ సహకారం సరిగ్గా లేక పోవడం వల్లనే నేడు భారత్‌పై పెద్ద సంఖ్యలో మిడతలు దాడికి వచ్చాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోకి 370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి మన దేశంపై పాకిస్థాన్ గుర్రుగా ఉందని, అందుకని ఈసారి సరైన సహకారం లభించడం లేదని గుర్జార్ మీడియా ముందు అంగీకరించారు. అయినా సరైన సహకారం కోసం ఐక్యరాజ్య సమితితో కలసి తాము కషి చేస్తున్నామని ఆయన తెలిపారు. (రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే) -
మిడతల దండు ముప్పు మనకు లేదు
సాక్షి, అమరావతి/నెల్లిమర్ల రూరల్: మిడతల దండుతో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు ముప్పు వాటిల్లినా గత 80 ఏళ్లలో రాష్ట్రంలోకి ఎన్నడూ అవి ప్రవేశించిన దాఖలాలు లేవని గుంటూరు లాంఫాంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్వీవీఎస్ దుర్గాప్రసాద్, డాక్టర్ ప్రమీలా రాణి స్పష్టం చేశారు. 80 ఏళ్ల కిందట మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ప్రాంతంలోకి పరిమిత స్థాయిలో ఇవి వచ్చినట్టు చరిత్ర ఉందని భారత మొక్కల పరిరక్షణ సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.ఎస్.ఆర్.కె. మూర్తి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోకి ఈ మిడతల దండ్లు వచ్చే అవకాశం లేదని, రైతులు ధైర్యంగా ఉండొచ్చన్నారు. ఉత్తర, పశ్చిమ భారతాన్ని మిడతలు వణికిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. వస్తే ఏమి చేయాలి? ► మిడతల దండు వచ్చే సూచనలు ఉన్నట్టయితే 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనెను పంటలపై పిచికారీ చేయాలి. ► శబ్దాలు చేస్తూ పంట మీద వాలకుండా జాగ్రత్త పాటించాలి. ► పంటలపై లామ్డా సైహాలోత్రిన్, డెల్టా మైత్రిన్, ఫిప్రోనిల్, క్లోరిఫైరిఫాస్, మలాథియాన్లో ఏదో ఒకదాన్ని పిచికారీ చేయాలి. సారిపల్లిలో మిడతల కలకలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో పలు చోట్ల పెద్ద సంఖ్యలో మిడతలు గుంపులుగా సంచరిస్తూ, జిల్లేడు చెట్లపై చేరి ఆకులను తింటున్నాయి. ఈ ప్రాంతంలో పంటలు కూడా ఏమీ లేకపోవడంతో మిడతల వల్ల ప్రమాదమేమీ లేదని భావిస్తున్నారు. -
మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు!
సాక్షి, హైదరాబాద్: మిడతల దండు మధ్యప్రదేశ్ వైపు మరలిపోతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. జోధాపూర్ లొకస్ట్ వార్నింగ్ సెంటర్ అధికారులు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాంటెక్ నుంచి దిశ మార్చుకుని, మధ్యప్రదేశ్ వైపు ప్రయాణిస్తోందని పేర్కొంటున్నారు. వాస్తవంగా మిడతల దండు ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తుందని అంచనా వేసినా.. ఇప్పుడు అటు వెళ్లట్లేదని చెబుతున్నారు. గాలి దిశకు అనుగుణంగా మళ్లీ పైకి వెళ్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. మన సరిహద్దులకు దగ్గరగా మిడతల దండు వచ్చినా.. ప్రస్తుతానికి దిశ మార్చుకోవడంతో రైతులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఒకవేళ గాలి దిశ మారితే, మళ్లీ ఇటువైపు వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. 90 శాతం వరకు ఇటు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. రామగుండానికి వెళ్లిన కమిటీ సభ్యులు.. రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో సాధారణంగానే మిడతల వల్ల ప్రతిసారి కొంతమేర పంట నష్టం సంభవి స్తుంది. అయితే అవి ఇతర రాష్ట్రాలకు వస్తుండటం వల్ల పరిస్థితి మారిందని విశ్లేషిస్తున్నారు. అందుకే మిడతల దండును సరిహద్దుల్లోనే సంహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని జయశంకర్ భూపాలపల్లి, మంచి ర్యాల జిల్లాల నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తే నష్టం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తుగా కమిటీ సభ్యులను ముగ్గురిని రామగుండానికి పంపినట్లు వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల చెబుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోకి మిడతల దండు రానందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, ఒకవేళ మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే అడ్డుకునేందుకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వెయ్యి లీటర్ల చొప్పున 7 వేల లీటర్ల రసాయనాలు సిద్ధంగా పెట్టుకున్నారు. -
విమానాలకు తప్పని మిడతల ముప్పు
న్యూఢిల్లీ: మిడతల దండు పచ్చని పైర్లకు, చెట్లకు మాత్రమే ప్రమాదంగా పరిణమించగా వీటివల్ల విమానాలకూ ముప్పు వాటిల్లే అవకాశముందని డీజీసీఏ(వైమానిక నియంత్రణ సంస్థ) హెచ్చరించింది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయాల్లో ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీజీసీఏ శుక్రవారం పైలట్లకు, ఇంజనీర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో.. మిడతలు సాధారణంగా తక్కువ ఎత్తులోనే విహరిస్తాయని తెలిపింది. (రాకాసి పురుగుపై టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు) విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో విమానంలోని ప్రవేశ మార్గాల(ఇంజిన్ ఇన్లెట్, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్, తదితర మార్గాలు) ద్వారా మిడతల దండు లోనికే ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. తద్వారా విమానాలు ఎగురుతున్నప్పుడు ఆ ద్వారాలు పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పిటోట్, స్టాటిక్ సోర్స్(గాలి ప్రవాహ వేగాన్ని కొలిచే సాధనాలు) మూసుకుపోవడం వల్ల గాలివేగం, అల్టీమీటర్ సూచీలు తప్పుడు సంకేతాలిస్తాయని తెలిపింది. కాగా ఖండాలను దాటుతూ పయనిస్తోన్న మిడతల దండు భారత్‌లో తొలిసారిగా రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. అనంతరం పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తూ విధ్వంసం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. (మిడతల దండుపై దండయాత్ర) -
రాకాసి పురుగుపై టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంటలను నాశనం చేసే రాకాసి మిడత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మిడతల గుంపు మూకుమ్మడి భీభత్సం సృష్టించగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఇప్పటికే మిడత(లోకస్ట్)ల దాడికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. మహారాష్ట్ర ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సరిహద్దు కావడంతో తమకు కూడా ముప్పు తప్పదని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం ఇప్పటికే మిడతల నుంచి తలెత్తే ప్రమాదాన్ని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించే మిడతల దండు మూడు కిలోమీటర్లకు పైగా విస్తరించి దాడి చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. మిడతలు జిల్లాకు చేరితే పచ్చని పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. జిల్లాలో సాగవుతున్న కూరగాయలు, మామిడిపండ్లు, ఇతర పంటలకు ప్రమాదం పొంచి ఉంది. మిడతల దండుకు పచ్చదనం కనిపిస్తే దాడిచేసి కనబడకుండా చేస్తాయి. వాటినుంచి అప్రమత్తంగా ఉంటూ పంటను రక్షించుకునేలా అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. అవసరమైన రసాయనాలు, యంత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫైరింజన్లు కూడా సిద్ధంగా ఉంచారు.(టోల్‌ఫ్రీ నం. 1800 120 3244 ) నివారణకు సూచనలు ♦ మిడతలు పంట పొలాలవైపు రాకుండా ముందస్తుగానే డబ్బాలు, స్టీల్ ప్లేట్లు, డ్రమ్ములు, లౌడ్‌స్పీకర్లతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా చేయాలి. ♦ 15 లీటర్ల నీటికి 45 మిల్లీలీటర్ల వేప రసాయనాలను కలిపి పిచికారీ చేయాలి. ♦ క్వినోల్పాస్ 1.5 శాతం డీపీ గానీ, క్లోరోఫైరోపాస్ 105 శాతం డీపీ పొడి మందును హెక్టారుకు 25 కిలోల చొప్పున చల్లి, పొలాన్ని దున్నితే మిడతల గుడ్లు, వాటి పిల్ల పురుగులు అక్కడికక్కడే నాశనమవుతాయి. ♦ ఎండిన పొలాల్లో లేదా చుట్టుపక్కల మంటలు వేస్తే మిడతల దండు, పిల్ల దశ పురుగులు మంటల్లో పది శాతం వరకు నశించిపోతాయి. రైతులు ఈ మార్గదర్శకాలను పాటిస్తే కొంత మేరకైనా పంటలను కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
దండుయాత్ర!
-
కరోనా వేళ వణికిస్తున్న మిడతల దండు
-
మిడతల దండుపై ఆందోళనొద్దు
సాక్షి, అనంతపురం: మిడతల దండుపై ఆందోళన వద్దు అని తిరుపతిలోని ఉద్యానశాఖ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. మిడతల దండు జిల్లాలోకి ప్రవేశించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వ్యవసాయశాఖ జేడీ ఎస్కే హబీబ్‌బాషా, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహారాష్ట్రలో ఎడారి మిడతల దండు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. గాలివేగం, గమనాన్ని బట్టి వాటి పయనం ఉంటుందన్నారు. ఒకవేళ మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికొస్తే.. అక్కడి నుంచి సరిహద్దు జిల్లాలైన తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మంలోకి ప్రవేశించొచ్చన్నారు. అటు నుంచి రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. ఇప్పటికైతే ఉభయ రాష్ట్రాల్లో వాడి జాడ లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనంత జిల్లాలోని రాయదుర్గం ప్రాంతానికి చేరుకున్నట్లు, పంటలను దెబ్బతీస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనన్నారు. అవి పదులు, వందల సంఖ్యలో రావన్నారు. వచ్చాయంటే లక్షలు, కోట్లలో వాటి సంఖ్య ఉంటుందన్నారు. జిల్లాలో కనిపిస్తున్న మిడతలు సాధారణంగా సహజంగా ఉన్నవేనన్నారు. చదవండి: మిడతల దండుపై దండయాత్ర జీవితకాలం 12 వారాలు వాటి జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే 12 వారాలు (84 రోజులు) జీవిస్తాయన్నారు. అందులో గ్రుడ్ల నుంచి లార్వా దశలో 2 వారాలు, చిన్న పురుగుల దశ ఆరు వారాలు, రెక్కల పురుగు దశ నాలుగు వారాలు ఉంటుందని శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెక్కల పురుగు దశ కీలకమైందన్నారు. ఎడారిలో వీటి ప్రభావం ఎక్కువ మిడతల దండు అనేది కొత్త విషయం కాదని శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎడారి ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. తరచూ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కనిపిస్తాయన్నారు. అయితే అవి ఎడాది ప్రాంతాన్ని వదిలేసి జనావాసాలు, పంట పొలాలకు వ్యాపించడం అనేది కొత్తగా చూస్తున్నందున ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. దండు ప్రవేశిస్తే పచ్చదనం లేకుండా నాశనం చేసేస్తాయన్నారు. దీనిపై ఒరిస్సా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులను అప్రమత్తం చేశాయన్నారు. మామిడి సీజన్ కావడంతో సాధ్యమైనంత మేరకు కోతలు పూర్తి చేయాలని తెలిపారు. వాతావరణం, పర్యావరణానికి హాని జరగకుండా వేప సంబంధిత మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు వాటి జాడ లేనందున జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. -
మిడతల దండుపై దండయాత్ర
న్యూఢిల్లీ/నాగపూర్: రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది క్రిమి సంహారక మందులు చల్లారు, రైతులు పళ్లాలు మోగించారు. పెద్దపెద్ద శబ్దాలు చేశారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? పచ్చటి పంటలను, చెట్ల ఆకులను విందు భోజనంలా ఆరగిస్తున్న రాకాసి మిడతల దండును తరిమికొట్టడానికే. ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మిడతలు దాడి చేసే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మిడతలు త్వరలో బిహార్, ఒడిశాకు చేరుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) హెచ్చరించింది. మామిడి తోటలకు తీవ్ర నష్టం మిడతలపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని హరియాణా వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కౌశల్ చెప్పారు. మిడతల విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. గత నెలలో పాకిస్తాన్ నుంచి రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతలు ఇప్పటికే 90 వేల హెక్టార్లలో పంటలను తినేశాయి. ఇవి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోకి అడుగుపెట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో క్రిమి సంహారక మందులు చల్లి, భారీ సంఖ్యలో మిడతలను హతమార్చారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాల్లో మిడతలు ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భారత్‌లో మిడతల దాడి మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఎఫ్ఏవో వెల్లడించింది. -
మిడతల దండు సంక్షోభం
‘పీడ పోయిందనుకుంటే పిశాచం పట్టుకుంద’ని నానుడి. కానీ కరోనా వైరస్ మహమ్మారి రూపంలో పట్టిన పీడ వదలకముందే మిడతల దండు వచ్చిపడి మన దేశాన్ని గడగడలాడిస్తోంది. పది రోజుల క్రితం ఆ దండు పాకిస్తాన్ సరిహద్దులవైపు నుంచి ప్రవేశించి గుజరాత్, రాజస్తాన్‌లపై విరుచుకుపడి, అటుపై ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తూ గాలివాటుకు రెండుగా చీలి ఒకటి మధ్యప్రదేశ్ దిశగా పోయి అక్కడ విధ్వంసకాండ సాగించింది. మరో దండు ఢిల్లీ, హర్యానా వైపు వెళ్లింది. మధ్యప్రదేశ్‌వైపు వెళ్లిన దండు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లవైపు మళ్లినట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా ముప్పు వుండొచ్చునన్న సమాచారంతో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. మిడతల దండు మన దేశానికి కొత్తగాదు. గత పదేళ్లుగా అప్పుడప్పుడు వీటి తాకిడివున్నా, చాలా స్వల్ప సంఖ్యలో రావడం.. రాజస్తాన్, గుజరాత్‌లలోని ఒకటి రెండు జిల్లాలకు సమస్య ఏర్పడటం ఉండేది. ఈసారి అవి కోట్లాదిగా వచ్చిపడ్డాయి. ఇంతటి భారీ సంఖ్యలో మిడతలు మన దేశం వచ్చిన ఉదంతాలు 1787–1796 మధ్య.. 1901–1908 మధ్య ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కూడా మిడ తల దండు రావడం రివాజైనా కోట్లాదిగా వచ్చిన దాఖలా లేదు. అవి వచ్చి పంట పొలంపై వాల డాన్ని స్వయంగా వీక్షించిన రైతు ఒకరు ‘ఎవరో ఆకాశం నుంచి ఒక పెద్ద వస్త్రాన్ని పొలంపై కప్పినట్టు అనిపించింద’ని చెప్పాడంటే మిడతల దండు తీవ్రత అంచనా వేసుకోవచ్చు. కోట్లాదిగా దండు కట్టడం, రోజుకు కనీసం 150 కిలోమీటర్ల దూరం వేగంగా ప్రయాణించడం ఈ కీటకాల ప్రత్యేకత. ఇవి పగటిపూట ప్రయాణిస్తూ ఏపుగా పెరిగిన పంట చేలపైనో, పచ్చని చెట్ల పైనో, పచ్చికబయళ్లపైనో వాలతాయి. ఆకులు, పండ్లు, కూరగాయలు, జొన్న, వరి... ఇలా ఏది దొరి కితే అది స్వాహా చేస్తాయి. చీకటి పడేవేళ వున్నచోటే వుండిపోతాయి. ఒక దండు కదిలిందంటే అందులో కనీసం నాలుగు కోట్ల మిడతలుంటాయని, అవి ఒక్క రోజులో 35,000 మంది తినే ఆహా రాన్ని ఖాళీ చేస్తాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చెబుతోంది. అంత ర్జాతీయ స్థాయిలో మిడతల తీరుతెన్నులపై అధ్యయనం చేసే ఏకైక సంస్థ అది. మిడతల దండు తాకిడికి లోనైన దేశాలు ఇచ్చే సమాచారాన్ని అందుకుని, అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి, ఆ దండు ఎటువైపు పోయే అవకాశం వుందో అంచనాకు రావడం... ఆ దిశగా వున్న దేశాలను అప్ర మత్తం చేయడం దాని బాధ్యత. నిజానికి ఇప్పుడేర్పడిన బెడద చిన్నదని, వచ్చే నెలకల్లా అది మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం వున్నదని ఎఫ్ఏఓ మన దేశాన్ని హెచ్చరించింది. తూర్పు ఆఫ్రికా నుంచి పాకిస్తాన్ మీదుగా భారత్‌కి వచ్చిపడే ఆ మిడతల దండు మరింత పెద్దగా ఉండొచ్చు నంటున్నది. మన దేశంలో కూడా ప్రత్యేకించి మిడతల బెడదను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు చేయడానికి, అవసరమైన చర్యలు సూచించడానికి రాజస్తాన్‌లోని జోద్పూర్ కేంద్రంగా లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్(ఎల్‌డబ్ల్యూ) పనిచేస్తోంది. ఇది ఎఫ్‌ఏఓతోనూ, వేరే దేశాల్లో ఇదే అంశంపై పనిచేస్తున్న సంస్థలతోనూ చర్చిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంది. మిడతల దండు వల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. కోట్లాదిమంది వినియోగించే ఆహారధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు వగైరాలను అవి స్వాహా చేస్తాయి. చాన్నాళ్ల తర్వాత ఈ ఏడాది పంటలు బాగా పండాయి. కానీ లాక్డౌన్ కారణంగా అవాంతరాలేర్పడ్డాయి. సకాలంలో పంట కోయలేక రైతులు అగచాట్లు పడ్డారు. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉండగలదని అంచనా వేశారు. ఇప్పుడొచ్చిపడిన మిడతల దండు ఈ పరిస్థితిని మరింతగా కుంగ దీస్తుందని నిపుణులు చెబుతున్న మాట. అదృష్టవశాత్తూ రబీ పంట కోతలు ఇప్పటికే ముగిశాయి. ఖరీఫ్‌కి ఇంకా వ్యవధి వుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో చేతికందే పప్పుధాన్యాలు, కూరగాయలు, పత్తి వగైరాలు ఈ మిడతల దండువల్ల నష్టపోయే అవకాశం వుంది. ఇంకో ప్రమాదం కూడా వుంది... సరిగ్గా రుతుపవనాలు ప్రవేశించి, వానలు కురవడం ప్రారంభమయ్యాక వచ్చే మిడతలు భారీగా గుడ్లు పెడతాయంటున్నారు. ఒక్కో ఆడ మిడత 750 గుడ్లుపెడుతుందని, వాటివల్ల రెండేళ్లపాటు సమస్యలేర్పడే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికి ఒక్క రాజస్తాన్‌లోనే అయిదు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని అంచనా. మన దేశం మాత్రమే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అఫ్ఘానిస్తాన్, ఆఫ్రికాతోసహా 64 దేశాలు ఈ మిడతల దండువల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వీటిని సాగనంపడానికి క్రిమి సంహారకాలు వెదజల్లడం మొదలుకొని అనేక రకాల చర్యల్ని సూచిస్తున్నారు. పళ్లాలు మోగించడం, వాహనాలపై లౌడ్స్పీకర్లు పెట్టి చెవులు చిల్లులు పడేలా సంగీతం పెట్టడం, డ్రోన్ల ద్వారా నిఘా తదితరాలు చేస్తున్నారు. ఈ మిడతల దండు పచ్చదనం అధికంగా వున్న నగరాలు, పట్టణాలను సైతం వదలటం లేదు. అన్ని అనర్థాల్లాగే ఇది కూడా మానవాళి స్వయంకృతమే. భూతాపం వల్ల హిందూ మహాసముద్రంలోని పశ్చిమ ప్రాంత సముద్ర జలాలు వేడెక్కాయని, పర్యవసానంగా గత ఏడాది చివరిలో ఆఫ్రికా ఎడారి ప్రాంతంలోనూ, అరేబియా ద్వీపకల్పంలోనూ కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు కురిశాయని, అందువల్లే ఈ స్థాయిలో మిడతల బెడద వచ్చిపడిందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలకు ముందు ఇక్కడ కురిసిన వర్షాలతో ఆ దండు మన దేశం వైపు వచ్చివుండొచ్చునని వారి అంచనా. కరోనా వైరస్ ప్రపంచ దేశాలతోపాటు మన దేశాన్ని కూడా కుంగదీసింది. దాన్నుంచి తేరుకోకుండానే ఇప్పుడు మిడతల సమస్య వచ్చిపడింది. పటిష్టమైన వ్యూహరచనతో అడుగేస్తే తప్ప వీటినుంచి సురక్షితంగా బయటపడటం అసాధ్యం. ఆ విషయంలో అత్యంత జాగు రూకతతో వ్యవహరించాలి. -
మిడతల దండుపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మిడతల దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మిడతల దండును అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై ఆయన ప్రగతి భవన్లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పీసీసీఎఫ్ శోభ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ డీజీ సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మిడతలు ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. (ఆదిలాబాద్‌కు 300 కి.మీ. దూరంలో మిడతలు) అక్కడి నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నాట్లు అధికారు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే మిడతలు తెలంగాణలో ప్రవేశించేందుకు తక్కువ అవకాశాలున్నప్పటికీ రాష్ట్రంలోకి అవి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారలు సీఎంకు తెలిపారు. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారని అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలు ఉన్నాయని చెప్పారు. కాగా గాలి మరలి చత్తిష్‌గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చని అధికారులు తెలిపారు. అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జీవన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలమల్లు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. (పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..) మిడతల దండును అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు: ఇప్పటికే మహారాష్ట్ర, చత్తీష్‌గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రాష్ట్రంలో ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతిలతో ఈ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. (బాలయ్య వ్యాఖ్యల దుమారం.. కళ్యాణ్ క్లారిటీ) మిడతల దండు రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలి. 12 ఫైర్ ఇంజన్లు, 12 జెట్టింగ్ మిషన్లలను కూడా సిద్ధంగా చేసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాసేలా ఈ కమిటీలు చూసుకుంటాయి. -
మిడతల దాడితో తీవ్ర పంటనష్టం
-
రాయదుర్గం చేరిన మిడతల దండు
-
ఆదిలాబాద్‌కు చేరుకోనున్న మిడతలు!
సాక్షి, ఆదిలాబాద్: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదిలాబాద్ జిల్లా సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడతలు మరో రెండు రోజుల్లో ఆదిలాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు మిడతల దండును ఎదుర్కొనేందుకు అప్రమత్తమవుతున్నట్లు పేర్కొన్నారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?) (పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు) ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిడతలు పంటకు నష్టం కలిగించాయి. ఈ క్రమంలో గురువారం మిడతలు ఆంధ్రప్రదేశ్ అనంతపుర్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో రాయదుర్గంలో వందల సంఖ్యల్లో ఈ రాకాసి మిడతలు క్షణాల్లో జిల్లేడి చెట్టు ఆకులను తినేయడం చూసి స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..) -
మిడతల దండు.. పోలీస్ సైరన్లు!
-
పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు
భోపాల్ : కరోనాతో వణికిపోతున్న భారత్‌కు రాకాసి మిడతల దండు కొత్త తలనొప్పిగా మారింది. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలను స్వాహా చేస్తున్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన ఈ దండు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలో పంటను నమిలేస్తూ అటు రైతులకు, ఇటు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిని పారదోలేందుకు డీజేలు పెడుతూ పెద్ద శబ్ధాలు చేస్తూ పంటను కాపాకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చెట్లు, పంటలను దాడి చేస్తున్న దండును పారదోలేందుకు పోలీస్ జీపుల సైరన్లను ఉపయోగించారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?) పొలాల వెంబడి పోలీస్ జీపులను నడుపుతూ పెద్ద శబ్ధంలో సైరన్లను మోగిస్తూ వాటిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు ఈ విషయం గురించి పన్నాకు చెందిన వ్యవసాయ అధికారి సుమన్ మాట్లాడుతూ.. "మిడతల దండు నుంచి పంటలను కాపాడేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. భారీ శబ్ధాలు లేదా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ద్వారా రాకాసి దండు బారి నుంచి పంటను కాపాడుకోవచ్చ"ని సలహా ఇచ్చారు. కాగా భారత్‌లో మిడతల దండు ప్రవేశించిన రాష్ట్రాల్లో నివారణా చర్యలు చేపడుతున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. (వణికిస్తున్న రాకాసి మిడతలు: రైతులు గజగజ) -
పొలాల మధ్యన డీజే, లౌడ్ స్పీకర్ల హోరు..
లక్నో: పెళ్లి ఊరేగింపు, విజయోత్సవ ర్యాలీ వంటి వేడుకల్లో డీజే పెట్టడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రం మిడతల దండును తరిమి కొట్టడం కోసం డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు. అది కూడా పొలాల మధ్యన. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఓ వైపు దేశం కరోనాతో అతలాకుతలమవుతోంటే.. మరోవైపు మిడతల దండు పొలాలపై దాడి చేసి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు మిడతల రూపంలో మరో నష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. (వణికిస్తున్న రాకాసి మిడతలు) గుంపులు గుంపులుగా మిడతలు పొలాల్లో స్వైర విహారం చేస్తూ.. అన్నదాతను అశాంతికి గురి చేస్తున్నాయి. ఆఫ్రికా, యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మిడతలు భారతదేశంలో ప్రవేశించాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో మిడతల దండు వీర విహారం చేస్తుంది. ఇప్పటికే రాజస్తాన్‌లో ఈ మిడతల దండు 50,000 హెక్టార్ల పంటను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. మిడతలను తరిమేందుకు పొలాల మధ్యలో డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు.(రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే) ఇప్పుడు గనక ప్రభుత్వాలు మిడతల సమస్యపై దృష్టి సారించకపోతే.. ముందు ముందు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్నది వర్షా కాలం. వరి, గోధుమ, పత్తి, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసిది ఈ కాలంలోనే. ఒక వేళ ప్రభుత్వాలు గనక ఇప్పుడు ఈ మిడతలను నివారించకపోతే.. రైతలు తీవ్రమైన పంట నష్టం చవి చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
రాష్ట్రంపైకి మిడతల దండు యాత్ర
-
రాష్ట్రంపైకి మిడతల దండు?
సాక్షి, హైదరాబాద్ : మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి ఆగమేఘాల మీద ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే అవకాశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని వివరించారు. ఒకవేళ అక్కడ దండు కంట్రోల్ కాకపోతే తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. మిడతల దండు గంటకు 12–15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాల్లో నిఘా బృందాలను (వ్యవసాయ, ఉద్యానశాఖ శాస్త్రవేత్తలతో) ఏర్పాటు చేయాలని సూచించారు. సస్యరక్షణ పరికరాలను, రసాయన మందులను అంచనా వేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. రక్షిత సస్యరక్షణ మందులను వాడాలని, నివాస ప్రాంతాల్లో సస్యరక్షణ మందుల పిచికారీ చేయరాదని ఆదేశించారు. మిడతల దండును సామూహికంగా నివారించే విషయంపై రైతులను చైతన్యం చేయాలన్నారు. గ్రామస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మిడతల దండు ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించింది. ఒక్కో మిడత రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుంది. వాటిలో సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. జూన్‌లోగా వాటి సంఖ్య 400 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో వై.జి. ప్రసాద్, ఎస్.జె. రహ్మాన్, ఆర్.సునీత, ఎం.నర్సింహారెడ్డి తదితర శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న రాకాసి మిడతలు
రాకాసి మిడతలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజా»Œ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా పంటలను నమిలేస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోనే 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం రాకాసి మిడతల దండు దాడికి గురైనట్లు అంచనా. రాజస్థాన్‌లోనే 5 లక్షల హెక్టార్లలో పంటలను మిడతలు స్వాహా చేస్తున్నాయి. ముందుకు విస్తరిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు మిడతల తాకిడి కొత్తేమీ కాదు. అయితే, ఈ ఏడాది సాధారణంగా కన్నా కొన్ని వారాలు ముందుగానే విరుచుకుపడటంతో చేతికి వచ్చే దశలో రబీ పంటలు ధ్వంసమయ్యాయి. గత 27 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ బెడద ఇప్పుడు ముంచుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పళ్లాలు, ఇతర పాత్రలు, డబ్బాలను మోగించడం, పెద్దగా శబ్దాలు చేస్తూ మిడతల దండును పారదోలి పొలాల్లోని పంటలను కాపాడుకోవాల్సిందిగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్లతో, అగ్నిమాపక యంత్రాలతో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నాయి. అయితే, 2.5–3 కిలోమీటర్ల పొడవైన కోట్లాది మిడతల గుంపు పంటల మీద దాడి చేస్తున్నందున డ్రోన్లను రంగంలోకి దింపడం అవసరమని కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ డైరెక్టరేట్‌కు మిడతల దండు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం చట్టవిరుద్ధం. అయితే, మిడతల విపత్తును ఎదుర్కొనేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మిడతలు పగటి పూట ప్రయాణం చేసి రాత్రి పూట చెట్లు చేమలు పంటలపై వాలుతాయి. ఆ సమయంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. మన దేశంలోకి సాధారణంగా పాకిస్తాన్ మీదుగా మిడతల దండు దాడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం తీవ్రత చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో రెండో వైపు నుంచి కూడా మిడతల ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి హిందూమహా సముద్రం మీదుగా నేరుగా భారత ద్వీపకల్పంలోని తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఇతర రాష్ట్రాలపైనా మిడతల దండు దాడికి దిగవచ్చని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. జూలైలోగా భారత్ వైపు మరిన్ని మిడతల గుంపులు కదిలి వచ్చే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ సూచిస్తోంది. -
జైపూర్‌లో మిడతల దండు
జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరవాసులకు సోమవారం వింత అనుభవం ఎదురైంది. మిడతల దండు దాడి చేసి ఇళ్ల గోడలు, చెట్లపై తిష్టవేశాయి. ఆకులను తినేశాయి. స్థానికులు వాటిని వెళ్లగొట్టడానికి పళ్లాలతో బిగ్గరగా శబ్దాలు చేశారు. అధికారులు చెట్లపై క్రిమిసంహార మందులు చల్లారు. అనంతరం అవి దౌసా జిల్లా వైపు వెళ్లిపోయాయి. రాజస్తాన్‌లో 18 జిల్లాల్లో మిడతల బెడద తీవ్రంగా ఉందని, ఆహారం కోసం ఇతర ప్రాంతాల వైపు వలస వెళ్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఓంప్రకాశ్ చెప్పారు. -
జైపూర్: లక్షలాది మిడతలు..
-
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..
జైపూర్: దేశం కరోనాతో అతలాకుతలమవుతోంటే.. పుండు మీద కారం చల్లినట్లుగా ఉంపన్ తుపాను వచ్చి బీభత్సం సృష్టించింది. దీనివల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. వీటికి తోడుగా మరో ప్రమాదం వచ్చిపడింది. పలు రాష్ట్రాల్లో మిడతల దండు విధ్వంసం సృష్టిస్తోంది. శనివారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో మిడతల గుంపు కనిపించింది. ఆ తర్వాత ఉజ్జయిన్ జిల్లాలోని రానా హెడ గ్రామంలో లక్షలాది మిడతలు కనిపించాయి. ఆ తర్వాత అవి రాజస్థాన్‌లోని జైపూర్ మీదకు దండెత్తాయి. ఈ క్రమంలో నేడు ఉదయం నిద్రలేవగానే టెర్రస్‌పై కనిపించిన దృశ్యాలు చూసి జైపూర్‌వాసులు గగుర్పాటుకు లోనయ్యారు. (వైరల్ వీడియో : ఇదీ జీవితమంటే) Locust attack in Jaipur. God know what more is left this year pic.twitter.com/NRhEa55jJ4 — #PrayForPoorsOfWB (@iHRumii_B) May 25, 2020 ఎటు చూసినా మిడతలే కనిపించడంతో వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వారి అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ ఒక్క ఏడాదే ఇన్ని విపత్తులు వస్తుండటంతో చాలామంది 2020 సంతవత్సరాన్ని తిట్టి పోస్తున్నారు. "మానవాళి అంతానికి రోజులు దగ్గరపడ్డాయా?", "ఈ యేడాది ముగిసేలోపు ఇంకా ఎన్ని చూడాలో" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మిడతల దండు ఏప్రిల్‌లోనే రాజస్థాన్‌లోకి ప్రవేశించగా, ఇప్పటివరకు 50,000 హెక్టార్ల పంటను నాశనం చేసింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. (రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే) -
పొలాలపై మిడతల దాడి..
-
రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే
జైపూర్ : పంట పొలాలను, వృక్షాలను నాశనం చేస్తున్న మిడతల దండును చంపేందుకు రంగం సిద్ధం చేయాలని ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా యంత్రాంగం అగ్నిమాపక దళానికి ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజులుగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మిడతలు వ్యాపించాయి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవైన సమూహంతో ఉన్న ఈ మిడతల దండు ఒక్కసారిగా ఎగురుతూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో మిడతలను అంతం చేసేందుకు రసాయనాలు నింపిన వాహనాలతో పిచికారీ చేయాలని జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని ) దీనిపై జిల్లా కలెక్టర్ ఆండ్రా వంశీ మాట్లాడుతూ.. మిడతలను చంపే ప్రక్రియ గురించి గ్రామస్తులందరికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సాధారణంగా మిడతలు, పచ్చగడ్డి, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తాయన్నారు. అందువల్ల అవి తాము నివసించే ప్రదేశాల్లో, పొలాల్లో కనిపిస్తే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్లు పొడవైన సమూహంతో పెద్ద సంఖ్యలో మిడుతలు దేశంలోకి ప్రవేశించినట్లు తమకు వార్తలు అందినట్లు డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి తెలిపారు. మిడుతల సమస్యలను పరిష్కరించడానికి రాజస్థాన్ నుంచి ఓ బృందం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ మిడుతల సహూహం ఝాన్సీలోని బాంద్రా మాగర్పూర్ వద్ద ఉందని, పురుగు మందుల పిచికారీ రాత్రి సమయంలో జరుగుతందని ఆయన పేర్కొన్నారు. (సొంత చెల్లెలిపై అఘాయిత్యం..) -
మిడతలకు చెవులున్నాయా?
మిడుతలకు మనలాగ చెవులుండవు. కాని వాటి జీవితంలో శబ్దానికి చాల ప్రాముఖ్యముంది. అసలు చెప్పాలంటే వాటికి తోడు కావలసిన మిడతల్ని కనుక్కునేందుకు ఈ శబ్దమే ముఖ్యమైన సాధనం. మగ మిడతలను ఒక గాజు గిన్నెలో ఉంచినపుడు, వాటిని గురించి ఆడ మిడతలు అసలు పట్టించుకోవని శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఆడమిడతలు గాజు గిన్నెలోని మగ మిడతల్ని చూడగలిగినప్పటికీ వాటిని వినలేకపోయినందువల్ల సరిగా గుర్తించలేకపోయాయి. కాని ఒక మైక్రోఫోను ఆ మగ మిడుత శబ్దాన్ని స్పీకరుకు అందించినపుడు ఆడ మిడతలు ఎంతో సంతోషంగా ఆ గాజుగిన్నె చుట్టూ చేరినట్లు పరిశోధనల్లో తేలింది. అసలు విషయం ఏమిటంటే...మిడుతలకు చెవులుండవు. వాటికి బదులు వాటి ముందు కాళ్ళలో శబ్ద గ్రాహకాలు ఉంటాయి. అవి మద్దెలలాగ ఉంటాయి. ప్రతి ‘మద్దెల’ మధ్యలో ఒక గుండ్రటి కొమ్ములాంటి అమరిక ఉంటుంది. ఈ ‘మద్దెల’ పల్చటి చర్మాలు చుట్టుపక్కల ఉన్న శబ్దతరంగాలను - మిగతా క్రిమికీటకాలు చేసే చప్పుళ్ళను గ్రహించి ఆ మిడుత నాడీవ్యవస్థకు పంపుతాయి. అక్కడ ఆ శబ్దాల్ని డీకోడ్ చేసుకుంటాయి.