చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ‘గొప్ప ముందడుగు’ పేరిట 1958 నుంచి 1962 వరకు రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. అందులో ‘ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు’ సమూలంగా నిర్మూలించడం ఓ లక్ష్యం. ఆ లక్ష్యంలో చాలా వరకు విజయం సాధించినప్పటికీ చైనా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పిచ్చుకలు లేకుండా పోవడంతో చైనాలో మిడతల దాడులు పెరిగాయి. అంతకుముందు మిడతలు కనిపిస్తే పిచ్చుకలు వాటి వెంటబడి తినేవి. (మిడతలను పట్టే ‘మెథడ్స్’)
మిడతలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ మార్గలేమిటని చైనా ప్రభుత్వం అన్వేషించగా, అందుకు బాతులు బాగా పనికొస్తాయని తేలింది. దాంతో పెద్ద ఎత్తున బాతుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. లక్షలకు చేరుకున్న బాతులకు ‘డక్ ఆర్మీ’ అని పేరు పెట్టి మిడతల పైకి దాడికి పంపించేది. ఆ బాతులు మిడతల లార్వాలను, ఎగురలేని పిల్ల మిడతలను శుభ్రంగా తినేసేవి. నోటికందిన పెద్ద మిడతలను కూడా వదిలేవి కావు. (మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! )
మిడతల దండు దేశంలోని పంటలపైకి దాడికి వచ్చినప్పుడల్లా, ఇప్పటికీ ‘డక్ ఆర్మీ’ని చైనా ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం వినతిపై లక్ష బాతుల ఆర్మీని ఆ దేశానికి పంపించేందుకు గత ఫిబ్రవరి నెలలో చైనా ప్రభుత్వం అంగీకరించింది. అయితే పంపించిందీ, లేనిదీ కరోనా వార్తల పరంపరలో తెలియలేదు. (ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కుమ్మేశారు)
Comments
Please login to add a commentAdd a comment