48 రోజుల్లో తెలుగు! | Government to implement Telugu as official language | Sakshi
Sakshi News home page

48 రోజుల్లో తెలుగు!

Published Thu, Dec 5 2013 2:49 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Government to implement Telugu as official language

సాక్షి, హైదరాబాద్: అధికార భాషగా తేట తెలుగును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా తెలుగుపై పట్టులేని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులకు భాషను నేర్పించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను తలకెత్తుకున్న తెలుగు అకాడమీ ‘48 రోజుల్లో తెలుగు’ పేరుతో శిక్షణ నిచ్చేందుకు సమాయత్తమైంది. కోర్సును రెండు భాగాలుగా విభజించి తెలుగు అస్సలు రానివారికి ‘పరిచయ కోర్సు’, ఓ మోస్తరుగా వచ్చిన వారికి ‘ఉన్నత కోర్సు’ అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. బోధన కాల వ్యవధిని 48 రోజులుగా నిర్ణయించిన అకాడమీ ఈ నెల 9 నుంచి వారానికి 6 రోజుల చొప్పున సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణనిచ్చేందుకు సిద్ధమని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పరిచయ కోర్సులో ప్రవేశానికి విద్యార్హత 10 కాగా, ఉన్నత కోర్సులో చేరేందుకు ఈ పరిచయ కోర్సు పూర్తి చేసి ఉండాలని వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement