అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆదివారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్ డకౌటైన షఫీక్ ఈ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకుముందు ఆఫ్గాన్‌తో తొలి టీ20లోనూ డకౌట్‌గా వెనుదిరగాడు.
అదే విధంగా ఆఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన రెండు టీ20ల్లోనూ షఫీక్ డకౌటయ్యాడు. దీంతో ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడిన షఫీక్.. అందులో నాలుగు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి షఫీక్ కేవలం 7 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అదే విధంగా పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం.
చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు
Comments
Please login to add a commentAdd a comment