
Photo: IPL Twitter
మూడు పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ గెలుపు
సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కాన్వే 50 పరుగులతో రాణించగా.. ఆఖర్లో ధోని 17 బంతుల్లో 32 నాటౌట్, జడేజా 15 బంతుల్లో 25 నాటౌట్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు.
అయితే ఆఖరి ఓవర్‌లో సందీప్ శర్మ చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో సీఎస్‌కే ఓటమి చవిచూసింది. అయితే సీఎస్‌కే మ్యాచ్ ఓడినా ధోని మాత్రం తన వింటేజ్ ఆటతో అభిమానులను అలరించాడు. రాజస్తాన్ బౌలర్లలో
చహల్, అశ్విన్‌లు రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, ఆడమ్ జంపా చెరొక వికెట్ తీశారు.
19 ఓవర్లలో సీఎస్‌కే 155/6
19 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జడేజా 24, ధోని 18 పరుగులతో ఆడుతున్నారు. సీఎస్‌కే విజయానికి ఆరు బంతుల్లో 20 పరుగులు కావాలి.
రాయుడు(1) ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే తడబడుతుంది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 104 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాయుడు హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
8 ఓవర్లలో సీఎస్‌కే 61/1
8 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. కాన్వే 30, అజింక్యా రహానే 22 పరుగులతో ఆడుతున్నారు. రుతురాజ్ 8 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
4 ఓవర్లలో సీఎస్‌కే 26/1
4 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కాన్వే 8, అఇంక్యా రహానే 9 పరుగులతో ఆడుతున్నారు. రుతురాజ్ 8 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
సీఎస్‌కే టార్గెట్ 176
సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దేవదత్ పడిక్కల్ 38 పరుగులు చేశాడు. అశ్విన్ 22 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖర్లో హెట్‌మైర్ 18 బంతుల్లో 30 నాటౌట్ మెరవడంతో రాజస్తాన్ గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. సీఎస్‌కే బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.
బట్లర్(52) ఔట్.. ఐదో వికెట్ డౌన్
52 పరుగులు చేసిన బట్లర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ 143 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హెట్‌మైర్ 3, జురేల్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.
13 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 110/3
13 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 44, అశ్విన్ 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కెప్టెన్ సంజూ శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
దేవదత్ పడిక్కల్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
దేవదత్ పడిక్కల్(38 పరుగులు) రూపంలో రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బట్లర్ 34 పరుగులతో ఆడుతున్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 5 ఓవర్లలో 45/1
5 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట నష్టానికి 45 పరుగులు చేసింది. అంతకముందు 10 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్-2023 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 12) మరో రసవత్తర సమరం జరుగునుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన సీఎస్‌కే ఫీల్డింగ్ ఎంచుకుంది.
𝐓𝐡𝐚𝐥𝐚 @msdhoni wins the 🪙 in his 200th #TATAIPL match as a #CSK skipper & elects to bowl first 🤩
Predict the score @rajasthanroyals will put up & stream #CSKvRR - LIVE & FREE on #IPLonJioCinema - on all telecom operators!#IPL2023 | @ChennaiIPL pic.twitter.com/ztDcrB1iSB
— JioCinema (@JioCinema) April 12, 2023
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్/వికెట్ కీపర్), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెరి రెండిటిలో గెలుపొందాయి. ఇక గత రికార్డులు పరిశీలిస్తే.. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు జరగ్గా.. 15 సీఎస్‌కే నెగ్గగా.. 11 మ్యాచ్‌లు రాజస్తాన్ గెలిచింది.