టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లో తప్పని సరిగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన‍్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసిన పక్షంలో ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన‍్నారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికలు పొడిగించడానికి వీలులేదని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్నది వాస్తవమేనన్నారు. కానీ ఎన్నికల కమిషన్(ఈసీ) తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రేపు నితిన్ గడ్కరీని కేసీఆర్ కలుస్తారని వెల్లడించారు. రేపటి సీఈసీ సమావేశానికి టీఆర్‌ఎస్ తరపున తాను హజరవుతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment