
హెలికాప్టర్లో పేపర్ చదువుతున్న సీఎం కుమారస్వామి
యశవంతపుర: ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వరద బాధిత జిల్లాల్లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే సమయంలో దినపత్రిక చదవడం విమర్శలకు తావిస్తోంది. విహంగ వీక్షణంలో పేపర్‌ను చూస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సీఎం వైఖరిపై విమర్శలు తప్పడం లేదు. మైసూరు నుంచి హిరియాపట్టణ వరకు సీఎం ఏరియల్ సర్వే చేశారు. వందలాది గ్రామాలు నీటమునిగాయి, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి, ఆ సమయంలో పేపర్‌లో తలదూర్చడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలు బీజేపీ పనేనని, తనపై ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందని కుమారస్వామి దుయ్యబట్టారు.