పిల్లలు కలుగలేదని ... | Married women Suicide | Sakshi
Sakshi News home page

పిల్లలు కలుగలేదని ...

Published Sat, May 14 2016 3:52 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

పిల్లలు కలుగలేదని ... - Sakshi

పిల్లలు కలుగలేదని ...

పి.ఒడ్డుపల్లె (ఐరాల) : పిల్లలు కలగలేదనే బాధతో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఐరాల మండలం పుల్లూరు ఒడ్డుపల్లెలో జరిగింది. ఎస్‌ఐ శివశంకర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చెన్నకేశవ నాయుడు(36) పూతలపట్టు మండలానికి చెందిన గుణశ్రీ (27)ని 13 నెలల కిందట వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇది రెండో వివాహం. ఏడాది దాటినా సంతానం కలుగకపోవడంతో గుణశ్రీ తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివశంకర్ తెలిపారు.


గుణశ్రీ మృతిపై గ్రామస్తుల అనుమానం
గుణశ్రీ మృతి పట్ల గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కుటుంబ సభ్యులు గొడవ పడ్డారని చెబుతున్నారు. అలాగే గురువారం గుణశ్రీ, చెన్నకేశవ నాయుడు ప్రయాణం చేసి ఇంటికి వచ్చారని, వచ్చిన కొద్ది గంటల్లోనే మృతి చెందడం అనుమానాలకు తావిస్తోం దని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement