ఆ తర్వాత ఏలియన్స్‌ దాడులా?: వర్మ | LOCUSTS Are On A WORLD TOUR Says Ram Gopal Varma On Twitter | Sakshi
Sakshi News home page

మిడతల దండు: వర్మకు మరో సినిమా దొరికినట్టేనా?

Published Sat, May 30 2020 11:32 AM | Last Updated on Sat, May 30 2020 12:27 PM

LOCUSTS Are On A WORLD TOUR Says Ram Gopal Varma On Twitter - Sakshi

హైదరాబాద్‌: సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై ఇప్పటివరకు కవితలు, పాటలు రాసిన వర్మ తాజాగా ఏకంగా ఓ సినిమాను తెరకెక్కిస్తూ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే వర్మ ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ నెటిజన్ల తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటికే వివిధ సమస్యలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే మిడతల రూపంలో కొత్త సమస్య వచ్చిచేరింది. మిడతల దండు పంటపొలాలను నాశనం చేస్తుండటం ప్రభుత్వాలకు తలపోటుగా మారింది. ఈ క్రమంలో మిడతల దండుపై తన దైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశాడు వర్మ. (ఈశ్వర్‌, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ)

వైరస్‌లు ప్రపంచంపై దాడి చేసిన అనంతరం ప్రస్తుతం మిడతలు అటాక్‌ చేస్తున్నాయని, తదుపరి ఏలియన్స్‌ దాడులు చేస్తాయా? అని ప్రశ్నిస్తూ వర్మ ట్వీట్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. ‘ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి’ అంటూ మరో సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమా తీయడానికి వర్మకు మరో సబ్జెక్ట్‌ దొరికిందని కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. ‘మిడతల దండు’ అనే సినిమా తీయండి అంటూ మరికొందరు వర్మకు సూచనలిస్తున్నారు. (ఆర్జీవీకి అభినందనలు: బిగ్‌బీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement