
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ మళ్లీ టాప్‌ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండు ఓటములతో డీలా పడిన రాజస్తాన్ సీఎస్‌కేపై విక్టరీతో మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కినట్లే. ఇక రాజస్తాన్ రాయల్స్‌కు సీఎస్‌కేపై గత ఏడు మ్యాచ్‌ల్లో ఇది ఆరో విజయం కావడం విశేషం. దీన్నిబట్టి సీఎస్‌కేపై రాజస్తాన్ ఆధిపత్యం ఎంతలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.
ఇక సీఎస్‌కేతో మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్‌కు ఐపీఎల్‌లో 200వ మ్యాచ్ కావడం విశేషం. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శనతో జట్టుకు గుర్తుండిపోయే విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్‌లో యశస్వి జైశ్వాల్, ద్రువ్ జురేల్, దేవదత్ పడిక్కల్‌లు రాణించగా.. బౌలింగ్‌లో ఆడమ్ జంపా, అశ్విన్‌లు చెలరేగారు.
ఇక సందీప్ శర్మ తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ వికెట్లు తీయకున్న తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి బలమైన సీఎస్‌కేపై నెగ్గిన రాజస్తాన్ విజయంతో మరోసారి టాప్‌లోకి దూసుకెళ్లింది. రానున్న మ్యాచ్‌ల్లో ఇదే ప్రదర్శనను కనబరిచి టైటిల్ గెలవాలని ఆశిద్దాం.
Back to winning ways! 💗💗💗 pic.twitter.com/T3Yp0mEXq8
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2023