నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ చార్జ్ బిల్ కలెక్టర్ పృథ్వీరాజ్, పీహెచ్ వర్కర్ కొండయ్య, రిటైర్డ్ పీహెచ్ వర్కర్ వెంకులును అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అరెస్టు అయిన వారిలో పీహెచ్ వెంకులు ఇప్పటికే రిటైర్ అయినట్లు తెలుస్తోంది.
అరెస్టు అయిన వారిలో రషీదులుపై మనీ వాల్యూయేషన్ పుస్తకాలను ఆడిట్ అధికారుల కంటపడకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, 2015లో బయటకొచ్చిన ఈ ఉదంతంలో రూ. 5.04 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది అధికారులు ఇప్పటికే సెలవుల్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు తమ సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment