Attacked by the police
-
కోడి పందాల జోరు
నిబంధనలు భేఖాతరు * గప్‌చుప్‌గా నిర్వహణ * భారీగా దండుకునేందుకు ఏర్పాట్లు * వర్ని మండలంలో అధికం నిజామాబాద్ క్రైం : జిల్లాలో కోడి పందాలకు తెర లే చింది. భోగికి మూడు రోజుల ముందే నిర్వాహకులు ఇందుకోసం గప్‌చుప్‌గా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు కోడిపుంజు ‘కొక్కోరొకో’ అంటూ కత్తులు దూస్తోంది. కోడి పందాలు దాదాపు ఎక్కువగా వర్ని మండలంలోనే జరుగుతాయనే విష యం అందరికి తెలిసిందే. అక్కడ సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకొంటారు. అందులో భాగంగా కోడిపందాలూ జరుగుతాయి. గతంలో పలు గ్రామాలలో పోలీసులు దాడి చేసి వాటిని కట్టడి చేశారు. అయినా అవి ఆగడం లేదు. తాజాగా సోమవా రం కూడా వర్ని మండలం జాకోరా గ్రామంలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చే శారు. పందెం రాయుళ్లు పోలీసుల కంట పడకుండా కోడి పందాలు నిర్వహించేందుకు రహస్య ప్రాంతాలలో ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక గ్రామంలో పందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏడాదిన్నర వయస్సు కలిగిన పుంజులను ఎంచుకుని ప్రత్యేకమైన బుట్టలో ఉంచి పండుగకు వచ్చే కొత్త పెండ్లి కొడుకుకు ఏ విధంగా మర్యాద చేస్తారో అటువంటి మర్యాదే పందెం కోళ్లకు చేస్తారు. శక్తి పుంజుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కుక్కుట శాస్త్రం ఆధారంగా నక్షత్రం, తిథులు చూసుకుని మరీ పందాలకు ఎగబడుతున్నారు. నాలుగేళ్ల క్రితం వర్ని మండలంలోని అపంజ్ఫారంలో కోడి పందా లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ న్యూస్ చానల్‌వారు అక్కడకు వెళ్లి రహస్యంగా చిత్రీకరించారు. ఇది గమనించిన నిర్వహకులు చానల్ ప్రతినిధి, కెమెరామన్‌పై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు. ఈ సంఘటనను సీరీయస్‌గా తీసుకున్న పోలీసులు కోడి పందెలు నిర్వహించే గ్రామాలపై ఓ కన్ను వేసి ఉంచారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
నారాయణఖేడ్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. సీఐ ముని కథనం మేరకు.. గురువారం పట్టణ బైపాస్ రోడ్డులో గల వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సువర్ణ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి సువర్ణ, సత్యమ్మలతో పాటు బాధితులు రేణుక, రామవ్వ విటుడు సర్దార్ రవిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఖేడ్‌కు చెందిన సువర్ణ, సత్యమ్మలు ఇద్దరు కలిసి సువర్ణ గృహంలో వ్యభిచారం జరుపుతున్నారని విచారణలో వెల్లడైందన్నారు. ర్యాలమడుగుకు చెందిన రేణుక, రామవ్వలను వ్యభిచారంలోకి దింపారని, దాడులు సమయంలో ఇంట్లో రూ.5 వేల నగదు, 6 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు, బీరు, కల్లు సీసాలు లభించగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. సువర్ణ, సత్యమ్మ, రవిలపై పిటా యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. రేణుక, రామవ్వలను సంగారెడ్డిలోని రెస్క్యూ హోంకు తరలిస్తామని తెలిపారు. ఖేడ్ సర్కిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు సునీల్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారని సీఐ పేర్కొన్నారు.