Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ అనుకున్న రీతిలో రాణించడం లేదు. గతేడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన బట్లర్ ఐపీఎల్ 2023లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
తాజాగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బట్లర్ డకౌట్ అయ్యాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బట్లర్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్ డకౌట్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి.
ఒక సీజన్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఇంతకముందు ఒక ఐపీఎల్ సీజన్‌లో ఒక బ్యాటర్ నాలుగుసార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు. తాజాగా బట్లర్ డకౌట్ల చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకముందు హర్షలే గిబ్స్(2009, డెక్కన్ చార్జర్స్), మిథున్ మన్హస్(2011, పుణే వారియర్స్), మనీష్ పాండే(2012, పుణే వారియర్స్), శిఖర్ ధావన్(2020, ఢిల్లీ క్యాపిటల్స్), ఇయాన్ మోర్గాన్(2021,కేకేఆర్), నికోలస్ పూరన్(2021, పంజాబ్ కింగ్స్) నాలుగేసి సార్లు డకౌట్ అయ్యారు.
#JosButtler is the FIRST player to bag five ducks in an IPL season!
— Circle of Cricket (@circleofcricket) May 19, 2023
🦆🦆🦆🦆🦆#RR #PBKSvRR #IPL2023 pic.twitter.com/0O2B7Nca8Y
Fifth duck for Jos Buttler in this season.
— CricTracker (@Cricketracker) May 19, 2023
A good start for PBKS.
📸: Jio Cinema#CricTracker #PBKSvRR #JosButtler pic.twitter.com/XZkJ8i95aM
చదవండి: #JiteshSharma: పంజాబ్ తరపున కొత్త సిక్సర్ల వీరుడు
స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి!
Comments
Please login to add a commentAdd a comment