Telugu Academy
-
రెండేళ్లలో 13.37 లక్షల పుస్తకాల ముద్రణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక అకాడమీ ప్రచురణలను మార్కెట్లోకి తీసుకొచ్చి నట్టు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి, ఉన్నత విద్యకు అవసరమైన విజ్ఞాన సంపదను అందించేందుకు అకాడమీ విశేష కృషి చేస్తోందన్నారు. గురువారం వడ్డేశ్వరంలోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అకాడమీ విభజన పూర్తయిన తర్వాత ఏపీలో సేవలు ప్రారంభించిన రెండేళ్లలో రూ. 21 కోట్ల విలువైన 13.37 లక్షల పుస్తకాలను ముద్రించామన్నారు. డీఎస్సీ, బీఈడీ, టెట్, ఏపీపీఎస్సీతో పాటు వివిధ రకాల పోటీ పరీక్షల సిలబస్‌తో 67 రకాల పుస్తకాలకు సంబంధించి 3 లక్షల కాపీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. వీటితో పాటు 10.37 లక్షల ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలను ముద్రించడం ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ధరకు స్టడీ మెటీరియల్స్ అందించామన్నారు. ఆంగ్లం, ఇతర భాషల ద్వారా వాడుకలోకి వచ్చి న పదాలకు త్వరలోనే తెలుగు పదజాలాన్ని రూపొందిస్తామన్నారు. తెలుగు–సంస్కృతం–ఆంగ్లం కలగలిపిన త్రిభాషా పదకోశాన్ని (డిక్షనరీ) ముద్రిస్తామన్నారు. డిగ్రీ, పీజీ పాఠ్యప్రణాళికలకు తగ్గట్టుగా పుస్తకాలను ముద్రిస్తామన్నారు. ఇకపై అకాడమీ ప్రతి ముద్రణను తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవేశపెడుతుందన్నారు. బాబు స్వార్థానికి అకాడమీ బలి చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు తెలుగు అకాడమీ తీవ్రంగా నష్టపోయిందని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో తెలుగు అకాడమీ విభజనను పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కోర్టుకు వెళ్లి ఉమ్మడి అకాడమీ విభజన పూర్తి చేసి ఏపీ వాటా కింద రూ. 140 కోట్లు సాధించామన్నారు. కానీ, చంద్రబాబు అకాడమీ ప్రచురణలకు పాతరేసి నారాయణకు పాఠ్యపుస్తకాల ముద్రణను కట్టబెట్టడం ద్వారా భారీ రేట్లకు విక్రయించి రూ. కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియా అకాడమీ సేవలపై విషం చిమ్ముతోందన్నారు. తిరుపతి నుంచే తెలుగు, సంస్కృత అకాడమీలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. విజయవాడ కేంద్రంలో ఎక్కువ ముద్రణాలయాలు ఉండటంతో ప్రింటింగ్ ఉద్యోగులు మాత్రమే స్థానిక కార్యాలయంలో సేవలందిస్తున్నారన్నారు. త్వరలోనే తిరుపతిలో ఎస్వీ వర్సిటీ స్థలంలో తెలుగు, సంస్కృత అకాడమీ శాశ్వత భవనం నిర్మాణాన్ని చేపడతామన్నారు. -
డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ పురస్కారం
తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన పలువురు ప్రముఖులకు తెలుగు, సంస్కృత అకాడమీ పురస్కారాలు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో కవిత్వం-విమర్శ కేటగిరి కింద ఆల్ ఇండియా రేడియో న్యూస్ రీడర్ డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావుకు తెలుగు అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి పురస్కారం అందించారు. డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు కవిగా, రచయితగా, సాహిత్య విమర్శకునిగా, అనువాదకుడిగా, అధ్యాపకుడిగా, మీడియా గురుగా సుప్రసిద్ధులు. వివిధ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా పని చేసిన ఆయన వాడుక భాష, తెలుగు వ్యాక్యం ప్రధాన అంశాలుగా పలు విశ్వవిద్యాలయాల్లో వందల మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఉస్మానియా నుంచి ఎం.ఏ., హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్., తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశారు. తెలంగాణ పోరాట కథలపై ఎం.ఫిల్లో పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. తెలుగు కవిత్వంలో ఆధునికత, ఆవిర్భావ వికాసాలపైన చేసిన మౌలిక సాధికార పరిశోధన సాహితీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది. నిరంతర భాషా అధ్యయనం కారణంగా శాసన భాష నుంచి వర్తమాన సాహిత్యం వరకు అనేక అంశాలపై పలువేదికల నుంచి సమ్మెట ప్రసంగించారు. హైదరాబాద్‌లో తెలుగు సాహితీ సమితిని స్థాపించి నెల నెలా సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. రావిశాస్త్రి, డాక్టర్ కేశవరెడ్డి రచనలపై కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సదస్సులు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్‌లతో పాటు న్యూఢిల్లీ, పోర్ట్ బ్లెయిర్, తిరువనంతపురం, సిమ్లాలలో తెలుగు సాహిత్యంపై ప్రసంగించారు. కేంద్ర సాహిత్య అకాడమీకి చెందిన గిరిజన, మౌఖిక సాహిత్య కేంద్రంలో క్రియాశీల సభ్యుడిగా తెలుగు ప్రాంతాల గిరిజన సాహిత్యంపై విజయవాడలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాలలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సిమ్లాలో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య ఉత్సవంలో గోండుల కథలపై ప్రసంగించారు. కృష్ణా జిల్లా నెమ్మలూరుకు చెందిన డాక్టర్ సమ్మెట, నిడుమోలు, మచిలీపట్నం, హైదరాబాద్, రాజమండ్రిల్లో విద్యాభ్యాసం చేశారు. న్యూఢిల్లీలో ఆకాశవాణిలో తెలుగు న్యూస్ రీడర్‌గా పని చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో పని చేస్తున్నారు. పాతికేళ్ల పాటు కొన్ని వేల సార్లు ఆకాశవాణిలో ఉచ్చారణ దోషం లేకుండా వార్తలు చదవడం తన భాషా సేవలో భాగమని తెలిపారు. తెలుగు, సంస్కృత అకాడమీ అవార్డు తన బాధ్యత మరింత పెంచిందని డాక్టర్ సమ్మెట నాగమల్లేశ్వరరావు అన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి మూడేళ్లు
-
నిరుద్యోగుల్ని వేధిస్తున్న అకాడమీ పుస్తకాల కొరత
-
10 రోజుల్లో అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న లక్ష లాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలుగు అకాడమీ పుస్తకాలు మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల ప్రిటింగ్ కోసం ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్‌లకు శుక్రవారం ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావతరణ తర్వాత రూపకల్పన చేసిన పుస్తకాలనే ఈసారీ ప్రింటింగ్‌కు ఇచ్చినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. సిలబస్‌లో మార్పులు చేర్పులేం చేయలేదని, సమయం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని అకాడమీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్స్‌కు అవసరమైన సబ్జెక్టులతో పాటు బీఎడ్, ఇతర పుస్తకాలను ప్రింట్ చేయిస్తున్నారు. మొత్తం 45 రకాల పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రచురించబోతున్నారు. ఈ పుస్తకాలను ప్రింట్ చేయించాలని 2 నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా పేపర్ కొరత, అకాడమీలో నిధుల గోల్మాల్ వ్యవహారంతో ముద్రణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈలోగా గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలవ్వడంతో అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరిగింది. పోటీ పరీక్షల మెటీరియల్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలను అన్నివర్గాలు విశ్వసిస్తాయి. అయితే సరైన సమయంలో పుస్తకాలపై అకాడమీ దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారి తీసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుస్తకాల ముద్రణ చేపట్టింది. ముద్రణకు ఇచ్చిన పుస్తకాలు ఇవీ ఆర్థికాభివృద్ధి, పర్యావరణం, భారత రాజ్యాంగం, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక నిర్మితి–వివాదాలు–విధానాలు, తెలంగాణ ప్రాచీన చరిత్ర (ముంగిలి), భారత స్వాతంత్రోద్యమ చరిత్ర–3, భారత ప్రభుత్వం రాజకీయాలు–2, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రశ్నల నిధి చరిత్ర, భారత దేశ చరిత్ర–సంస్కృతి, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, జనరల్ స్టడీస్, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ అధ్యయనం, అంతర్జాతీయ సంబంధాలు వంటి పుస్తకాలతో పాటు మరికొన్నింటిని అకాడమీ ముద్రణకు పంపింది. -
గ్రూప్–1.. నో స్టాక్
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మెజార్టీ అభ్యర్థులు సాధన చేసే పుస్తకాలు తెలుగు అకాడమీవే. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ఈ పుస్తకాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. తెలుగు అకాడమీ కౌంటర్ వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అయితే తెలుగు అకాడమీ బుక్ కౌంటర్లో పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో పుస్తకాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. డిమాండ్ ఎక్కువ..లభ్యత తక్కువ సబ్జెక్టు ఏదైనా తెలుగు అకాడమీ పుస్తకాలకున్న ప్రాధాన్యతే వేరు. అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, విషయ నిపుణుల విశ్లేషణలతో కూడిన ఆ పుస్తకాలు పోటీ పరీక్షల్లో విజయానికి బాటలు వేస్తాయనే భావన అభ్యర్థుల్లో ఎప్పట్నుంచో ఉంది. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కావడం.. మొదటి నోటిఫికేషన్లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్న వారు సైతం దీర్ఘకాలిక సెలవులు పెట్టి గ్రూప్–1 నియామకాల కోసం సిద్ధమవుతుండటంతో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు సంబంధిత సిలబస్ ఉండే పుస్తకాలు సేకరించే పనిలో పడ్డారు. ఇతర పబ్లికేషన్స్ మాటెలా ఉన్నా తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కొత్తవి రావు.. తెలుగులో లేవు ఇంటర్వ్యూలను తొలగించడంతో గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు పరిమితమైంది. ఇందులో ప్రిలి మినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ర్యాంకింగ్‌లో ఈ మార్కులకు ప్రాధాన్యత లేనప్పటికీ మెయిన్ పరీక్షలకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు తప్పనిసరి. ఇక జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మార్కులు కూడా ర్యాం కింగ్ పరిధిలోకి రావు. ఈ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెలుగు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. కీలకమైన మెయిన్ పరీక్షల సబ్జెక్టు పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ పుస్తకాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్ పరీక్షల్లో మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 24 అంశాలతో కూడిన సిలబస్ ఉంది. అయితే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ వెర్షన్ పుస్తకాలు అందుబాటులో లేవు. చరిత్ర, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఇంగ్లిష్ వెర్షన్లో మాత్రమే అం దుబాటులో ఉన్నాయి. హిస్టరీ, హెరిటేజ్, కల్చర్ ఆఫ్ తెలంగాణ పుస్తకాలు లేవు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొత్త వెర్షన్ కూడా లేదు. అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఆంగ్లంలోనే ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు సమయం అత్యంత కీలకంగా మారింది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఔపోసన పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు అకాడమీలో లేని పుస్తకాల కోసం ఇతర పబ్లికేషన్ల వైపు పరుగులు పెడుతున్నారు. కొత్త పుస్తకాల స్టాకు రాలేదంటున్నారు పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉత్తమమని మా ప్రొఫెసర్ చెప్పడంతో వాటినే చదువుతున్నాను. ప్రస్తుతం గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. తాజా సమాచారంతో కూడిన పుస్తకాల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నా. కానీ కొత్త పుస్తకాల స్టాకు ఇంకా రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. వారి దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాల సెట్ ఒక్కో దానికి రూ.1,150 వసూలు చేస్తున్నారు. – డి. నర్సింగ్‌రావు, గ్రూప్–1 అభ్యర్థి, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా -
ఏపీకి పెండింగ్ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు అకాడమీ విజభన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ. 33 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే పిటిషన్‌కు వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతినిచ్చింది. కాగా, ఏపీకి ఇప్పటికే రూ. 92.94కోట్లు చెల్లించినట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. అయితే, మిగిలిన డబ్బు మొత్తానికి 6శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట -
ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం
‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది. ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు – ‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ ‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు. ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. వ్యాసకర్త మాజీ సంచాలకులు తెలుగు అకాడమి ‘ 93901 13169 -
‘తెలుగు అకాడమీ’ నిందితులపై సస్పెక్ట్ షీట్స్
సాక్షి, హైదరాబాద్: చుండూరి వెంకట కోటి సాయికుమార్... రూ.64 కోట్లతో ముడిపడి ఉన్న తెలుగు అకాడమీ కుంభకోణంలో కీలక సూత్రధారి. వెంకట రమణ, సోమశేఖర్ సహా మరికొందరితో కలిసి 2015 నుంచి ఈ తరహా స్కామ్స్ చేస్తున్నాడు. ఈ గ్యాంగ్ అరెస్టు కావడం, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ అదే పంథాలో నేరాలు చేయడానికి సరైన నిఘా లేకపోవడమే కారణమని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే సాయి కుమార్ సహా తెలుగు అకాడమీ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరవాలని నిర్ణయించారు. (చదవండి: పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..) ► రౌడీలపై రౌడీషీట్, చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్, సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్, భూకబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరవడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఇదే తరహాలో పదేపదే నేరాలు చేస్తున్న మోసగాళ్ల పైనా సస్పెక్ట్ షీట్స్‌ను తెరుస్తున్నారు. ► ఇప్పటి వరకు అసాంఘికశక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్స్‌లో స్వల్ప మార్పులతో సీసీఎస్ అధికారులు ఈ సస్పెక్ట్ షీట్లు నమోదు చేస్తున్నారు. వీటిలో సదరు నేరగాడికి సంబంధించిన ఫొటో, చిరునామా, నమోదై ఉన్న కేసులు, నేరం చేసే విధానం సహా పూర్తి సమాచారం పొందుపరుస్తారు. ► ఈ వివరాలను సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసుస్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఆయా చోట్ల పోలీసు అధికారులు మారినప్పటికీ వీరిపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. ► సస్పెక్ట్ షీట్ తెరిచిన తరవాత సాయి కుమార్ సహా ఇతర కీలక నిందితులపై స్థానిక పోలీసుల నిఘా కొనసాగుతుంది. మరోపక్క గస్తీ బృందాలు సైతం అనునిత్యం వారి ఇళ్లకు వెళ్లి కార్యకలాపాలు, కదలికల్ని పరిశీలిస్తుంటారు. సీసీఎస్ పోలీసులు సైతం కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈ నిందితుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ► ఇలాంటి షీట్లను తెరవడానికి సదరు కార్యాలయానికి పోలీసుస్టేషన్ హోదా ఉండటం తప్పనిసరి. సీసీఎస్‌తో పాటు సైబర్ క్రైమ్ ఠాణాకు సైతం ఈ హోదా ఉంది. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటు ఆధారంగానే సాయి, వెంకట రమణ తదితరులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నారు. (చదవండి: తెలంగాణ జైళ్లలో యువత; ఉజ్వల భవిత.. ఊచల వెనక) ► మరోపక్క తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన కీలక నిందితుల్లో బయటి రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి నేర చరిత్ర లేని వీరు బయటి ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై ఇక్కడ షీట్ తెరిచినా ఉపయోగం లేదు. ► దీన్ని పరిగణలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇలాంటి నేరగాళ్ళపై షీట్లు తెరవడంతో పాటు ఆ వివరాలను వారు నివసిస్తున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలోని వస్తుందో ఆ జిల్లా ఎస్పీలకు లేఖ ద్వారా నివేదించనున్నారు. అందులో నేరగాడి చరిత్ర రాయడంతో పాటు నిఘా ఉంచాల్సిందిగా కోరనున్నారు. ► ఈ తరహా మోసాలకు పాల్పడిన సస్పెక్ట్ షీటర్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లలో ఉంచడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం సాధ్యం కాదనే వాదన ఉంది. సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరిచూసుకోవడం సాధ్యం కాదు. ► ఇలాంటి వారి వివరాలను పోలీసు అధికారిక వెబ్సైట్లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఎవరికైనా వీరిపై అనుమానం వస్తే సరి చూసుకోగలుగుతారు. -
పరిచయాలే పావుగా వాడుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ల స్కాంలో మరో ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన యోహాన్ రాజు, స్కామ్ సొమ్ము డిపాజిట్ చేయించుకున్న ఆయన భార్య ప్రమీలరాణిని విజయవాడ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 13కు చేరింది. మరోవైపు సూత్రధారి సాయితోసహా ఆరుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు తదు పరి విచా రణ కోసం శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా..: విజయవాడలోని చిట్టినగర్‌లో ఉన్న ప్రైజర్‌పేట పెద్దిరాజులవారి వీధికి చెందిన పూసలపాటి యోహాన్ రాజుకు మం దుల దుకాణం ఉంది. స్నేహితులు, పరిచయస్తుల్లో అనేక మందికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుం టాడు. ఇలా ఇతడికి అనేక బ్యాంకులకు చెందిన మేనేజర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో విజయవాడలోని ఆంధ్రా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసిన మస్తాన్ వలీతోనూ రాజుకు పరిచయ మైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనంతో నగరానికి బదిలీపై వచ్చిన మస్తాన్ వలీ సంతోష్‌నగర్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా పని చేస్తూ కార్వాన్ బ్రాంచ్ బాధ్యతలూ నిర్వర్తించాడు. ఈ స్కాం సూత్రధారి సాయికుమార్‌కు వెంకట రమణ ప్రధాన అనుచరుడిగా పని చేశాడు. కొన్నాళ్ల క్రితం రమణ తన స్నేహితుడి శుభకార్యం కోసం విశాఖ వెళ్లాడు. అక్కడే పరిచయస్తుల ద్వారా యోహాన్ రాజు ఇతడికి పరిచయమయ్యాడు. విజయవాడలో ఉండే రాజు బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంటాడని, చాలా మంది బ్యాంకు మేనేజర్లు తెలుసని కామన్ ఫ్రెండ్ చెప్పాడు. మేనేజర్ల అవసరం రావడంతో.. తెలుగు అకాడమీ ఎఫ్డీలపై కన్నేసిన సందర్భంలో సాయికి బ్యాంకు మేనేజర్ల అవసరం వచ్చింది. అప్పుడే విశాఖకు చెందిన సాంబశివరావు ద్వారా కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను, రమణ ద్వారా మస్తాన్ వలీని రంగంలోకి దింపాలని నిర్ణయించాడు. సాయి చెప్పడంతో అప్పట్లో యోహాన్ రాజును కలిసిన రమణ తన పథకం వివరించి మస్తాన్ వలీని కలపాల్సిందిగా కోరాడు. దీంతో మస్తాన్‌తో ఫోన్లో మాట్లాడిన యోహాన్.. రమణ వచ్చి కలుస్తాడని చెప్పాడు. ఆపై సంతోష్‌నగర్ వెళ్లి మస్తాన్ వలీని కలిసిన రమణ.. తమ కుట్రలో భాగంగా చేశాడు. సాయిని కూడా తీసుకువెళ్లి వలీకి పరిచయం చేశాక కుంభకోణం కథ నడిపారు. అకాడమీ ఎఫ్‌డీల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో యోహాన్‌కు రూ.50 లక్షలు ఇచ్చారు. ఇందులో రూ.16 లక్షలు ప్రమీలారాణి ఖాతాలో జమ చేశాడు. ఏపీలో రూ.14.6 కోట్ల మేర జరిగిన ఆయిల్ ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల స్కాంలోనూ సాయి, యోహాన్‌ల పాత్ర ఉంది. ఆ కేసుల్లో యోహాన్ రాజు, ప్రమీలను విజయవాడ సీసీఎస్ పోలీసులు అక్టోబర్ 21న అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిటీ సీసీఎస్ పోలీసులు యోహాన్, ప్రమీలను పీటీ వారెంట్ల హైదరాబాద్ తీసుకొచ్చి జైలుకు పంపారు. -
తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ఇకపై కేసు విచారణను ఏసీబీ చేతికి అప్పగించనున్నారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. క్రిమినల్ చర్యలతో పాటు అధికార దుర్వినియోగానికి నిందితులు పాల్పడినట్లు గుర్తించారు. చదవండి: నిధుల మాయం వెనుక మాఫియా! ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సీసీఎస్ విచారణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక అవకతవకల్లో ప్రభుత్వ సిబ్బంది పాత్ర ఉంటే.. కేసు దర్యాప్తులో వారిని ఏసీబీ కోర్టులోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అకాడమీకి సంబంధించి నమోదైన మూడు ఎఫ్ఐఆర్లను సీసీఎస్ అధికారులు ఏసీబీకి పంపించారు. అవినీతి నివారణ చట్టం(పీసీ) కింద ఏసీబీ విచారణ చేయనుంది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నందున కేసు పూర్తిస్థాయి దర్యాప్తు సీసీఎస్ చేస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న నిందితులకు సంబంధించి మాత్రమే ఏసీబీ దర్యాప్తు చేస్తుందని సీసీఎస్ జేసీపీ మహంతి వెల్లడించారు. చదవండి: దొరక్కూడదని ధ్వంసం చేశాడు కాగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ.64.5 కోట్లు గోల్మాల్ అవ్వడం తెలిసిందే. ప్రధాన నిందితుడు వెంకట సాయి కుమార్ సహా 18మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ ఏఓ రమేష్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ బ్యాంక్ అధికారుల పాత్రపై సైతం ఏసీబీ విచారణ జరపనుంది. -
దొరక్కూడదని ధ్వంసం చేశాడు
సాక్షి, హైదరాబాద్: చెన్నై కేంద్రంగా 2009లో చోటుచేసుకున్న నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్)తో మొదలుపెట్టి నగరంలో జరిగిన తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు దాదాపు పది కుంభకోణాల్లో నిందితుడిగా సాయి కుమార్‌కు పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. సీబీఐ విచారణ, దర్యాప్తులనూ చూసి ఉండటంతో మరింత రాటుతేలాడు. ఈ నేపథ్యంలోనే తాము పట్టుబడినా నేరానికి సంబంధించిన ఆధారాలు సాధ్యమైనంత వరకు పోలీసులకు దొరక్కుండా పథకం వేశాడు. ఈ నెల 6న ఇతడు అరెస్టు కావడానికి పది రోజుల ముందు తనతోపాటు తన అనుచరుల ఫోన్లనూ ధ్వంసం చేశాడు. కేసు దర్యాప్తు, నిందితుల విచారణలో ఈ విషయం గుర్తించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు తెలుగు అకాడమీ కేసులో మరో సెక్షన్ జోడించాలని నిర్ణయించారు. సాయితోపాటు అతడి ముఠా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పథకం ప్రకారం అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లు కాజేసింది. ఈ సమయంలో తన అనుచరులైన వెంకట రమణ, సోమశేఖర్ సహా ఇతరులతో సంప్రదింపులు జరపడానికి కొత్త ఫోన్, సిమ్ తీసుకున్నాడు. అయినప్పటికీ సమాచారమార్పిడి, సంప్రదింపులకు వివిధ సోషల్‌మీడియా కమ్యూనికేషన్ యాప్స్‌నే వాడాడు. తెలుగు అకాడమీ స్కామ్ వెలుగులోకి వచ్చి సీసీఎస్‌లో కేసులు నమోదైన తర్వాత తన గ్యాంగ్‌లోని ముఖ్య అనుచరులైన ముగ్గురితో కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్‌లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అక్కడే అందరి ఫోన్లు తీసుకున్న సాయి తన దాంతోపాటు వాటినీ ధ్వంసం చేశాడు. అవి వాళ్ల దగ్గరే ఉంటే మరో సిమ్ వేసుకుని వాడతారని, అలా చేస్తే పోలీసులు కనిపెట్టడంతోపాటు ఆధారాలు సేకరిస్తారని ఇలా చేశాడు. పోలీసులు వీరిని అరెస్టు చేస్తే ఫోన్లలో తనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఈ పని చేశాడని అధికారులు చెప్తున్నారు. అప్పటి నుంచి సాయి కొన్ని రోజులు ఫోన్ లేకుండానే గడిపాడు. అరెస్టుకు ఒకరోజు ముందు సాయి తాను అరెస్టు కావడానికి ఒకరోజు ముందు సహ నిందితుడు భూపతిరావుతో (ఆ తర్వాత ఇతడు అరెస్టు అయ్యాడు) సంప్రదింపులు జరిపాడు. దీనికోసం గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రి వద్దకు వెళ్లిన సాయి అందులో తన బంధువు చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని కలిశాడు. తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, తమ పేషెంట్ విషయంపై కుటుంబీకులతో మాట్లాడాలని అతడి ఫోన్‌ను తీసుకున్నాడు. అందులో భూపతి నంబర్ సేవ్ చేసి వాట్సాప్ కాల్ ద్వారా అతడితో మాట్లాడాడు. ఆపై తాను సేవ్ చేసిన ఫోన్ నంబర్ డిలీట్ చేసి ఫోన్ తిరిగి ఇచ్చాడు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాడు. తాను నేరుగా ఫోన్ చేస్తే పోలీసులకు చిక్కుతాననే సాయి ఇలా చేశాడని అధికారులు చెప్తున్నారు. ఇంత వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ సీసీఎస్ అధికారులు చాకచక్యంగా సాయిని పట్టుకున్నారు. ఫోన్ల ధ్వంసం విషయాన్ని విచారణలో గుర్తించిన పోలీసులు తెలుగు అకాడమీ కేసులో సాయిపై ఆధారాలను ధ్వంసం చేయడానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 204 కింద ఆరోపణలు జోడించాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో న్యాయస్థానానికి సమాచారం ఇవ్వనున్నారు. -
నిధుల మాయం వెనుక మాఫియా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో సంచలనం కలిగించే విషయాలను విద్యాశాఖ గుర్తించింది. దీని వెనుక ఓ మాఫియానే ఉందని తెలుసుకుంది. ఉన్నతాధికారులను సైతం ఈ మాఫియా రిమోట్ కంట్రోల్‌తో నడిపించినట్టు భావిస్తోంది. మంచి వ్యక్తిగత రికార్డు ఉన్న వాళ్లు సైతం అక్రమానికి అండగా నిలవడం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ. 65 కోట్లు గోల్మాల్ అవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఒకపక్క పోలీసు విచారణ జరుగుతుండగానే, విద్యాశాఖ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో విచారణ కమిటీని వేసింది. గోల్మాల్ను అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో కొన్ని కొత్త అంశాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మాఫియా గుప్పిట్లో అధికారుల గుట్టు! విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... నిధుల గోల్మాల్ వ్యవహారంలో ఇప్పటివరకు తెరమీద కన్పించిన పాత్రలే కాకుండా, మరికొంత మంది కూడా ఉన్నారు. రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్బీఐలో చేయాల్సిన డిపాజిట్లను అనేక బ్యాంకులకు దారి మళ్లించేందుకు ఈ మాఫియానే ముందుగా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. తెలుగు అకాడమీ, విద్యాశాఖకు చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీనికి చేయూతనిచ్చినట్లు తెలుస్తోంది. మరికొంత మందిని వారి వ్యక్తిగత బలహీనతలను ఆధారంగా చేసుకుని ట్రాప్ చేసినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మహిళా బ్యాంకు అధికారి గురించి అనేక కోణాల్లో విచారణ జరిపారు. ఆమె డబ్బుకు లొంగిందా? ట్రాప్‌లో చిక్కుకుందా? అనే అనుమానాలున్నాయని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఆమె ఆర్థిక లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఓ నిర్థారణకు రాలేమని చెప్పారు. అయితే గోల్మాల్ వ్యవహారం మొత్తం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం వెనుక బలమైన కారణాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం మొత్తం మాఫియా గుప్పిట్లో ఉండటం, వాళ్ళ చేత బ్లాక్ మెయిల్‌కు గురి కావడమూ కొట్టిపారేయలేమని అధికారులు అంటున్నారు. డబ్బులు వెనక్కి రావాల్సిందే కుంభకోణంలో మాయమైన ప్రతి పైసా తెలుగు అకాడమీ ఖాతాలోకి రప్పించి తీరుతామని విద్యాశాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఆర్బీఐ ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిగాయి. ‘అకాడమీ సొమ్ము దొంగలెత్తుకుపోలేదు... వివిధ బ్యాంకుల్లోకే వెళ్ళింది. కాబట్టి పూర్తి బాధ్యత ఆర్బీఐదే’అని అధికారులు అంటున్నారు. బ్యాంకు వర్గాలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో దీనిపై కొంత స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆర్బీఐకి పూర్తిస్థాయి నివేదిక అందించి, అనుమతి తీసుకున్న తర్వాత అకాడమీ నిధులు తిరిగి ఖాతాలోకి రప్పించే వీలుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సీనియర్లతో ప్రత్యేక కమిటీ తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్ నేపథ్యంలో ఆర్థిక పరమైన విభిన్న కోణాలు తెరమీదకొస్తున్నాయి. వీటిని దర్యాప్తు బృందాలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిగ్గు తేల్చడం కష్టమని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు సీనియర్ ఆడిటర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖకు చెందిన త్రిసభ్య కమిటీ భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలతో పాటు నిందితులు వాడిన సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సాంకేతిక బృందం పరిశీలిస్తుంది. దీనిద్వారా అనేక లింకులు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నియమ నిబంధనలు పూర్తిగా మార్పు అకాడమీ నియమ నిబంధనలు కట్టుదిట్టం చేయాలని, పూర్తిగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా మార్గదర్శకాలు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో ఉన్న అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను ముందస్తు ఉపసంహరణ (ఫోర్ క్లోజర్) చేయాలని తీర్మానించారు. వడ్డీతో ప్రమేయం లేకుండా ఈ మొత్తాలను ఎస్బీఐలోనే సేవింగ్ బ్యాంకు ఖాతాలో వేయాలని విద్యాశాఖ కమిటీ సిఫార్సు చేసింది. -
ఫోర్జరీ ఖరీదు రూ.30 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్లు కాజేయడానికి పథకం వేసిన సూత్రధారి సాయికుమార్ అందుకు నకిలీ లేఖలు, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) బాండ్లు వినియోగించాడు. వీటిని తమిళనాడుకు చెందిన పద్మనాభన్ తయారు చేయగా.. అకాడమీ, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసింది మాత్రం మదన్ అని తేలింది. దీని నిమిత్తం ఇతడికి కుంభకోణం సొమ్ము నుంచి రూ.30 లక్షలు ముట్టింది. సాయి అనుచరుడు వెంకట రమణకు స్నేహితుడైన ఇతడిని కేసు దర్యాప్తు అధికారి కె.మనోజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం షిర్డీలో అరెస్టు చేసి శుక్రవారం నగరానికి తరలించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన యోహాన్ రాజును పీటీ వారెంట్‌పై తీసుకురావాల్సి ఉంది. టెన్త్ చదివిన మదన్ ఫోర్జరీలో దిట్ట మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన మదన్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై అక్కడే వ్యవసాయం చేసేవాడు. 2019లో వెంకటరమణ షిర్డీ వెళ్లినప్పుడు ఇతడితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి రాకపోకలు, సంప్రదింపులు కొనసాగాయి. సంతకాలను ఫోర్జరీ చేయడంలో మదన్‌కు పట్టుండటంతో వెంకటరమణ అతన్ని సాయికి పరిచయం చేశాడు. తెలుగు అకాడమీ డబ్బు వివిధ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడానికి సాయి తన అనుచరులైన సోమశేఖర్ తదితరులను దళారుల అవతారం ఎత్తించాడు. డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన సాయి.. అకాడమీ నుంచి తన అనుచరుల ద్వారా ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్లను తీసుకున్నాడు. తొలుత లేఖల్లో ఎఫ్డీ కాలాన్ని మారుస్తూ నకిలీవి సృష్టించాడు. వీటిని అకాడమీ ఇచ్చిన చెక్కులతో జత చేసి బ్యాంకుల కు పంపించాడు. ఈ లేఖల్లో సదరు మొత్తాన్ని 5 రోజుల నుంచి వారానికే ఎఫ్డీ చేయాలని కోరేవాడు. బ్యాంకులు ఈ కాలానికి ఎఫ్డీ చేస్తూ దానికి సంబంధించిన బాండ్లు అందించేవి. వీటిని తీసుకుని సాయి అనుచరులు కొండాపూర్‌లోని అడ్డాకు చేర్చేవాళ్లు. ఎఫ్‌డీల ఆధారంగా పద్మనాభన్ కంప్యూటర్ సాయంతో నకిలీవి తయారు చేసి ప్రింట్ తీసేవాడు. నకిలీ కవరింగ్ లెటర్లపై అకాడమీ అధికారుల సంతకాలు, నకిలీ ఎఫ్డీలపై బ్యాంకు అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేసేవాడు. నకిలీ ఎఫ్డీలను అకాడమీకి ఇచ్చి 5 రోజులో, వారం రోజులో గడువు ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న ఒరిజనల్ ఎఫ్డీలు రద్దు చేసేవారు. కేవలం తెలుగు అకాడమీ కుంభకోణంలోనే కాకుండా ఏపీలో చోటు చేసుకున్న రెండు స్కాముల్లోనూ సాయి తదితరులతో పాటు మదన్ నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల నుంచీ సాయి గ్యాంగ్ రూ.14.6 కోట్లు కాజేశారు. అక్కడా నకిలీ లేఖలు, బాండ్లను పద్మనాభన్ తయారు చేయగా... బ్యాంకు, అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేశాడని తేలింది. ఇతడిని సీసీఎస్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
మీడియా అంటే సాయికి క్రేజ్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసిన కేసుల్లో సూత్రధారిగా ఉన్న అంబర్‌పేట వాసి చుండూరి వెంకట కోటి సాయికుమార్‌కు మీడియా అంటే మహా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా చాలా శక్తి మంతమైందని తెలుసుకున్న ఇతడు తానే సొంతంగా ఓ చానల్ ఏర్పాటు చేయాలని భావించాడు. తెలుగు అకాడమీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసుల విచారణలో సాయికుమార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ల క్రితం ఏబీసీ టీవీ పేరుతో చానల్ ఏర్పాటుకు.. తాజాగా కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్ కేంద్రంగా శ్రావ్య మీడియా అంటూ ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాడు. గత పదేళ్ల కాలంలో వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల ఎఫ్డీలు కొల్లగొట్టినా.. సాయికి మాత్రం చానల్ పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. 2012లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ.55.47 కోట్ల ఎఫ్డీలను సాయి, వెంకటరమణ తదితరులు కాజేశారు. అప్పట్లో విజయా బ్యాంక్‌లో మైనార్టీస్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. ఆ కార్పొరేషన్‌కు–బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన ఈసీఐఎల్ కమలానగర్ వాసి కేశవరావు సహాయంతో ఆ కథ నడిపాడు. దాదాపు 240 నకిలీ చెక్కులతో 16 బోగస్ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. వీటిలో దాదాపు రూ.20 కోట్లు వరకు సాయి తన వాటాగా తీసుకున్నాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!) సీఐడీకి చిక్కడంతో.. మైనారిటీస్ కార్పొరేషన్ కుంభకోణంలో వచ్చిన రూ. 20 కోట్లనుంచి సాయి .. రూ.8 కోట్లను ఏబీసీ టీవీ పేరుతో ఓ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి వెచ్చించాడు. దానికోసం హైదరాబాద్‌లో ఓ భవనాన్ని లీజుకు తీసుకుని దాన్ని ఆధునీకరించడంతో పాటు కావాల్సిన ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇందులో పనిచేయడానికోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారికి జీతాల అడ్వాన్సులుగా భారీ మొత్తాలు చెల్లించాడు. అయితే ఆ చానల్ కార్యరూపం దాల్చకముందే మైనార్టీ కార్పొరేషన్ స్కామ్‌లో ఉమ్మడి రాష్ట్ర సీఐడీకి చిక్కాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం) ఆ కేసు దర్యాప్తులో చానల్ ఏర్పాటు యత్నాలను సీఐడీ అధికారులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల నుంచి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.20 కోట్ల వరకు తీసుకున్న సాయి కుమార్ ఇందులోంచి కొంత డబ్బును యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్‌కు అడ్డా అయిన కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్‌లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరో స్కామ్ చేసినప్పుడు సంపాదించే సొమ్ముతో దాన్ని శాటిలైట్ చానల్‌గా మార్చాలని సాయి పథకం వేసినట్లు తెలిసింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
‘తెలుగు అకాడమీ’ కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేసిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు మరో నిందితుడు జీవీ కృష్ణారెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేటలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం సాయికుమార్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము కాజేయడానికి సాయి ఏడాది క్రితం పథకం వేయగా దీనికి సహకరించడానికి కృష్ణారెడ్డి ముందుకు వచ్చాడు. క్రమేణా కృష్ణారెడ్డితో ఎక్కువ అవసరం లేకపోవడాన్ని గమనించిన సాయికుమార్ అతడిని దూరంగా ఉంచాడు. అయితే ప్రతి అక్రమ లావాదేవీ నుంచి అతడికి వాటా ఇస్తూనే వచ్చాడు. సాయి అరెస్టు తర్వాత కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విచారణలో సాయి ఈ విషయాలను వెల్లడించడంతో ఏసీపీ కె.మనోజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం కృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు మంగళవారం అతడిని అరెస్టు చేసింది. కుంభకోణం సొమ్ము నుంచి అతడి వాటాగా రూ.6 కోట్ల వరకు ఇచ్చానంటూ సాయి పోలీసులకు చెప్పగా, తనకు రూ.2.65 కోట్లు మాత్రమే అందాయని కృష్ణారెడ్డి అంటున్నాడు. ఈ విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఏపీలోనూ నేరాలు దాదాపు పుష్కరకాలంగా కుంభకోణాలకు పాల్పడుతున్న సాయికుమార్ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లనూ కొల్లగొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన రూ.10 కోట్లు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ.5 కోట్లను ఇదే పంథాలో స్వాహా చేసింది. తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన సాయి ఈ విషయాలను విచారణలో బయటపెట్టాడు. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం అందించగా విజయవాడ సీసీఎస్‌లో రెండు కేసులు నమోదు చేశారు. వీటిలోనూ కృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కేసుల్లో అరెస్టులు, కస్టడీలు పూర్తయిన తర్వాత సాయి, కృష్ణారెడ్డిసహా ఇతర నిందితులను విజయవాడ పోలీసులు పీటీ వారంట్‌పై అక్కడకు తరలించి విచారించే అవకాశముంది. -
తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్టయ్యారు. సాయికుమార్‌తో కలిసి డిపాజిట్లు గోల్మాల్ చేసిన కృష్ణారెడ్డిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డి.. తన వాటాగా రూ.6 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
తెలుగు అకాడమీ స్కాం: మరో సూత్రధారి అరెస్ట్
సాక్షి, గుంటూరు: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన సమీప బంధువైన సాంబశివరావును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపాజిట్ల గోల్ మాల్ చేసిన ముఠాకు సాంబశివరావు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం సాంబశివరావు దాదాపు రూ.50 లక్షల రూపాయలను వాటాగా తీసుకున్నట్లు గుర్తించారు. ఆయనను గుంటూరులో అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంపై జరుగుతున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీ) కాజేసిన కేసు సూత్రధారి చుండూరి వెంకటసాయి కుమార్ ఈ స్కామ్ కోసం నకిలీబాండ్లను వినియోగించినట్లు వెల్లడైంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న అడ్డాలో ఈ బాండ్లను తయారు చేయించాడనే విషయం తాజాగా వెలుగులోకి వచి్చంది. వాస్తవానికి తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడాది క్రితమే సాయి కన్నుపడింది. వెంకటరమణను రంగంలోకి దింపి, అకాడమీకి–వివిధ బ్యాంకులకు మధ్య దళారులుగా ఉండేవారి కోసం ఆరాతీశాడు. భూపతిరావు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలుసుకొని వెంకటరమణ ద్వారా అతడికి ఎర వేశాడు. తన అనుచరులైన ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్, సోమశేఖర్‌ను రంగంలోకి దిం పాడు. వీళ్లు గతంలో సాయి చేసిన కొన్ని స్కామ్‌లలోనూ పాలుపంచుకున్నట్లు వెల్లడైంది. ఈ విధంగా కథ నడిపి...: వెంకట్, సోమశేఖర్లు అకాడమీ అధికారుల వద్దకు వెళ్లినప్పుడు బ్యాంకు ప్రతినిధులమని, బ్యాంకు అధికారులను కలిసినప్పుడు అకాడమీ ప్రతినిధులమని చెప్పుకుని కథ నడిపారు. అకాడమీ అధికారులు నగదును ఎఫ్డీ చేసే సమయంలో ఆ మొత్తానికి సంబంధించిన చెక్కుతోపాటు నిరీ్ణత కాలానికి ఎఫ్డీ చేయాలని కోరుతూ బ్యాంకు అధికారులకు ఓ కవరింగ్ లెటర్‌ను సిద్ధం చేసేవాళ్లు. వీటిని భూపతిరావు తీసుకుని ఆ వివరాలను సాయికి చెప్పేవాడు. దీంతో సాయి ఓ నకిలీ కవరింగ్ లెటర్ రూపొందించి బ్యాంకు అధికారులు ఇచ్చేదాని స్థానంలో ఉంచేవాడు. అందులో ఆ మొత్తాన్ని ఏడాది కాలానికి కాకుండా వారంరోజులకే ఎఫ్డీ చేయాలంటూ రాసేవాడు. బ్యాంకు అధికారులు ఇచి్చన అసలు ఎఫ్డీ బాండ్లను తమిళనాడుకు చెందిన మదన్, పద్మనాభన్‌కు అందించేవాడు. వీటిని స్కాన్ చేసి ఆపై కంప్యూటర్లో ఫొటోషాప్ సాప్ట్‌వేర్‌లో ఎడిట్ చేస్తూ ఏడాది కాలానికి ఎఫ్డీ చేసినట్లు రూపొందించేవారు. బాండ్ పేపర్లపై ప్రింట్ ఔట్ తీసి నకిలీబాండ్లు తయారు చేసేవారు. వీటినే అకాడమీ అధికారులకు సాయి అందేలా చేసేవాడు. -
‘ఎఫ్డీ స్కామ్’.. చెన్నై జైల్లో నేర్చుకున్నాడు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ) స్కామ్‌లో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. తాజాగా సూత్రధారి చుండూరి వెంకట కోటి సాయికుమార్ విచారణలో సీసీఎస్ పోలీసులు పలు కీలకాంశాలు గుర్తించారు. ఎఫ్డీ స్కామ్‌కు సంబంధించి విషయాలను చెన్నై జైల్లో నేర్చుకున్నట్లు వెల్లడైంది. నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) కేసులో జైలుకు వెళ్లినప్పుడు సహనిందితులే వీటిని నేర్పించారని సాయి బయటపెట్టాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన సాయికుమార్ మొదట స్వాల్ కంప్యూటర్స్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. దీనికి హైటెక్ సిటీతోపాటు తమిళనాడులోని చెన్నైలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. అమెరికాకు చెందిన ప్రాజెక్టులు కైవశం చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో సాయికి ఈ రంగంలో నష్టాలే మిగిలాయి. ఈ క్రమంలో అతనికి తమిళనాడు ముఠాతో పరిచయమైంది. అప్పటికే ఈ గ్యాంగ్ ఎన్‌సీఎల్‌కు చెందిన ఎఫ్డీలపై కన్నేసింది. చెన్నైలోని పలు బ్యాంకుల్లో ఉన్న రూ.25 కోట్లు కాజేయడానికి పథకం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సాయితో ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎల్ ఎఫ్డీలను లిక్విడేట్ చేయగా వచ్చిన రూ. 6 కోట్లను స్వాల్ సంస్థ పేరిట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖలోని కరెంట్ ఖాతాలోకి మళ్లించింది. ఆ మొత్తం డ్రా చేసి ఇచ్చినందుకు రూ.కోటి కమీషన్‌గా సాయికి అందించింది. ఇప్పటికీ మూడు ఎఫ్‌డీల స్కామ్ ఎన్సీఎల్ స్కామ్ వెలుగులోకి రావడంతో చెన్నైకు చెందిన సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సూత్రధారులు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో సాయి కూడా ఉన్నాడు. ఈ కేసులో చెన్నై జైలు కు వెళ్లిన సాయికుమార్ అక్కడే ఎఫ్‌డీల స్కామ్ ఎలా చేయాలనే అంశాలను వీరి ద్వారా తెలు సుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సాయి రియల్టర్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన నండూరి వెంకట రమణతో పరిచయం ఏర్పడింది. తన స్వస్థలంలో ప్రింటింగ్‌ప్రెస్ నిర్వహించే వెంకటరమణకు ఓ కేంద్ర ప్రభుత్వసంస్థతో ఒప్పందం ఉంది. ఆ సంస్థకు కావాల్సిన బిల్ బుక్స్సహా అన్ని రికార్డులనూ ముద్రించి అందిస్తుంటాడు. అయితే తన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చిన వెంకటరమణ సైనిక్‌పురి ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతడు కూడా రియల్టర్‌గా మారాడు. ఈ క్రమంలోనే సాయితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మరికొందరితో కలసి 2012లో ఏపీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఎఫ్డీలు, 2015లో ఏపీ హౌసింగ్ బోర్డ్ ఎఫ్డీలు, తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్‌డీల సొమ్ము కాజేశారు. ఏపీలోనూ కుంభకోణాలు తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం నిందితులు 11 ఏండ్లుగా ఈ స్కామ్‌లు చేస్తున్నట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ఏపీలోని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 10 కోట్లు, ఏపీ అయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 5 కోట్లను కొట్టేసి, ఆ డబ్బును ఏపీ మర్కంటైల్ బ్యాంకులోకి మళ్లించినట్లు నిందితులు వెల్లడించారు. తెలుగు అకాడమీ కేసులో ఇప్పటి వరకు 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2009 నుంచి సాయికుమార్ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం చేశారని, ఇతడిపై వివిధ ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నట్లు తెలిసిందని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. 9 మంది కస్టడీ మంగళవారం ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు, మరో పక్క కెనరా బ్యాంకు చందానగర్ మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు, ఆమెకు రూ. 1.99 కోట్లు సాయికుమార్ అందించినట్లు వెల్లడించాడు. సాయికుమార్‌తో పాటు అతని అనుచరులను మరోసారి కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు, దీనిపై ఈ నెల 16వ తేదీన కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయి. -
తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా డబ్బు కొట్టేసింది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో రూ.10 కోట్లును కొట్టేసిన సాయికుమార్.. ఏపీ సీడ్స్ కార్పొరేషన్లో రూ.5 కోట్ల ఎఫ్డీలను డ్రా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు సాయికుమార్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!) ఏపీ సంస్థల నుంచి డిపాజిట్లను ఐవోబీ బ్యాంక్ నుంచి బదిలీ చేశారు. ఐవోబీ నుంచి ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బదిలీ, విత్ డ్రా చేయగా, ఏపీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఏపీ అధికారులకు సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. సాయికుమార్ ముఠాపై రెండు కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై పోలీసులు దృష్టి పెట్టారు. చదవండి: అత్త తిట్టిందని.. కోడలు ఎంత పని చేసిందంటే..! -
రికవరీ 5 శాతం లోపే!
సాక్షి, హైదరాబాద్: వివిధ బ్యాంకుల్లో తెలుగు అకాడమీకి చెందిన ఫిక్సిడ్ డిపాజిట్లను (ఎఫ్డీ) కొల్లగొట్టడానికి సాయికుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ముఠా పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించింది. ఈ కేసులో తాము అరెస్టు అయినా... నగదు మాత్రం రికవరీ ఇవ్వకూడదనేలా వ్యవహరించింది. ఫలితంగా పోలీసులు ఈ కేసులో ఇప్పటికి 5% లోపు సొమ్మే స్వాధీనం చేసుకోగలిగారు. ఈ స్కామ్‌లో నిందితులు అకాడమీకి చెందిన మొత్తం రూ.64.5 కోట్లను స్వాహా చేశారు. ఇప్పటివరకు సూత్రధారులతో పాటు మొత్తం 14 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు సహాయకులు మాత్రమే చిక్కాల్సి ఉంది. అయితే నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంది రూ.3 కోట్లు మాత్రమే. స్కామ్ సొమ్ముతో ఖరీదు చేసిన స్థిరాస్తులు పెద్దగా బయటకు రాలేదు. ఓ నిందితుడు పెద్ద అంబర్‌పేటలో రూ.5 కోట్లు వెచ్చ ంచి భూమి, మరొకరు ఓ ఫ్లాట్ ఖరీదు చేసినట్లు మాత్రమే తేలింది. మిగిలిన సొమ్ము ఏమైందనే దానిపై స్పష్టత రాలేదు. అరెస్టయిన నిందితుల్లో 9 మంది పోలీస్ కస్టడీలో ఉండగా, వీరి విచారణ గడువు మంగళవారంతో ముగియనుంది. వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్న సీసీఎస్ పోలీసులు.. కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధనను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. మరో నలుగురిని కూడా కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు మళ్లీ కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ స్కామ్‌పై సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒక కేసులోనే అరెస్టులు, కస్టడీలు సాగుతున్నాయి. ఇది ముగిసిన తర్వాత మరో రెండింటిలోనూ విచారణ కొనసాగనుంది. -
స్కామ్ సొమ్ముతో భూముల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.64.5 కోట్ల కుంభకోణంపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డబ్బుల్లో అధిక మొత్తం కాజేసినట్లు ఆరోపణలున్న ప్రధాన సూత్రధారి సాయికుమార్ వివాదాస్పద భూములు ఖరీదు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయనే ఈ పని చేసినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు అరెస్టు అయిన 14 మందిలో 9 మందిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్, ఎఫ్‌డీల విత్‌డ్రాలో దళారులుగా వ్యవహరించిన సాయికుమార్, నందూరి వెంకట రమణ, వెంకటేశ్వర్రావు, సోమశేఖర్లతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్ బ్రాంచ్ మాజీ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్లు పద్మజ, మెహినుద్దీన్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీపీ మనోజ్‌కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిపి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు. 34 ఎకరాలు, 3 ప్లాట్లు.. ప్రధాన నిందితుడు సాయికుమార్ స్కామ్‌లో తన వాటాగా రూ. 20 కోట్లకుపైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు. ఇతను రూ.5 కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌లో 34 ఎకరాల వివాదాస్పద భూము లు కొనుగోలు చేశాడని, ఆ భూముల పత్రాలను కొందరి వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. ఇవి తక్కువ ధరకు రావడంతో పాటు భవిష్యత్తులో తాను అరెస్టు అయినప్పటికీ ఈ భూములను పోలీసులు స్వాధీనం చేసుకోలేరనే ఇలా చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన వెంకటరమణ కొండాపూర్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్నంలో సుమారు రూ.6.5 కోట్లు వెచ్చించి మూడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు అందించనున్నట్లు సమాచారం.ఈ కుంభకోణంలో మరికొందరు నిందితుల ప్రమే యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చందానగర్ కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వేగంగా ఈడీ విచారణ తెలుగు అకాడమీలో కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను శుక్రవారమే కోర్టు అనుమతితో తీసుకున్న ఈడీ, శనివారం చంచల్‌గూడ జైల్లో అకాడమీ ఇన్చార్జి అకౌంటెంట్ రమేశ్‌ను ప్రశ్నించింది. బ్యాంక్ ఎఫ్‌డీల నుంచి డ్రా చేసిన డబ్బును ఎవరెవరు, ఎంతెంత తీసుకున్నారు.. తమ వాటాగా తీసుకున్న డబ్బులను ఏం చేశారన్న అంశాలపై కూపీ లాగినట్టు తెలిసింది. కాగా, ఈడీ దర్యాప్తు బృందం సోమవారం బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కెనరా బ్యాంక్‌తో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లను ప్రశ్నించి ఎఫ్డీ సొమ్మును ఎక్కడికి తరలించారన్న సంగతిని రాబట్టాలని భావిస్తోంది. అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సాయికుమార్ తన వాటాగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడన్న అంశాలను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడీ ప్రయత్నిస్తోంది. మరో పక్క ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు వారి వాటాగా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యుల ద్వారా మళ్లించినట్టు సీసీఎస్ తన దర్యాప్తులో స్పష్టంచేసింది. ఆ డబ్బులను హవాలామార్గాల్లో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మేనేజర్లతోపాటు మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. -
తెలుగు అకాడమీ కేసు: కస్టడీకి నలుగురు నిందితులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. నలుగురు నిందితులను చంచల్ గూడ జైల్ నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సత్యనారాయణ, పద్మావతి, మొహిద్దీన్ను కస్టడీకి తీసుకోగా, ఇప్పటికే యూబీఐ మేనేజర్ మస్తాన్‌వలీని పోలీసులు ప్రశ్నించారు. నాలుగో రోజు కూడా మస్తాన్‌వలీని కస్టడీలోకి తీసుకున్నారు. కొట్టేసిన డబ్బును ఎక్కడ దాచారన్న దానిపై పోలీసులు ఆరా తీయనున్నారు. చదవండి: Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం -
తెలుగు అకాడమీ కేసులో కీలక పరిణామం, మొత్తం 10మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ కేసులో కీలక పరిణాయం చోటుచేసుకుంది. చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు అకాడమీ స్కాంలో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. ఈ రోజు ఒక్క రోజే సీసీఎస్ పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. A1 మస్తాన్ వలీ, A2సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు స్కాంక్‌లకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. చదవండి: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మూడు బ్యాంకుల నుంచి కోట్లు డ్రా చేసిన ముఠా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు స్కాంకు పాల్పడినట్టు గుర్తించారు. డిసెంబర్‌కల్లా అకాడమీకి చెందిన 324 కోట్లు కొట్టేయాలని స్కేచ్ వేసినట్లు తెలిపారు. కమిషన్ల ఎర చూపి బ్యాంక్ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తెలిపారు. సాయి, వెంకట్‌పై గతంలో కేసులున్నాయని పేర్కొన్నారు. మరికాసేపట్లో హైదరాబాద్ కమీషనరేర్లో మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టనున్నారు. చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ వలీతోపాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా మస్తాన్ వలీకి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. మరో ముగ్గురి కస్టడీ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై మరింత లోతైన విచారణ అవసరమని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. అకౌంట్స్ ఆఫీసర్ మొదలుకొని తెలుగు అకాడమీ ఉన్నతాధికారుల వరకు ఇందులో పాత్ర ఉందని, బ్యాంకు సిబ్బందితోనూ లాలూచీ వ్యవహారం కొనసాగిందన్న అనుమానం వ్యక్తం చేసింది. అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని భావించింది. అకాడమీలో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో కూడిన ఈ కమిటీ మంగళవారం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. వాస్తవానికి ఈ నెల 2వ తేదీనే కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. కానీ అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు, మరికొన్ని వివరాల కోసం గడువు పొడిగించారు. వీటి ఆధారంగా ప్రాథమిక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. సీఐడీకి బదలాయింపు? మొత్తం మీద బ్యాంకు అధికారులు, అకాడమీ సిబ్బంది, బయట వ్యక్తుల ప్రమేయం ఇందులో కన్పిస్తోందని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. విభిన్న కోణాల్లో, శాస్త్రీయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భావించింది. మరికొన్ని లోతైన అంశాలకు ఆధారాలు వెలికితీయాల్సి ఉందని పేర్కొంది. దీన్నిబట్టి కేసును సీఐడీకి అప్పగించే వీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. నివేదికలోని వివరాలు ఇవి..! గోల్మాల్ గుర్తించకపోవడానికి కారణాలేమిటి? ‘ఏపీ, తెలంగాణ ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి చెందిన రూ.43 కోట్లను యూబీఐ బ్యాంకులో కొన్నేళ్ళ క్రితం డిపాజిట్ చేశారు. ఈ నిధులను ఏపీకి పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో అకాడమీ అధికా రులు భవనాలు, నగదు వివరాలను లెక్కించారు. పలు బ్యాంకులు సహా యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయని గుర్తించారు. వీటిని తీసుకునేందుకు డిపాజిట్పత్రాలను ఈ నెల 21న బ్యాంకుకు పంపినా అక్కడి నుంచి సమాధానం రాలేదు. దీన్ని అకాడమీ అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఉన్నతాధికా రుల దృష్టికి ఈ విషయం వచ్చిందా? లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత ఉన్న అకౌంటింగ్ విభాగం డిపాజిట్ల విత్ డ్రా వ్యవహారం గుర్తించకపోవడానికి కారణా లేంటి?’ అని కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుత అధికారుల బాధ్యతారాహిత్యం ‘అసలు డిపాజిట్‌ను ఆగస్టులోనే విత్‌డ్రా చేసుకున్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. దీనిపై అంతర్గతంగా ఏం జరిగిందనేది ఇప్పటికీ తెలుగు అకాడమీ స్పష్టంగా చెప్పడం లేదు. రికార్డుల పరిశీలనకు సంబంధించి గానీ, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే విషయాలను స్పష్టంగా అధికారులు చెప్పలేకపోతున్నారు. తమ హయాంలో ఏమీ జరగలేదని ప్రస్తుత అధికారులు చెప్పడాన్ని బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నాం..’ అని పేర్కొంది. ఉన్నతాధికారుల ఆమోదంతోనే.. ‘గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని ఆ సొమ్మును హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్ చేశారు. ఎస్బీఐ తెలుగు అకాడమీ ఖాతాకు రూ. 5.70 కోట్లు బదిలీ అయ్యాయి. మిగిలిన రూ. 26 కోట్లు అకాడమీ అధికారులే విత్‌డ్రా చేశారని బ్యాంకు వర్గాల వాదన. అయితే ఈ మొత్తం వ్యవహారం అకౌంట్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఉన్నతాధికారులు అనుమతించిన తర్వాతే వ్యవహారం ముందు కెళ్తుంది. కాబట్టి ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఇదంతా జరిగిందనేది మా దర్యాప్తులో వెల్లడైంది..’ అని కమిటీ తెలిపింది. అయితే ఎందుకు? ఎవరు? అనే అంశాలపై స్పష్టత లేదని దీనిపై ఆరా తీసినప్పుడు అకాడమీ ఉన్నతాధికారులు విభిన్న వాదనలు విన్పించినట్టు కమిటీ సభ్యుడొకరు తెలిపారు. స్వాహా సూత్రధారుల పట్టివేత హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల స్వాహా కేసులో సూత్రధారులను హైదరాబాద్ సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పట్టుకు న్నారు. అకాడమీ ఏఓ రమేష్ సహా మొత్తం ఆరు గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎవరిని అరెస్టు చేయాలి? ఎవరికి నోటీసులు ఇవ్వాలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని ఈ నెల 12 వరకు సీసీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీ సులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా మిగతా నిందితుల కస్టడీపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాజేసిన సొమ్ముతో నిందితులు కొన్ని స్థిరాస్తులు ఖరీదు చేశారని, పాత అప్పులు తీర్చడం, కొత్తగా అప్పులు ఇవ్వడం చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద కొంత మొత్తం నగదు అధికారులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. -
తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.63.47 కోట్ల నిధులను నొక్కేసిన కేటుగాళ్లు మరో రూ.20 కోట్లు కాజేయడానికి స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అకాడమీ ఇచ్చిన కవరింగ్ లెటర్లు మార్చి ఈ గ్యాంగ్ కథ నడిపినట్లు తేలింది. అకాడమీ అధికారులు సైతం తమకు చేరిన ఫిక్స్డ్ డిపా జిట్లకు (ఎఫ్డీ) సంబంధించిన నకిలీ బాండ్లను గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఈ స్కామ్ సూత్రధారుల్లో ఒకడైన రాజ్‌కుమార్ అకాడమీకి– బ్యాంకులకు మధ్య దళారిగా వ్యవహరించేవాడు. అకాడమీ నిధులను కొల్లగొట్టడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ, సోమశేఖర్, శ్రీనివాస్‌లతో ముఠా కట్టి రంగంలోకి దిగాడు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో.. గత ఏడాది డిసెంబర్ నుంచి గత నెల వరకు సంతోష్‌నగర్, కార్వాన్‌ల్లోని యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, చందానగర్ కెనరా శాఖల్లో ఉన్న రూ.63.47 కోట్లను ఈ ముఠా నొక్కేసింది. ఈ క్రమంలోనే చందానగర్‌లోని అదే బ్రాంచ్‌లో ఉన్న మరో రూ.20 కోట్ల ఎఫ్డీ సొమ్మునూ తమ ఖాతాల్లోకి మళ్లించడానికిగాను నకిలీపత్రాలను రూపొందించింది. మరోవైపు తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి సంబంధించి గత నెల 14న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం పంపకం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి లెక్కలు చూడాలని డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అకాడమీ అధికారులు ఈ నెల 18న బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు అకాడమీ అధికారులు లేఖలు రాయడంతోపాటు బాండ్లు అందించడంతో ఆ రూ.20 కోట్లు తెలుగు అకాడమీ ఖాతాలోకి వచ్చాయి. దీంతో ఈ ముఠా ప్లాన్ బెడిసికొట్టింది. అతడు చిక్కితేనే స్పష్టత సీసీఎస్ పోలీసులు సోమవారం సైతం అకా డమీ, బ్యాంకు అధికారులను ప్రశ్నించి వాం గ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఓ కీలక నిందితుడు చిక్కితే ఈ స్కామ్‌లో అకాడమీ అధికారుల పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఎఫ్‌డీల కోసం దళారుల సహకారం ఎందుకనే అంశాన్నీ సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంగళవారం మరికొం దరు నిందితులను అరెస్టు చేసే అవకాశాలు న్నాయి. రూ.6 కోట్లు ది ఏపీ మర్కంటైల్ కో– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ సత్య నారాయణరావుకు చేరినట్లు తేలగా, మిగిలిన మొత్తం ఏమైందనే దానిపై ఆరా తీస్తున్నారు. -
Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ దర్యాపప్తును సీసీఎస్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అలానే అకాడమీలో పనిచేస్తున్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం విచారిస్తున్నారు పోలీసులు. కొన్ని డిపాజిట్లకు సంబంధించి సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో బ్యాంకులకు సోమిరెడ్డి ఇచ్చిన రిలీజింగ్ ఆర్డర్‌పై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమిరెడ్డి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ అకాడమీ ఖాతాలో నిధులు డిపాజిట్ కాలేదని గుర్తించారు. ఈ వ్యవహారంలో మస్తాన్ వలీ, శ్రీనివాస్, సోమశేఖర్, రాజకుమార్ల పాత్రపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు పోలీసులు. వీరితో పాటు అకాడమీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణను కూడా విచారిస్తామని తెలిపారు పోలీసులు. (చదవండి: ‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు! ) ఏపీ మర్కంటైల్ బ్రాంచ్ నుంచి డ్రా చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 64 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదంటున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన వారికి ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదని తెలిపారు. ఈ క్రమంలో నిధులు ఎవరికి చేరాయి అనేదానిపై పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. 64 కోట్ల రూపాయల నిధుల ఆచూకీ తెలుసుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసులు. చదవండి: సీసీఎస్ అదుపులో స్కామ్ సూత్రధారులు? -
సీసీఎస్ అదుపులో స్కామ్ సూత్రధారులు?
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.63.47 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కామ్‌లో సూత్రధారులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మొత్తం నలుగురిలో ఇద్దరిని ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారని తెలిసింది. మరోపక్క ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆదివారం అకాడమీ అధికారులతో పాటు కెనరా బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సూత్రధారుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌కు మరో రెండు మారుపేర్లు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అకాడమీకి చెందిన రూ.కోట్ల చెక్కులను రూపొందించేది అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ అయినా.. వాటిని నిర్వహించేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ అని తెలిసింది. ఇతడి ద్వారానే యూబీఐ, కెనరా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్స్ రాజ్‌కుమార్‌కు చేరాయి. ఇదే అదునుగా భావించిన రాజ్‌కుమార్.. సోమశేఖర్, శ్రీనివాస్‌తో పాటు మరొకరి సాయంతో స్కామ్‌కు ప్లాన్ చేశాడు. అధికారుల నిర్లక్ష్యం... అకాడమీ నిధుల విషయంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేష్‌తో పాటు రఫీక్‌ను సీసీఎస్ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అకాడమీ నిధుల నిర్వహణ విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై ఆరా తీశారు. రఫీక్, రాజ్‌కుమార్ మధ్య ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టారు. వీరిలో కొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. గడిచిన నెల రోజుల్లో అకాడమీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ మొత్తం తమకు అప్పగించాల్సిందిగా పోలీసులు అధికారులను కోరారు. అయితే దాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి అందించామని వాళ్లు వివరణ ఇచ్చారు. దీన్ని పరిశీలిస్తే రాజ్‌కుమార్ అకాడమీకి ఎప్పుడెప్పుడు వచ్చాడు? ఎవరెవరిని కలిశాడు? అనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో అదనపు ఆధారాలు సేకరించడానికి ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులైన ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ సత్యనారాయణరావు, మేనేజర్లు పద్మావతి, మెహినుద్దీన్లతో పాటు యూబీఐ బ్యాంకు కార్వాన్ బ్రాంచ్ మాజీ ఛీప్ మేనేజర్ మస్తాన్‌వలీ సాబ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకోవా లని నిర్ణయించి పిటిషన్ దాఖలు చేశారు. -
‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’
హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ ఉద్యోగులంతా హిమాయత్‌నగర్‌లో విచారణకు అందుబాటులో ఉండాలని సీసీఎస్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా, మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేష్‌లను విచారణకు హజరుకావాలని సీసీఎస్ పోలీసులు సమాచారం అందించారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏ2 గా నిందితునిగా ఉన్న రాజ్‌కుమార్‌ల మధ్య ఉన్నసంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరికి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీకి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విచారించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: తెలుగు అకాడమి స్కాంలో సూత్రధారి కోసం గాలింపు -
‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కొత్త కోణాలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.63 కోట్ల నిధుల కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌పై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శనివారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ స్కామ్‌లో కీలకపాత్ర పోషించిన రాజ్‌కుమార్‌సహా నలుగురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ డబ్బును వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి రాజ్‌కుమార్ అనే వ్యక్తి దళారిగా వ్యవహరించాడు. డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన రాజ్‌కుమార్ అకాడమీ ఉద్యోగి రఫీ నుంచి ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులను తీసుకున్నాడు. కొన్నింటిని ఆయా బ్యాంకుల్లో వారంరోజులకే డిపాజిట్ చేశాడు. అయితే ఏడాది కాలానికి చేసినట్లు నకిలీవి సృష్టించి అకాడమీకి సమర్పించాడు. మరికొన్ని డిపాజిట్లు ఏడాది కాలానికి చేసినా నకిలీ బాండ్లను రూపొందించి తన వద్ద ఉంచుకున్నాడు. ముగ్గురి సహకారం.. రాజ్‌కుమార్‌కు ది ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ బీవీవీఎన్ సత్యనారాయణరావు పూర్తి సహకారం అందించారు. సొసైటీలో తెరిచిన ఖాతా నుంచి రాజ్‌కుమార్ తదితరులు డ్రా చేసినప్పుడల్లా డబ్బును నేరుగా ఇచ్చేయాలంటూ విజయవాడ నుంచి సత్యనారాయణ ఇక్కడి బ్రాంచ్‌లో ఉన్న ఆపరేషన్స్ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్‌లకు ఆదేశాలు జారీ చేశాడు. ప్రతి విత్‌డ్రా సమయంలోనూ తన కమీషన్ 10 శాతం మినహాయించి మిగిలిన మొత్తం రాజ్‌కుమార్ తదితరులకు అప్పగించేలా ఆదేశించాడు. సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో తెరిచిన నకిలీ ఖాతా నుంచి వివిధ దఫాలుగా డబ్బు డ్రా చేసిన దుండగులు ఆ మొత్తాన్ని వాహనాల్లో విజయవాడకు తరలించినట్లు తెలిసింది. ఈ ముఠా ఓ దఫా డబ్బును ముంబైకి కూడా తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఆది, సోమవారాల్లో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయాన్ని ఐటీ విభాగం దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు అవసరమైన రికార్డులు అందించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు సమాచారం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. -
‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో నలుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల నిధుల స్వాహా కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలి, ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆపరేషన్స్ మేనేజర్ వేదుల పద్మావతి, రిలేషన్షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్లను హైదరాబాద్‌లో, చైర్మన్/ఎండీ బీవీవీఎన్ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పక్కా పథకంతో డిపాజిట్లు మాయం తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. ఈ లావా దేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పథకం ప్రకారం ఈ త్రయం ఎఫ్డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్ జిరాక్స్ తీసుకున్నారు. సంతోశ్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్రపన్నారు. సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో నకిలీ గుర్తింపుకార్డులు, ఫోర్జరీ పత్రా లు సమర్పించారు. వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్ చేశారు. తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసేశారు. సొసైటీకి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి.. అకాడమీ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం ఏపీ, తెలంగాణ పంచుకోవాలని గత నెల 14వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాటి లెక్కలు చూడాలని అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఈ నెల 18వ తేదీన బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణం వెలుగుచూసింది. అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. -
తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్మాల్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల నిధుల స్వాహా కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన ఆపరేషన్స్ మేనేజర్ వి.పద్మావతి, రిలేషన్షిప్ మేనేజర్ సయ్యద్ మొహియుద్దీన్లను హైదరాబాద్‌లో, చైర్మన్/ఎండీ బీవీవీఎన్ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పక్కా పథకంతో డిపాజిట్లు మాయం తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకులకు చెందిన 20 బ్రాంచ్‌ల్లో ఏడాది ఆపై కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేసింది. ఈ లావాదేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముందస్తు పథకం ప్రకారం వ్యవహరించిన ఈ త్రయం ఎఫ్డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్ జిరాక్సు తీసుకుని తమ వద్ద పెట్టుకున్నారు. మూడు నెలల క్రితం ఎఫ్డీలను కాజేయడానికి రంగంలోకి దిగారు. సంతోష్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్ కెనరా బ్యాంక్ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్ర పన్నారు. అంత మొత్తాన్ని ఖాతాల్లోకి తెచ్చినా నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దుండగులు తెలుగు అకాడమీ పేరుతో సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో దుండగులు నకిలీ గుర్తింపుకార్డులు, పత్రాలు సమర్పించారు. ఈ సొసైటీ విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులతో పాటు నిబంధనలకు విరు ద్ధంగా హైదరాబాద్‌లోనూ ఓ బ్రాంచ్ని నిర్వహిస్తోంది. కాగా నకిలీ ఎఫ్డీ పత్రాలు, తెలుగు అకాడమీ పేరుతో రూపొందించిన లేఖల్లో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురు దుండగులు వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్ చేశారు. ఆ నిధు లు నిబంధనలకు విరుద్ధంగా సిద్ధి అంబర్‌బజార్‌లోని అగ్రసేన్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఉన్న సొసైటీ ఖాతా లోకి బదిలీ అయ్యేలా చేశారు. ఆ తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి సొసైటీ నిర్వాహకుల సహ కారంతో మళ్లించి డ్రా చేసేశారు. దీని నిమిత్తం సొసైటీకి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చారు. రెండు నెలల వ్యవధిలో ఈ తతంగం పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి.. తెలంగాణ–ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులు, ఆస్తుల పంపకంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ సాగింది. గత నెల 14న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం పంపకం చేయాలని స్పష్టం చేసింది. దీంతో వాటి లెక్కలు చూడాల్సిందిగా డైరెక్టర్ సోమిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అకాడమీ అధికారులు ఈ నెల 18న బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే యూబీఐ అ«ధికారులు కార్వాన్ బ్రాంచ్‌లో ఉండాల్సిన రూ. 43 కోట్లు అప్పటికే విత్‌డ్రా అయినట్లు తెలిపారు. దీంతో ఇతర డిపాజిట్ల వివరాలు ఆరా తీసిన అకాడమీ అధికారులు సంతోష్‌నగర్ బ్రాంచ్‌లో రూ. 10 కోట్లు, చందానగర్ కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో రూ. 11 కోట్లు కూడా మాయం అయినట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కుంభకోణానికి సంబంధించి నమోదైన మూడు కేసులను సీసీఎస్ ఏసీపీ కె.మనోజ్‌కుమార్ దర్యాప్తు చేశారు. శుక్రవారం పద్మావతి, మొహియుద్దీన్, సత్యనారాయణరావులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురితో పాటు మరికొందరి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నిబంధనల ప్రకారం ఏదైనా ఎఫ్డీ రద్దైనప్పుడు ఆ మొత్తాన్ని డిపాజిట్ ఎవరి పేరుతో ఉంటే వారి ఖాతాలోనే డిపాజిట్ చేయాల్సి ఉం టుంది. దీనికి విరుద్ధంగా యూబీఐ, కెనరా బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ ఎఫ్‌డీల డబ్బును అగ్రసేన్ బ్యాంక్‌లో ఉన్న సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ఈ నేపథ్యంలోనే స్కామ్‌లో వారి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే యూబీఐ కార్వాన్ చీఫ్ మేనేజర్, సంతోష్‌నగర్ బ్రాంచి ఇన్చార్జి కూడా అయిన మస్తాన్ వలీని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు, కెనరా బ్యాంక్ అధికారుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుంభకోణం సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై వేటు తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ నేపథ్యంలో అకాడమీ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ఉన్న ఎం.సోమిరెడ్డిని ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో పాఠశాల విద్య కమిషనర్ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమిరెడ్డిని మాతృసంస్థ అయిన ఓపెన్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ బాధ్యతలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. నిధుల గోల్‌మాల్‌పై ప్రభుత్వం ముగ్గురు విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ శనివారం ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంది. రెండు రోజులుగా వారు అకాడమీ పత్రాలు, లావాదేవీలు, రికార్డులు పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని గుర్తించడంతో పాటు డైరెక్టర్‌పై వేటుకు సిఫారసు చేసినట్టు సమాచారం. -
తెలుగు అకాడమీ నిధుల స్కాంలో ముగ్గురు అరెస్ట్
-
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్మాల్ కేసులో సీసీఎస్ పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ, అగ్రసేన్ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, ఏపీ మర్కంటైల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగి మొహినుద్దిన్‌లను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరు కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. 330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్ చేసింది. ప్రధానంగా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మాయం బ్యాంకు అధికారుల పాత్రపై తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. కాగా, దీనిపై సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖరాశారు. కాగా, డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి వరకు మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అకాడమీ ఉద్యోగులను సైతం సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: Telugu Academy Money Fraud: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్ -
తెలుగు అకాడమీ స్కాం: రూ.71 కోట్ల గల్లంతు..
-
తెలుగు అకాడమి స్కాంలో దర్యాప్తు వేగవంతం
-
తెలుగు అకాడమీ నిధుల స్కాం తో CCS దర్యాప్తు ముమ్మరం
-
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిపై ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. సుమారు 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు అకాడమీ అధికారులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్) ఇప్పటికే పోలీసులు పలు బ్యాంక్ అధికారులను సీసీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరిలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, అగ్రాసేన్ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు. చదవండి: టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు -
తెలుగు అకాడమీ నిధుల మళ్లింపుపై విచారణ వేగవంతం
-
తెలుగు అకాడమీలో డిపాజిట్ల గోల్ మాల్
-
తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ అయ్యాయి. కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు 43 కోట్లు కాజేశారు. వివారాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ ఖాఖల్లో రూ. 43 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరకముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసేందకు ప్రయత్నించగా ఆసలు బ్యాంక్‌లో డబ్బులు లేవని తేలింది. సెప్టెంబరు 22న డబ్బులు కోసం తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌కు వెళ్లగా.. తర్వలో ఇస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ అడగ్గా ఆసలు నిధులు లేవని బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ పేర్కొన్నారు. దీంతో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం లావాదేవిలో బ్యాంక్ మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 43 కోట్లలో 23 కోట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది. చదవండి: ఆ వయసులోపు వారిలో పెరుగుతున్న గుండెపోటు.. -
ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఆదిమూలపు సురేష్
సాక్షి, విజయవాడ: తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, అకాడమి చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడమీ హైదరాబాద్‌లో ఉండిపోయింది. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ప్రారంభించాం. తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం’’ అన్నారు. (చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’) ‘‘తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడమీ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడమీ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడమీ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడమీని బలోపేతం చేస్తాం’’ అన్నారు. (చదవండి: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి) తెలుగు అకాడమీ పుస్తకాలంటే విద్యార్థులకు మక్కువ: లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ విభజనపై ఎపికి అనుకూల మైన తీర్పు వచ్చిందన్నారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడమీ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం’’ చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ -
డిగ్రీ తెలుగు పాఠ్యాంశంగా ‘సాక్షి’ కథనం
సాక్షి, హైదరాబాద్: నేటితరానికి ‘సాక్షి’కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయు ధమైంది. గతేడాది (డిసెంబర్ 21, 2020) ‘సాక్షి’ దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికతో ప్రచురితమైన వార్తాకథనాన్ని డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలు గు సాహితీ దుందుభి పుస్తకాన్ని ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మంగళవారం ఇక్కడ ఆవిష్క రించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఏ కోర్సుల ద్వితీయ భాషగా ఈ పుస్తకాన్ని అందించారు. విద్యార్థుల్లో రచనానైపుణ్యాలను పెంచాలన్న సంకల్పంతో ‘సాక్షి’కథనాన్ని జర్నలిజం మౌలికాం శాల శీర్షికలో చేర్చారు. రికార్డులు తారుమారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామా రెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను ‘సాక్షి’ ప్రజల దృష్టికి తెచ్చి ప్రభుత్వ యంత్రాం గాన్ని కదిలించింది. పుస్తకావిష్కరణలో ‘సాహితీ దుందుభి’ ప్రధానసంపాదకుడు సూర్యాధనంజ య్, ఆచార్య కాశీం, లావణ్య, ఎస్.రఘు, వి.శ్రీధర్, శంకర్, కృష్ణయ్య, డా.భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం
సాక్షి, ఏఎన్‌యూ: తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుకు ఆ పాలకులు ఎందుకు చొరవ తీసుకోలేదో చెప్పాలన్నారు. మాతృభాషా వికాసానికి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. చదవండి: సీఎం జగన్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్ ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ పరిస్థితుల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అదే తరుణంలో తెలుగు సబ్జెక్టును కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. తెలుగు భాషపై లోతైన అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. తెలుగు కవుల గొప్పతనాన్ని తెలియజేస్తూ నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీకి తిక్కన విక్రమ సింహపురి యూనివర్సిటీగా పేరు మార్చుతూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నామని తెలిపారు. గిడుగు రామ్మూర్తి జీవిత చరిత్ర చిత్రాలతో పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలుగు, సంస్కృత భాష వికాసానికి కృషి చేస్తున్న 13 మందికి మంత్రి చేతులమీదుగా పురస్కారాలు అందజేశారు. తెలుగు, సంస్కృత భాషా అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్ -
తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందన్న విషయాన్ని గుర్తించాలని ఏపీ సాహిత్యఅకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అలాంటప్పుడు తెలుగు అకాడమీని తెలుగు&సంస్కృత అకాడమీగా పేరు మార్చడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. గతంలో తెలుగు అకాడమీని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ ప్రభుత్వంలో తెలుగు అకాడమీకి పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. తిరుపతిలో తెలుగు&సంస్కృతం అకాడమీ భవనం నెలకొల్పారని, భాషా చైతన్య సదస్సులను రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో నిర్వహిస్తామన్నారు. -
టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు
దొండపర్తి (విశాఖ దక్షిణ): తెలుగు భాషపై చంద్రబాబు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎద్దేవా చేశారు. తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని కలిపి ‘తెలుగు–సంస్కృత అకాడమీ’ అని మారిస్తే తెలుగు భాషకు జరిగిన నష్టమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీచ్ రోడ్డులోని లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం అస్థిత్వమే లేకుండా చేశారని గుర్తుచేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తానంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు గోదావరిలో కలిపేశారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సీఎం కృషి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతోనే తెలుగుకు ప్రాచీన హోదా లభించిందని యార్లగడ్డ గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తెలుగు భాషను, అకాడమీని పట్టించుకోని సమయంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని పునరుద్ధరించారని తెలిపారు. అలాగే సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరుకు తీసుకువచ్చారని చెప్పారు. నిజానికి తెలుగు అకాడమీకి కేంద్రం నుంచి నిధులు రావని.. సంస్కృత భాషకు ఎక్కువ వస్తాయని తెలిపారు. తెలుగు వికాసానికి ఎవరు కృషి చేస్తున్నారన్న విషయంపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యార్లగడ్డ సవాలు విసిరారు. -
చంద్రబాబును నమ్మిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదు..
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడుని నమ్మిన ఏ ఒక్కరు కూడా బాగు పడినట్లు చరిత్రలో లేదని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అడుగులకు మడుగులు నొక్కుతున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పరిస్థితి కూడా అంతేనన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లోనై నిమ్మగడ్డ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా ఎలా ప్రవర్తిస్తాడో చెప్పటానికి నిమ్మగడ్డ ఓ ఉదాహరణ అన్నారు. నిమ్మగడ్డ తీరును అందరూ వ్యతిరేకిస్తున్నా, ఆయనలో ఏమాత్రం చలనం లేదని.. ఆయన చంద్రబాబు మైకంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సకల పాపాలకు కేంద్ర బిందువైన చంద్రబాబు మాటలను ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తి ఎలా నమ్ముతున్నాడో అర్ధం కావట్లేదన్నారు. గాంధీ తర్వాత గ్రామ స్వరాజ్యానికి కోరుకున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, ఆయన ఏడాదిన్నర పాలనే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తుంటే, కొన్ని అరాచక శక్తులు అందుకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కరోనా క్లిష్ట సమయాల్లో కూడా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంటే, చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్ ద్వారా కార్యకర్తలను రెచ్చగొడుతూ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే చంద్రబాబు విగ్రహలను ధ్వంసం చేయిస్తున్నాడని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నాడని, త్వరలో ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఆమె జోస్యం చెప్పాడు. కాగా, తెలుగు అకాడమీ ప్రధాన కార్యాలయం త్వరలో తిరుపతి నుండి కార్యకలాపాలు సాగించనుందని, ఇప్పటికే తిరుపతిలో ఆఫీస్, పుస్తకాలు భద్రపరిచే గోడౌన్ వసతులు సమకూరాయని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికంతా ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పట్టించుకోలేదని, సీఎం జగన్ తెలుగు అకాడమీపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వం సంస్కృత అకాడమీని ప్రారంభించనుందని ఆమె తెలిపారు. -
శారదాపీఠాన్ని సందర్శించిన లక్ష్మీ పార్వతి
-
తెలుగు భాషకు వన్నె తెస్తా
సాక్షి, చిత్తూరు : తెలుగుభాషకు వన్నె తెస్తానని రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన తెలుగు అకాడమికి తొలి డైరెక్టర్‌గా నియమితులైన ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సంయుక్త రాష్ట్రంలో 1968లో తెలుగు అకాడమిని ఏర్పాటు చేశారు. తెలుగుభాషాభివృద్ధి, వ్యాప్తికి తెలుగు మాధ్యమంలో పుస్తకాలు ముద్రించేందుకు తెలుగు అకాడమిని ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలి డైరెక్టర్‌గా నియమితులై 6 సంవత్సరాలుపాటు సేవలు అందజేశారు. 2014లో రాష్ట్రం విడిపోయాక తెలుగు అకాడమి తెలంగాణాలో ఉండిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఏపీలో తెలుగు అకాడమి ఏర్పాటుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీలో తెలుగు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీ చైర్మన్‌గా లక్ష్మీపార్వతిని గత నెల 16న నియమించారు. తాజాగా ఈ సంస్థ డైరెక్టర్‌గా ఎస్వీయూ ప్రొఫెసర్ పేట శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : మీ కుటుంబ నేపథ్యం? జవాబు : మాది తిరుపతిని బండ్ల వీధి. మా నాన్న పేట నారాయణరెడ్డి. ఆంధ్రాబ్యాంక్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ చెంగమ్మ. బాల్యం అంతా తిరుపతిలోనే గడిచింది. ప్రశ్న : బీకాం చదివి తెలుగు ఎందుకు ఎంచుకున్నారు? జవాబు : నేను పదవ తరగతి చదివే సమయంలో ఎస్వీయూ తెలుగు ప్రొఫెసర్ జీఎన్ రెడ్డి రచించిన తెలుగు నిఘంటువు బాగా ఆకర్షించింది. దాన్ని చూసి తెలుగు పట్ల ఆసక్తి పెంచుకున్నాను. డిగ్రీలో ఒక సందర్భంలో ఆయన తెలుగుపై మా కళాశాలలో ప్రసంగించారు. దీంతో తెలుగుపట్ల ఆకర్షితుడినై బీకాం అనంతరం ఎంఏ తెలుగు చేశాను. ప్రశ్న : మీ ఉద్యోగ జీవితం? జవాబు : ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖలో పీహెచ్డీ చేశాను. 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి 2007లో ప్రొఫెసర్ అయ్యాను. డీన్‌గా విభాగాధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశాను. ప్రశ్న : ఇప్పటి వరకు ఎన్ని రచనలు చేశారు ? జవాబు : ఇప్పటి వరకు 20 పుస్తకాలు రచించాను. తిరుపతి కథలు, కొండకథలు, గంగజాతర పుస్తకాలు ఎంతో పేరు తెచ్చాయి. ఆంధ్రప్రభ, వీక్లీలో తిరుపతి కథలు ప్రచురితం అయ్యాయి. దానిపై పుస్తకం తెస్తున్నాను. అలాగే తిరువీధులు పుస్తకం ద్వారా తిరుపతి నగరాన్ని గురించి వివరిస్తూ రచన చేశాను. ప్రశ్న : ఎన్ని అవార్డులు అందుకున్నారు? జవాబు : నేను ఇప్పటి వరకు 17 అవార్డులను పొందాను. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్ అవార్డు, 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం ముఖ్యమైనవి. అలాగే పలు అకడమిక్ సంస్థల్లో సభ్యుడిగా ఉన్నాను. 23 పీహెచ్డీ డిగ్రీలకు మార్గదర్శనం చేశాను. ప్రశ్న : తెలుగు అకాడమికి ఎలాంటి సేవ చేస్తారు? జవాబు : తెలుగు అకాడమి డైరెక్టర్‌గా నియమితులు కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అకాడమికి చైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతి కూడా ఎంఏ పీహెచ్డీ తెలుగులో చేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమిని పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు అకాడమి ఏర్పాటు చేయడం తెలుగు భాషాభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి అవగతమౌతుంది. తెలుగుభాష వ్యాప్తికి, చిత్తశుద్ధితో పనిచేస్తాను. హైదరాబాద్‌లో ఉన్న తెలుగు అకాడమిని విభజించి ఏపీలో తెలుగు అకాడమిని సుస్థిర పరుస్తాను. తెలుగుకు సంబంధించిన పుస్తకాలను మంచి రచయితలతో రచనలు చేయించి అందుబాటులోకి తెస్తాను. అందరికీ తెలుగు పట్ల ఆసక్తి కలిగేలా చేస్తాను. ప్రశ్న : ఇంగ్లిష్ మీడియం ప్రభావంతెలుగుపై ఉంటుందా? జవాబు : రాష్ట్రంలో తెలుగు ప్రొఫెసర్లు అంతా ఆంగ్లమాధ్యమంలోనే చదువుతున్నారు. ఏపీ సీఎం తెలుగుమీడియం స్థానంలో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టి మంచినిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పేదలకు ఆంగ్లంలో చదువుకునే అవకాశం వచ్చింది. ఇంగ్లిష్ మీడియం పెట్టినంత మాత్రాన తెలుగు నిర్లక్ష్యానికి గురికాదు. బయోడేటా పేరు: పేట శ్రీనివాసరెడ్డి హోదా: ఎస్వీయూ ప్రొఫెసర్ విద్యాభ్యాసం: ఎంఏ, పీహెచ్డీ రచనలు: 20 పేరుతెచ్చినవి: కొండ కథలు, తిరువీధులు, గంగజాతర, తిరుపతి కథలు అందుకున్న అవార్డులు: 20 -
ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థులకు 'ఉజ్వల భవిత'
ఇంగ్లిష్ మీడియంతో మాతృభాష మృతభాషగా మారిపోతుందని, ప్రాభవం కోల్పోతుందనే వాదనల్లో అర్థం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దిశగా ముందడుగు సాక్షి, అమరావతి: ‘బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం వెల్లడిస్తోంది. పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్‌లో విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించడం ఉత్తమం’ అని ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు.. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా విశ్లేషించాకే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలంటే ఇంగ్లిష్ మీడియంలో విద్యాభ్యాసం తప్పనిసరి. ప్రపంచంలో విషయ పరిజ్ఞానమంతా ఇంగ్లిష్‌లోనే ఉంది. బాల్యంలోనే ఏ భాషపైన అయినా పట్టు సాధించవచ్చని భాషాశాస్త్రం శాస్త్రీయంగా నిరూపించింది. కాబట్టి విద్యార్థులకు బాల్యం నుంచే ఇంగ్లిష్ నేర్పించాలి. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో సాగితేనే విద్యార్థుల మనోవికాసం సరిగా ఉంటుందనే వాదన సరికాదు. మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యను ఇంగ్లిష్‌లో అభ్యసిస్తే విద్యార్థులు సరైన విజ్ఞానాన్ని పొందలేరు. కొంతమంది రాద్ధాంతానికి అర్థం లేదు ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాష ప్రాభవానికి, ఉనికికి ఎలాంటి ముప్పూ లేదు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే తెలుగు భాష వైభవాన్ని కోల్పోతోందని కొందరు చేస్తున్న రాద్ధాంతానికి అర్థం లేదు. దీని వెనుక కార్పొరేట్ విద్యా సంస్థల హస్తం ఉంది. ఇంగ్లిష్ మీడియం లేదా వేరే మీడియం విద్యా బోధనతో ప్రపంచంలో ఒక మాతృభాష మృతభాషగా మారిపోయినట్టు ఇంతవరకు నిర్ధారణ కాలేదు. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ సంస్థానంలో 400 ఏళ్లకుపైగా ఉర్దూనే అధికారిక భాషగా, బోధన భాషగా సాగింది. అందరూ ఉర్దూ మీడియంలోనే చదువుకునేవారు. అయితే.. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో తెలుగు భాష ఉనికికి, సాహితీ వైభవానికి ఏ మాత్రం భంగం కలగలేదు. కర్ణాటకలో తుళు భాషకు లిపి లేదు.. దాన్ని కన్నడంలోనే రాస్తారు. అయినా ఆ భాష వందల ఏళ్లుగా ప్రాభవాన్ని కోల్పోకుండా ఉంది. అలాంటిది.. 2 వేల ఏళ్లకుపైగా చరిత్ర, ఘన సాహితీ వారసత్వం, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మందికి మాతృభాష అయిన తెలుగు ఉనికి, వైభవం ఎందుకు కోల్పోతుంది?.. అని ప్రతాప్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. -
వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని చెప్పలేదా?
సాక్షి, తాడేపల్లి : పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, పేద ప్రజలను లక్షలాది రూపాయల దోపిడీ నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుగు అకాడమి చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విరుచుకుపడ్డారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్లు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివించలేదా? ఏబీఎన్ రాధాకృష్ణ తన కుమారుడిని తెలుగు మీడియంలో చదివించారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా ‘తెలుగు అంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు తెలుగు అభివృద్ధికి చేసిందేమిటి? తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం ఎందుకు కృషి చేయలేదు? తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు రాష్ట్రానికి తేలేకపోయారు? ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోనూ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం ఆరువేల పాఠశాలలను చంద్రబాబు మూయించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపలేదు. కనీసం పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించలేదు. భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టమని పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసిన చంద్రబాబుకు తెలుగు గురించి మాట్లాడే అర్హత లేదు. వచ్చే జన్మంటూ ఉంటే తాను, వెంకయ్యనాయుడు అమెరికాలో పుడతామని చెప్పలేదా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని బట్టి తెలుగంటే చంద్రబాబుకు ఎంత ఇష్టం ఉందో తెలుసుకోవచ్చని లక్ష్మీపార్వతి విమర్శించారు. మరోవైపు తెలుగు రాని లోకేష్‌ని ఇంగ్లీష్ మీడియంలో చదివించినా ఆ భాష కూడా సరిగా రాదని ఎద్దేవా చేశారు. ఇదికాక, ఇంగ్లీష్ మీడియంలో పట్టులేక అనేక మంది ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే ఉన్నత స్థానానికి ఎదిగారని ఆమె వ్యాఖ్యానించారు. -
లక్ష్మీపార్వతికి కీలక పదవి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్. ఎ పూర్తి చేశారు. -
తెలుగు అకాడమీని పునరుద్ధరిస్తాం
- సంగీత, నాటక అకాడమీలు కూడా.. - ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు - ప్రముఖులకు పురస్కారాల ప్రదానం విజయవాడ కల్చరల్ : తెలుగు అకాడమీని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలాగే సంగీత, నాటక అకాడమీలను కూడా పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి గతంలోనే ఒక కమిటీ వేశామని, తాజాగా ప్రాధికార కమిటీని నియమించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో హేవళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం, వ్యవసాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖలు ప్రచురించిన పంచాంగాలను ఆవిష్కరించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు 2017 సంవత్సరానికి కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాషా వైభవాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూచిపూడి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,000 పాఠశాలల్లో 50 వేల మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పల్లె రఘునా«థరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, బి.గోపాల కృష్ణారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, భాషా–సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగుపల్లి శ్రీకాంత్, సంచాలకుడు డి.విజయభాస్కర్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ బాబు.ఎ తదితరులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర :వేదాంతం వేదాంతం రాజగోపాల చక్రవర్తి పంచాంగ పఠనం సభికులను ఆకట్టుకుంది. హేవళంబి అంటే బంగారు తోరణమని, ఏడాదంతా జీవన యాత్ర శుభప్రదంగా జరుగుతుందని చెప్పారు. సకాలంలో వర్షాలు పడతాయని, రైతులకు తృణధాన్యాలకు గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు. వ్యవసాయ పంచాంగాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త కూర్మారావు వివరించారు. -
పెరగనున్న ఇంటర్ ఇంగ్లిషు పుస్తకాల ధర?
ఆంగ్ల పుస్తకాలు ప్రైవేటు పరం చేసేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిషు పాఠ్యపుస్తకాల ధరలకు రెక్కలు రానున్నాయి. ఓ ప్రైవేటు పబ్లిషర్‌కు పుస్తకాల ముద్రణ, విక్రయం బాధ్యతలను అప్పగించడం ద్వారా పుస్తకాల ధర పెరిగే పరిస్థితి ఏర్పడింది. రిటైలర్ రిబేటు, పబ్లిషర్ లాభం, ఇంటర్ బోర్టుకు రాయల్టీ పేరుతో ప్రైవేటు పబ్లిషర్ ప్రస్తుతం రూ.70 ఉన్న పాఠ్యపుస్తకం ధరను రెట్టింపు చేసే పరిస్థితిని ఇంటర్ బోర్డే తీసుకువస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్ ఇంగ్లిషు పాఠ్యపుస్తకాలను ఓ ప్రైవేటు ముద్రణ సంస్థ ముద్రించింది. తెలంగాణ వచ్చిన తరువాత ఆ పబ్లిషర్‌ను పుస్తక ముద్రణ బాధ్యతల నుంచి తప్పించి తెలుగు అకాడమీకి ప్రభుత్వం అప్పగించింది. దీంతో అకాడమీ గత ఏడాది ఒక్కో పుస్తకాన్ని రూ.70కే అందించింది. కానీ ఇప్పుడు తెలుగు అకాడమీని పక్కనబెట్టి ప్రైవేటు పబ్లిషర్‌కు పుస్తక ముద్రణ బాధ్యతలను అప్పగించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది. పుస్తకాల సిలబస్‌లో మార్పులు ఇంటర్ పాఠ్యపుస్తకాల మార్పుల్లో భాగంగా ప్రథమ సంవత్సర ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలోని సిలబస్‌లో నెల రోజుల కిందటే మార్పులు చేసింది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సర ఇంగ్లిషు పాఠ్యపుస్తకం సిలబస్‌లో మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. మరో వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పుస్తకాల ముద్రణ, పంపిణీ పనులపై ఓ పబ్లిషర్ కన్ను పడింది. దీంతో రాజకీయ పలుకుబడి కలిగిన సదరు పబ్లిషర్ ఇంటర్ బోర్డు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ‘ప్రైవేటు’కు ఇస్తే పెంపు తప్పదు.. తెలుగు అకాడమీ విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈసారి కూడా అదే ధరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ఇంటర్ బోర్డు మాత్రం ప్రైవేటు పబ్లిషర్‌కు ముద్రణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం కావడంపై బోర్డు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలకు పాఠ్య పుస్తకాల ముద్రణ, విక్రయాల బాధ్యతను అప్పగిస్తే పుస్తకం ధరలో 20 శాతం రిటైల్ వ్యాపారులకు, 17 శాతం పబ్లిషర్‌కు లాభం రూపంలో, 17 శాతం ఇంటర్ బోర్డుకు రాయల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పుస్తకం ధరను పెంచకతప్పని పరిస్థితి ఏర్పడనుంది. -
’డిగ్రీ’ లోనూ సెమిస్టర్స్
- మెమోల్లోనూ క్రెడిట్స్, గ్రేడింగ్ - మార్కుల విధానానికి స్వస్తి - వచ్చే విద్యా సంవత్సరం నుంచే .. పూర్తికావొచ్చిన సిలబస్ మార్పులు - త్వరలో తెలుగు అకాడమీ ముద్రణకు అప్పగింత సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సుల పరీక్షల విధానం, సిలబస్‌లో సమూల మార్పులకు ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇకపై అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున మూడేళ్ల డిగ్రీ కోర్సులకు మొత్తం ఆరు సెమిస్టర్లను అమలు చేయనుంది. అలాగే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో (సీబీసీఎస్) భాగంగా అందించే క్రెడిట్ పాయింట్లు, గ్రేడింగ్ విధానాన్నే డిగ్రీ కోర్సుల్లో పాటించి మెమోల్లోనూ మార్కుల స్థానంలో వాటినే ముద్రించనుంది. ఇందుకు అనుగుణంగా ఏడాదిగా సాగిస్తున్న సిలబస్ రివిజన్ పూర్తి కావచ్చింది. సంప్రదాయ డిగ్రీల్లోని 17 సబ్జెక్టుల్లో సిలబస్ మార్పులు పూర్తవగా ఈ నెల 31లోగా మరో రెండు సబ్జెక్టుల సిలబస్‌లలో మార్పులు పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. మార్చిన సిలబస్‌లోనే 2016-17 విద్యా సంవత్సరంలో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 31 తరువాత మారిన సిలబస్ మొత్తాన్ని తెలుగు అకాడమీకి అప్పగించి పుస్తకాల ముద్రణ పూర్తయ్యాక జూన్ నాటికి కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సిలబస్ మార్పులపై ఇటీవల అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య...సిలబస్ మార్పులను అన్ని వర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో ఆమోదించి జూన్ నుంచి పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మరో 50 స్పెషలైజ్డ్ సబ్జెక్టుల్లోనూ.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న కోర్ సబ్జెక్టులతోపాటు వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు సొంతంగా, ప్రతే ్యకంగా నిర్వహిస్తున్న బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి 50కిపైగా స్పెషలైజ్డ్ సబ్జెక్టులను అందిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక కోర్సులను ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకమైన కోర్సును కొనసాగిస్తోంది. కొన్ని ప్రధాన కాలేజీలూ పలు ప్రత్యేక సబ్జెక్టుల్లో యూనివర్సిటీ ఆమోదంతో డిగ్రీలను కొనసాగిస్తున్నాయి. అలాంటివన్నీ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రస్థాయిలో అమలు చేసే కోర్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులను యూనివర్సిటీల ప్రొఫెసర్లతో ఉన్నత విద్యా మండలి చేయిస్తుందని, స్పెషలైజ్డ్ సబ్జెక్టుల సిలబస్‌లో స్థానికంగా యూనివర్సిటీలు, కాలేజీల పరిధిలోనే మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. మల్లేశ్ స్పష్టం చేశారు. సిలబస్‌లో మార్పులు చేసిన సబ్జెక్టులు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో సిలబస్ మార్పులను ఉన్నత విద్యా మండలి గతంలో పూర్తి చేయగా ఇటీవల కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లిషు, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్ సిలబస్‌లలో మార్పులు చేసింది. ఈ నెల 31లోగా సైకాలజీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు పూర్తికానున్నాయి. వివిధ సబ్జెక్టుల్లో ప్రధాన మార్పులు తెలుగు ద్వితీయ భాష, మోడర్ ్న లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్టుల్లో తెలంగాణకు చెందిన ఆధునిక కవులకు పెద్దపీట. సివిల్స్, గ్రూపు-1 వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీలోని సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంత్రోపాలజీ సబ్జెక్టుల్లో మార్పులు. కామర్స్‌లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొన్ని యూనిట్లకు చోటు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషనలో తెలంగాణ గ్రామ పరిపాలన వ్యవస్థకు పెద్దపీట. హిస్టరీలో దక్కన్ చరిత్రకు ప్రాధాన్యత. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై ప్రముఖంగా పాఠ్యాంశాలు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి సబె ్జక్టుల్లో సిలబస్ అప్‌గ్రేడ్. -
అకాడమీ పుస్తకాలు సిద్ధం!
పోటీ పరీక్షలకు..అందుబాటులోకి జనరల్ స్టడీస్, తెలంగాణ చరిత్ర, సాంఘిక అంశాల పుస్తకాలు నాలుగైదు రోజుల్లో మరో ఐదు పుస్తకాల విడుదలకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ ప్రత్యేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. పలు ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్లు జారీ అవుతున్న నేపథ్యంలో... పుస్తకాల కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పోరాటాలు తదితర అంశాలకు సంబంధించి ‘ప్రైవేటు’ పుస్తకాలు కొన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నా... ప్రామాణిక పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ సంస్థ తెలుగు అకాడమీ ప్రధానమైన జనరల్ స్టడీస్, తెలంగాణ చరిత్ర-సంస్కృతి, సాంఘిక అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. మరి కొన్ని పుస్తకాలను నాలుగైదు రోజుల్లో తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్ ఆధారంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో ఈ పుస్తకాలను రాయించింది. ఇప్పటివరకు భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలనా శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ... ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 8 రకాల పుస్తకాలను తీసుకురానుంది. ఇందులో మూడు పుస్తకాలను సోమవారం విడుదల చేసింది. మొత్తంగా వచ్చే 10 రోజుల్లో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణపై ప్రత్యేక అంశాలు తెలంగాణ చరిత్ర-సంస్కృతి పుస్తకంలో తెలంగాణ పరిచయం నుంచి మొదలుకొని పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్ల కాలం, అసఫ్జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు తదితర 33 అంశాలతో పాఠ్యాంశాలను పొందుపరిచింది. వీటితోపాటు తెలంగాణ చరిత్ర, భూగోళ, ఆర్థిక అంశాలు, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీ లు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ పుస్తకాల్లో పాఠ్యాంశాలను పొందుపరుస్తోంది. అందుబాటులోకి తేనున్న పుస్తకాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి ప్రభుత్వ పాలనా శాస్త్రం సమాజ శాస్త్రం తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం ఇదివరకే అందుబాటులో ఉన్నవి ఇండియన్ జియోగ్రఫీ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సోషియాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ భారత రాజ్యాంగం ప్రభుత్వ పాలనా శాస్త్రం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర -
అకాడమీ పుస్తకాలు సిద్ధం!
-
ఈవెంట్
బంగారు తెలంగాణపై కవి సమ్మేళనం ‘కామన్ డయాస్’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు ‘బీసీ సాధికారత సంస్థ, హిమాయత్ నగర్’(తెలుగు అకాడమీ పక్కన)లో ‘బంగారు తెలంగాణ’పై కవి సమ్మేళనం జరగనుంది. మసన చెన్నప్ప, కాలువ మల్లయ్య, బీవీఆర్ చారి పాల్గొంటారు. కవిత్వ కళా శిబిరం ‘తెలంగాణ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 గంటలకు కర్షక్ బీఈడీ. కళాశాల, కామారెడ్డిలో ‘కవిత్వ కళా శిబిరం- కవి సమ్మేళనం’ జరగనుంది. కీలకోపన్యాసం: నందిని సిధారెడ్డి. ప్రసంగాలు: నాళేశ్వరం శంకరం, ఎం.నారాయణశర్మ, అయాచితం నటేశ్వరశర్మ. వెజిటేరియన్స్ ఓన్లీ ఆవిష్కరణ ఓరియంట్ బ్లాక్ స్వాన్ ప్రచురించిన స్కైబాబా తెలుగు కథల ఆంగ్లానువాదం ‘వెజిటేరియన్స్ ఓన్లీ’ ఆవిష్కరణ నేడు ఉదయం 10 గంటలకు నల్లగొండ జిల్లా కేశరాజుపల్లిలో జరగనుంది. ఆవిష్కర్త: రచయిత అమ్మ హాజీబేగం. ఇందులో వేముల శేఖర్, పసునూరి రవీందర్, అంబటి సురేంద్రరాజు, గోరటి వెంకన్న, నోముల సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బెరైడ్డి కృష్ణారెడ్డి, కార్టూనిస్ట్ శంకర్, నిసార్, బెల్లి యాదయ్య, షాజహానా తదితరులు పాల్గొంటారు. ఇస్మాయిల్ కవిత్వ పురస్కార సభ 2014 ఇస్మాయిల్ కవిత్వ పురస్కారాన్ని ‘నదీమూలం లాంటి ఆ ఇల్లు’ కవితాసంపుటికిగానూ యాకూబ్‌కు ప్రదానం చేయనున్నారు. ఇస్మాయిల్ మిత్రమండలి ఆధ్వర్యంలో నేడు ఉదయం 10:30కి కాకినాడలోని పి.ఆర్.ప్రభుత్వ కళాశాల సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో ధూళిపాళ అన్నపూర్ణ, వాడ్రేవు చినవీరభద్రుడు, పలమనేరు బాలాజీ, కొప్పర్తి వెంకటరమణమూర్తి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి పాల్గొంటారు. ‘బతుకుముడి’కి వట్టికోట పురస్కారం ‘మంజీరా రచయితల సంఘం’ నిర్వహించిన వట్టికోట ఆళ్వార్‌స్వామి స్మారక కథా పురస్కారానికి నిజామాబాద్‌కు చెందిన బి.కళాగోపాల్ కథ ‘బతుకుముడి’ ఎంపికైంది. అలాగే, దిలావర్(ఖమ్మం) ‘మూడు తరాలు’, హుమాయూన్ సంఘీర్(నిజామాబాద్) ‘బూదెవ్వ’ ఉత్తమ కథలుగా ఎంపికయ్యాయని వేముగంటి రఘునందన్ తెలియజేస్తున్నారు. నందిని సిధారెడ్డి, దేవరాజు మహారాజు, సంగిశెట్టి శ్రీనివాస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇస్మాయిల్ అవార్డు-2015 తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైందని తమ్మినేని యదుకుల భూషణ్ తెలియజేస్తున్నారు. ‘తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి’. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్, వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాసరావు, పద్మలత, తులసీ మోహన్, స్వాతికుమారి, మమతకు ఈ అవార్డ్ లభించింది. ఉమ్మడిశెట్టి అవార్డు కోసం... ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు-2015 కోసం కవుల నుండి 2015లో అచ్చయిన కవితాసంపుటాలను ఆహ్వానిస్తున్నారు అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ. నాలుగు పుస్తకాలను 2016 జనవరి 31లోగా ‘రాధేయ, 13-1-606-1, షిర్డినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం-515001’ చిరునామాకు పంపాలి. ఫోన్: 9985171411 ఫ్రీవర్స్ ఫ్రంట్ కవిత్వ బహుమతులు గత 45 ఏళ్లుగా ప్రతి యేటా ఉత్తమ వచన కవితాసంపుటికి అవార్డులు యిస్తూవున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గత సంవత్సరానికీ, ఈ సంవత్సరానికీ ఉమ్మడిగా అవార్డుల్ని ప్రకటించింది. 2014 సంవత్సరానికిగానూ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ‘మాకూ ఒక భాష కావాలి’ ఎంపికైందనీ, 2015కుగానూ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ ఎంపికైందనీ శీలా వీర్రాజు తెలియజేస్తున్నారు. ఈ పురస్కారాల్ని డిసెంబర్ 18న దేవరాజు మహారాజు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో దేవిప్రియ చేతుల మీదుగా అందజేస్తారు. -
పోటీ పరీక్షలకు మరో 8 పుస్తకాలు
సిద్ధం చేస్తున్న తెలుగు అకాడమీ వారంలో ఒకటి, నెలాఖరుకు మరో 7 అందుబాటులోకి తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి హైదరాబాద్: రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ మరో 8 కొత్త పుస్తకాలను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో మరో 8 పుస్తకాలను సిద్ధం చేయిస్తోంది. ఈ నెలాఖరులోగా వాటిని అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి 12 రకాల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇంటర్మీడియెట్ లో మార్పు చేసిన పుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఇప్పటికే ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన కోణం, పూర్తి విశ్లేషణలతో ఈ పుస్తకాలను అకాడమీ అందుబాటులోకి తెస్తోంది. వీటితోపాటు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జనరల్ స్టడీస్ పుస్తకాన్ని అకాడమీ ప్రత్యేకంగా ముద్రిస్తోంది. మరో వారంలో ఇది అందుబాటులోకి రానుంది. కొత్త పుస్తకాల్లోని ప్రత్యేకాంశాలు.. త్వరలో అందుబాటులోకి రానున్న తెలంగాణ చరిత్ర-సంస్కృతి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరి త్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్ల కాలం, అసఫ్జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగా ణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు వంటి అంశాలను అకాడమీ పొందుపరుస్తోంది. ఇంటర్ పుస్తకాల్లోనూ తెలంగాణ సంబంధ అంశాలు ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పుస్తకాల్లోనూ తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయని, అవి కూడా అభ్యర్థులకు ఉపయోగపడతాయని అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. వాటిలో తెలంగాణ చరిత్ర, భౌగోళిక, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న పుస్తకాలు . తెలంగాణ చరిత్ర-సంస్కృతి తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర అవతరణ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి {పభుత్వ పాలన శాస్త్రం సమాజ శాస్త్రం తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం జనరల్ స్టడీస్ ఇదివరకే అందుబాటులో ఉంచినవి ఇండియన్ జియోగ్రఫీ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సోషియాలజీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ భారత రాజ్యాంగం {పభుత్వ పాలన శాస్త్రం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర -
పెద్ద కూలీ ఐఏఎస్సే
ప్రేమతోనే సివిల్స్‌లోకి రావాలి సీనియర్ ఐఏఎస్‌ల ఉద్ఘాటన సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో అతి పెద్ద కూలీ ఐఏఎస్ అధికారే.. ప్రజలపై విపరీతమైన ప్రేమ, సమస్య-పరిష్కారాలే శ్వాస ధ్యాసగా భావించే మనస్తత్వం, జన శ్రేయస్సే లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీస్‌లోకి అడుగుపెట్టాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో అన్నింటి కన్నా విలువైన పరీక్ష నేడు సివిల్స్ ఎగ్జామ్ అని తెలిపారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో తెలిసి వచ్చే ప్రతి అంశం సివిల్ సర్వీస్‌లో ఒక పాఠం లాంటిదనే విషయం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తెరగాలని కోరారు. మున్ముందు తెలుగువారు అత్యధికులు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సీనియర్ అధికారులు డాక్టర్ ఏ అశోక్, డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు నేటి తరం విద్యావంతులను సివిల్ సర్వీసుల వైపు కార్యోన్ముఖులను చేసేందుకు పుస్తకాలు రాయటం, అవగాహన కల్పించటం ఆదర్శ ప్రాయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ 120 కోట్ల మంది ఉన్న దేశంలో అటు సమాజాన్ని, ఇటు జన జీవితాన్ని ప్రభావితం చేసే అతి గొప్ప సర్వీసు సివిల్స్ అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అధర్ సిన్హా మాట్లాడుతూ సివిల్స్‌లో పద్ధతి ప్రకారం చదివితే విజయం సొంతమన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే సమాచారం ఇస్తే మరిన్ని పుస్తకాల్ని తాము అచ్చు వేస్తామన్నారు. పుస్తకరచయితలు కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకొని సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా తమను సంప్రదిస్తే కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధమేనని చెప్పారు. అనంతరం ‘మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా?’ అనే పుస్తకాన్ని అజయ్ మిశ్రా ఆవిష్కరించారు. ఆంత్రోపాలజీకల్ తాట్, సోషియో కల్చరల్ ఆంత్రోపాలజీ పుస్తకాలను కళాశాల విద్య కమిషనర్ కె. సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్. శశిధర్రావు, ఎ.దినకర్ బాబు, డాక్టర్ ఎం జగన్మోహన్, డాక్టర్ యు.వెంకటేశ్వర్లు, వాణీ ప్రసాద్ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఏ. అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
48 రోజుల్లో తెలుగు!
సాక్షి, హైదరాబాద్: అధికార భాషగా తేట తెలుగును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా తెలుగుపై పట్టులేని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులకు భాషను నేర్పించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను తలకెత్తుకున్న తెలుగు అకాడమీ ‘48 రోజుల్లో తెలుగు’ పేరుతో శిక్షణ నిచ్చేందుకు సమాయత్తమైంది. కోర్సును రెండు భాగాలుగా విభజించి తెలుగు అస్సలు రానివారికి ‘పరిచయ కోర్సు’, ఓ మోస్తరుగా వచ్చిన వారికి ‘ఉన్నత కోర్సు’ అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. బోధన కాల వ్యవధిని 48 రోజులుగా నిర్ణయించిన అకాడమీ ఈ నెల 9 నుంచి వారానికి 6 రోజుల చొప్పున సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణనిచ్చేందుకు సిద్ధమని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పరిచయ కోర్సులో ప్రవేశానికి విద్యార్హత 10 కాగా, ఉన్నత కోర్సులో చేరేందుకు ఈ పరిచయ కోర్సు పూర్తి చేసి ఉండాలని వివరించింది. -
14కు తెలుగు అకాడమీ కేసు వాయిదా
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుపతి తెలుగు అకాడమీ శాఖలో 2008లో జరి గిన నిధుల దుర్వినియోగం కేసు విచారణను తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. కేసులో నిందితుడిగా ఉన్న తెలుగు అకాడమీ శాఖ ఉద్యోగి రాఘవరెడ్డి బుధవారం కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. వేద పాఠశాల కేసు 19కు వాయిదా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో ఓ విద్యార్థిపై జరి గిన లైంగిక వేధింపుల కేసు విచారణను తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి కమలాకర్‌రెడ్డి ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కేసులో సాక్షిగా ఉన్న రుయా ఆస్పత్రి డాక్టర్ వెంకటేశ్వర్లను నిందితుల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. న్యాయవాదులు బుధవారం హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణకు ఇరుపక్షాల వారు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.