Insecticides Drug
-
న్యూట్రీఫెర్మ్తో గుడుంబా తయారీ.. తాగితే ప్రాణాలు పోవడం ఖాయం!
కొత్తగూడ(మహబూబాబాద్ జిల్లా): ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనులు మొదట సహజసిద్ధమైన ఇప్పపువ్వుతో గుడుంబా తయారు చేసుకుని తాగేవారు. క్రమంగా బెల్లం, పటిక, యూరియాతో తయారుచేసి గుడుంబాను విక్రయించారు. అయితే నల్లబెల్లం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కొన్ని రోజులు చక్కెర వినియోగించారు. కాగా బెల్లంతో అయినా చెక్కెరతో అయినా గుడుంబా తయారీలో పటిక క్రీయాశీలకంగా మారింది. కాగా పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. న్యూట్రీఫెర్మ్ స్ప్రే మందుతో గుడుంబా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చదవండి: ప్రగతి భవన్లో మంత్రి ‘కేటీఆర్’ ఎమోషనల్ సీన్.. 500గ్రాముల ప్యాకెట్‌తో 20సీసాలు.. పటిక దొరక్కపోవడంతో తయారీదారులు కొత్తదారిలో వెళ్తున్నారు. 500గ్రాముల ప్యాకెట్‌తో 20 సీసాల గుడుంబా వస్తోంది. దీనికి బెల్లం, చక్కెర, పటికతో పనిలేదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టుకునే అవకాశం లేదు. యథేచ్ఛగా తీసుకెళ్లవచ్చు. మిర్చి, పత్తిలాంటి ఆరుతడి పంటల ఎదుగుదలకు న్యూట్రీఫెర్మ్ అనే మందు ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది. ఓ ప్యాకెట్ తీసుకుని ఒక డ్రమ్ములో సగం నీరు పోసి కలియబెట్టి రెండు రోజులు నానబెడతారు. మూడోరోజు గుడుంబా తయారు చేసే విధంగానే బట్టీ పెడతారు. సాధారణంగా గుడుంబా తయారు చేయడాని వారం రోజులు పడుతుంది. దీనికి రెండు రోజులే సమయం పట్టడం, అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా న్యూట్రీఫెర్మ్ గుడుంబా తయారు చేస్తున్నారు. వాపు వస్తున్న ముఖాలు.. పంటలపై స్ప్రే చేసే మందుతో తయారుచేసే గుడుంబా వల్ల తయారీదారుల ముఖాలు వాపు వస్తున్నట్లు తెలిసింది. ముఖాలు వాస్తున్నా లాభాల కోసం గుడుంబా తయారీని వారు మానడం లేదు. అయితే తయారీదారుల పరిస్థితి ఇలా ఉంటే తాగే వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. తాగిన వారి అవయవాలు త్వరగా పాడైపోయి మృత్యువుకు దగ్గర కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. గుడుంబాతో ఎక్కువ లాభాలు ఉండడంతో కొందరు కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. వీరిపై ఎన్ని కేసులు బనాయించినా గుడుంబా తయారీని మాత్రం మానడం లేదు. నాజీతండా కేంద్ర బిందువు..? నూతన గుడుంబా తయారీ విధానానికి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా కేంద్ర బిందువు అని తెలుస్తోంది. ఈ గ్రామంలో గుడుంబా తయారు చేసి పలు గ్రామాలకు సరఫరా చేయడంతో పలు కేసులు నమోదయ్యాయి. మూడు మండలాల సరిహద్దు గ్రామం కావడంతో పోలీసుల నిఘా తక్కువ. ఎక్సైజ్ అధికారులకు తండావాసులు భయపడకపోవడం గమనార్హం. ఖానాపురం మండలంలోని పలు గ్రామాలతో పాటు జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో దాదాపు అన్ని గ్రామాలకు ములుగు జిల్లా పస్రా మండలంలోని పలు గ్రామాలకు ఇక్కడి గుడుంబా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఇక్కడి మహిళలు గుడుంబా తయారు చేస్తారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి భార్యభర్తలు ద్విచక్రవాహనాల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తారు. మధ్యలో ఎవరైనా ఆపి తనిఖీ చేసేందుకు యత్నిస్తే మహిళలు అరవడం, గోల చేయడం, తమపై అత్యాచారయత్రం చేకస్తున్నారని గగ్గోలు చేసి అధికారులను భయానికి గురిచేస్తారు. మద్యం ధరలు పెరగడంతో.. ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో రోజువారి కూలీలు, వ్యవసాయదారులు గుడుంబా తాగడానికి మొగ్గు చూపుతున్నారు. పొద్దంతా పొలం పనులు చేసి రాత్రి సమయంలో అధికంగా వెచ్చించి మద్యం తాగలేక చాలా మంది గుండుబా తాగుతున్నారు. అయితే నూతన గుడుంబా తయారీ విధానం వారికి తెలియకే తాగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలకే ప్రమాదం గుడుంబా దేనితో తయారు చేసినా తాగడం ప్రాణాలకే ప్రమాదం. ఇంకా స్ప్రే మందుతో తయారు చేసిన గుడుంబాను అస్సలు తాగొద్దు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది రోగుల్లో గుడుంబా కారణంగా కిడ్నీలు, లివర్, గుండె ఇతర అవయవాలు దెబ్బతినడం గమనిస్తున్నాం. దీని ప్రభావం పేగులపై కూడా పడుతుంది. –రవీందర్‌నాయక్,అసిస్టెంట్ ప్రొఫెసర్, మానుకోట మెడికల్ కాలేజీ కఠిన చర్యలు తీసుకుంటాం గుడుంబాను అరికట్టేందుకు బెల్లం, పటిక రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేశాం. స్ప్రే మందులతో గుడుంబా తయారీ నా దృష్టికి రాలేదు. ఇక నుంచి వాటిపై కూడా దృష్టి పెడుతాం. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినా తయారు చేయడం, తాగడం సరైంది కాదు. ప్రజలు చైతన్యవంతులై గుడుంబాను నిషేధించడంతో పాటు ఎక్కడ గుడుంబా తయారు చేసినా సమాచారం అందించాలి. –నగేష్, ఎస్సై -
జైపూర్‌లో మిడతల దండు
జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్ నగరవాసులకు సోమవారం వింత అనుభవం ఎదురైంది. మిడతల దండు దాడి చేసి ఇళ్ల గోడలు, చెట్లపై తిష్టవేశాయి. ఆకులను తినేశాయి. స్థానికులు వాటిని వెళ్లగొట్టడానికి పళ్లాలతో బిగ్గరగా శబ్దాలు చేశారు. అధికారులు చెట్లపై క్రిమిసంహార మందులు చల్లారు. అనంతరం అవి దౌసా జిల్లా వైపు వెళ్లిపోయాయి. రాజస్తాన్‌లో 18 జిల్లాల్లో మిడతల బెడద తీవ్రంగా ఉందని, ఆహారం కోసం ఇతర ప్రాంతాల వైపు వలస వెళ్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఓంప్రకాశ్ చెప్పారు. -
పొలాలపై మిడతల దాడి..
-
రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే
జైపూర్ : పంట పొలాలను, వృక్షాలను నాశనం చేస్తున్న మిడతల దండును చంపేందుకు రంగం సిద్ధం చేయాలని ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా యంత్రాంగం అగ్నిమాపక దళానికి ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజులుగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మిడతలు వ్యాపించాయి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవైన సమూహంతో ఉన్న ఈ మిడతల దండు ఒక్కసారిగా ఎగురుతూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో మిడతలను అంతం చేసేందుకు రసాయనాలు నింపిన వాహనాలతో పిచికారీ చేయాలని జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని ) దీనిపై జిల్లా కలెక్టర్ ఆండ్రా వంశీ మాట్లాడుతూ.. మిడతలను చంపే ప్రక్రియ గురించి గ్రామస్తులందరికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సాధారణంగా మిడతలు, పచ్చగడ్డి, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తాయన్నారు. అందువల్ల అవి తాము నివసించే ప్రదేశాల్లో, పొలాల్లో కనిపిస్తే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్లు పొడవైన సమూహంతో పెద్ద సంఖ్యలో మిడుతలు దేశంలోకి ప్రవేశించినట్లు తమకు వార్తలు అందినట్లు డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి తెలిపారు. మిడుతల సమస్యలను పరిష్కరించడానికి రాజస్థాన్ నుంచి ఓ బృందం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ మిడుతల సహూహం ఝాన్సీలోని బాంద్రా మాగర్పూర్ వద్ద ఉందని, పురుగు మందుల పిచికారీ రాత్రి సమయంలో జరుగుతందని ఆయన పేర్కొన్నారు. (సొంత చెల్లెలిపై అఘాయిత్యం..) -
పొలం, స్థలం అమ్మినా తీరని అప్పులు
కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంగళి పెద్ద ఎల్లనాగన్న అనే రైతు అప్పుల బాధతో 2014 ఆగస్టు 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య సావిత్రితోపాటు ముగ్గురు కుమార్తెలు (గీతాంజలి, రేణుక, శ్రీలక్ష్మి), కుమారుడు వీరేష్ ఉన్నారు. గీతాంజలి కస్తూర్బా గాంధీ వసతి గృహంలో ఉండి 6వ తరగతి చదువుతున్నది. రేణుక 5వ తరగతి, శ్రీలక్ష్మి 1వ తరగతి, వీరేష్ 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చిన్నారుల పోషణ భారమైనా ఐదేళ్లుగా పంటిబిగువున బాధను దిగమింగి సంసార నౌకను లాక్కొస్తున్నది సావిత్రి. కుటుంబపెద్ద మరణించినా బీమా అందలేదు. ఎన్.ఎఫ్.బి.ఎస్. పథకం కింద రావాల్సిన రూ. 20 వేలు కూడా అందలేదు. బాధితకుటుంబానికి ప్రభుత్వం ఇల్లు కూడా మంజూరు కాలేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. వితంతు పింఛన్ మాత్రమే మంజూరైంది. రెండున్నరెకరాల పొలం, ఇంటిస్థలం ఉండేది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో 2.5 ఎకరాల పొలంతోపాటు ఇంటి స్థలాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చింది సావిత్రి. అయినా, ఇంకా రూ. 3 లక్షల అప్పు మిగిలింది. గ్రామంలో ఇల్లు కూడా లేకపోవడంతో బంధువుల ఇంటిలో తలదాచుకుంటూ పిల్లలను కడుపులో పెట్టుకొని జీవనం సాగిస్తున్నది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ నలుగురు పిల్లలను పోషించుకుంటున్నది. కరువు వల్ల వ్యవసాయ పనులు కూడా చేతినిండా లేవు. పని దొరకని రోజు మంచినీళ్లతో తల్లీ బిడ్డలు కడుపు నింపుకోవాల్సిన దుర్భర పరిస్థితులున్నాయి. ప్రభుత్వం, దాతలు సహకరించి ఆర్థికంగా ఆదుకోవాలని సావిత్రి కోరుతున్నది. – నీలం సత్యనారాయణ, సాక్షి, కల్లూరు, కర్నూలు జిల్లా -
శీతలపానీయం అనుకుని..
కోదాడఅర్బన్ : కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో గల గణేశ్‌నగర్‌లో ట్యూషన్ కోసం వెళ్లిన విద్యార్థి శీతల పానీయం అనుకుని బాటిల్లోని క్రిమిసంహారక మందు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెం దాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. గణేషనగర్‌లో నివాసముండే గుంటా మహేశ్వరరావు కుమారుడు నాగసాయి(7) స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. మహేశ్వరరావు తన కుమారుడిని అదే కాలనీలోని తోమారెడ్డి ఇంట్లోని ట్యూషన్‌కు పంపిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో అక్కడ స్ప్రైట్ బాటిల్ కనిపించడంతో దానిని శీతలపానీయంగా భావించి తాగాడు. అయితే ఆ బాటిల్లో క్రిముల నివారణకు క్రిమిసంహారక మందును కలిపి ఉం చారు. ఈ విషయం తెలియని నాగసాయి దానిని తాగడంతో వాంతులు ప్రారంభమయ్యాయి. దీం తో నాగసాయిని పట్టణంలోని సిద్ధార్థ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి మిషమంగా ఉండడంతో మొదట ఖమ్మం, తరువాత గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగసాయి గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనలో ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ నాగసాయి తండ్రి మహేశ్వరరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏఎస్ఐ సైదా తెలిపారు. -
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
రఘునాథపల్లి : కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు శివారు ఎర్రగడ్డతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఎర్రగడ్డతండాకు చెందిన ఇస్లావత జాన్,బుజ్జి దంపతుల రెండో కుమారుడు ఇస్లావత్ మహేందర్ (22) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తుండేవాడు. వారం క్రితం వరి పంట కోత పనులున్నాచి, ఇంటికి రావాలని తండ్రి పోన్ చేయడంతో మహేందర్ తండాకు చేరుకొని వరి కోత పనులు చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం మహేందర్ తల్లిదండ్రుల వద్ద తన పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అన్న పెళ్లి కాకుండా నీ పెళ్లి కుదరదంటూ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. మధ్యాహ్నం వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి అపస్మాకర స్థితిలో ఉన్న కుమారుడిని చూసి పెద్ద ఎత్తున రోదించారు. స్థానికులు చేరుకొని వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జనగామ మార్చుకీలో మహేందర్ మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సై రంజిత్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలు కలుగలేదని ...
పి.ఒడ్డుపల్లె (ఐరాల) : పిల్లలు కలగలేదనే బాధతో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఐరాల మండలం పుల్లూరు ఒడ్డుపల్లెలో జరిగింది. ఎస్ఐ శివశంకర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెన్నకేశవ నాయుడు(36) పూతలపట్టు మండలానికి చెందిన గుణశ్రీ (27)ని 13 నెలల కిందట వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇది రెండో వివాహం. ఏడాది దాటినా సంతానం కలుగకపోవడంతో గుణశ్రీ తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. గుణశ్రీ మృతిపై గ్రామస్తుల అనుమానం గుణశ్రీ మృతి పట్ల గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కుటుంబ సభ్యులు గొడవ పడ్డారని చెబుతున్నారు. అలాగే గురువారం గుణశ్రీ, చెన్నకేశవ నాయుడు ప్రయాణం చేసి ఇంటికి వచ్చారని, వచ్చిన కొద్ది గంటల్లోనే మృతి చెందడం అనుమానాలకు తావిస్తోం దని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.