ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఆదిమూలపు సురేష్‌ | AP Adimulapu Suresh Inaugurates Telugu Academy Intermediate Class Books | Sakshi
Sakshi News home page

ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఆదిమూలపు సురేష్‌

Published Tue, Sep 28 2021 4:42 PM | Last Updated on Tue, Sep 28 2021 5:14 PM

AP Adimulapu Suresh Inaugurates Telugu Academy Intermediate Class Books - Sakshi

సాక్షి, విజయవాడ: తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం విజయవాడలో జరిగింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, అకాడమి చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడమీ హైదరాబాద్‌లో ఉండిపోయింది. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అకాడమీని ప్రారంభించాం. తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం’’ అన్నారు.
(చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు)

‘‘తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడమీ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడమీ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడమీ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడమీని‌ బలోపేతం చేస్తాం’’ అన్నారు. 
(చదవండి: తెలుగు భాష సంస్కృతం నుంచే మమేకమైందని గుర్తించాలి: లక్ష్మీపార్వతి)

తెలుగు అకాడమీ పుస్తకాలంటే విద్యార్థులకు మక్కువ: లక్ష్మీపార్వతి
తెలుగు అకాడమీ విభజనపై ఎపికి అనుకూల మైన తీర్పు వచ్చిందన్నారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ సందర్‌భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడమీ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో‌ నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల‌ ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం’’

చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement