కోడి పందాల జోరు | cock fights festivals | Sakshi
Sakshi News home page

కోడి పందాల జోరు

Published Tue, Jan 13 2015 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

కోడి పందాల జోరు

కోడి పందాల జోరు

నిబంధనలు భేఖాతరు
* గప్‌చుప్‌గా నిర్వహణ
* భారీగా దండుకునేందుకు ఏర్పాట్లు
* వర్ని మండలంలో అధికం
నిజామాబాద్ క్రైం : జిల్లాలో కోడి పందాలకు తెర లే చింది. భోగికి మూడు రోజుల ముందే నిర్వాహకులు ఇందుకోసం గప్‌చుప్‌గా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు కోడిపుంజు ‘కొక్కోరొకో’ అంటూ కత్తులు దూస్తోంది. కోడి పందాలు దాదాపు ఎక్కువగా వర్ని మండలంలోనే జరుగుతాయనే విష యం అందరికి తెలిసిందే. అక్కడ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకొంటారు.

అందులో భాగంగా కోడిపందాలూ జరుగుతాయి. గతంలో పలు గ్రామాలలో పోలీసులు దాడి చేసి వాటిని కట్టడి చేశారు. అయినా అవి ఆగడం లేదు. తాజాగా సోమవా రం కూడా వర్ని మండలం జాకోరా గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చే శారు. పందెం రాయుళ్లు పోలీసుల కంట పడకుండా కోడి పందాలు నిర్వహించేందుకు రహస్య ప్రాంతాలలో ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక గ్రామంలో పందాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ఏడాదిన్నర వయస్సు కలిగిన పుంజులను ఎంచుకుని ప్రత్యేకమైన బుట్టలో ఉంచి పండుగకు వచ్చే కొత్త పెండ్లి కొడుకుకు ఏ విధంగా మర్యాద చేస్తారో అటువంటి మర్యాదే పందెం కోళ్లకు చేస్తారు. శక్తి పుంజుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కుట శాస్త్రం ఆధారంగా నక్షత్రం, తిథులు చూసుకుని మరీ పందాలకు ఎగబడుతున్నారు.

నాలుగేళ్ల క్రితం వర్ని మండలంలోని అపంజ్‌ఫారంలో కోడి పందా లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ న్యూస్ చానల్‌వారు అక్కడకు వెళ్లి రహస్యంగా చిత్రీకరించారు. ఇది గమనించిన నిర్వహకులు చానల్ ప్రతినిధి, కెమెరామన్‌పై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు. ఈ సంఘటనను సీరీయస్‌గా తీసుకున్న పోలీసులు కోడి పందెలు నిర్వహించే గ్రామాలపై ఓ కన్ను వేసి ఉంచారు. అయినా ఫలితం లేకుండా పోతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement