సాక్షి, ఆదిలాబాద్: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదిలాబాద్ జిల్లా సరిహద్దుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడతలు మరో రెండు రోజుల్లో ఆదిలాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు మిడతల దండును ఎదుర్కొనేందుకు అప్రమత్తమవుతున్నట్లు పేర్కొన్నారు. (రాష్ట్రంపైకి మిడతల దండు?)
(పొలాల వెంట మోగుతోన్న పోలీస్ సైరన్లు)
ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిడతలు పంటకు నష్టం కలిగించాయి. ఈ క్రమంలో గురువారం మిడతలు ఆంధ్రప్రదేశ్ అనంతపుర్ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో రాయదుర్గంలో వందల సంఖ్యల్లో ఈ రాకాసి మిడతలు క్షణాల్లో జిల్లేడి చెట్టు ఆకులను తినేయడం చూసి స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..)
Comments
Please login to add a commentAdd a comment