సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ కేసులో కీలక పరిణాయం చోటుచేసుకుంది. చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు అకాడమీ స్కాంలో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. ఈ రోజు ఒక్క రోజే సీసీఎస్ పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. A1 మస్తాన్ వలీ, A2సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు స్కాంక్‌లకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.
చదవండి: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన
మూడు బ్యాంకుల నుంచి కోట్లు డ్రా చేసిన ముఠా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు స్కాంకు పాల్పడినట్టు గుర్తించారు. డిసెంబర్‌కల్లా అకాడమీకి చెందిన 324 కోట్లు కొట్టేయాలని స్కేచ్ వేసినట్లు తెలిపారు. కమిషన్‌ల ఎర చూపి బ్యాంక్ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తెలిపారు. సాయి, వెంకట్‌పై గతంలో కేసులున్నాయని పేర్కొన్నారు. మరికాసేపట్లో హైదరాబాద్ కమీషనరేర్‌లో మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టనున్నారు.
చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు
ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ వలీతోపాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా మస్తాన్ వలీకి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. మరో ముగ్గురి కస్టడీ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment