
బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు..
బంజారాహిల్స్: ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వంపై ఈ నెల 1 నుంచి ప్రచురితమవుతున్న విశ్లేషణాత్మక కథనాలను నిరసిస్తూ మంగళవారం బీజేపీ శ్రేణులు జూబ్లీహిల్స్‌లోని ఆ పత్రిక ప్రధాన కార్యాలయ ముట్టడికి యత్నించాయి. దీంతో ఆ పత్రిక కార్యాలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే బారికేడ్లు పెట్టారు. బీజేపీ కార్యకర్తలు కార్యాలయం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
బీజేపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతి దినపత్రికకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీపై కథనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లను తొలగించుకొని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment