సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను దిగజార్చేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ 2019లో తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు ఆ పత్రిక యాజమాన్యంపై రూ.100 కోట్లకు టీటీడీ తిరుపతి కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు మాజీ ఎంపీ సుబ్రహ్మణస్వామికి అనుమతినివ్వాలని కోరుతూ ఒక అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో టీటీడీ తరఫున వాదనలు వినిపించేందుకు సుబ్రహ్మణ్యస్వామికి అనుమతినిస్తూ తిరుపతి కోర్టు 2021 మే 1న ఉత్తర్వులు ఇచ్చిం ది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కె.శ్రీనివాస్, ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు వేసిన హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్‌పీ) దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యస్వామికి తిరుపతి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు.
అయితే ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరిని నియమించుకో వాలన్నది టీటీడీ ఇష్టమని, ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ప్రతివాదులకు లేదన్న టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.
ఎవరిని నియమించుకోవాలో మా ఇష్టం...
నిబంధనలకు అనుగుణంగా తమ తరఫున వాదనలు వినిపించేందుకు కింది కోర్టులో సుబ్రహ్మణ్య స్వామికి అనుమతినిచ్చామని సత్యనారాయణ ప్ర సాద్ వాదనలు వినిపించారు. ఈ విషయంలో టీటీ డీకున్న హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు. ఆయన విషయంలో అభ్యంతరం లేవనెత్తే హక్కు ఆంధ్రజ్యోతికి లేదన్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఎన్నో కేసుల్లో సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఆయన గొప్ప స్కాలర్ అని, ఆయన వాదనాపటిమపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పరువు నష్టం దావాలో జరుగుతున్న విచారణను జాప్యం చేసేందుకే దురుద్దేశాలతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిందని సత్యనారాయణ ప్రసాద్ కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ భానుమతి ఈ నెల 10న తీర్పు రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు వెలువరిస్తూ ఆంధ్రజ్యోతి యాజమా న్యం దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment