#RohitSharma Comeback- Hitman 5th T20I Century: అఫ్గనిస్తాన్ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ వైఫల్యాలను మరిపించేలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
అఫ్గన్ బౌలర్ల ధాటికి సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ తానున్నానంటూ భరోసా ఇచ్చాడు. కాగా బెంగళూరులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పవర్ ప్లేలోనే యశస్వి జైస్వాల్(4), విరాట్ కోహ్లి(0), శివం దూబే(1), సంజూ శాంసన్(0) రూపంలో టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది.
రోహిత్‌కు తోడై దంచికొట్టిన రింకూ
అప్పటికి జట్టుకు స్కోరు 30 పరుగులు మాత్రమే! అలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే.. ఏదేమైనా తగ్గేదేలే అన్నట్లు రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు. అగ్నికి ఆజ్యంలా రోహిత్‌కు తోడైన యంగ్ బ్యాటర్ రింకూ సింగ్(69 నాటౌట్) కూడా ధనాధన్ బ్యాటింగ్‌తో అఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్ శర్మ పరుగుల దాహం తీరలేదు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
Rohit Sharma 🤝 Rinku Singh
— BCCI (@BCCI) January 17, 2024
OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE
అదే విధంగా.. రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు
1.రోహిత్ శర్మ(ఇండియా)- 5
2.సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 4
3.గ్లెన్ మాక్స్‌వెల్(ఆస్ట్రేలియా)- 4.
🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏
— BCCI (@BCCI) January 17, 2024
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD
కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్ కోహ్లి పేరిట(1570 రన్స్) ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు.
చదవండి: Ind vs Afg T20I: గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్‌లో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment