Ducks
-
రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత
#RohitSharma Comeback- Hitman 5th T20I Century: అఫ్గనిస్తాన్ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ వైఫల్యాలను మరిపించేలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అఫ్గన్ బౌలర్ల ధాటికి సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ తానున్నానంటూ భరోసా ఇచ్చాడు. కాగా బెంగళూరులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పవర్ ప్లేలోనే యశస్వి జైస్వాల్(4), విరాట్ కోహ్లి(0), శివం దూబే(1), సంజూ శాంసన్(0) రూపంలో టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్‌కు తోడై దంచికొట్టిన రింకూ అప్పటికి జట్టుకు స్కోరు 30 పరుగులు మాత్రమే! అలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే.. ఏదేమైనా తగ్గేదేలే అన్నట్లు రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు. అగ్నికి ఆజ్యంలా రోహిత్‌కు తోడైన యంగ్ బ్యాటర్ రింకూ సింగ్(69 నాటౌట్) కూడా ధనాధన్ బ్యాటింగ్‌తో అఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్ శర్మ పరుగుల దాహం తీరలేదు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 అదే విధంగా.. రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు 1.రోహిత్ శర్మ(ఇండియా)- 5 2.సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 4 3.గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- 4. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్ కోహ్లి పేరిట(1570 రన్స్) ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. చదవండి: Ind vs Afg T20I: గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్లో ఇదే తొలిసారి -
ఏడాదిలో ఎంత మార్పు.. జాస్ బట్లర్ చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ అనుకున్న రీతిలో రాణించడం లేదు. గతేడాది ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన బట్లర్ ఐపీఎల్ 2023లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బట్లర్ డకౌట్ అయ్యాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బట్లర్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో బట్లర్ డకౌట్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఒక సీజన్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఇంతకముందు ఒక ఐపీఎల్ సీజన్లో ఒక బ్యాటర్ నాలుగుసార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు. తాజాగా బట్లర్ డకౌట్ల చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకముందు హర్షలే గిబ్స్(2009, డెక్కన్ చార్జర్స్), మిథున్ మన్హస్(2011, పుణే వారియర్స్), మనీష్ పాండే(2012, పుణే వారియర్స్), శిఖర్ ధావన్(2020, ఢిల్లీ క్యాపిటల్స్), ఇయాన్ మోర్గాన్(2021,కేకేఆర్), నికోలస్ పూరన్(2021, పంజాబ్ కింగ్స్) నాలుగేసి సార్లు డకౌట్ అయ్యారు. #JosButtler is the FIRST player to bag five ducks in an IPL season! 🦆🦆🦆🦆🦆#RR #PBKSvRR #IPL2023 pic.twitter.com/0O2B7Nca8Y — Circle of Cricket (@circleofcricket) May 19, 2023 Fifth duck for Jos Buttler in this season. A good start for PBKS. 📸: Jio Cinema#CricTracker #PBKSvRR #JosButtler pic.twitter.com/XZkJ8i95aM — CricTracker (@Cricketracker) May 19, 2023 చదవండి: #JiteshSharma: పంజాబ్ తరపున కొత్త సిక్సర్ల వీరుడు స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి! -
శాంసన్.. ప్లీజ్ ఇలాంటి రికార్డులు మనకొద్దు
టాలెంట్ ఉన్నా అవకాశాలు రాని ఆటగాడు సంజూ శాంసన్. జాతీయ మ్యాచ్‌ల్లో అవకాశాలు లేకున్నా ఐపీఎల్ ద్వారా తన ఆటను చూపిస్తున్న శాంసన్‌పై అభిమానం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో శాంసన్ గత రెండు మ్యాచ్‌లుగా ట్రాక్ తప్పినట్లుగా అనిపిస్తోంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగిన శాంసన్ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ ఐపీఎల్లో అనవసరమైన రికార్డును మూటగట్టుకున్నాడు. రాజస్తాన్ జట్టు తరపున అత్యధికసార్లు డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. తాజా దానితో కలిపి శాంసన్ 8 సార్లు డకౌట్ అయ్యాడు. శాంసన్ తర్వాత షేన్ వార్న్, స్టువర్ట్ బిన్నీలు ఏడు డకౌట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఐదు డకౌట్లతో అజింక్యా రహానే మూడో స్థానంలో ఉన్నాడు. ఇది చూసిన అభిమానులు.. '' శాంసన్ ప్లీజ్ ఇలాంటి రికార్డులు మనకొద్దు.. ''నీలాంటి టాలెంట్ ఆటగాడిని తొక్కేస్తున్నా మా మద్దతు ఎప్పుడు ఉంటుంది.. ఇలాంటి సమయంలో ఇలా ఆడి మా నమ్మకాన్ని కోల్పోనివ్వకు..'' అంటూ కామెంట్ చేశారు. Welcome to Jadeja Rescue Services - for two wickets, dial 8️⃣ 🤘#CSKvRR #TATAIPL #IPLonJioCinema | @ChennaiIPL @imjadeja pic.twitter.com/vqBQCQ6sgZ — JioCinema (@JioCinema) April 12, 2023 చదవండి: అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా
అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్ డకౌటైన షఫీక్ ఈ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకుముందు ఆఫ్గాన్‌తో తొలి టీ20లోనూ డకౌట్‌గా వెనుదిరగాడు. అదే విధంగా ఆఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లోనూ షఫీక్ డకౌటయ్యాడు. దీంతో ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడిన షఫీక్.. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి షఫీక్ కేవలం 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అదే విధంగా పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు -
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి!
తిరువనంతపురం: ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు బర్డ్ ఫ్లూ విజృంభణ.. వైరస్ల బెడదతో కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ కావడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించాయి. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించాయి. తకాళి పంచాయితీ పరిధితో పాటు హరిప్పడ్ మునన్సిపాలిటీలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్ని కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సరిహద్దు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో రెండు కేసులు.. -
పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు
న్యూఢిల్లీ: పని ఒత్తిడితో సతమవుతు ఉన్నారా.! పైగా అస్సలు సంతోషంగా ఉండే అవకాశం కూడా లేదని బాధపడిపోతూ కూర్చొకండి. ఇదే సరైన సమయం ఈ వీడియో చూడగానే మీ ఒత్తిడి దూరం అవుతుంది. ఒక్కసారి మీ ముఖంలో చిరునవ్వు తప్పక తొంగి చూస్తుంది. అసలు ఏం ఉందబ్బా ఈ వీడియోలో అని సందేహంతో ఉన్నారా!. (చదవండి: ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ) అసలు విషయంలోకెళ్లితే...అందమైన పసుపు రంగు బాతులు ముద్దు ముద్దుగా ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఎంతో అద్భుతంగా చూడ ముచ్చటగా ఉంది. అంతేకాదు ఒక్కసారిగా ఒత్తిడి మరిచిపోయి ఆనందంగా మైమరచి చూస్తాం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు ఇది ప్రకృతి అందం కదా అంటూ రకరకాలుగా ట్వీట్‌చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) -
వైరల్‌గా మారిన బాతు, పిల్లల దాగుడుమూతల వీడియో
చిన్నపిల్లలు దాగుడుమూతలు ఆడటం మనం చూసుంటాం. కాకపోతే ఈ వీడియోను చూస్తే మాత్రం.. ఈ ఆట కేవలం మనుషులకు మాత్రమే కాదు, బాతులు కూడా ఆడుకుంటాయా? అనిపిస్తుంది. అలాంటి ఫన్నీ వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు షేర్ చేయగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. జంతువుల ఆటలు, సరదాగా చేసిన పనుల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బాతు, తన పిల్లల వీడియో విషయానికి వస్తే.. 24 సెకన్ల నిడివ గల ఈ వీడియోలో.. నీటి కొలనులో ఉన్న బాతు పిల్లలు తన తల్లి దగ్గరికి వెళ్తుంటాయ్. అవి అలా దగ్గరకు వెళ్లిన ప్రతీసారి తల్లి బాతు తన పిల్లలకు కనపడకుండా నీటిలో మునిగి దాక్కుంటోంది. ఇలా మూడు సార్లు తన పిల్లలతో ఆ తల్లి బాతు ఆటలాడుతుంది. చూడటానికి అచ్చం మన పిల్లలు ఆడే హైడ్ అండ్ సీక్ లానే ఉన్న ఈ సరదా వీడిలో చాలా ఫన్నీగా ఉండడంతో సోషల్ మీడియా యూజర్లకు వీపరీతంగా నచ్చేసింది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్‌తో దూసుకుపోతోంది. తన పిల్లలకు నీటిలో ఎలా మునగాలో తల్లి ట్రైనింగ్ ఇస్తుందని కొందరు, మనషుల నుంచి ఎలా తప్పించుకోవాలో తర్ఫీదునిస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మాతృ దేవో భవ.. తల్లే తొలి గురువు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Mommy playing seek and hide.. 😅 pic.twitter.com/ewWivaghfa — Buitengebieden (@buitengebieden_) June 29, 2021 చదవండి: మనుషుల కంటె ఏనుగులే నయం.. వైరల్ వీడియో.. -
పూరన్ చెత్త రికార్డు.. ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు?
అహ్మదాబాద్: ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జేమిసన్ బౌలింగ్‌లో పూరన్ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో పూరన్ డకౌట్ల సంఖ్య నాలుగు చేరింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు డకౌట్ అయి అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ సీజన్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచిన పూరన్.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడిగా నిలిచాడు. గిబ్స్(2009), మిథున్ మన్హాస్ (2011), మనీష్ పాండే(2012), శిఖర్ ధావన్(2020)లు వివిధ సందర్భాల్లో నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు డకౌట్ అయ్యారు. తాజాగా ఆ లిస్టులో పూరన్ కూడా చేరిపోయాడు. ఇక పూరన్ ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా 0,0,1, 9,0,19,0 మొత్తంగా 21 పరుగులు చేసి దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇంత దారుణంగా విఫలమవుతున్న పూరన్‌ను పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఎందుకు చోటు కల్పిస్తుందో అర్థం కావడం లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికైనా పంజాబ్ కళ్లు తెరిచి పూరన్ స్థానంలో మలాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. చదవండి: అందుకే మయాంక్‌ను పక్కనపెట్టాం -
కోహ్లి కథ ముగిసినట్టేనా..!
-
కోహ్లి కథ ముగిసినట్టేనా..!
అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మొదటి టీ 20లో ఐదు బంతులాడిన కోహ్లి పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 13 సార్లు డకౌట్ అయిన రికార్డును చెరిపేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 14 సార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, అదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, క్రిస్ జోర్డాన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే గతంలో మహేంద్ర సింగ్ ధోని 11 సార్లు, కపిల్ దేవ్ 10 సార్లు, మహ్మద్ అజారుద్దీన్ 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. చదవండి: (తొలి టీ20 : ఇంగ్లండ్ ఘన విజయం) -
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?
పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ –ఏ వైరస్లు వ్యాధి కారకాలు. కోవిడ్–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్’’, ‘‘ఎన్’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. మనుషులకూ సోకుతుందా? మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్5, హెచ్7, హెచ్9 రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు. ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు. ఎలాంటి పక్షులకు సోకుతుంది? కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
వైరల్: పెద్దపులినే బురిడి కొట్టించిన బాతు
జంతువులను వేటాడటంలో పులులకు సాటైన జంతువులు లేవు. పులి ఏ జంతువును వేటాడిన అది దానికి ఆహరం కావాల్సిందే. అలాంటి పెద్దపులినే ఓ చిన్ని బాతు ఆటాడుకుంది. దాన్ని తినేందుకు వచ్చిన పులిని బాతు బురిడి కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తొమ్మిది సెకన్ల నిడివి గల వీడియోను ట్విటర్ యూజర్ ఒకరు బుధవారం షేర్ చేశాడు. ‘గ్రేట్ ఎస్కెప్’ అనే క్యాప్సన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు గంట వ్వవధిలో 26 వేల వ్యూస్.. వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: 800 కిలోల భారీ చేప..వీడియో వైరల్) The great escape.. pic.twitter.com/OybbvAdahr — Buitengebieden (@buitengebieden_) July 28, 2020 ‘ఆ బాతు చాలా తెలివిగా తప్పించుకుంది’ అని, ‘పులులు ఎంత పెద్దవైనప్పటికి అవి ఎప్పటికీ అంతే’ అంటూ చమత్కారంగా నెటిజన్లను కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో బాతును వేటాడేందుకు నీటిలో నెమ్మదిగా బాతు వైపు వెళ్తుంది పెద్దపులి. పులిని గమనించిన ఆ బాతు అది దగ్గరకు రాగానే వెంటనే నీటిలోకి మునిగింది. ఇక బాతు ఎటువైపు వెళ్లీందో తెలియక పెద్దపులి అయోమయంలో పడింది. బాతు ఒక్కసారిగా నీటిలో మునగడంతో పెద్దపులికి ఏం జరిగిందో అర్థం కాక అటూ ఇటూ వెతుకుతున్న ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. (చదవండి: సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!) -
మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’
చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ‘గొప్ప ముందడుగు’ పేరిట 1958 నుంచి 1962 వరకు రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేసింది. అందులో ‘ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు’ సమూలంగా నిర్మూలించడం ఓ లక్ష్యం. ఆ లక్ష్యంలో చాలా వరకు విజయం సాధించినప్పటికీ చైనా అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పిచ్చుకలు లేకుండా పోవడంతో చైనాలో మిడతల దాడులు పెరిగాయి. అంతకుముందు మిడతలు కనిపిస్తే పిచ్చుకలు వాటి వెంటబడి తినేవి. (మిడతలను పట్టే ‘మెథడ్స్’) మిడతలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ మార్గలేమిటని చైనా ప్రభుత్వం అన్వేషించగా, అందుకు బాతులు బాగా పనికొస్తాయని తేలింది. దాంతో పెద్ద ఎత్తున బాతుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. లక్షలకు చేరుకున్న బాతులకు ‘డక్ ఆర్మీ’ అని పేరు పెట్టి మిడతల పైకి దాడికి పంపించేది. ఆ బాతులు మిడతల లార్వాలను, ఎగురలేని పిల్ల మిడతలను శుభ్రంగా తినేసేవి. నోటికందిన పెద్ద మిడతలను కూడా వదిలేవి కావు. (మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! ) మిడతల దండు దేశంలోని పంటలపైకి దాడికి వచ్చినప్పుడల్లా, ఇప్పటికీ ‘డక్ ఆర్మీ’ని చైనా ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం వినతిపై లక్ష బాతుల ఆర్మీని ఆ దేశానికి పంపించేందుకు గత ఫిబ్రవరి నెలలో చైనా ప్రభుత్వం అంగీకరించింది. అయితే పంపించిందీ, లేనిదీ కరోనా వార్తల పరంపరలో తెలియలేదు. (ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కుమ్మేశారు) -
పాక్ పై మిడతల యుద్ధం
-
‘మన కంటే బాతులే నయం.. ఏం క్రమశిక్షణ!’
తిరువనంతపురం: విదేశాల్లో అయితే కేవలం వాహనాల వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ మన దేశంలో మాత్రం .. వర్షం పడినా, తాగి రోడ్డు మీదకొచ్చి రచ్చ చేసే ఘటనలు సహా ఏ చిన్న సంఘటన జరిగినా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడప్పుడు ఈ లిస్ట్‌లోకి జంతువులు కూడా చేరతాయి. జంతువులు రోడ్డు ఎక్కాయంటే ఎంత భారీ వాహనం అయినా సరే ఆగిపోవాల్సిందే. ఆవులు, గేదెలు రోడ్డు మీదకు వచ్చి ట్రాఫిక్ జామ్ సృష్టించడం మన దేశంలో సర్వ సాధారణంగా కనిపించే దృశ్యం. కేరళలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రద్దీగా ఉండే రోడ్డు మీదకు బాతుల గుంపు ఒకటి రావడంతో.. కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పదుల సంఖ్యలో బాతులు రోడ్డు మీదకు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. అయితే ట్రాఫిక్ జామ్‌కు కారణమైనప్పటికీ బాతులు మనకు క్రమశిక్షణ నేర్పాయంటూ వాటిపై ప్రశంసలు కురిపించడం విశేషం.‘మనకంటే బాతులే నయం.. ఎంత క్రమశిక్షణగా రోడ్డు దాటాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A different type of traffic jam in #Kerala #DuckTales pic.twitter.com/OP1hoghxuP — Amush Booshe (@guffawer) July 25, 2019 -
క్రికెట్లో చెత్త రికార్డు.. అందరూ డకౌట్!
పెరింథల్‌మన్న: క్రికెట్ మ్యాచ్‌లలో అరుదైన రికార్డులతో పాటు చెత్త రికార్డులు నమోదు చేయడమూ సహజమే. ఒక క్రికెట్ జట్టులోని పది మంది సభ్యులు డకౌట్ కావడం గల్లీ క్రికెట్లో కూడా చూసి ఉండకపోవచ్చు. అయితే మొత్తం జట్టలోని సభ్యులు ఎవరూ పరుగులు ఖాతా తెరవకపోవడం మాత్రం ఔరా అనిపించక మానదు. ఈ తరహా ఘటన కేరళ క్రికెట్లో చోటు చేసుకుంది.అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం కేరళలోని మలప్పురం జిల్లా పెరింథల్‌మన్న స్టేడియంలో వాయనాడ్, కాసరగోడ్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాసరగాడ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు వీక్షిత, చైత్ర రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. ఒక్క పరుగు కూడా చేయలేదు. ఇక మూడో ఓవర్ నుంచి కాసరగాడ్ పతనం మొదలైంది. వాయనాడ్ కెప్టెన్ నిత్య లూర్ధ్ మూడో ఓవర్లో 3 వికెట్లు తీశారు. తర్వాతి ఓవర్లలో మరో 3 వికెట్లను కాసరగోడ్ చేజార్చుకుంది. మరో బౌలర్ జోషిత ఐదు బంతుల్లో హ్యాట్రిక్ తీసి మొత్తం 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో 10 మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇక నాటౌట్‌గా నిలిచిన 11వ బ్యాటర్ ఖాతా తెరవలేదు. వయనాడ్ బౌలర్లు నాలుగు రన్స్ ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడంతో కాసరగోడ్ 5 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. కాగా, విజయానికి కావాల్సిన ఐదు పరుగులను మొదటి ఓవర్లోనే సాధించిన వయనాడ్ పది వికెట్లతో ఘన విజయం సాధించింది. -
గడ్డిపొదలో బాతుపిల్ల
పిల్లల కథ భూపాల్, నటుడు, రచయిత చెరువు అంచుకు ఊరు ఉంది. ఆ ఊరుకొనకు ఒక ఇంట్లో బాతులున్నాయి. బాతు ఒకటి పది పిల్లలు చేసింది. ఒకరోజు అది తన పది పిల్లలను తోల్కొని చెరువుకు పొయ్యి ‘ఈత’ కొట్టేది ఎట్లనో నేర్పించవలెనని అనుకుంది. తెల్లారెగట్ల పిల్లలను తోల్కొని చెరువు దిక్కు నడిచింది. ఆ బాతు పిల్లలన్నింట్ల ‘బేక్‌బేక్’ అనే పేరున్న పిల్ల.... మహా అల్లరి చేస్తుంటది. ఒక్కతాన ఉండదు. కొంటె చేష్ట లెక్కువ.అన్ని పిల్లలు ఒక తాన చేరి తల్లి ముంగటనే ఈత కొడుతుంటే.... ఈ ‘బేక్ బేక్’ తల్లిని కాదని మెల్లెగ పక్కకు జారుకుంది. చెరువు నడుమకు పోయింది. చెరువుల అక్కడక్కడ గడ్డిపొదలున్నాయి. తుంగ పెరిగివుంది. బేక్బేక్కు ఉషారు ఎక్కువైంది. నీళ్లల్ల ఈదుకుంట, ఎగురుకుంట గడ్డి పొదల దిక్కుపొయ్యింది. అనుకోకుండ పొదల చిక్కుకుంది. దాన్ని గడ్డి చుట్టేసింది. బయటకు యెల్దామంటే కష్టమైంది. ఇగ ఏం జెయ్యాలెనో తోచక అది ఏడువసాగింది. ఆ ఏడుపు చప్పుడు అక్కడికి కొంచెం దూరమున్న చెరువు గట్టుకు వినపడుతుంది. ఆ గట్టు అంచున తొర్రలో ఉన్న ఎండ్రికాయ బయటకొచ్చి చూసింది. బేక్‌బేక్ బాధ దానికి తెలిసింది. మెల్లగా ఈదుకుంటూ దాని దెగ్గరికి పోయి, తన కత్తెర చేతులతో గడ్డిని కత్తిరించింది. బేక్‌బేక్ బయటికొచ్చింది. నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పింది. ఇక్కడ ఇట్లావుంటే.... అక్కడ తల్లిబాతు, మిగతా పిల్లలు బేక్‌బేక్ కోసం దేవులాట మొదలుపెట్టినయి. తల్లిబాతు ఆ పిల్లలను ఒకతాన్నే ఉండుమని చెప్పి, దేవులాడుకుంట గడ్డి పొదల దిక్కువస్తుంది. అప్పుడే తనూ బయలుదేరిన బేక్‌బేక్ తల్లిని చూసి ఎంతో మురిసిపోయింది. తల్లి తిడుతుందేమోనని ముందే తన పొరపాటు ఒప్పుకుంది. క్షమించమంది. ఎండ్రికాయ చేసిన సహాయం గురించి చెప్పింది. ప్రమాదం తప్పింది అన్నది. ఇప్పటి నుంచి భద్రంగా వుంటాననీ, పిచ్చిపిచ్చి లొల్లిమానుకుంటాననీ అన్నది.