హెలికాప్టర్‌లో జిల్లాకు చేరిన కమిటీ సభ్యులు
ఎదులాపురం (ఆదిలాబాద్): మిడతల దండు విషయంలో రాష్ట్ర రైతులు ఆందోళన చెందవద్దని, వివి ధ మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని కీటక శాస్త్రజ్ఞుడు ఎస్‌జే రహమాన్ అన్నారు. మిడతలు రాష్ట్రంలో ప్రవేశించేలోపు తీసుకోవాల్సిన ముం దస్తు చర్యల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన కమిటీ సభ్యులు ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా ఆదిలాబా ద్ జిల్లాకు చేరుకున్న కమిటీ సభ్యులు రాష్ట్ర సరిహ ద్దు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంతోపాటు నిర్మల్ జిల్లాలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మం దిరంలో కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యుడు, కీటక శాస్త్రవేత్త రహమాన్ మాట్లాడుతూ మిడతలు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ప్రవేశించేందుకు ఆస్కారం ఉందో అంచనా వేసేందుకు ఈ ఏరియల్ సర్వే చేపట్టామన్నారు. ఆయన వెంట కమిటీ సభ్యురా లు, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఆర్.సునీత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment