జైపూర్ : పంట పొలాలను, వృక్షాలను నాశనం చేస్తున్న మిడతల దండును చంపేందుకు రంగం సిద్ధం చేయాలని ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా యంత్రాంగం అగ్నిమాపక దళానికి ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజులుగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మిడతలు వ్యాపించాయి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవైన సమూహంతో ఉన్న ఈ మిడతల దండు ఒక్కసారిగా ఎగురుతూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో మిడతలను అంతం చేసేందుకు రసాయనాలు నింపిన వాహనాలతో పిచికారీ చేయాలని జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని )
దీనిపై జిల్లా కలెక్టర్ ఆండ్రా వంశీ మాట్లాడుతూ.. మిడతలను చంపే ప్రక్రియ గురించి గ్రామస్తులందరికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సాధారణంగా మిడతలు, పచ్చగడ్డి, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తాయన్నారు. అందువల్ల అవి తాము నివసించే ప్రదేశాల్లో, పొలాల్లో కనిపిస్తే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్లు పొడవైన సమూహంతో పెద్ద సంఖ్యలో మిడుతలు దేశంలోకి ప్రవేశించినట్లు తమకు వార్తలు అందినట్లు డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి తెలిపారు. మిడుతల సమస్యలను పరిష్కరించడానికి రాజస్థాన్ నుంచి ఓ బృందం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ మిడుతల సహూహం ఝాన్సీలోని బాంద్రా మాగర్పూర్ వద్ద ఉందని, పురుగు మందుల పిచికారీ రాత్రి సమయంలో జరుగుతందని ఆయన పేర్కొన్నారు. (సొంత చెల్లెలిపై అఘాయిత్యం..)
Comments
Please login to add a commentAdd a comment