funds Golmaal
-
మీడియా అంటే సాయికి క్రేజ్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసిన కేసుల్లో సూత్రధారిగా ఉన్న అంబర్‌పేట వాసి చుండూరి వెంకట కోటి సాయికుమార్‌కు మీడియా అంటే మహా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా చాలా శక్తి మంతమైందని తెలుసుకున్న ఇతడు తానే సొంతంగా ఓ చానల్ ఏర్పాటు చేయాలని భావించాడు. తెలుగు అకాడమీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసుల విచారణలో సాయికుమార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ల క్రితం ఏబీసీ టీవీ పేరుతో చానల్ ఏర్పాటుకు.. తాజాగా కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్ కేంద్రంగా శ్రావ్య మీడియా అంటూ ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాడు. గత పదేళ్ల కాలంలో వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల ఎఫ్డీలు కొల్లగొట్టినా.. సాయికి మాత్రం చానల్ పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. 2012లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ.55.47 కోట్ల ఎఫ్డీలను సాయి, వెంకటరమణ తదితరులు కాజేశారు. అప్పట్లో విజయా బ్యాంక్‌లో మైనార్టీస్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. ఆ కార్పొరేషన్‌కు–బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన ఈసీఐఎల్ కమలానగర్ వాసి కేశవరావు సహాయంతో ఆ కథ నడిపాడు. దాదాపు 240 నకిలీ చెక్కులతో 16 బోగస్ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. వీటిలో దాదాపు రూ.20 కోట్లు వరకు సాయి తన వాటాగా తీసుకున్నాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!) సీఐడీకి చిక్కడంతో.. మైనారిటీస్ కార్పొరేషన్ కుంభకోణంలో వచ్చిన రూ. 20 కోట్లనుంచి సాయి .. రూ.8 కోట్లను ఏబీసీ టీవీ పేరుతో ఓ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి వెచ్చించాడు. దానికోసం హైదరాబాద్‌లో ఓ భవనాన్ని లీజుకు తీసుకుని దాన్ని ఆధునీకరించడంతో పాటు కావాల్సిన ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇందులో పనిచేయడానికోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారికి జీతాల అడ్వాన్సులుగా భారీ మొత్తాలు చెల్లించాడు. అయితే ఆ చానల్ కార్యరూపం దాల్చకముందే మైనార్టీ కార్పొరేషన్ స్కామ్‌లో ఉమ్మడి రాష్ట్ర సీఐడీకి చిక్కాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం) ఆ కేసు దర్యాప్తులో చానల్ ఏర్పాటు యత్నాలను సీఐడీ అధికారులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల నుంచి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.20 కోట్ల వరకు తీసుకున్న సాయి కుమార్ ఇందులోంచి కొంత డబ్బును యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరో స్కామ్ చేసినప్పుడు సంపాదించే సొమ్ముతో దాన్ని శాటిలైట్ చానల్‌గా మార్చాలని సాయి పథకం వేసినట్లు తెలిసింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: కదులుతున్నడొంక..
నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ చార్జ్ బిల్ కలెక్టర్ పృథ్వీరాజ్, పీహెచ్ వర్కర్ కొండయ్య, రిటైర్డ్ పీహెచ్ వర్కర్ వెంకులును అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అరెస్టు అయిన వారిలో పీహెచ్ వెంకులు ఇప్పటికే రిటైర్ అయినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో రషీదులుపై మనీ వాల్యూయేషన్ పుస్తకాలను ఆడిట్ అధికారుల కంటపడకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, 2015లో బయటకొచ్చిన ఈ ఉదంతంలో రూ. 5.04 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది అధికారులు ఇప్పటికే సెలవుల్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు తమ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్ -
స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకున్న నగదు అక్రమాల కేసులో గురువారం పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది బీవోబీ ఉద్యోగులు, మెసెంజరు సయ్యద్ అలీఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బీవోబీలో స్వయం సహాయక సంఘాల నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది ప్రమేయంతో మెసెంజరు రూ.1.6కోట్ల (ఎస్‌హెచ్‌జీ) నిధులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కొల్లగొట్టడం, నకిలీ పత్రాలు, పాస్వర్డ్లు వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అక్రమాలకు పాల్పడ్డారని తేలిన 16 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.20లక్షలు, మెసెంజరు అలీఖాన్‌కు చెందిన రూ.48.16లక్షలు విలువ చేసే 1.12 కిలోల తాకట్టు బంగారు నగల పత్రాలు, ఎనిమిది ఖాతాలను ఫ్రీజ్ చేసి, మూడు ద్విచక్రవాహనాలు, 12 సెల్ఫోన్లు మొత్తం రూ.70.20లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. కాగా మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. -
రైతులకు అందాల్సిన నిధులు మింగేసిన అధికారులు
-
గాంధీ కుటుంబానికి ‘కట్ మనీ’
కారైక్కల్/సాక్షి, చెన్నై: పుదుచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,000 కోట్ల నిధుల నుంచి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి కట్ మనీ పంపించారని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్లే పుదుచ్చేరితోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమయ్యిందని తేల్చిచెప్పారు ఆదివారం పుదుచ్చేరిలోని కారైక్కల్‌లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ప్రతిభావంతులకు చోటు లేదని విమర్శించారు. 2016లో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపించిన నమశ్శివాయంను కాదని, నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలకు నారాయణస్వామి కట్టుబానిస అని ఆక్షేపించారు. కమల వికాసాన్ని అడ్డుకోలేరు పుదుచ్చేరిలో ఈసారి బీజేపీని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలో భారతదేశ ఆభరణంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారాయణస్వామి గాంధీ కుటుంబ సేవలో తరించడం తప్ప ప్రజలకు చేసేందేమీ లేదని తప్పుపట్టారు. పుదుచ్చేరి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గాంధీ కుటుంబానికి చేరవేశారని, ఆఖరికి ఎస్టీ, ఎస్టీల నిధులను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గొప్ప భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. స్పీకర్ శివకొళుందు రాజీనామా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ శివకొళుందు ఆదివారం పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను అందజేశారు. -
పర్యాటకంలో ‘పచ్చ’దొంగలు
సాక్షి,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించి అనేక ఉత్సవాల్లో కోట్లు నిధులు దుర్వినియోగమయ్యాయి. అప్పట్లో గుంటూరు జిల్లా కలెక్టర్ బ్లాక్ లిస్టులో పెట్టిన ఒక కాంట్రాక్టర్‌కు రూ.1.40 కోట్లు సొమ్ము చెల్లించిన కేసులో గుంటూరు జిల్లాలో పర్యాటక అధికారి హీరాపఠాన్ అరెస్టు అయిన విషయం విదితమే. వాస్తవంగా అప్పట్లో జరిగిన ఉత్సవాల వ్యయం పైనా సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్వహించిన ఉత్సవాలు ఇవే... విభజన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెడతానంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చలివిడిగా పర్యాటక ఉత్సవాలు నిర్వహించారు. ఏపీటీఏను చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. ఇందులో పనిచేసే అధికారులంతా టీడీపీ సానుభూతిపరులే. కాంట్రాక్టు పద్ధతిలో కీలకపదవుల్ని అదిష్టించి నిధులు పర్యాటకాభివృద్ధి పేరుతో తమ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టారు. గత ఐదేళ్లలో నావిషో, ఎయిర్‌షో, సంక్రాంతి సంబరాలు, ఇంటర్నేషనల్ మెగా ఫెస్టివల్, బుద్ద జయంతి, దీపావళి ఉత్సవాలు, నాగాయలంక బీచ్ ఫెస్టివల్, సోషల్‌మీడియా సమిట్, అమరావతి ధియేటర్ పెస్టివల్, పెలికాన్ బర్ట్స్, గోబెల్శాంతి, మసూలబీచ్ పెస్టివల్, ఎఫ్1హెచ్2ఓ, కొండపల్లి ఉత్సవాలు, కొటప్పకొండ ఉత్సవాలు, కొండవీడు ఉత్సవాలు, సూర్యలంక బీచ్ ఫెస్టివల్ తదితర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలన్నీ 2017 తరువాతనే జరిగాయి. ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు ఒకొక్క ఉత్సవానికి రూ.2 నుంచి రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలన్నీ అధికారుల జేబు సంస్థలే. ఏలూరులోని ఒక సంస్థ ఎక్కువ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఈ సంస్థ ఏపీటీఏలోని ఆర్డీ అండ్ ఈడీలోని కీలక అధికారికి చెందినదిగా ఆ సంస్థలోనే సిబ్బందే చెబుతున్నారు. కనీసం వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వకుండానే ఈ సంస్థలు ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీకు చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, స్పీకర్లకు ఈ సంస్థ ప్రతినిధులకు సన్నిహిత సంబధాలు ఉండటం వల్ల వర్క్ ఆర్డర్ లేకపోయినా ఉత్సవాలు నిర్వహించారని ఏపీటీఏలో చర్చ జరుగుతోంది. రికవరీ చేస్తారా? గత ప్రభుత్వ హయాంలో నిధులు లేకపోయినా ఉత్సవాలు నిర్వహించేశారు. ఇప్పుడు ఆయా బిల్లులను ఏపీటీఏ అధికారులు అప్లోడ్ చేసి సొమ్ము చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగానే 2019 మార్చిలో నిర్వహించిన కొండవీటి ఉత్సవాల బిల్లులు మంజూరు చేయించారు. ఈ ఉత్సవాల్లోనూ ఏలూరుకు చెందిన సంస్థ కొంత పనిచేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అడ్డగోలుగా చెల్లించిన రూ.1.40 కోట్లు ఏవిధంగా కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ కాంట్రాక్టర్‌కు టీడీపీ నేతల పెద్దల ఆశీస్సులు ఉండటం గమనార్హం. పర్యాటకాభివృద్ధి తక్కువే... సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుల సంఖ్య తక్కువే. ఉత్సవాల్లో ఎక్కువగా అధికారులు, ఈ జిల్లా ప్రాంత వారే కనపడేవారు. వాస్తవంగా అప్పట్లో జరిగిన పర్యాటక ఉత్సవాలను ప్రజలు కూడా మరిచిపోయారు. ఇదే సొమ్ముతో భవానీద్వీపం లేదా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధిచేసి ఉంటే స్థానిక ప్రజలకు ఉపయుక్తంగా వుండేది. -
పసుపు–కుంకుమ నిధుల స్వాహా!
సాక్షి, అమరావతి: పసుపు పార్టీ నాయకులు ‘పసుపు–కుంకుమ’లో పెద్ద మాయ చేశారు. ఎన్నికలకు ముందు వారి అధినాయకత్వం మహిళల ఓట్ల కోసం గాలం వేస్తే.. ఆ నిధులను నొక్కేయడంలో స్థానిక నాయకులు చేతివాటం ప్రదర్శించారు. యానిమేటర్లతో కుమ్మక్కై డ్వాక్రా మహిళలకు దక్కాల్సిన సొమ్మును మింగేశారు. ఇందు కోసం భారీ స్కెచ్ వేశారు. నకిలీ ఖాతాలు సృష్టించారు. సంఘాల్లో అదనంగా కొత్తవారి పేర్లను చేర్చారు. అర్హులకు అందాల్సిన మొత్తాన్ని దారి మళ్లించి.. దోపిడీకి పాల్పడ్డారు. తమ ఖాతాల్లో సొమ్ము పడలేదని సంఘ సభ్యులు డీఆర్డీఏకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే డీఆర్డీఏ సిబ్బందికి కూడా ఈ అవినీతి వ్యవహారంలో భాగస్వామ్యం ఉండటమే. ఇప్పుడు దీనిపై విచారణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన పసుపు–కుంకుమ నిధుల్లో చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యానిమేటర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు కుమ్మక్కై డ్వాక్రా సంఘాల నిధులను స్వాహా చేశారు. అప్పటి అధికార పార్టీ నాయకులు, సీసీ (కమ్యూనిటీ కో–ఆర్డినేటర్) అండ తో పలు సంఘాలకు దక్కాల్సిన నిధులను నకిలీ ఖాతాలు సృష్టించి దారి మళ్లించారు. కొత్తగా సభ్యులను చేర్చి.. జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మొదటి దశలో పసుపు–కుంకుమ పథకం కింద 60,903 గ్రూపులకు రూ.590.09 కోట్ల నిధులు చెల్లించారు. రెండో దశలో 67,628 గ్రూపులకు రూ.646 కోట్ల నిధులను జమ చేశారు. అయితే ఈ నిధులను టీడీపీ నేతల కనుసన్నల్లో యానిమేటర్లు నకిలీ ఖాతాల్లోకి మళ్లించడంతో పాటు కొత్త గ్రూపుల్లో అదనంగా సభ్యుల పేర్లను చేర్చి నిధుల దోపిడీకి పాల్పడ్డారు. ఉదాహరణకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొత్తగా ఆయా గ్రూపులోకి 20 మంది సభ్యుల పేర్లు చేర్చి నిజమైన అర్హుల సొమ్మును స్వాహా చేశారు. దీనిపైన ఫిర్యాదులు రావడంతో విచారణ జరిగింది. అయితే విషయాన్ని బయటకు రాకుండా స్థానిక యానిమేటర్‌తో పాటు, విచారణ సిబ్బందితో కుమ్మకై డ్వాక్రా మహిళలకు డబ్బు చెల్లించి విషయం బయటకు పొక్కకుండా చేశారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు 60 మంది సభ్యులకు రావాల్సిన సొమ్మును మింగేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సైతం ఇలాంటి ఘటనలు జరిగినట్టు సమాచారం. పట్టించుకోని డీఆర్డీఏ సిబ్బంది.. జిల్లాలో పలు ప్రాంతాల్లో పసుపు–కుంకుమ నిధులు తమ ఖాతాల్లో జమకాలేదని ఫిర్యాదులు వచ్చినా.. డీఆర్డీఏ సిబ్బంది విషయం బయటకు రాకుండా స్థానిక టీడీపీ నాయకుల అండతో మేనేజ్ చేసినట్లు సమాచారం. అయితే గ్రామాల్లో పసుపు–కుంకుమ నిధులు చెల్లించిన మహిళా సంఘాల జాబితాలను పంచాయతీ కార్యాలయల వద్ద ప్రదర్శిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి అవినీతి పాల్పడిన యానిమేటర్, డీఆర్డీఏ సిబ్బంది బాగోతం బయటకు వస్తుందనే చర్చ మహిళా సంఘాల సభ్యుల్లో జోరుగా సాగుతోంది. విచారణ జరిపితే.. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో ఉన్న 67,268 గ్రూపులకు పసుపు–కుంకుమ కింద చెల్లించిన మొత్తంపై దాదాపు 10 శాతం గ్రూపుల నిధుల విషయంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్‌తోపాటు, 12 మున్సిపాల్టీల్లో 24,160 సంఘాలకు జమ అయిన నిధులపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పలువురు డ్వాకా గ్రూపు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో కదిలిన డొంక గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రైలు పేటలోని దుర్గాసాయి మహిళ మండలికి గ్రూపునకు పసుపు–కుంకుమ కింద లక్ష రూపాయలు విడుదలయ్యాయి. అయితే సాంకేతిక సమస్యలను సాకుగా చూపి యానిమేటర్ నకిలీ ఖాతాలకు మళ్లించింది. సదరు గ్రూపు సభ్యులకు నిధులు రాలేదని మాయ మాటలు చెప్పింది. అనుమానం వచ్చిన గ్రూపు సభ్యులు గోరంట్లలోని మెప్మా హెడ్ ఆఫీసుకు వెళ్లి అధికారులను నిలదీశారు. రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులకు నిధులు జమయ్యాయని చెప్పారు. దీంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు అవాక్కయ్యారు. వెంటనే యానిమేటర్‌ను నిలదీయడంతో విషయం బయటకి చెప్పొద్దని, వారి సంఘానికి మంజూరైన లక్ష రూపాయల నిధులను వెనక్కి ఇచ్చింది. అయితే ఆ యానిమేటర్ పరిధిలోనే మూడు సంఘాల సొమ్మును సాంకేతిక కారణాలను సాకుగా చూపి నొక్కేసినట్టు సమాచారం. వాస్తవానికి యానిమేటర్లను జన్మభూమి కమిటీల సిఫారసు మేరకు నియమించడం, డీఆర్డీఏలో పనిచేసే సీఓ అండ ఉండటంతో గోల్మాల్ విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో ఇంతకు ముందు కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో వేసిన నిధుల్లో సైతం అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నిధులున్నా.. జీరో!
ఈ తాగునీటి బోర్వెల్ వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీ చెరువు ప్రాంతంలో ఉంది. 260 కుటుంబాలకు తాగునీటిని సరఫరా చేసేది. తీవ్రవర్షాభావం, మండు వేసవి కావడంతో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ బోర్ వెల్‌నుంచి సక్రమంగా నీరు రావడం లేదు. పూడిక తీయించి మరమ్మతులు చేస్తే పూర్తిస్థాయిలో నీరు వస్తుంది. పంచాయతీకి చెందిన పీడీ ఖాతాలో(పర్సనల్ డిపాజిట్ అకౌంట్) తాగునీటి నిర్వహణకు సరిపడా నిధులున్నాయి. బోర్వెల్కు మరమ్మతులు చేసేందుకు డబ్బు డ్రా చేద్దామనుకుంటే డబ్బులున్న తమ పీడీ ఖాతాలో జీరో బ్యాలెన్స్ చూపిస్తుండటంతో అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. దీంతో ఆ బోర్వెల్ మరమ్మతుల పని గురించి ఆలోచించడం పక్కన పెట్టేశారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నెలకొంది. నెల్లూరు(అర్బన్): జిల్లాలోని 940 పంచాయతీల్లో సర్పంచ్ల పాలన గత ఆగస్టు ఒకటో తేదీతో ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలనలోనికి గ్రామాలు వెళ్లాయి. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులకు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు వినియోగిద్దామంటే పీడీ ఖాతాల్లో బ్యాలెన్స్ (నగదు) జీరో చూపిస్తోంది. దీంతో పంచాయతీల్లో పాలన నిర్వహిస్తున్న ప్రత్యేకాధికారి, సెక్రటరీ తమ జేబుల్లో నుంచి డబ్బు ఎందుకు తీసి ఖర్చుపెట్టాలంటూ పాలన గురించి పట్టించుకోవడం మానేశారు. సీఎఫ్ఎంఎస్ పేరుతో ప్రభుత్వం దగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమంటూ అన్ని శాఖాల లావాదేవీలను ట్రెజరీ ద్వారా నిర్వహించేందుకు సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) అనే నూతన విధానాన్ని దాదాపు ఏడాదిన్నర క్రితమే ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా జిల్లాలోని 940 పంచాయతీలు, 46 మండల పరిషత్‌లు, జెడ్పీ, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలకు చెందిన అన్ని రకాల నిధులు, డిపాజిట్లు, గ్రాంట్లు ట్రెజరీలో జమ చేయాలి. ఈ నిధులు సీఎఫ్ఎంఎస్ విధానం ద్వారా పీడీ ఖాతాల్లోనికి జమ కావాల్సి ఉంది. ఏ క్యాడర్‌లోనైనా, ఏ స్థాయి అధికారికి అయినా నగదు చెల్లింపులు ఈ సీఎఫ్ఎంఎస్ విధానంలో జరగాల్సిందే. అయితే మార్చి తరువాత అన్ని శాఖల నుంచి ట్రజరీకి బిల్లులు పంపినప్పుడు ఆన్లైన్లో సీఎఫ్ఎంఎస్ విధానంలో తీసుకుంటున్నాయి. ఇలా బిల్లులను యాక్సెప్ట్ చేసిన వెంటనే నిధులు విడుదల కావాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా పీడీ ఖాతాలన్నీ జీరో చూపిస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏమి చేయాలో అధికారులకు అర్థం కాక ఉన్నతాధికారులకు తమ బాధలు మొరపెట్టుకుంటున్నారు. ప్రధానంగా పంచాయతీశాఖ, జెడ్పీ అధికారులు గ్రామాల్లోని సమస్యలు తీర్చలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎన్నికల కోడ్ పేరుతో డ్రామాలాడుతోంది. ఈ నిధులను కూడా పసుపు–కుంకుమ పథకానికి టీడీపీ పాలకులు ఓట్ల రాజకీయంలో భాగంగా డైవర్ట్ చేశారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. చుక్క నీటికి ఇక్కట్లు వరుసగా మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయాయి. ప్రధానంగా మెట్టప్రాంతాలైన ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపురం, వింజమూరు, కలిగిరి, ఏఎస్‌పేట, మర్రిపాడు రాపూరు, సైదాపురం తదితర అనేక మండలాల్లో ప్రజలు చుక్క నీటికి అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ట్యాంకర్లపై ఆధారపడి జీవిస్తున్నారు. జనం నానా పాట్లు పడుతున్నారు. సర్పంచ్‌లు అధికారంలో ఉంటే ముందుగా తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించేవారు. తరువాత నిధానంగా బిల్లులు పెట్టుకుని డబ్బులు తీసుకునే వారు. ప్రత్యేకాధికారుల పాలన కావడంతో ఈ పరిస్థితి లేదు. చిరుద్యోగులైన కార్యదర్శులు తమ జేబులో నుంచి రూపాయి తీసి ఖర్చు చేసినా అవి తిరిగి వస్తాయనే నమ్మకం లేక మిన్నకుండిపోతున్నారు. దీంతో గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలన పడుతున్నాయి. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరో వైపు కలెక్టర్ స్పందించి ఈ పరిస్థితిని చక్కదిద్ది తమ సమస్యలు తీర్చాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. -
పేదలకు దక్కని పనులు.. నిధులు
సాక్షి, అమరావతి : నిరు పేదలకు చేతినిండా పని కల్పించి.. వారు నిశ్చింతగా జీవించేందుకు ఉద్దేశించిన ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పెద్దల జేబులు నింపే కార్యక్రమంలా మారిపోయింది. చేసేందుకు పనిలేక, పస్తులుండలేక కుటుం బంతో కలసి పనులు వెతుక్కుంటూ పేదలు వలసపోతున్నారు. పేదలకు దక్కాల్సిన ఉపాధి హామీ పనులను, నిధులను కొట్టేయడానికి అధికారపార్టీ నేతలు అనేక ఎత్తులు వేస్తున్నారు. మెషీన్లతో పనులు చేయించి కూలీల పేరుతో బిల్లులు మంజూరు చేయించుకోవడం, పనులు చేయకపోయినా చేసినట్లు చూపించడం, చేసిన పనులే మరలా చేసినట్లు చూపించడం వంటి అక్రమాలకు అంతే లేదు. ఏడాదిన్నర క్రితమే కృష్ణా పుష్కరాలు ముగిసినా ఉపాధి నిధుల నుంచి ఇంకా బిల్లులు మంజూరవుతూనే ఉన్నాయి. ఇక అధికారపార్టీకి చెందిన పెద్దలు సూచించిన గ్రామాలకు కోట్ల రూపాయల మేర పనులు మంజూరవుతుండగా పనులు అవసరం ఉన్న గ్రామాలకు మాత్రం మొండిచేయే దక్కుతోంది. అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్న చోట్లనయినా నిరుపేద కూలీలకు పనులు లభిస్తున్నాయనుకుంటే పొరపాటే. అక్కడ పచ్చచొక్కాలకు అనుకూలురైన కూలీలకు మాత్రమే పనులు. మిగిలినవారికి పస్తులే.. గొల్లపూడిలో రూ.1.30 కోట్ల దోపిడీ కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో∙పుష్కరాల పేరుతో రూ. కోటి ఉపాధి నిధులకు బిల్లులు చేసుకున్నారు. విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై గొల్లపూడి వన్ సెంటర్ నుంచి పుష్కరఘాట్‌కు ఎప్పటి నుంచో రోడ్డు ఉంది. దాదాపు కిలో మీటరు పరిధిలో ఉండే ఈ రోడ్డు గ్రామం పరిధిలో ఉన్నంత వరకు సిమెంట్ రోడ్డు, ఆ తర్వాత పుష్కర్‌ఘాట్ వరకు మెటల్ రోడ్డు ఉండేది. 2016 ఆగస్టులో కృష్ణా పుష్కరాల సందర్భంగా కన్స్ట్రçక్షన్ ఆఫ్ రూరల్ రోడ్సు(సీఆర్ఆర్) గ్రాంట్‌లో అదే రోడ్డు అధునీకరణకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో పుష్కరాల సమయంలోనే గొల్లపూడి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డును వెడల్పు చేశారు. ఆ తర్వాత ఉన్న మెటల్ రోడ్డుపై తారు రోడ్డు వేశారు. అయితే, ఆ ప్రాంతంలో కొత్తగా మెటల్ రోడ్డు నిర్మించినట్టు రికార్డులు రాసుకొని ఉపాధి పథకం నిధుల నుంచి రూ.77.76 లక్షలు బిల్లులు చేసుకున్నారు. సిమెంట్ రోడ్డు వెడల్పు, తారు రోడ్డు నిర్మాణం పుష్కరాలు జరిగిన 2016 ఆగస్టు నాటికే పూర్తయినప్పటికీ, అక్కడ మెటల్ రోడ్డు నిర్మాణానికి 2017 జులై 14, 23, 27 తేదీల్లో కూడా రూ. 72.88 లక్షలు ఉపాధి నిధుల నుంచి అధికారులు బిల్లులు చెల్లించారు. (పైన కనిపిస్తున్న చిన్న సాగునీటి కాలువ కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలంలోని రామకృష్ణాపురంలోనిది. ఇందులో ఏకంగా 1,470 మంది కూలీలతో డ్రగ్ అవుట్ ఫాండ్ నిర్మాణం చేపట్టినట్టు బిల్లులు చేసుకుని అధికార పార్టీ పెద్దలు కోట్లు తినేశారు.) పనులు లేక వలసపోతున్న పేదలు పేదలకు కూలి పనులు కల్పించడం కోసం కేంద్రమిచ్చే నిధులను ఏదో ఒక పేరు చెప్పి పెద్దలు తమ జేబుల్లోకి మళ్లించుకుంటుంటే గ్రామాల్లో నిరుపేదలు సొంత వూరిలో పనులు దొరక్క వలస పోతున్నారు. విశాఖపట్నం జిల్లా రామకతం మండలం మేడివాడ, దేవరపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు 20 రోజుల కిత్రం పనులను వెతుక్కుంటూ కృష్ణా , గుంటూరు జిల్లాలకు వలస వచ్చాయి. అందులో మేడివాడకు చెందిన తాతారావు, చిన్నారావు – లక్ష్మీ కుటుంబాలతో పాటు మరో ఐదు కుటుంబాలు తాము పని వెతుక్కుంటూ వచ్చిన గారపాడు గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తి కావడంతో తిరుగు ప్రయాణం కోసం శనివారం విజయవాడ రైల్వే సేష్టన్‌లో వేచి ఉన్నారు. సొంత ఊరిలో ఉపాధి పనులు లేకపోవడం వల్లే తాము పనులు వెతుక్కుంటూ పొరుగూరికి రావాల్సి వచ్చిందని లక్ష్మీ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. పచ్చచొక్కాలకు నచ్చిన వారికే కూలిపని అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో కూలీలకు పనులు కల్పిస్తున్నా... అక్కడ టీడీపీ నేతలదే ఇష్టారాజ్యం. వారు చెప్పినవారికే పనులు. కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వడ్డే రాజు 2007లోనే గ్రామంలో ఉపాధి కూలీగా పేరు నమోదు చేసుకున్నారు. గ్రామంలో కూలీల జాబితాలో అతనిది నాల్గో నెంబరు. గతేడాది వడ్డే రాజు ఆరు రోజులు పాటు పని చేసినట్టు చూపి గ్రామంలో టీడీపీ నేతే బిల్లులు చేసుకున్నారు. సోషల్ ఆడిట్ విచారణలో రాజు తాను పనిచేయలేదని, దొంగ బిల్లులు చేసుకున్నారని చెప్పడంతో గ్రామంలో టీడీపీ నేతలు, వారికి అనుకూలంగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ కక్షగట్టారు. ఈ ఏడాది రాజు ఎన్నిసార్లు పని అడిగినా ఒక్క రోజు కూడా అతనికి పని కల్పించలేదు. గ్రామంలోని దాదాపు 20 శ్రమశక్తి సంఘాలకు ఈ ఏడాది ఒక్క రోజు కూడా పని కల్పించలేదని అక్కడి కూలీలు చెబుతున్నారు. చేయని పనులకు బిల్లులు గుంటూరు జిల్లా యడ్లపాడు మండల కేంద్రాన్ని అనుకొని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో రెండు పనులు (పనుల గుర్తింపు నెంబర్లు 071103710008170461, 071103710008170463) చేసినట్టు ఒక పనికి రూ. 4.41 లక్షలు, మరొక పనికి రూ. 3.20 లక్షలు చొప్పున బిల్లులు చేసుకున్నారు. ఆ చెరువులో ఈ వేసవిలో 50 మంది కూలీలతో రెండు వారాల పాటు లక్ష రూపాయల పనిచేసినట్టు ఆ పనిలో పాల్గొన్న కూలీ ఒకరు సాక్షి ప్రతినిధికి తెలిపారు. కర్నూలు జిల్లా క్రిష్టగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో 1470 మంది కూలీలతో డ్రగ్ఆవుట్ పాండ్ నిర్మాణం చేపట్టినట్లు రికార్డుల్లో పేర్కొని బిల్లులు చేసుకున్నారు. పని నెంబరు 131812805005170238. ఆ పని ఎస్టిమేట్స్ కాపీలో పేర్కొన్న జియోట్యాగింగ్ వివరాలు చూస్తే ఆ ప్రాంతంలో పని జరిగిన దాఖాలాలు లేవు. అది సాగునీటి శాఖ పరిధిలోని ఓ ప్రధాన పంట కాల్వ అని జియో ట్యాగింగ్‌లో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగునీటి శాఖ ప్రధాన పంట కాల్వలో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టరు. ఒకవేళ పనులు చేపట్టాలంటే ముందుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతి తీసుకున్న దాఖాలు లేవు. అయినా అక్కడ పనిచేసినట్టు బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి. లోకేష్ పీఏ ఊరికి రూ.3.48 కోట్లు.. ఉపాధి పథకం అమలు మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత సహాయకుడి సొంత ఊరు తిమ్మాపురం గ్రామానికి ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో రూ. 3.48 కోట్లు ఉపాధి నిధుల బిల్లులు మంజూరయ్యాయి. తిమ్మాపురం గ్రామంలో 1167 జాబ్‌కార్డులుండగా, పొరుగు గ్రామం వంకాయపాడులో 1577 జాబ్‌కార్డులున్నాయి. కానీ ఆ గ్రామానికి ఈ ఏడాది మంజూరు అయిన నిధులు కేవలం రూ. 23 లక్షలే. అదే మండలంలో మరో 17 గ్రామాలున్నా మరే గ్రామానికీ రూ. కోటి నిధులు మంజూరు కాలేదు. తిమ్మాపురంలో ఒకే సిమెంట్ రోడ్డును చూపి రెండు పనులకు బిల్లులు చేసుకున్నారు. ఫాంపాండ్స్‌లో రూ. 1,165 కోట్లు పోశారు.. ఉపాధి హామీ పథకంలో పంట కుంటలు(ఫామ్ పాండ్స్) నిర్మాణం ‘మెషిన్లతో పని– కూలీల పేరుతో బిల్లులు’ అన్న చందంగా మారింది. ఉపాధి పథకంలో చేపట్టే పనుల్లో మెషిన్ల వాడకం పూర్తిగా నిషేదం. కూలీల ద్వారానే పనులు చేపట్టాలి. కూలీల ద్వారా జరిగే పనుల విలువను బట్టి .. 60 శాతం కూలీలకు, 40 శాతం మెటిరీయల్ వినియోగానికి కేంద్రం నిధులు ఇస్తోంది. కూలీలతో ఎక్కువ పని జరిగినట్టు చూపించాలని ప్రభుత్వం అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మెషీన్ల సహాయంతో ఫామ్ పాండ్స్ నిర్మాణం చేపట్టినా ఆ పనిని కూలీలతోనే చేయించినట్లు రికార్డుల్లో చూపి కూలీల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. ఈ రకమైన అవినీతి దాదాపు రాష్ట్రమంతటా విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ మూడేళ్లలో ఫాండ్పామ్స్ పేరుతో రూ. 1,165 కోట్ల మేర మెషిన్లతో పనిచేయించి, కూలీల పేరుతో బిల్లు చేసుకున్నారు. – గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలో రైతుల పొలాల్లో అప్పటికే ఉన్న వ్యవసాయ బావులను కూడా ఫామ్ పాండ్స్‌గా చూపి బిల్లులు చేసుకున్నారు. పాలపాడుగ్రామంలో 2016 –17 ఆర్థిక సంవత్సరంలో 30 ఫామ్ పాండ్స్ త్రవ్వకాలు జరిగినట్లు చూపి బిల్లులు చేసుకున్నారు. దీనిని సోషల్ ఆడిట్ బృందం గుర్తించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. –విజయవాడ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది, స్థానిక అధికార పార్టీ నేతలు దేవస్థానం భూముల్లో ఫామ్‌పాండ్స్ తవ్వినట్టు చూపి బిల్లు చేసుకుంటున్నారు. పోరంకిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఫామ్ పాండ్ నిర్మాణం చేపట్టినట్టు చూపి రూ. 16,700 బిల్లులు చేసుకున్నారు. ఉపాధి హామీ పథకం అమలుకు గత మూడేళ్లలో రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు సంవత్సరం ఇచ్చిన మొత్తం(రూ. కోట్లలో) 2016–16 3,073.80 2016–17 3,940.21 2017–18(ఇప్పటి వరకు) 4,458.63 -
నిధులు గోల్మాల్?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మండల సమాఖ్యలు, గ్రామైక్య సంఘాల బలోపేతం కోసం 2000-2001లో ప్రపంచ బ్యాంకు సాయంతో కేంద్రప్రభుత్వం రూ. 30.7కోట్ల సామాజిక పెట్టుబడి నిధిని డీఆర్డీఏకు విడుదల చేసింది. వీటిని సాధారణ వడ్డీకి గ్రామైక్యసంఘాలకు రుణాలివ్వాలని, రుణం తీసుకున్న సంఘాలు తిరిగి 100 వాయిదాల్లో ప్రతీ నెలా మండల సమాఖ్యలకు వడ్డీతో కలిపి చెల్లించాలని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనివల్ల స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా రుణాలపై వచ్చే వడ్డీతో మండల సమాఖ్యలు నిర్వహించుకోవాలన్నది లక్ష్యం. కానీ జిల్లాలో సామాజిక పెట్టుబడి నిధి లక్ష్యం నెరవేరలేదని తెలుస్తోంది. కొంత సొమ్మును వేరే అవసరాలకు సర్ధుబాటు చేయగా, మరికొంత సొమ్మును కొం దరు సిబ్బంది, అధ్యక్షులుగా చెప్పుకునే కొందరు కుమ్మక్కై స్వాహా చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తేలని రికవరీ లెక్కలు కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ. 30.7కోట్లు 1100గ్రామైక్య సంఘాలకు రుణాలుగా అందించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన కచ్చితమైన రికార్డుల్లేవు. ఇప్పటివరకు రూ. 6కోట్లవరకు రికవరీ జరిగినట్టు మాత్రమే చెబుతున్నారు. వడ్డీతో కలిపి ఇంకా రూ. 29.13కోట్ల మేరకు రావల్సి ఉందని చెబుతున్నారు. ఇందులోనూ వాస్తవాలు కనిపించడంలేదు. చాలా వరకు సంఘాలకు రుణం సొమ్ము వెళ్లకుండా మధ్యలోనే స్వాహా అయిపోయిందని, ఆ కారణంగానే ఇంతవరకు రికవరీ జరగలేదని తెలుస్తోంది. సంఘం సభ్యులకు తెలియకుండా అధ్యక్షులు, సిబ్బంది కుమ్మక్కై పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా గ్రామైక్య సంఘాలకు ఇచ్చినట్టయితే ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేవి. రికవరీ కన్పించేది. దీనికి సంబంధించి స్పష్టమైన లెక్కలు లేకపోవడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. వసూలైన రూ. 10కోట్లు వేరేవాటికి సర్దుబాటు సక్రమంగా లావాదేవీలు జరిగిన సంఘాల నుంచి వసూలైన నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా వేరే అవసరాలకు సర్దుబాటు చేశారు. సుమారు రూ. 10కోట్ల వరకు స్వయం సహాయక సంఘాల సభ్యుల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద మళ్లించారు. వాస్తవానికైతే, స్వయం సహాయక సంఘాల నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం వసూలు చేసి కట్టాలి. కానీ, నాటి డీఆర్డీఏ అధికారులు గొప్పకు పోయి స్వయం సహాయక సంఘాల సభ్యులందరి నుంచి ప్రీమియం వసూలు చేసినట్టు చూపించి, సామాజిక పెట్టుబడి నిధి నుంచి రూ. 10కోట్లు వేరు చేసి కట్టేశారు. ఆ తర్వాత తీరికగా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంను చాలా వరకు సంఘాల సభ్యులనుంచి వసూలు చేసినట్టు తెలిసింది. కానీ, రికార్డుల్లో మాత్రం అదేదీ చూపించలేదు. ఆ ప్రీమియం ఇంకా వసూలు చేయాల్సి ఉందని సంబంధిత ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ వసూళ్లలోనూ స్వాహా జరిగిందన్న వాదనలు ఉన్నాయి. మొత్తమ్మీద మళ్లింపు, రుణబకాయిల కింద మండల సమాఖ్యలకు రావాల్సిన రూ. 30కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. ఆర్థిక వెతల్లో సమాఖ్యలు అటు అసలు, ఇటు వడ్డీ రాకపోవడంతో మండల సమాఖ్యలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రతీ మండల సమాఖ్యలో ఒక అకౌంటెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. వారి జీతాలు, కార్యాలయ విద్యుత్‌బిల్లు మండల సమాఖ్యలే చెల్లించాలి. ఇలా ప్రతీ నెలా రూ. 20వేలకు పైబడి ఖర్చు ఉంటుంది. ఇదంతా సామాజిక పెట్టుబడి నిధి వడ్డీ నుంచే వెచ్చించాలి. గ్రామైక్య సంఘాల నుంచి రికవరీ లేకపోవడంతో ఇప్పుడా ఖర్చులు భరించలేని స్థితిలో మండల సమాఖ్యలున్నాయి.