IPL 2023, CSK Vs RR: శాంసన్‌.. ప్లీజ్‌ ఇలాంటి రికార్డులు మనకొద్దు | Sanju Samson Registers Unwanted Record As He Gets Duck Out - Sakshi
Sakshi News home page

Sanju Samson: శాంసన్‌.. ప్లీజ్‌ ఇలాంటి రికార్డులు మనకొద్దు

Published Wed, Apr 12 2023 8:50 PM | Last Updated on Thu, Apr 13 2023 11:17 AM

Sanju Samson 8 Ducks-Worst Record Most Ducks For RR In IPL - Sakshi

Photo: IPL Twitter

టాలెంట్‌ ఉన్నా అవకాశాలు రాని ఆటగాడు సంజూ శాంసన్‌. జాతీయ మ్యాచ్‌ల్లో అవకాశాలు లేకున్నా ఐపీఎల్‌ ద్వారా తన ఆటను చూపిస్తున్న శాంసన్‌పై అభిమానం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో శాంసన్‌ గత రెండు మ్యాచ్‌లుగా ట్రాక్‌ తప్పినట్లుగా అనిపిస్తోంది.

తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. బుధవారం సీఎస్‌కేతో మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగిన శాంసన్‌ డకౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ ఐపీఎల్‌లో అనవసరమైన రికార్డును మూటగట్టుకున్నాడు. రాజస్తాన్‌ జట్టు తరపున అత్యధికసార్లు డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాడిగా శాంసన్‌ నిలిచాడు. తాజా దానితో కలిపి శాంసన్‌ 8 సార్లు డకౌట్‌ అయ్యాడు.

శాంసన్‌ తర్వాత షేన్‌ వార్న్‌, స్టువర్ట్‌ బిన్నీలు ఏడు డకౌట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఐదు డకౌట్లతో అజింక్యా రహానే మూడో స్థానంలో ఉన్నాడు. ఇది చూసిన అభిమానులు.. '' శాంసన్‌ ప్లీజ్‌ ఇలాంటి రికార్డులు మనకొద్దు.. ''నీలాంటి టాలెంట్‌ ఆటగాడిని తొక్కేస్తున్నా మా మద్దతు ఎప్పుడు ఉంటుంది.. ఇలాంటి సమయంలో ఇలా ఆడి మా నమ్మకాన్ని కోల్పోనివ్వకు..'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement