సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో బుధవారం సింగపూర్ సాంకేతికసభ్యుల బృందం ఏరియల్ సర్వే కూడా చంద్రబాబు చీకటి ఒప్పందాల తరహాలోనే సాగింది. ఉదయం 11 గంటలలోపు రాజధాని ప్రతిపాదిత గ్రామాలపై ఆకాశంలో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇదే సమయంలో రైతులను మోసం చేసే విధంగా మీడియాలో ప్రకటనలు వెలువడ్డాయి.
ఏరియల్ సర్వే రద్దయిందని తొలి ప్రకటన వచ్చిన అరగంటలోపే సర్వే పూర్తయిందని మరో ప్రకటన వెలువడడం రైతులను వంచనకు గురి చేయడం మినహా మరొకటి కాదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. రాజధాని భూముల సమీకరణతోపాటు, సింగపూర్ బృందం ఏరియల్ సర్వే కూడా గోప్యంగా జరగడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని రైతులతోపాటు, ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు రైతులతో దొంగాట ఆడుతున్నారని విమర్శించారు.
సింగపూర్ బృందం ఏరియల్ సర్వేను వ్యతిరేకిస్తూ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రైతులంతా నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు, నల్ల జెండాలతో డాబాలు ఎక్కి నిరస న తెలిపారు. అనంతరం సమావేశమైన రైతులనుద్దేశించి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడారు.
రాజధాని నిర్మాణ విషయంలో చంద్ర బాబు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ప్రతిపక్షంతో పాటు, తెలుగుదేశం అభిమానులు సైతం వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సింగపూర్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు, ర హస్య మంతనాలు జరుపుతున్న చంద్రబాబు భూములు ఇవ్వబోమని చెపుతున్న రైతులు, గ్రామాల జోలికి రాకుంటే మంచిదని హెచ్చరించారు.
తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కా దని, అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పారని ఆర్కే ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సింగపూర్ కంపెనీలకు చెప్పిన మాయ మాటలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఏరియల్ సర్వేకు మొగ్గు చూపినట్టు అర్థమవుతుందన్నారు. సింగ పూర్ బృందం ఎప్పుడు వచ్చినా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.
ైరె తులంటే అంత అలుసా...?
రైతులంటే చంద్రబాబుకు ఎంత అలుసో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని ఆర్కే అన్నారు. ఒకసారి ‘మట్టి పిసుక్కునే రైతులు’ అని, మరోసారి ‘ఎర్ర చందనం దొంగలు’ అంటూ పోల్చడం దారుణమన్నారు.
రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలనే ప్రభుత్వాన్ని చూస్తుంటే, ఎవరిని ఎర్ర చందనం దొంగలతో పోల్చవచ్చో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశాన్ని తాకట్టు పెట్టినట్టు నేడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని సింగపూర్, జపాన్‌లకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్కే తీవ్రంగా ధ్వజమెత్తారు.
గగనాన చంద్ర వంచన
Published Thu, Dec 11 2014 12:43 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement