
జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరవాసులకు సోమవారం వింత అనుభవం ఎదురైంది. మిడతల దండు దాడి చేసి ఇళ్ల గోడలు, చెట్లపై తిష్టవేశాయి. ఆకులను తినేశాయి. స్థానికులు వాటిని వెళ్లగొట్టడానికి పళ్లాలతో బిగ్గరగా శబ్దాలు చేశారు. అధికారులు చెట్లపై క్రిమిసంహార మందులు చల్లారు. అనంతరం అవి దౌసా జిల్లా వైపు వెళ్లిపోయాయి. రాజస్తాన్‌లో 18 జిల్లాల్లో మిడతల బెడద తీవ్రంగా ఉందని, ఆహారం కోసం ఇతర ప్రాంతాల వైపు వలస వెళ్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఓంప్రకాశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment