తిరుపతి తుడా: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్‌కు శాటిలైట్ సహాయం తీసుకోనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులతో ఢిల్లీకి చెందిన లీ కన్సల్టెన్సీ బృందం అధికారులతో చర్చించి ప్లాన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఆరు నెలలుగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు తుడా కృషి చేస్తోంది. ఎట్టకేలకు ఢిల్లీకి చెందిన లీ కన్సల్టెన్సీ బృందం తుడా మాస్టర్ ప్లాన్‌కు ముందుకొచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో తొమ్మిది నెలల కాల వ్యవధికి తుడాకు మాస్టర్ ప్లాన్ పూర్తి చేసిచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధుల బృందం సమావేశమై చర్చించింది. శనివారం రోజున మరోసారి లీ బృందం తుడా అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో శాటిలైట్, ఏరియల్ సర్వేపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది.
తుడా పరిధిలోకి తొమ్మిది మండలాలు (తిరుపతి అర్బన్,రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, వడమాలపేట, రామచంద్రాపురం, పుత్తూరు మండలాలు) వస్తాయి. ఈ తొమ్మిది మండలాలను కలుపుతూ తుడా మాస్టర్ ప్లాన్ కోసం లీ బృందం శాటిలైట్ సహాయం తీసుకోనుంది. అదేవిధంగా ఆగస్టు మూడో వారంలోపు ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందుకు లీ బృందం తుడా సహకారం కోరినట్టు అధికారులు తెలిసింది.
ఆగస్టులో పర్యటన
తుడా మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి లీ కన్సల్టెన్సీ బృందం ఆగస్టు మూడోవారంలో పూర్తి స్థాయిలో పర్యటించనునంది. ఆ సంస్థకు చెందిన ప్రధాన బృందం ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి తుడా పరిధిని పర్యవేక్షిస్తారు. తుడా పరిధిలోని గ్రామాలు, ప్రధాన రోడ్లు, ైరె ల్వే మార్గాలు, చెరువులు, కాలువలు, భూముల వివరాలతో పక్కా మాస్టర్ ప్రింట్‌ను సిద్ధం చేయనున్నారు. మూడు నెలల్లో ముందుగా బ్లూప్రింట్ సిద్ధం చేయాలి తుడా వీసీ లీ కన్సల్టెన్సీని ఆదేశించారు.
శాటిలైట్ సాయంతో తుడా మాస్టర్ ప్లాన్
Published Mon, Aug 3 2015 2:14 AM | Last Updated on Tue, Aug 28 2018 5:59 PM
Advertisement
Advertisement