news channel
-
చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్!
బాలల కోసం బాలలే నడిపిస్తున్న చానల్ ఇది. బ్రిటన్‌కు చెందిన ‘స్కై చానల్’లో భాగంగా ‘ఎఫ్‌వైఐ’– ఫ్రెష్ యూత్ ఇనీషియేటివ్ వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం బాలల కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందులో రిపోర్టింగ్, యాంకరింగ్ వంటి పనులన్నీ బాలలే చేస్తారు. వీరు ఆరితేరిన రిపోర్టర్లు, యాంకర్లకు దీటుగా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుండటం విశేషం. ఈ బాల జర్నలిస్టులు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. వారం రోజుల్లో జరిగిన ముఖ్య పరిణామాలపై ‘వీక్లీ న్యూస్ షో’, పిల్లలతో మాటామంతి కార్యక్రమం ‘కిడ్వర్జేషన్’, ‘బిగ్ ఏంబిషన్’, ‘మ్యాన్ వర్సెస్ చైల్డ్’ కార్యక్రమంలో బాలల వంటల విశేషాలు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉక్రెయిన్, గాజా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల బాధితులైన బాలల గురించి కూడా ఈ బాల జర్నలిస్టులు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశారు. (చదవండి: హైటెక్ డాన్స్‌మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!) -
చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్
ఢిల్లీ: ఊపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిషేధిత) చట్టం కింద అరెస్టైన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ పోలీసులు వీరి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 37 మంది అనుమానిత జర్నలిస్టులను విచారించారు. తొమ్మిది మంది మహిళా జర్నలిస్టులను కూడా ప్రశ్నించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రబీర్ పుర్కాయస్థ, రచయితలు పరంజోయ్ గుహా ఠాకుర్తా, ఊర్మిళేష్లను దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ప్రత్యేక సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. అనంతరం న్యూస్క్లీక్తో సంబంధాలు ఉన్న జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారు. ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్‌తో సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 30 స్థావరాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చైనా నిధులు.. న్యూస్‌క్లిక్ సంస్థకు ప్రముఖ అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులు అందుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ ఆగష్టు 10న ఓ కథనం వెలువరించింది. సోషలిస్టు భావాలను ప్రచారం చేయడం, తద్వారా చైనా అనుకూల వార్తలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం వారి ప్రధాన ఉద్దేశమని న్యూయార్క్ పోస్టు ప్రచురించింది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే న్యూస్‌క్లిక్ సంస్థకు కూడా నిధులు అందుతున్నాయని స్పష్టం చేసింది. సింఘమ్‌కు చైనా ప్రభుత్వంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. దీని ఆధారంగా ఆగష్టు 17న న్యూస్‌క్లిక్‌పై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే మంగళవారం సోదాలు నిర్వహించి చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు. భారీగా విదేశీ నిధులు న్యూస్ క్లిక్ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్ చానెల్ అధికారి అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. ‘ఇండియా ఏహెడ్’ న్యూస్ చానెల్ కమర్షియల్ హెడ్, ప్రొడక్షన్ కంట్రోలర్ అర్వింద్ కుమార్ జోషిని అదుపులోకి తీసుకుంది. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ ప్రచార బాధ్యతలను చేపట్టిన చారియెట్ మీడియా సంస్థకు ఈయన హవాలా మార్గంలో రూ.17 కోట్లను బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వాట్సాప్ చాటింగ్, హవాలా ఆపరేటర్ల రికార్డులు పరిశీలించిన తర్వాత జోషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. చారియెట్ మీడియా యజమాని రాజేశ్ జోషిని ఫిబ్రవరిలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే, సరైన ఆధారాలను సమర్పించలేదంటూ మే 6న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. -
‘ఆల్ట్ న్యూస్’కు విదేశీ విరాళాలు
న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఆధ్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ.2 లక్షల మేర విరాళాలు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డబ్బు జమ చేసిన మొబైల్ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్‌లు అన్నీ థాయ్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, మనామా, హాలండ్, సింగపూర్, అమెరికా,, ఇంగ్లాండ్, సౌదీఅరేబియా, స్వీడన్, యూఏఈ, కెనడా, స్విట్జర్లాండ్, పాకిస్తాన్, సిరియా దేశాలకు చెందినవని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,31,933 ప్రావ్దా మీడియాకు చేరిందని తెలిపారు. జుబైర్ అరెస్ట్ అనంతరం అతడికి మద్దతుగా వచ్చిన ట్వీట్లను విశ్లేషించగా ఎక్కువ భాగం యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్, పాకిస్తాన్ వంటి దేశాలవేనని గుర్తించామన్నారు. ఈ మేరకు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జుబైర్ పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఢిల్లీ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ఎదుట హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు తీర్పు ప్రతి అందకముందే జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు, కస్టడీకి అనుమతించినట్లు పోలీసులు మీడియాకు లీకులివ్వడం అవమానకరమని ఆయన తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. -
‘స్వతంత్ర’ న్యూస్ చానల్ స్టూడియోలు ప్రారంభం
సాక్షి, అమరావతి : ‘స్వతంత్ర’ తెలుగు శాటిలైట్ న్యూస్ చానల్ స్టూడియోలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ చానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి, ఆ చానల్ ఎండీ బి.కృష్ణప్రసాద్, ఎడిటర్ తోట భావ నారాయణ, అసిస్టెంట్ ఎడిటర్ రమా విశ్వనాథన్, చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్ ఆకుల అమరయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మీడియా అంటే సాయికి క్రేజ్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసిన కేసుల్లో సూత్రధారిగా ఉన్న అంబర్‌పేట వాసి చుండూరి వెంకట కోటి సాయికుమార్‌కు మీడియా అంటే మహా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా చాలా శక్తి మంతమైందని తెలుసుకున్న ఇతడు తానే సొంతంగా ఓ చానల్ ఏర్పాటు చేయాలని భావించాడు. తెలుగు అకాడమీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసుల విచారణలో సాయికుమార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ల క్రితం ఏబీసీ టీవీ పేరుతో చానల్ ఏర్పాటుకు.. తాజాగా కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్ కేంద్రంగా శ్రావ్య మీడియా అంటూ ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాడు. గత పదేళ్ల కాలంలో వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల ఎఫ్డీలు కొల్లగొట్టినా.. సాయికి మాత్రం చానల్ పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. 2012లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ.55.47 కోట్ల ఎఫ్డీలను సాయి, వెంకటరమణ తదితరులు కాజేశారు. అప్పట్లో విజయా బ్యాంక్‌లో మైనార్టీస్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. ఆ కార్పొరేషన్‌కు–బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన ఈసీఐఎల్ కమలానగర్ వాసి కేశవరావు సహాయంతో ఆ కథ నడిపాడు. దాదాపు 240 నకిలీ చెక్కులతో 16 బోగస్ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. వీటిలో దాదాపు రూ.20 కోట్లు వరకు సాయి తన వాటాగా తీసుకున్నాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!) సీఐడీకి చిక్కడంతో.. మైనారిటీస్ కార్పొరేషన్ కుంభకోణంలో వచ్చిన రూ. 20 కోట్లనుంచి సాయి .. రూ.8 కోట్లను ఏబీసీ టీవీ పేరుతో ఓ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి వెచ్చించాడు. దానికోసం హైదరాబాద్‌లో ఓ భవనాన్ని లీజుకు తీసుకుని దాన్ని ఆధునీకరించడంతో పాటు కావాల్సిన ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇందులో పనిచేయడానికోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారికి జీతాల అడ్వాన్సులుగా భారీ మొత్తాలు చెల్లించాడు. అయితే ఆ చానల్ కార్యరూపం దాల్చకముందే మైనార్టీ కార్పొరేషన్ స్కామ్‌లో ఉమ్మడి రాష్ట్ర సీఐడీకి చిక్కాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం) ఆ కేసు దర్యాప్తులో చానల్ ఏర్పాటు యత్నాలను సీఐడీ అధికారులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల నుంచి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.20 కోట్ల వరకు తీసుకున్న సాయి కుమార్ ఇందులోంచి కొంత డబ్బును యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరో స్కామ్ చేసినప్పుడు సంపాదించే సొమ్ముతో దాన్ని శాటిలైట్ చానల్‌గా మార్చాలని సాయి పథకం వేసినట్లు తెలిసింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
Viral: లైవ్‌లో న్యూస్‌రీడర్ గోస
శనివారం సాయంత్రం వార్తలు. కేబీఎన్ ఛానెల్లో న్యూస్ ప్రోగ్రామ్. ఎప్పటిలాగే బులిటెన్ చదివుతున్నాడు యాంకర్ కమ్ న్యూస్‌రీడర్ కబిందా కలిమీనియా. హెడ్‌లైన్స్ పూర్తయ్యాయి. ఇక మెయిన్ వార్తల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆగిపోయాడు. ‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్.. వార్తల మధ్య నుంచి వైదొలుగుతున్నందుకు మన్నించాలి. మేమూ మనుషులమే. మాకు జీతాలు అందాలి కదా’’ అంటూ నిట్టూర్పు విడిచాడు. ‘‘బాధాకరమైన విషయం ఏంటంటే.. షరోన్, ప్రతీ ఒక్కరూ, నాతోసహా ఇక్కడున్న చాలామందిలో ఎవరికీ జీతాలు ఇవ్వట్లేదు’’ అని మాట్లాడుతుండగానే.. లైవ్‌ను అర్థాంతరంగా కట్ చేశారు. జాంబియాలో ఓ న్యూస్ ఛానెల్ లైవ్‌లో జరిగిన ఈ వ్యవహారం అక్కడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఛానెల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యాంకర్ తీరును కేబీఎన్ టీవీ సీఈవో కెన్నెడీ మాంబ్వే తప్పుబట్టాడు. ‘‘ఆ యాంకర్ తప్పతాగి డ్యూటీకి వచ్చాడు, సహించేది లేదు, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’’ అని కేబీఎన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే కలిమీనియా మాత్రం తానేం తాగి లేనని చెబుతున్నాడు. నేను ఒకవేళ తాగి ఉంటే.. అదేరోజు అప్పటికే మూడు షోలను ఎలా నిర్వహించి ఉంటా? అబద్ధాలకైనా ఓ హద్దుండాలి అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు కలిమినియా. చాలా రోజుల నుంచి మాకు జీతాల్లేవ్. మాలో చాలా మంది ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నారు. ఆ భయం నాలో చచ్చిపోయింది. ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు. అందుకే లైవ్‌లోనే నిలదీశా అని చెబుతున్నాడు కలిమీనియా. ప్రస్తుతం ఈ ఫ్రస్టేషన్ జర్నలిస్ట్ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: అందగత్తె తొడలపై జూమ్, ఆపై.. -
నేను సాదియా... కైరాళీ టీవీ
చంద్రయాన్ –2.. అనుకున్న లక్ష్యం నెరవేర్చినా.. వేర్చకపోయినా..ఆ వార్తలను అందించడంలో మాత్రం ఒక వర్గానికి స్పేస్ ఇచ్చింది!పనిలో.. పనిచోట ‘ఈక్వల్ రెస్పెక్ట్’ అనే కాన్సెప్ట్‌ను స్థిరం చేసింది!అలా ఓ ట్రాన్స్ ఉమన్‌ను ఇక్కడ పరిచయం చేసుకోవడానికిఓ సందర్భాన్నీ తెచ్చింది! ఆ అమ్మాయి పేరు హైదీ సాదియా. వయసు ఇరవై రెండేళ్లు. కేరళలోని ‘కైరాళి’ అనే మలయాళం వార్తా చానెల్లో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్‌గా పనిచేస్తోంది. కిందటి నెల (ఆగస్ట్) 31వ తేదీనే ఆ చానెల్లో జర్నలిస్ట్‌గా చేరింది. వెంటనే ఆమె తీసుకున్న అసైన్మెంట్.. చంద్రయాన్ 2ను రిపోర్ట్ చేయడం. స్క్రీన్ మీద ఆమె ఇచ్చిన ప్రెజెంటేషన్‌కు కేరళ ప్రేక్షకులతోపాటు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కేకే శైలజ కూడా ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. చావక్కాడ్ నివాసి అయిన సాదియా ‘‘త్రివేండ్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం’’లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. కైరాళి టీవీలో ఇంటర్న్‌గా చేరింది. వృత్తి పట్ల ఆమె జిజ్ఞాస, ఉత్సాహాన్ని పసిగట్టిన అధికార సిబ్బంది వారం రోజుల్లోనే ఉద్యోగ అవకాశం ఇచ్చారు ‘‘న్యూస్ ట్రైనీ’’గా. ఆ వెంటనే చంద్రయాన్ 2 అసైన్మెంట్ను అప్పజెప్పారు. బెదురు, బెరుకు లేకుండా చక్కగా ప్రెజంట్ చేసింది న్యూస్‌ను. ‘‘ఈ అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. న్యూస్రూమే నా సెకండ్ హోమ్. ఎల్జీబీటీక్యూ పట్ల వివక్ష చూపని ప్రొఫెషనంటే జర్నలిజమే. ఫ్యూచర్లో మా కమ్యూనిటీకి ఇలాంటి చోట మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నాను’’ అని చెప్తున్న సాదియా ‘‘ఇంట్లో మాత్రం నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. దేశంలోని చాలా చోట్ల ట్రాన్స్‌విమెన్ జీవన శైలి చూసి నా విషయంలోనూ అలాంటి భావనతోనే ఉండి ఉంటారు. ఈ విషయంలో వాళ్లనేం తప్పుపట్టట్లేదు నేను’’ అంటారు. జీవితంలో చాలా పోరాడి ఈ స్థాయికి చేరుకున్న సాదియా.. సినిమారంగంలోనూ అడుగిడాలనుకుంటోంది. నటన, దర్శకత్వం రెండింటిలోనూ తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ సాదియా! -
తీగలాగితే కదిలిన అవినీతి డొంక
గుంటూరు రూరల్: వ్యభిచార గృహాల నిర్వాహకులను బెదిరించడంతో పాటు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్, గతంలో ఓ న్యూస్ చానల్ (సాక్షికాదు) లో పని చేసిన కెమేరామన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను బెదిరించి నగదు వసూలుకు పాల్పడిన ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని నిజాలు బయటపడ్డాయి. నగరంలోని నగరాలు ప్రాంతానికి చెందిన మల్లేశ్వరి వ్యభిచార గృహం నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్, గతంలో న్యూస్ చానల్లో పనిచేన కెమేరామన్లు ఆమెను బెదిరించి నగదు వసూలు చేశారు. నెలానెలా మూమూళ్లు ఇస్తే ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. ఏఆర్ కానిస్టేబుల్ బెదిరింపులు ఈ క్రమంలో రెండు రోజుల కిందట 6వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ మల్లేశ్వరి వద్దకు వెళ్లి రూ. 20 వేలను బెదిరించి వసూలు చేశాడు. దీంతో ఆమె గతంలో తనకు హామీ ఇచ్చిన హోంగార్డు, కెమేరామన్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరు కలసి ఏఆర్ కానిస్టేబుల్‌పై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఊహించని నిజాలు బయట పడ్డాయి. కెమేరామన్, హోంగార్డులే బెదిరిపులకు పాల్పడుతూ వసూళ్లు చేస్తుంటారని తెలిసింది. దీంతో వారినీ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా బాగోతం బయటపడింది. పలు స్టేషన్లలో కేసుల నమోదు గతంలోనూ హోంగార్డు, మాజీ కెమేరామన్ ఇదే విధంగా వసూళ్లకు పాల్పడ్డ ఘటనల్లో నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కెమేరామన్ గతంలో పాత గుంటూరుకు చెందిన ఒక మహిళను బెదిరించి నగదు వసూలు చేశాడు. దీంతో ఆమె జిల్లా ఎస్పీని సంప్రదించగా పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. నగరంలోని ఈస్ట్, వెస్ట్ పరిధిలో మరో రెండు పోలీస్స్టేషన్లలో ఇద్దరిపై కేసులు నమోదైనట్లు సమాచారం. అయినా, వారిలో మార్పు రాలేదు. నగరంలోని పలు వ్యభిచార గృహాల నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. గతంలో నగరంపాలెంలో ఓ పత్రికా విలేకరి ఇదే విధంగా వ్యభిచారం నిర్వాహకురాలిని బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడిన ఘటనలో ప్రస్తుతం అదుపులోఉన్న కెమేరామన్ హస్తం ఉన్నట్లు సమాచారం. బెందిరింపులే ప్రవృత్తిగా హోంగార్డు అండతో నగరంలోని నగర శివారుల్లోని వ్యభిచార గృహాల్లో లక్షలాది రూపాయలు వసూళ్లు చేశాడని సమాచారం. బెదిరింపులకు పాల్పడేది ఇలా... ముందుగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారి ఆచూకీ తెలుసుకుని అది ఏస్టేషన్ పరిధిలోకి వస్తుందో చూస్తారు. అనంతరం ఆ స్టేషన్‌కు వెళ్లి అక్కడ వారికి అనుకూలమైన కానిస్టేబుల్‌ను ఎంచుకుని అతని సహాయంతో హోంగార్డ్, కెమేరామన్లు వారిని బెదిరిస్తారు. ఒకవేళ కానిస్టేబుల్ వారికి అనుకూలించకపోతే అతనిపై లేనిపోని ఆరోపణలు చూపి అతనిని బెదిరించి వారి వైపునకు మలుచుకుంటారు. దీంతో చేసేదిలేక కానిస్టేబుల్స్ సైతం వారు చెప్పినట్లు ఆడుతుంటారని సమాచారం. ఈ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వచ్చే నగదును అందరూ పంచుకునేవారని తెలిసింది. ఈ విధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి వద్ద నుంచి లక్షల్లో నగదును వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితుల అరెస్టు ఎట్టకేలకు నల్లపాడు పోలీస్‌స్టేషన్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిసింది. అయితే, వీరితో పాటు వ్యభిచార గృహాల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తేగానీ ఇటువంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట పడదు. -
టీఆర్ఎస్కు పత్రిక లేదు
సాక్షి, హైదరాబాద్: టీఆ ర్ఎస్కు పార్టీ పత్రిక, వార్తా చానల్ లేదని ఆ పార్టీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక, టీ– న్యూస్ చానల్లో టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ప్రచారం కల్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదును ఆయన తోసిపుచ్చారు. పార్టీ ఎమ్మె ల్యే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ ఓ) రజత్‌కుమార్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ వినియోగం, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం నిర్వహిం చడంపై సీఈఓను కలిసి అనుమానాలు నివృత్తి చేసుకున్నామని చెప్పారు. -
జయలలిత పేరుతో న్యూస్ చానల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నా డీఎంకే కొత్త వార్తా చానల్‌ను బుధవారం ప్రారంభించింది. పార్టీ మాజీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరుమీదుగా ఈ కొత్త చానల్‌కు ‘న్యూస్ జే’ అని పేరుపెట్టారు. గతంలోనూ అన్నాడీఎంకే పార్టీకి ‘జయ టీవీ’ చానల్ ఉండగా, జయలలిత మరణం తర్వాత అది పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ వర్గం చేతుల్లోకి వెళ్లింది. గతంలో జయలలిత స్థాపించిన దినపత్రిక ‘డాక్టర్ నమదు ఎంజీఆర్’ కూడా ప్రస్తుతం దినకరన్ వర్గం చేతుల్లోనే ఉంది. దీంతో పార్టీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ‘నమదు పురచ్చి తలైవి అమ్మ’ పేరుతో అన్నాడీఎంకే కొత్త పత్రికను కూడా తీసుకొచ్చింది. న్యూస్ జే ప్రారంభోత్సవానికి సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు నేతలు హాజరయ్యారు. తమ ప్రభుత్వ విజయాల గురించి ప్రస్తుత చానళ్లు పెద్దగా కథనాలు ప్రసారం చేయడం లేదనీ, ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించి వాటిని ప్రజలకు చేరువ చేసేందుకే ఈ చానల్‌ను ప్రారంభిస్తున్నామని పళనిస్వామి చెప్పారు. -
యాంకర్‌కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌లోని ఓ న్యూస్ ఛానెల్లో పని చేస్తున్న యాంకర్(28) మారుతి నగర్ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ నెల 24న కార్యాలయంలోకి వచ్చి తనతో రాకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడని తెలిపింది. మూడేళ్ల క్రితం కూడా సదరు రవీందర్ తనను వేధింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారని విడుదలై వచ్చిన తర్వాత మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించింది. పోలీసులు రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూస్ చానల్ పెట్టిన నయీం!
గ్యాంగ్‌స్టర్ నయీం కార్యకలాపాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. హరిప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని సీఈవోగా నియమించి ఐ-10 న్యూస్ పేరిట నయీం చానల్ పెట్టినట్లు తాజాగా వెల్లడైంది. హరిప్రసాద్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఈ మేరకు వెల్లడించారు. హరిప్రసాద్ రెడ్డికి మావోయిస్టు వ్యతిరేక కథనాలు ప్రచారం చేయాలని నయీం ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో నయీంకు వ్యతిరేకంగా హరిప్రసాద్ రెడ్డి వార్తలు రాశాడని, దీంతో నయీం అనుచరుడు పాశం శ్రీను.. హరిప్రసాద్ రెడ్డిని నయీంతో పరిచయం చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అప్పటి నుంచి హరిప్రసాద్ రెడ్డికి నయీంతో సంబంధాలు కొనసాగించాడని పేర్కొన్నారు. న్యూస్ చానల్ పెట్టడానికి మొదట 13.50 లక్షలు నయీం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతర ఓ మంత్రి బర్త్ డే సందర్భంగా పాట తయారుచేయించి దానికి విజువల్స్ కోసం నయీం 1.50 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. నయీం మరణానంతరం నయీం వ్యవహారాల్లో ఉపయోగించిన సెల్ ఫోన్ ను చాదర్ ఘట్ వద్ద మూసీలో పడేసినట్లు హరిప్రసాద్ రెడ్డి పోలీసులతో వెల్లడించాడు. -
న్యూస్ ఛానల్ కార్యాలయంపై రాళ్ల దాడి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని ఓ న్యూస్ ఛానల్ కార్యాలయం పైకి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత రాజుకుంది. నగరంలోని నెంబర్ 1 న్యూస్ ఛానల్‌పై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో కార్యాలయ భవనంలోని అద్దాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. దీంతో సదరు టీవీ ఛానల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. -
ఉలిక్కిపడ్డ మీడియా
రాష్ట్రంలోని మీడియా రంగం గురువారం ఉలిక్కి పడింది. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో ఓ చానల్‌పై హిందూ యువజన సేన మూకలు వీరంగం సృష్టించాయి. వరుస పేలుళ్లతో పోలీసులు ఉరకలు తీశారు. మీడియాపై దాడిని సర్వత్రా ఖండించారు. దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, చెన్నై: కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో కొన్ని హిందూ సంఘాలు తమ ఉనికిని చాటుకునే పనిలో పడ్డాయి. సమాజ హితాన్ని కాంక్షిస్తూ కొన్ని సంఘాలు పనిచేస్తుంటే, మరికొన్ని సంఘాలు వివాదాలతో ముందుకు సాగే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా మహిళా దినోత్స వం సందర్భంగా పుదియ తలమురై న్యూస్ చానల్ ‘పసుపు తాడు..తాళి బొట్టు’ విలువను ఎత్తి చూపుతూ ప్రత్యేక కథనానికి నిర్ణయించింది. ఆ చానల్ ప్రసారం చేస్తున్న ప్రొమో, కర్టన్ రైజర్‌ను చూసిన కొన్ని హిందూ సంఘాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశాయి. దీంతో ఆ ప్రసారం నిలుపుదల చేయడానికి ఆ చానల్ నిర్ణయించింది. అయితే, ఎక్కడ ఆ కథనం ప్రసారం అవుతుందోనన్న ఆగ్రహంతో గిండిలోని ఆ చానల్ కార్యాలయంపై దాడి జరిగింది. మహిళా దినోత్సవం రోజున మహిళా జర్నలిస్టుపై, ఓ కెమెరా మెన్‌పై ఆ మూకలు దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసులు సైతం మెతక వైఖరి అనుసరించారన్న విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన మరువక ముందే, అదే చానల్ కార్యాలయంలో గురువారం వేకువ జామును టిఫిన్ బాక్సులలో అమర్చిన బాంబులతో దాడి జరగడం రాష్ర్టంలోని మీడియా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వేకువ జామున మూడు గంటల సమయంలో రెండు మోటార్ బైక్‌ల మీద వచ్చిన నలుగురు వ్యక్తులు కాసేపు ఆ మీడియా చానల్ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో చక్కర్లు కొట్టారు. వెళ్తూ...వెళ్తూ ఆ చానల్ కార్యాలయం సమీపంలోని ఓ చెట్టు కింద ఆగి అక్కడి నుంచి టిఫిన్ బాక్స్ బాంబుల్సి విసిరి ఉడాయించారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఒక్క సారిగా పెద్ద శబ్ధంతో రెండు బాంబులు పేలడంతో అక్కడి సిబ్బందితో పాటుగా,ఆ పరిసరవాసులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. బాంబులు పేలిన శబ్దం రావడంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. అయితే, ఈ పేలుళ్లలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాడి సమాచారంతో గిండి పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ టీవీ చానల్ పరిసరాల్లోని నిఘా కెమెరాలతో పాటుగా ఆ మార్గంలో ఉన్న మరికొన్ని సంస్థలకు చెందిన నిఘా కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఆ చానల్ కార్యాలయం పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. టిఫిన్ బాక్సు రూపంలో బాంబులు రెండింటిని పేల్చడంతో మీడియా వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇలాంటి దాడి జరగడంతో, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఈ దాడి తన సేనలతో తానే చేయించానంటూ హిందూ యువజన సేన నాయకుడు జయం పాండియన్ మదురై కోర్టులో లొంగిపోయాడు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, టీఎంసీ అధ్యక్షుడు జికే వాసన్, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, ద్రవిడ కళగం నేత కీ వీరమణిలతో పాటుగా పలు ప్రజా సంఘాల నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. మీడియా సంఘాల నేతృత్వంలో నిరసలనకు నిర్ణయించారు. అలాగే, సీపీఎం, సీపీఐల నేతృత్వంలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. -
కోడి పందాల జోరు
నిబంధనలు భేఖాతరు * గప్‌చుప్‌గా నిర్వహణ * భారీగా దండుకునేందుకు ఏర్పాట్లు * వర్ని మండలంలో అధికం నిజామాబాద్ క్రైం : జిల్లాలో కోడి పందాలకు తెర లే చింది. భోగికి మూడు రోజుల ముందే నిర్వాహకులు ఇందుకోసం గప్‌చుప్‌గా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు కోడిపుంజు ‘కొక్కోరొకో’ అంటూ కత్తులు దూస్తోంది. కోడి పందాలు దాదాపు ఎక్కువగా వర్ని మండలంలోనే జరుగుతాయనే విష యం అందరికి తెలిసిందే. అక్కడ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకొంటారు. అందులో భాగంగా కోడిపందాలూ జరుగుతాయి. గతంలో పలు గ్రామాలలో పోలీసులు దాడి చేసి వాటిని కట్టడి చేశారు. అయినా అవి ఆగడం లేదు. తాజాగా సోమవా రం కూడా వర్ని మండలం జాకోరా గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చే శారు. పందెం రాయుళ్లు పోలీసుల కంట పడకుండా కోడి పందాలు నిర్వహించేందుకు రహస్య ప్రాంతాలలో ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక గ్రామంలో పందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏడాదిన్నర వయస్సు కలిగిన పుంజులను ఎంచుకుని ప్రత్యేకమైన బుట్టలో ఉంచి పండుగకు వచ్చే కొత్త పెండ్లి కొడుకుకు ఏ విధంగా మర్యాద చేస్తారో అటువంటి మర్యాదే పందెం కోళ్లకు చేస్తారు. శక్తి పుంజుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కుట శాస్త్రం ఆధారంగా నక్షత్రం, తిథులు చూసుకుని మరీ పందాలకు ఎగబడుతున్నారు. నాలుగేళ్ల క్రితం వర్ని మండలంలోని అపంజ్ఫారంలో కోడి పందా లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ న్యూస్ చానల్‌వారు అక్కడకు వెళ్లి రహస్యంగా చిత్రీకరించారు. ఇది గమనించిన నిర్వహకులు చానల్ ప్రతినిధి, కెమెరామన్‌పై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు. ఈ సంఘటనను సీరీయస్‌గా తీసుకున్న పోలీసులు కోడి పందెలు నిర్వహించే గ్రామాలపై ఓ కన్ను వేసి ఉంచారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. -
చర్చకని పిలిస్తే.. ఇలా రచ్చ చేశారు..!
-
చర్చ కాస్తా రచ్చగా మారిందిలా..!
-
‘జీ 24 గంటలు’పై రెండు కేసులు
సాక్షి, హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫతేదర్వాజాలో ప్రముఖ ముస్లిం మత గురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్‌ను కలవడంపై అవాస్తవాలు ప్రసారం చేశారంటూ ‘జీ 24 గంటలు’ వార్తా చానల్‌పై శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసు నమోదు చేయగా, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. డీజీపీ వెళ్లి హైద్రూస్‌ను కలవడంపై ‘జీ 24 గంటలు’ చానల్లో ‘స్పెషల్ స్టోరీ’ ప్రసారమైంది. గురువారం డీజీపీ తన వెంట ఎలాంటి ఫైళ్లను తీసుకువెళ్లలేదని, ఒంగోలులో స్వామిని కలిసినప్పుడు కూడా ఆయన కాళ్లకు మొక్కలేదని, వీటికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ ద్వారా సృష్టించి ప్రసారం చేరారని డీజీపీ కార్యాలయంలో పరిపాలన విభాగం ఏఐజీగా పని చేస్తున్న సుబ్బారావు శుక్రవారం సీసీఎస్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 469, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తన తండ్రిని మంత్రగాడంటూ కల్పిత కథనాలను ప్రసారం చేశారంటూ హైద్రూస్ కుమారుడు హబీబ్ మహ్మద్ చేసిన ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. జీ-24పై దాడిని ఖండించిన పాత్రికేయ సంఘాలు జీ-24 గంటలు చానల్ కార్యాలయంపై పోలీసులు శుక్రవారం చేసిన ఆకస్మిక దాడిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) నేతలు ఒక ప్రకటనలో ఖండించారు. విలేకరులపై కేసులు పెట్టడం, సోదాల పేరిట దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.