జంతువులను వేటాడటంలో పులులకు సాటైన జంతువులు లేవు. పులి ఏ జంతువును వేటాడిన అది దానికి ఆహరం కావాల్సిందే. అలాంటి పెద్దపులినే ఓ చిన్ని బాతు ఆటాడుకుంది. దాన్ని తినేందుకు వచ్చిన పులిని బాతు బురిడి కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తొమ్మిది సెకన్ల నిడివి గల వీడియోను ట్విటర్ యూజర్ ఒకరు బుధవారం షేర్ చేశాడు. ‘గ్రేట్ ఎస్కెప్’ అనే క్యాప్సన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు గంట వ్వవధిలో 26 వేల వ్యూస్.. వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: 800 కిలోల భారీ చేప..వీడియో వైరల్)
The great escape.. pic.twitter.com/OybbvAdahr
— Buitengebieden (@buitengebieden_) July 28, 2020
‘ఆ బాతు చాలా తెలివిగా తప్పించుకుంది’ అని, ‘పులులు ఎంత పెద్దవైనప్పటికి అవి ఎప్పటికీ అంతే’ అంటూ చమత్కారంగా నెటిజన్లను కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో బాతును వేటాడేందుకు నీటిలో నెమ్మదిగా బాతు వైపు వెళ్తుంది పెద్దపులి. పులిని గమనించిన ఆ బాతు అది దగ్గరకు రాగానే వెంటనే నీటిలోకి మునిగింది. ఇక బాతు ఎటువైపు వెళ్లీందో తెలియక పెద్దపులి అయోమయంలో పడింది. బాతు ఒక్కసారిగా నీటిలో మునగడంతో పెద్దపులికి ఏం జరిగిందో అర్థం కాక అటూ ఇటూ వెతుకుతున్న ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. (చదవండి: సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!)
Comments
Please login to add a commentAdd a comment