న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా , బీజేపీ నాయకులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కోనుగోలు విషయంలో టీఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీపై టీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. అదే విధంగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్‌షా ఆదేశించారు. త్వరలోనే తెలంగాణలో భారీ బహిరంగా సభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని నాయకులకు అమిత్ షా సూచించారు. ఈ సభకు తాను.. హజరవుతానని పేర్కొన్నారు. సభ నిర్వహించే తేదీని పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితరులు హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment