సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంపై జరుగుతున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ) కాజేసిన కేసు సూత్రధారి చుండూరి వెంకటసాయి కుమార్ ఈ స్కామ్ కోసం నకిలీబాండ్లను వినియోగించినట్లు వెల్లడైంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలసి కొండాపూర్‌లోని సైబర్ రిచ్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసుకున్న అడ్డాలో ఈ బాండ్లను తయారు చేయించాడనే విషయం తాజాగా వెలుగులోకి వచి్చంది. వాస్తవానికి తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాది క్రితమే సాయి కన్నుపడింది.
వెంకటరమణను రంగంలోకి దింపి, అకాడమీకి–వివిధ బ్యాంకులకు మధ్య దళారులుగా ఉండేవారి కోసం ఆరాతీశాడు. భూపతిరావు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలుసుకొని వెంకటరమణ ద్వారా అతడికి ఎర వేశాడు. తన అనుచరులైన ఆర్‌ఎంపీ డాక్టర్ వెంకట్, సోమశేఖర్‌ను రంగంలోకి దిం పాడు. వీళ్లు గతంలో సాయి చేసిన కొన్ని స్కామ్‌లలోనూ పాలుపంచుకున్నట్లు వెల్లడైంది.
ఈ విధంగా కథ నడిపి...:
వెంకట్, సోమశేఖర్‌లు అకాడమీ అధికారుల వద్దకు వెళ్లినప్పుడు బ్యాంకు ప్రతినిధులమని, బ్యాంకు అధికారులను కలిసినప్పుడు అకాడమీ ప్రతినిధులమని చెప్పుకుని కథ నడిపారు. అకాడమీ అధికారులు నగదును ఎఫ్‌డీ చేసే సమయంలో ఆ మొత్తానికి సంబంధించిన చెక్కుతోపాటు నిరీ్ణత కాలానికి ఎఫ్‌డీ చేయాలని కోరుతూ బ్యాంకు అధికారులకు ఓ కవరింగ్ లెటర్‌ను సిద్ధం చేసేవాళ్లు. వీటిని భూపతిరావు తీసుకుని ఆ వివరాలను సాయికి చెప్పేవాడు. దీంతో సాయి ఓ నకిలీ కవరింగ్ లెటర్ రూపొందించి బ్యాంకు అధికారులు ఇచ్చేదాని స్థానంలో ఉంచేవాడు.
అందులో ఆ మొత్తాన్ని ఏడాది కాలానికి కాకుండా వారంరోజులకే ఎఫ్‌డీ చేయాలంటూ రాసేవాడు. బ్యాంకు అధికారులు ఇచి్చన అసలు ఎఫ్‌డీ బాండ్లను తమిళనాడుకు చెందిన మదన్, పద్మనాభన్‌కు అందించేవాడు. వీటిని స్కాన్ చేసి ఆపై కంప్యూటర్‌లో ఫొటోషాప్ సాప్ట్‌వేర్‌లో ఎడిట్ చేస్తూ ఏడాది కాలానికి ఎఫ్‌డీ చేసినట్లు రూపొందించేవారు. బాండ్ పేపర్లపై ప్రింట్ ఔట్ తీసి నకిలీబాండ్లు తయారు చేసేవారు. వీటినే అకాడమీ అధికారులకు సాయి అందేలా చేసేవాడు.
Comments
Please login to add a commentAdd a comment