
సాక్షి, హైదరాబాద్: టీఆ ర్‌ఎస్‌కు పార్టీ పత్రిక, వార్తా చానల్ లేదని ఆ పార్టీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక, టీ– న్యూస్ చానల్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే ప్రచారం కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును ఆయన తోసిపుచ్చారు. పార్టీ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ ఓ) రజత్‌కుమార్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ వినియోగం, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిం చడంపై సీఈఓను కలిసి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment