news paper
-
దేశమంతా ఆరోగ్యశ్రీని ప్రశంసిస్తుంటే రామోజీ వికృత రాతలు
-
హైకోర్టులో ఆంధ్రజ్యోతికి చుక్కెదురు..
-
ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ 2019లో తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు ఆ పత్రిక యాజమాన్యంపై రూ.100 కోట్లకు టీటీడీ తిరుపతి కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు మాజీ ఎంపీ సుబ్రహ్మణస్వామికి అనుమతినివ్వాలని కోరుతూ ఒక అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు సుబ్రహ్మణ్యస్వామికి అనుమతినిస్తూ తిరుపతి కోర్టు 2021 మే 1న ఉత్తర్వులు ఇచ్చిం ది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కె.శ్రీనివాస్, ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు వేసిన హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ) దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యస్వామికి తిరుపతి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు. అయితే ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరిని నియమించుకో వాలన్నది టీటీడీ ఇష్టమని, ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ప్రతివాదులకు లేదన్న టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఎవరిని నియమించుకోవాలో మా ఇష్టం... నిబంధనలకు అనుగుణంగా తమ తరఫున వాదనలు వినిపించేందుకు కింది కోర్టులో సుబ్రహ్మణ్య స్వామికి అనుమతినిచ్చామని సత్యనారాయణ ప్ర సాద్ వాదనలు వినిపించారు. ఈ విషయంలో టీటీ డీకున్న హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు. ఆయన విషయంలో అభ్యంతరం లేవనెత్తే హక్కు ఆంధ్రజ్యోతికి లేదన్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఎన్నో కేసుల్లో సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గొప్ప స్కాలర్ అని, ఆయన వాదనాపటిమపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పరువు నష్టం దావాలో జరుగుతున్న విచారణను జాప్యం చేసేందుకే దురుద్దేశాలతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిందని సత్యనారాయణ ప్రసాద్ కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఈ నెల 10న తీర్పు రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు వెలువరిస్తూ ఆంధ్రజ్యోతి యాజమా న్యం దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టేశారు. -
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
ఈ ‘వార్తలు’ మొలకెత్తుతాయ్.. మట్టిలో నాటితే చిగురించే వార్తాపత్రిక
సాక్షి, అమరావతి: వార్తా పత్రికను చదివిన తర్వాత ఏం చేస్తారు? ఆకర్షించే అంశాలుంటే దాచుకుంటారు. లేదంటే చింపి ఇంట్లో అవసరాలకు వాడుకుంటారు. ఎక్కువగా ఉంటే కేజీల్లెక్కన అమ్మేస్తారు. కానీ, వార్తాపత్రికను చదివేశాక మట్టిలోకప్పెడితే.. పరిమళాలు వెదజల్లే పూల మొక్కగానో, ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మొక్కగానో మొలకెత్తితే అద్భుతమే కదా! ఈ ప్రయత్నమే చేసింది జపాన్‌లోని ‘మైనిచి షింబున్షా’. ఆ ప్రచురుణ సంస్థ 2016లో ప్రారంభించిన ‘గ్రీన్ న్యూస్‌పేపర్’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుత పర్యావరణ సమస్యలపై పిల్లలకు అవగాహన పెంచడానికి, భవిష్యత్ తరానికి పేపర్ రీసైక్లింగ్ ప్రాముఖ్యతను బోధించేందుకు ఉత్తమ మార్గంగా ఈ పత్రిక ప్రత్యేకతను అక్కడి పాఠ్యాంశాల్లో చేర్చడం గమనార్హం. ‘ది మైనిచి షింబున్షా’ మే 4, 2016న ‘గ్రీనరీ డే’ కోసం తొలిసారి ఈ పత్రికను ప్రచురించింది. పర్యావరణ వార్తలకు అంకితం చేస్తూ 100 శాతం బయోడిగ్రేడబుల్ పేపర్‌తో ప్రత్యేక ఎడిషన్‌గా వచ్చిన తొలి పత్రికగా ఇది గుర్తింపు పొందింది. పాత కాగితాలను రీసైకిల్ చేసి, దానికి వివిధ రకాల మొక్కల విత్తనాలను జతచేసి తయారు చేసిన కాగితాన్ని ముద్రణ కోసం వినియోగిస్తున్నారు. వార్తలను ముద్రించేందుకు కూడా మొక్కల నుంచి తీసిన సహజసిద్ధ సిరాను వినియోగించడం మరో ప్రత్యేకత. జపాన్ మార్కెట్లో ప్రతిరోజు సుమారు 40.60 లక్షల మందికి చేరుతున్న ఈ పత్రికను చదివిన అనంతరం మట్టిలో పడేస్తే దాన్నుంచి మొక్కలు మొలిచి సీతాకోక చిలుకలను ఆకర్షించే పూలు పూయడం అంతకంటే ప్రత్యేకం. పత్రికలకు పెరుగుతున్న ఆదరణ వార్తా పత్రికలకు అవసరమైన కాగితం కోసం ప్రపంచంలో ఏటా 95 మిలియన్ చెట్లను నరికివేస్తున్నట్టు పర్యావరణం పరిరక్షణకు కృషి చేస్తోన్న అమెరికాకు చెందిన ‘వన్ ఎర్త్’ ఎన్జీవో సంస్థ చెబుతోంది. అయితే, పర్యావరణ ప్రయోజనాన్ని గుర్తించిన మైనిచి షింబున్షా సంస్థ అందుబాటులోకి తెచ్చిన గ్రీన్ న్యూస్‌పేపర్‌కు జపాన్‌లో వచ్చిన ఆదరణను చూస్తుంటే.. ఇంటర్నెట్ కాలంలో కూడా ఇలాంటి పత్రికలను రీడర్స్ విపరీతంగా ఆదరిస్తారని నిరూపితమైనట్టు పేర్కొంది. గ్రీన్ న్యూస్‌పేపర్ ముద్రణ ద్వారా ప్రచురణకర్త 7 లక్షల డాలర్లకు పైగా ఆర్జించడం పెద్ద సంచలనంగా వన్ ఎర్త్ పేర్కొంది. ఇది వార్తాపత్రిక పరిశ్రమకు పెరుగుతున్న ఆదరణగా, పర్యావరణంపై ప్రజల్లోని చైతన్యానికి గుర్తుగా వివరించింది. భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోను మొలకెత్తే పత్రికల ముద్రణ ప్రారంభమైందని, అమెరికాలోని అనేక కంపెనీలు వివిధ ప్రయోజనాల కోసం ప్లాంటేషన్ పేపర్‌ను తయారు చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. ఇటీవల వన్ ఎర్త్ చేసిన సర్వేలో భారత్‌లో శుభలేఖలు, యూరప్‌లో 74 శాతం గ్రీటింగ్ కార్డులను మొలకెత్తే రీతిలో తీసుకొచ్చినట్టు తెలిపింది. పచ్చదనం పెంచడానికి దోహదం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచే కార్యక్రమాలను జపాన్ ప్రభుత్వం ముమ్మరం చేసిన నేపథ్యంలో దేశంలో పచ్చదనం పెంపునకు తమ పత్రిక దోహదం చేస్తున్నట్టు ప్రచురుణ సంస్థ ది మైనిచి షింబున్షా ప్రకటించింది. పత్రిక చదవడం పూర్తయిన తర్వాత చిన్న ముక్కలుగా చింపేసి, ఆ ముక్కలను మట్టిలో నాటాలని, ఆపై ఇతర మొక్కల మాదిరిగానే నీరు పెట్టాలని వారు సూచిస్తున్నారు. జపాన్‌లోని అతిపెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో ఒకటైన డెంట్సు ఇంక్ ఈ విధానాన్ని కనిపెట్టి, మైనిచితో కలిసి పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా ది మైనిచి షింబున్షా పబ్లిషర్స్ జపాన్ పాఠశాలల్లో పర్యావరణ సమస్యలపై అవగాహన పాఠాలు చెబుతున్నారు. -
‘నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్ యాడ్
సాధారణంగా డెత్ సర్టిఫికెట్ చనిపోయిన తరువాత ఇస్తారు. డెత్ సర్టిఫికెట్ పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. ఈ మధ్య కాలంలో బతికున్న వారికి కూడా డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతున్న ఘటనలు మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. అధికారుల తప్పిదాల కారణంగా మనిషి బతికున్నప్పటికీ చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కల్లో కొకొల్లలు ఉన్నాయి. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నట్లు పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధ్రువీకరణ పత్రం పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. సదరు డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్ ప్రకటన ఫొటోను ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. ‘ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రకటనను చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ‘ఆ వ్యక్తి స్వర్గంలో నుంచి సాయం కోరుతున్నాడా? ఒకవేళ ఆ ‘మరణ ధ్రువీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తనకు ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి -
Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త సమీర్ అరోరా.. న్యూస్ పేపర్లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్మెంట్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, లేదా డాక్టర్ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు. ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్‌లైన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2 — Samir Arora (@Iamsamirarora) September 16, 2022 ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది. Don't worry..Engineers don't rely on some newspaper ad. They find everything on their own. — Ajay sharma (@Ajaysha17977479) September 16, 2022 Looking at the ad, the whole country's future doesn't look so sound. — Ashutosh Vishwakarma (@aashutoshaawara) September 16, 2022 Thank god, I got married 11 years ago! — Bharat Trader 🇮🇳 (@BharatTrader) September 16, 2022 -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
కళ్ళు ఉండి చూడలేని కబోది రాతలు
-
అగ్నిపథ్‌కు షింజో అబే హత్యకు ముడిపెడుతూ..
కోల్‌కతా: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్‌కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో విమర్శలకూ దారి తీసింది. జపాన్ రాజకీయవేత్త షింజో అబేను హతమార్చిన వ్యక్తి పేరు టెత్సుయ యమగామి(41). జపాన్ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్‌పేజీ కథనంగా ప్రచురించింది ఇవాళ. అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. యమగామి జపాన్ ఎస్డీఎఫ్లో పని చేశాడు. కానీ, ఎలాంటి పెన్షన్ అతను పొందలేకపోయాడు అంటూ ట్వీట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత ట్వీట్‌తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగానే ఆ పత్రిక కథనాలు ప్రచురిస్తుంది. అసలు అగ్నిపథ్‌కు అబే మరణానికి మృతి పెట్టి కథనం రాసింది ఎవరు?. దేశం మీద గౌరవం, ప్రేమ ఉన్న ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. జాగో బంగ్లా చేసింది ముమ్మాటికీ తప్పే. భారత యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ. షింజో అబే మీద గౌరవంతో భారత్ సంతాప దినం పాటిస్తున్న వేళ.. ఇలాంటి కథనం దురదృష్టకరం అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: షింజో అబేపై కాల్పులకు అసలు కారణం ఇదే.. -
ప్రింట్ మీడియాపై రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయంలో 25 శాతం వరకు వృద్ది ఉండొచ్చని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రకటనలు అధికం కావడమే ఇందుకు కారణమని వివరించింది. ప్రకటనల ఆదాయం 25–30 శాతం, సర్క్యులేషన్ ఆదాయం 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా న్యూస్‌ప్రింట్ ఖర్చుల భారం అధికం అయింది. ఇది లాభదాయకతను తగ్గిస్తుంది. ప్రింట్ మీడియా సంస్థల నిర్వహణ లాభాల మార్జిన్లు 3 శాతం పాయింట్ల వరకు క్షీణిస్తాయి. 2020–21లో వినియోగించిన న్యూస్‌ప్రింట్‌లో 60 శాతం దిగుమతి చేసుకున్నదే. యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి న్యూస్ ప్రింట్ ధర 80 శాతం దాకా దూసుకెళ్లింది. దిగుమతులు తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో న్యూస్ ప్రింట్ మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. సర్క్యులేషన్, ప్రకటనల పరిమాణం పునరుద్ధరణతో న్యూస్‌ప్రింట్ వినియోగంలో పెరుగుదలకు దారి తీస్తుంది’ అని వివరించింది. -
‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు
శ్రీకాకుళం: టెక్కలి ఎన్టీఆర్ కాలనీకు చెందిన బూసి అఖిల్ అనే కిడ్నీ బాధిత యువకునికి సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. కుమారుడి రెండు కిడ్నీలు పాడై, మెరుగైన వైద్యం కోసం తల్లి లోకేశ్వరి డబ్బులు కోసం పడుతున్న వేదనపై ‘సాక్షి’ లో ‘అమ్మ ఆవేదన’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందిస్తున్నారు. టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం సభ్యులు తమ వంతు సాయంగా రూ.15 వేలను బాధితుడి తల్లి లోకేశ్వరికి అందజేశారు. ఇందులో సేవా సంఘం నుంచి రూ.10 వేలు, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు శంభాన శ్రీనివాసరావు తన వంతు సాయంగా రూ.5 వేలు అందించారు. అలాగే పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బెహరా కృష్ణవేణి కాళీ తన వంతు సాయంగా రూ.5 వేలను బాధితుడి తల్లికి అందజేశారు. చదవండి: ట్విట్టర్‌ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు -
హాంకాంగ్‌లో ‘యాపిల్ డైలీ’ కథ ముగిసింది
హాంకాంగ్: హాంకాంగ్ ప్రజాస్వామ్య డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూతపడింది. గురువారం ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. యాపిల్ డైలీ కాపీల కోసం పాఠకులు ఎగబడ్డారు. దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్‌పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్ దేశం చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన యాపిల్ డైలీ పత్రిక మూతపడడంతో ఇక చైనాకు మరింత బలం చేకూరినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. ఇటీవల ఆ పత్రికకు చెందిన ఐదుగురు సంపాదకులను అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2.3 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు. ఈ పత్రిక మూతపడడం హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజని జార్జిటౌన్ సెంటర్ ఫర్ ఆసియన్ లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ కెల్లాగ్ చెప్పారు. హాంకాంగ్ డౌన్టౌన్లో యాపిల్ ప్రతుల కోసం ప్రజల క్యూ -
పాత పేపర్‌కు డిమాండ్ పెరిగిందండోయ్.. కిలో ఎంతంటే!
సాక్షి, ఆదిలాబాద్ : పాత పేపర్ ధర అమాంతగా పెరిగిపోయింది. కిలో ధర రూ. 35 రూపాయలకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పాతపేపర్ కొరత ఉండడంతో గిరాకీ పెరిగింది. గతంలో కిలో రూ. 4 నుంచి 9 రూపాయల వరకు మాత్రమే ఉండేది. కాని కరోనా నేపథ్యంలో పేపర్ మార్కెట్లోకి రాకపోవడంతో డిమాండ్ పెరిగింది. ఇటీవల మండల కేంద్రానికి చెందిన వ్యాపారి 10 టన్నుల పేపర్‌ను గుజరాత్ నుంచి కొనుగోళ్లు చేసి నిజమాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో విక్రయించారు. చదవండి: కొడుకుతో సమయం కేటాయించాలని.. న్యూస్ పేపర్ -
కొడుకుతో సమయం కేటాయించాలని.. న్యూస్ పేపర్
ఎనిమిదేళ్ల కొడుకుచేత వార్తాపత్రిక చదివించాలనుకుంది ఆ తల్లి. పిల్లలకోసమే వార్తాపత్రిక ఏదైనా ఉందా అనే వెతికింది. అలాంటి పత్రికలేవీ కనిపించక తన కొడుకు లాంటి పిల్లల కోసం ‘ది చిల్డ్రన్స్ పోస్ట్’ అనే పేరుతో దిన పత్రిక ప్రారంభించింది. ఆ తల్లి పేరు నిధి అరోరా. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఉంటుంది. వార్తాపత్రికలు మనోవృద్ధికి ఎంతగా తోడ్పడుతాయో పిల్లవాడికి రోజూ పాఠంలా చెప్పేది. కానీ, కొన్ని రోజులకు పిల్లవాడితో పత్రిక చదివించాలనుకుంది. కానీ, పిల్లల కోసమే ఉన్న దినపత్రిక ఏదీ కనిపించలేదు. అందుకే, 2017లో ‘ది చిల్డ్రన్స్ పోస్ట్’ పేరుతో వార్తాపత్రిక ప్రారంభించింది. కొడుకుతో సమయం కేటాయించాలని.. నిధి 2015 డిసెంబర్ వరకు మంచి కార్పోరేట్ సంస్థలో ఉద్యోగిని. క్వాలిటీ టైమ్‌ను కొడుకుకి కేటాయించాలనుకుంది. కొడుకులో చదివే అలవాటును పెంచాల్సిన అవసరంతో ఉద్యోగాన్ని వదిలేసింది. ఇప్పుడు పత్రికను దానితో పాటు ఓ ఎన్జీవో సంస్థను కూడా నడుపుతుంది. ఓ కన్సల్టింగ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలుగా ఉంది. ఆమె పత్రికా పాఠకులు 8 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. పేపర్ ద్వారా పిల్లలకు మాట్లాడే గొంతుక అవ్వాలని, ఆ గళాన్ని తల్లిదండ్రులు వినాలని కోరుకుంటుంది. దేశం నలుమూలలా.. పేపర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆ ఉత్సాహం ఆమెను ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంది. ‘మాకు భారతదేశం నలుమూలల నుండి, నాగాలాండ్, గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్, కేరళ వరకు పాఠకులు ఉన్నారు. ఇప్పుడు దేశ హద్దులు దాటి జింబాబ్వే, యుఎస్, కెనడా, యు.ఎ.ఇ, దోహా, ఒమన్‌ల నుంచీ పాఠకులు కూడా ఉన్నారు. ఇంతగా పాఠకుల సంఖ్య ఎలా పెరిగిందో ఆశ్చర్యంగా ఉంది’ అంటోంది నిధి. తల్లులతో సంభాషణ తను రోజూ చేసే పని గురించి వివరిస్తూ –‘మా అబ్బాయి ఇప్పుడు చదివే అలవాటును పెంచుకోకపోతే, అది ఎప్పటికీ జరగదని నేను భయపడ్డాను. గురుగ్రామ్ తల్లులతో (ఫేస్బుక్ పేరెంటింగ్ గ్రూప్) నా ఆందోళనను పంచుకున్నాను. పిల్లల కోసం ఒక వార్తాపత్రికను ప్రారంభించాలనే ఆలోచన గురించి వారితో మాట్లాడాను. నన్ను ప్రోత్సహించారు. దీంతో వార్తాపత్రికను ప్రారంభించే ధైర్యం నాకు వచ్చింది. మొదటి కాపీని మా అబ్బాయికి ఇచ్చినప్పుడు, వచ్చి నన్ను కౌగిలించుకొని ‘అమ్మా, చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అన్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడనవసరం లేకపోయింది. రెండు నెలల్లో ఏడు వేర్వేరు ఎడిషన్లలో ఏడుగురు ఎడిటర్లు (తల్లులు) చేరారు. పిల్లల కోసం వారానికి ఒకరు చొప్పున ఎడిషన్ తీసుకువస్తారు. దీంతో ఆ తల్లుల మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు. మా పిల్లలు ఈ పత్రికను ఇష్టపడిన తర్వాత, మేం దానిని విస్తృతంగా పాఠకుల వద్దకు తీసుకువెళ్లాం. కార్టూనిస్ట్‌గా ఎదుగుదల పత్రికకు మా అబ్బాయి కూడా సాయం అందిస్తున్నాడు. పిల్లలూ పాల్గొంటున్నారు. దాదాపు 40–50 శాతం కంటెంట్ అంతా మా పాఠకుల నుండే వస్తుంది. బాగా, పజిల్స్, కార్టూన్లు (చైల్డ్ కార్టూనిస్టులు చేస్తారు), కవిత్వం, వర్డ్ మ్యాజిక్, ప్రస్తుత వార్తలు ఉంటాయి. అంతర్జాతీయ వ్యవహారాలు, ఆర్థిక శాస్త్రం, సాంకేతికత, సమాచార భద్రతకు సంబంధించినవి కూడా ఇస్తాం. మంచి పౌరులుగా పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి తగిన విభాగాలు మా పత్రికలో ఉన్నాయి. హింస, లైంగిక వేధింపులు మినహా అన్నింటినీ కవర్ చేస్తాం. దీని ద్వారా వారు ప్రధాన సమస్యపై మంచి అవగాహన తో ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మా అబ్బాయి ఈ పేపర్‌కి కార్టూనిస్ట్ అయ్యాడు. సొంత ఆలోచనతో కార్టూన్లు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించి క్రమశిక్షణ, నిబద్ధత, సకాలంలో పనులు చేయడం అలవాటైంది. సృజనాత్మకంగా బాధ్యతగా ఉండటం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. సమాజం పట్ల ఒక అవగాహనతో ఉంటున్నాడు. ప్రక్రియలో తల్లీకొడుకులుగా మేమిద్దరం ఎదిగాం అనిపిస్తుంది’ అని వివరించిన నిధి తమ పత్రికను హోటళ్ళు, ఆసుపత్రులు, పిల్లలలు ఉండే అన్ని చోట్లా వార్తాపత్రిక ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. -
నారా లోకేష్ తీరుపై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, ప్రకాశం : నారా లోకేష్ తీరుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సాక్షి పత్రిక ప్రతులను తగాలబెడతావా అని లోకేష్‌పై నిప్పులు చెరిగారు. పత్రికలపై గౌరవం ఉన్న వారు ఇటువంటి పని చేయరని పేర్కొన్నారు. అలాగైతే తప్పుడు కథనాలు రాస్తున్న మీ పచ్చ పత్రికను మేమేం చేయాలని ప్రశ్నించారు. దానిని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మాకు ఏ పథకం అందలేదని కొందరితో చెప్పించి మీ అనుంగు పత్రికలో అబద్దాలు రాయించారని మండిపడ్డారు. వాళ్ళు పొందిన లబ్దికి ఆధారాలు ఉన్నాయని చూపించారు. మీ పత్రికలో రాసిన మేడపి గ్రామ వాసులు రేగుల కాశయ్య, అనురాధ కుటుంబానికి వివిధ పథకాల ద్వారా 2లక్షల 88వేల 545 పాయలు అందాయని స్పష్టం చేశారు. అమ్మఒడి రాలేదని రాసిన రేగుల అనురాధ ఖాతాలో గత ఏడాది రూ 15 వేలు జమ అయ్యిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చదవండి: పప్పూ... ఇది తప్పు!! కాగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేష్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన్ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలని, తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలని మండిపడుతున్నారు. ఈయనకు ప్రజాస్వామ్యమన్నా.. దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? అని ప్రశ్నిస్తున్నారు. -
నిన్నటి పేపర్ అలాగే ఉండటంతో అనుమానం..
సాక్షి, న్యూఢిల్లీ : సమయ స్ఫూర్తి కలిగిన వారు జీవితంలో విజయం సాధించడమే కాకుండా ఎదుటి వారి జీవితాలను రక్షించి ప్రశంసలు అందకుంటారని దక్షిణ ఇంగ్లండ్‌లోని డార్సెట్ నగరానికి చెందిన 15 ఏళ్ల నవోమీ జుప్ అనే బాలిక నిరూపించారు. బతుకుతెరవు కోసం గత రెండేళ్లుగా ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేస్తున్న ఆ బాలిక రోజూలాగే ఈ నెల 15వ తేదీన కూడా క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఇంటింటికి పేపర్ వేస్తూ వెళ్లింది. ఓ ఇంటి వద్ద పేపర్ బాక్సులో పేపర్ వేయబోతుండగా, అంతకుముందు రోజు పేపర్ కూడా కనిపించింది. ఆ ఇంటిలో ఉంటున్న వారెవరో పేపర్ కోసం బయటకు రాలేక పోయారని ఆమెకు అర్థం అయింది. వెంటనే ఆ బాలిక 101కు ఫోన్‌చేసి పోలీసులకు ఈ విషయం చెప్పింది. అనారోగ్యం లేదా మరో కారణం వల్లనో ఆ ఇంట్లోని వారు బయటకు రాలేకపోయి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. (చదవండి: వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్) పోలీసులు హుటాహుటిన వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లగా ఓ మంచం మీద అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఓ వద్ధుడు కనిపించారు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఆ వద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ ఇంట్లో ప్రభుత్వ పింఛనుదారుడు ఒక్కరే నివసిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని బుధవారం నాడే ఇంటికి చేరుకున్నారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి నిండు ప్రాణాలను రక్షించినందుకు ఆ ప్రాంతం పోలీసు అధికారి ఆమెను ప్రశంసిస్తూ ‘ప్రత్యేక గుర్తింపు పత్రం’తో సత్కరించారు. లాక్డౌన్లో కూడా పేపర్ ఆపకుండా తన విధులను సక్రమంగా నిర్వహించిందంటూ ఆ ప్రాంతం వాసులు కూడా ఆమెను ప్రశంసించారు. (చదవండి: రాబిన్ హుడ్ అవతారమెత్తిన డీజీపీ ) -
వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్
శ్రీనగర్ : కొవిడ్-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా, ఏకంగా ఓ మాస్క్‌ను పాఠకులకు ఉచితంగా ఇచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన స్థానిక ఉర్దూ పత్రిక రోష్నీ, తమ ముందు పేజీలో ఓ మాస్క్‌ను అంటించి తమ పాఠకులకు అందించింది. (అంత లేదు, కేసుల సంఖ్యతో పరేషాన్ కావొద్దు) ‘ఈ సందేశాన్ని ప్రజలకు పంపించడం ఈ సమయంలో ముఖ్యమని మేము భావించాము. మాస్క్ ధరించాలనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేయడానికి ఇది మంచి మార్గం’ అని రోష్ని ఎడిటర్ జహూర్ షోరా అన్నారు. (అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం) ఇక రోష్ని పత్రిక చూపించిన చొరవను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా కట్టడిపై కేవలం సూచనలకే పరిమితం అవ్వకుండా పాఠకులకు మాస్క్‌లను పంపిణీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో సోమవారం ఒక్క రోజే 751 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, పది మంది మృతిచెందారు. మొత్తంగా 13,899 కేసులు నమోదవ్వగా 244 మంది మృతిచెందారు. -
కరోనాపై పోరులో మీడియాది అసమాన పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల కు సరైన, అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం వారిని అప్రమత్తం చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషించిన నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర’ పేరుతో ఆదివారం ఫేస్బుక్ వేదికగా విడుదల చేసిన వ్యాసంలో.. గతకొద్ది నెలలుగా వైరస్‌కు సంబం ధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచడంలో.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసిన సూచనలను నిరంతరం ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను అభినందించారు. అలాగే పత్రికలు వైరస్ వాహకాలని మొదట్లో ప్ర చారం జరిగిందని, అదేమా త్రం వాస్తవం కాదన్నారు. ‘నేను రోజూ పత్రికలు చదువుతూనే ఉన్నాను’ అని ఆయన వెల్లడించారు. నెటిజన్లు బాధ్యతగా మెలగాలి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ధ్రువీకృత సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని..లేకుంటే ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. మహ మ్మారికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడం ద్వారా, వాస్తవిక, విశ్లేషణాత్మక పద్ధతి లో ప్రచురించడం ద్వారా పార్లమెంటరీ సంస్థల చర్చల విషయంలో మీడియా ఒక అజెండాను సూచించిందన్నారు. -
న్యూస్ పేపర్‌తో రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే శాఖ
తిరువనంతపురం: కేరళకు చెందిన 12 ఏళ్లు బాలుడు న్యూస్ పేపర్‌తో అచ్చం రైలు నమూనాను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. లాక్డౌన్లో మెదడుకు పదును పెట్టి తన సృజనాత్మకతను చాటుకుని మాస్టర్‌గా మారాడు. తన టాలెంట్‌తో నెటిజన్లతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖను కూడా అబ్బురపరిచిన ఈ బాలుడి పేరు అద్వైత్ కృష్ణ. ఇతడు కేరళలో త్రిస్పూర్‌లోని సీఎన్ఎన్ బాయ్స్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మాస్టర్ అద్వైత్ న్యూస్ పేపర్‌తో రైలును తయారు చేస్తున్న వీడియోలను, ఫొటోలను గురువారం రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. (‘ఆ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు’) Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers. His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 ‘12 ఏళ్ల మాస్టర్ అద్వైత్ ఈ రైలును రూపొందించడానికి కేవలం 3 రోజుల సమయం తీసుకున్నాడు. ఇది తయారు చేయడానికి 33 న్యూస్ పేపర్లు, 10 ఎ4(A4) షిట్లు, గ్లూను ఉపయోగించి అచ్చమైన రైలు ప్రతిరూపాన్ని తయారు చేశాడు’ అని రైల్యే శాఖ తన ట్వీట్లో పేర్కొంది. మాస్టర్ అద్వైత్ రైలు ఇంజన్, బోగీలను, ఇతర భాగాలను తయారు చేసి వాటిని అమర్చిన విధానాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 32 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్‌లు వచ్చాయి. ‘అద్భుతం’, ‘ఈ బాలుడి తెలివి అందరికి స్ఫూర్తి’, ‘ఇతడికి రైల్వే ఆర్ అండ్ డీలో ఉద్యోగం ఇవ్వండి తన తెలివితో కొత్త టెక్నాలజీని తీసుకువస్తాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదువెందుకు..పెళ్లిచేసేయండి అన్నారు!) pic.twitter.com/qRN6WEQ3ms — Ministry of Railways (@RailMinIndia) June 25, 2020 -
ఉద్దీపన ప్యాకేజీతో ఆదుకోండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆదాయం పడిపోయి వార్తాపత్రికల సంస్థలు కుదేలవుతున్నాయని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకటనల ఆదాయం, సర్క్యులేషన్ తగ్గిపోవడంతో న్యూస్‌పేపర్ పరిశ్రమ ఇప్పటికే రూ. 4,000–4,500 కోట్ల దాకా నష్టపోయిందని పేర్కొంది. ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీలాంటిదేదైనా ఇవ్వకపోతే వచ్చే ఆరు.. ఏడు నెలల్లో దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నష్టపోయే ముప్పు ఉందని తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ఐఎన్ఎస్ ప్రెసిడెంట్ శైలేష్ గుప్తా ఈ అంశాలు పేర్కొన్నారు. వార్తాపత్రిక పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మంది పైచిలుకు జర్నలిస్టులు, ప్రింటర్లు, డెలివరీ వెండార్లు వంటి వారు పనిచేస్తున్నారని, నష్టాల కారణంగా వీరందరిమీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో న్యూస్‌ప్రింట్‌పై అయిదు శాతం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలని, రెండేళ్ల పాటు న్యూస్‌పేపర్ సంస్థలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, ప్రింట్ మీడియా బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని ఐఎన్ఎస్ విజ్ఞప్తి చేసింది. పెండింగ్ అడ్వర్టైజింగ్ బిల్లులను తక్షణం సెటిల్ చేయాలని కోరింది. తక్షణమే ప్యాకేజీ ప్రకటించాలి: కార్పొరేట్ ఇండియా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు పరిశ్రమలకు వెంటనే ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని దేశీయ పరిశ్రమలు (కార్పొరేట్ ఇండియా) కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. లాక్డౌన్ తీవ్రమైన ఆర్థిక విఘాతానికి దారితీసినట్టు కార్పొరేట్ ఇండియా వ్యాఖ్యానించింది. లాక్‌డౌన్‌ను మే 4 నుంచి మరో రెండు వారాల పాటు కొనసాగిస్తూ, అదే సమయంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఎన్నో వెసులుబాట్లు ఇవ్వడాన్ని స్వాగతించింది. నియంత్రణలతో కూడిన ఆర్థిక కార్యకపాల నేపథ్యంలో సత్వరమే, ప్రభావవంతమైన సహాయక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. -
డెత్ నోటీసుల కోసం పేపర్ పేజీలు పెంచారు
రోమ్ : చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇటలీ, ఇరాన్లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా బారిన పడి మృతిచెందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 1400కు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా ఇటలీలో కరోనా తీవ్రత ఎలా ఉందో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటలీలోని ఓ స్థానిక పత్రికలో డేత్ నోటీసులు ప్రచురించడానికి మాములుగా ఒక పేజీని కేటాయిస్తారు. అయితే కరోనా మృతుల నేపథ్యంలో దానిని పది పేజీలకు పెంచేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న లోంబార్డిలో పబ్లిష్ అయ్యే ‘లి ఎకో డి బెర్గామో’ అనే స్థానిక పత్రికలో ఫిబ్రవరి 9వ తేదీన ఒక పేజీన్నర భాగంలో డెత్ నోటీసులను ప్రచురించారు. ఆ సమయంలో ఇటలీలో కేవలం ముగ్గురికి కరోనా సోకినట్టు మాత్రమే నిర్ధారణ అయింది. మార్చి 13న అదే పేపర్లో డేత్ నోటీసులను ప్రచురించడానికి పది పేజీలను కేటాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఇటలీలో కరోనా ఏ విధంగా మృత్యు ఘంటికలు మోగిస్తుందో ప్రపంచానికి చాటిచెప్పారు. కాగా, మార్చి 13 వరకు ఇటలీలో 17,600 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అందులో 1,266 మంది మృతిచెందారు. మరోవైపు ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఐసీయూలో బెడ్స్ సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఒకవేళ హాస్పిటల్స్‌లో బెడ్స్ కొరత ఉంటే 80 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించినవారికి ఐసీయూలోకి ప్రవేశం నిరాకరించాలని సలహా ఇస్తూ టురిన్‌లోని విపత్తు నిర్వహణ బృందం నిర్ణయం తీసుకుంది. బాధితులకు సరిపడ బెడ్స్ లేనప్పుడు ఎవరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలనే దానిపై కూడా ఓ ప్రణాళికను తయారుచేసింది. -
బిగ్ ఫైట్/శుభారాణి
శుభారాణి దశ్ రోజూ తెల్లవారుజామున 3.20కి నిద్ర లేస్తారు. కాలకృత్యాలు ముగించుకుని ఆ చీకట్లోనే సైకిల్ మీద న్యూస్ పేపర్ల ఏజెంట్లు ఉండే సెంటర్‌కు వెళ్తారు. భువనేశ్వర్‌లో తన నివాసానికి దగ్గరగా ఉండే 200 ఇళ్లకు ఆ పేపర్లను డెలివరీ చేస్తారు. 7.30 కల్లా పేపర్ వెయ్యడం పూర్తవుతుంది. అక్కడి నుంచి స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు అదే సైకిల్ మీద కొన్ని ఇళ్లకు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. తర్వాత ఇంట్లోనే సాయంత్రం వరకు కుట్టు మెషీన్ మీద బట్టలు కుడతారు. పాత న్యూస్పేపర్లతో కవర్లు తయారు చేస్తారు. ఆ కవర్లు ఎక్కువ మొత్తంలో జమ అయ్యాక ఒక రోజు వాటిని తీసుకెళ్లి కిరాణా దుకాణాలకు అమ్ముతారు. శుభారాణి దినచర్య ఇది. ఈ పనులన్నిటి మధ్య ఎప్పుడో కాస్త ఎంగిలి పడతారు. ఉదయం పేపర్ల సెంటర్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా ఇప్పిస్తే టీ తాగుతారు. ఎప్పుడైనా గుర్తొస్తే ఒడిశా ఫుట్‌బాల్ అసోసియేషన్ తనకు ఇచ్చిన ప్రశంసాపత్రాలు, అవార్డులను తీసి చూసుకుంటారు. అవును శుభారాణి ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్లేయర్! ఇప్పుడు న్యూస్ పేపర్ హాకర్. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్లు. 1992లో తొలిసారి ఒడిశా రాష్ట్ర తొలి మహిళా ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలిగా అస్సామీ కొండ ప్రాంతపు మైదానం హఫ్లాంగ్కు వెళ్లారు శుభారాణి. ఆ ఆటలో శుభారాణి ఒడుపైన ఆట వల్ల ఒడిశా జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగింది. ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా ఆమె కెరీర్ కూడా 1998 వరకు చురుగ్గా ఎదిగింది. అయితే ఆ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత శుభారాణి మళ్లీ ఫుట్‌బాల్ ఆడలేకపోయారు. ఒడిశా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్‌గా ఎంపికై ఇక ఉద్యోగంలో చేరబోతుండగా జరిగిన యాక్సిడెంట్ అది. అలా ఉద్యోగం కూడా ఆమెకు చేజారింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టారు శుభారాణి. స్కూల్లో ఆమె ఖో–ఖో ప్లేయర్. ఫుట్‌బాల్‌కు ముందు చిన్న వయసులోనే ఖో–ఖోలో నేషనల్ గేమ్స్ ఆడారు. శుభారాణికి యాక్సిడెంట్ అయిన రెండేళ్లకు ప్రకాశ్ చంద్ర మిశ్రా అనే బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె తండ్రి. ప్రకాశ్ చంద్ర న్యూస్ పేపర్ హాకర్. భువనేశ్వర్ దగ్గరి షాహిద్ నగర్ ఏరియాలో ఇల్లు. చిన్న పెట్టెలాంటి గది అది. అక్కడే జోత్స్నమయి, స్తుతి ఆరాధన పుట్టారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే ఉన్నారు కానీ, పిల్లలు పెద్దవాళ్లు అవుతుండడంతో దగ్గర్లోనే ఇంకో ఇంటికి మారాల్సి వచ్చింది. ఆ ఇంటి అద్దె ఏడు వేలు. భార్యాభర్తలతో పాటు, పిల్లలిద్దరూ చదువుకుంటూనే పేపర్లు వేస్తుంటారు. అందరికీ కలిపి నెలకు 12 వేలు వస్తుంది. అద్దె పోగా మిగిలేది ఐదు వేలు. ఆ ఐదు వేలలోనే కుటుంబం గడవాలి. పాత ఇంట్లో (గదిలో) బాత్రూమ్ లేదు. గది బయటే పాలిథిన్ షీట్లతో స్నానాలకు ఒక ‘మాటు’ను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు లేచే సరికే వీళ్ల స్నానాలు ముగించుకునేవారు. తర్వాత పిల్లల కోసం ఇల్లు మారక తప్పలేదు. భువనేశ్వర్‌లో వచ్చే ఏడాది ‘ఫిఫా’ యు–17 ఉమెన్స్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఒడిశా క్రీడా శాఖ అధికారులు ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఆ అధికారుల దగ్గరే పెన్షన్ కోసం శుభారాణి దరఖాస్తు చేసుకున్న కాగితం కూడా ఉంది. వాళ్లు దాన్ని ఓకే చేస్తే నెల నెలా ఆమెకు 3000 రూపాయలు వస్తాయి. శుభారాణి చెయ్యి చాసి ఎవర్నీ ఏమీ అడగలేదు. అడగలేరు కూడా. స్వాభిమానం. కానీ ఇలా జీవితంతో పోరాడేవారికి వాళ్లు నోరు తెరిచి అడక్కుండానే వాళ్లకు దక్కాల్సింది దక్కాలి. ‘‘అద్దె ఏడువేలు పోను, మిగిలే ఐదు వేలతో మేం నలుగురం ఎలాగో నెట్టుకొస్తున్నాం. ఆడపిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల కోసం ఈ ఐదు వేలల్లోనే దాచేది దాస్తున్నాం. మా భయం ఒక్కటే. ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం వచ్చేనా దాచిందంతా కొట్టుకు పోతుంది. అప్పుడు జీవితం మళ్లీ మొదటికే వస్తుంది’’ – శుభారాణి, న్యూస్ పేపర్ హాకర్, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారిణి -
పేపర్ బాయ్స్‌కి ఆనంద్ మహీంద్రా సెల్యూట్
ముంబై : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోడ్డు, రైలు సేవలతో పాటు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ముంబైలో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పేపర్ బాయ్స్ తెరవెనుక నిజమైన హీరోలుగా నిలిచారని ఆయన అన్నారు. వారికి సెల్యూట్ చేస్తూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ముంబై ఎయిర్పోర్ట్ రన్‌వేను మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైలు పట్టాలపైకి పూర్తిగా నీరు చేరింది. కానీ న్యూస్ పేపర్ మాత్రం రోజు వచ్చే సమయానికే మా ఇంటికి వచ్చింది. అది కూడా పొడిగా(ఏ మాత్రం తడవకుండా). ఇందుకు కారణం తెరవెనుక ఉన్న నిజమైన హీరోలు. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. మనల్ని సాధారణ రోజులుగా అనుభూతికి గురిచేసిన వారికి సెల్యూట్ చేస్తున్నట్టు’ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే తన ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్‌ను పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. న్యూస్ పేపర్ బాయ్స్, మిల్క్ మ్యాన్, కూరగాయల అమ్మేవారు నిజమైన హీరోలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. Mumbai Airport runway shut, schools closed, train stations flooded, but the newspapers arrived in my house on time & dry! I have to salute those quiet, unsung heroes who brave torrential rain just so we can experience a ‘normal day.’ 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/iUhKMRSRFi — anand mahindra (@anandmahindra) July 2, 2019 -
టీఆర్ఎస్కు పత్రిక లేదు
సాక్షి, హైదరాబాద్: టీఆ ర్ఎస్కు పార్టీ పత్రిక, వార్తా చానల్ లేదని ఆ పార్టీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక, టీ– న్యూస్ చానల్లో టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ప్రచారం కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును ఆయన తోసిపుచ్చారు. పార్టీ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ ఓ) రజత్‌కుమార్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ వినియోగం, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిం చడంపై సీఈఓను కలిసి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని చెప్పారు.