ఐపీఎల్-2023లో ప్లేఆప్స్ ఆశలను రాజస్తాన్ రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ ఐదో స్థానానికి చేరుకుంది. అయితే ఆర్సీబీని అధిగమించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకడంలో విఫలమైంది.
రాజస్తాన్ ఖాతాలో ప్రస్తుతం 14 పాయింట్ల ఉన్నాయి. 188 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 18.5 ఓవర్లలో ఛేజ్ చేసి ఉంటే.. మెరుగైన రన్‌రేట్‌తో ఆర్సీబీ అధిగమించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరేది. కానీ ఈ టార్గెట్‌ను 19.4 ఓవర్లలో ఛేదించింది. కాగా రాజస్తాన్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆర్‌సీబీ, ముంబై జట్ల గెలుపుఓటములపై ఆధారపడి ఉంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు.
పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శాంసన్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్‌ను హెట్‌మైర్ 18.5 ఓవర్లలో ముగిస్తాడని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. మా జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో మా స్థానాన్ని చూస్తుంటే కొంచెం షాక్‌గా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో మేము ఒత్తిడి కారణంగా ఓడిపోయాం.
జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు తన వంతు సహకారం అందిస్తున్నాడు. అతడు మ్యాచ్ మ్యాచ్‌కు మరింత మెరుగవుతున్నాడు. యశస్వీ 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడు. ఇక బౌల్ట్ ప్రతీసారి మాకు తొలి ఓవర్‌లో వికెట్‌ను అందిస్తున్నాడు" అని చెప్పుకొచ్చాడు.
చదవండి: WTC FINAL 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో బిగ్‌షాక్!
Comments
Please login to add a commentAdd a comment