సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) కాజేసిన కేసుల్లో సూత్రధారిగా ఉన్న అంబర్‌పేట వాసి చుండూరి వెంకట కోటి సాయికుమార్‌కు మీడియా అంటే మహా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా చాలా శక్తి మంతమైందని తెలుసుకున్న ఇతడు తానే సొంతంగా ఓ చానల్ ఏర్పాటు చేయాలని భావించాడు. తెలుగు అకాడమీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసుల విచారణలో సాయికుమార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ల క్రితం ఏబీసీ టీవీ పేరుతో చానల్ ఏర్పాటుకు.. తాజాగా కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్‌మెంట్ కేంద్రంగా శ్రావ్య మీడియా అంటూ ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాడు.
గత పదేళ్ల కాలంలో వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల ఎఫ్‌డీలు కొల్లగొట్టినా.. సాయికి మాత్రం చానల్ పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. 2012లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ.55.47 కోట్ల ఎఫ్‌డీలను సాయి, వెంకటరమణ తదితరులు కాజేశారు. అప్పట్లో విజయా బ్యాంక్‌లో మైనార్టీస్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. ఆ కార్పొరేషన్‌కు–బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన ఈసీఐఎల్ కమలానగర్ వాసి కేశవరావు సహాయంతో ఆ కథ నడిపాడు. దాదాపు 240 నకిలీ చెక్కులతో 16 బోగస్ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. వీటిలో దాదాపు రూ.20 కోట్లు వరకు సాయి తన వాటాగా తీసుకున్నాడు.
(చదవండి: తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!)
సీఐడీకి చిక్కడంతో..
మైనారిటీస్ కార్పొరేషన్ కుంభకోణంలో వచ్చిన రూ. 20 కోట్లనుంచి సాయి .. రూ.8 కోట్లను ఏబీసీ టీవీ పేరుతో ఓ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి వెచ్చించాడు. దానికోసం హైదరాబాద్‌లో ఓ భవనాన్ని లీజుకు తీసుకుని దాన్ని ఆధునీకరించడంతో పాటు కావాల్సిన ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇందులో పనిచేయడానికోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారికి జీతాల అడ్వాన్సులుగా భారీ మొత్తాలు చెల్లించాడు. అయితే ఆ చానల్ కార్యరూపం దాల్చకముందే మైనార్టీ కార్పొరేషన్ స్కామ్‌లో ఉమ్మడి రాష్ట్ర సీఐడీకి చిక్కాడు.
(చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం)
ఆ కేసు దర్యాప్తులో చానల్ ఏర్పాటు యత్నాలను సీఐడీ అధికారులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల నుంచి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.20 కోట్ల వరకు తీసుకున్న సాయి కుమార్ ఇందులోంచి కొంత డబ్బును యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్‌మెంట్స్‌లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.
తొలుత యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్‌మెంట్స్‌లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరో స్కామ్ చేసినప్పుడు సంపాదించే సొమ్ముతో దాన్ని శాటిలైట్ చానల్‌గా మార్చాలని సాయి పథకం వేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment